ఒకరు… పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నా సరే, అనుకోకుండా తన సినిమాలు ఒకటీరెండు హిట్టయ్యాయి… దాంతో తన పిచ్చికూతలకు జనామోదం ఉందనీ, దాన్నే జనం ఇష్టపడుతున్నారనే పిచ్చి భ్రమల్లో పడిపోయాడు తను… ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే నీతి తనకు ఎవడూ చెప్పినట్టు లేడు… పెద్ద పెద్ద స్టార్లు సైతం జనంలోకి వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడతారనీ, సగటు ప్రేక్షకుడు తన బాడీ లాంగ్వేజీ, టాకింగ్ స్టయిల్ కూడా పరిశీలిస్తారనీ, లాంగ్‌రన్‌లో అవన్నీ కౌంట్లోకి వస్తాయనే సోయి కూడా లేనట్టుంది […]
నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
Bharadwaja Rangavajhala……… నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా…… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బరామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. చెంచులక్ష్మితో స్టార్ట్ […]
మరో హిందీ సినిమా ఢామ్మని పేలిపోయింది… ఇది ఇంకా దారుణంగా…
మరో హిందీ సినిమా ఢామ్మని పేలిపోయింది… హీరో, హీరోయిన్లు ఎవరైతేనేం..? బ్యానర్ ఏదయితేనేం..? దర్శకుడు ఎవరైతేనేం..? సినిమా ఎలా ఉంటేనేం..? ఎంత ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేసుకుంటేనేం..? ‘‘మా సినిమా బాయ్‌కాట్ చేయండి ప్లీజ్, హ్యాష్ ట్యాగ్ వైరల్ చేయండి దయచేసి’’ అంటూ బాయ్‌కాట్ పిలుపుల మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు హీరోయిన్ తాప్సి, దర్శకుడు అనురాగ్ కశ్యప్… ‘అసలు ఈ షోలను కేన్సిల్ చేసే కల్చర్ ఏమిట్రా బాబోయ్’ అంటూ పకపకా జోకులేసుకుని నవ్వారు… సినిమా పేరు […]
గెటౌట్ విష్వక్సేన్..! ఆ మూవీకి అత్యంత దయనీయంగా టీఆర్పీలు..!!
అదేమిటో… విష్వక్సేన్ అనగానే… తన సినిమా కోసం ఓ ప్రాంక్ వీడియో చేయించి అడ్డగోలుగా బదనాం అయిపోయిన సంఘటన గుర్తొస్తుంది… అంతేకాదు, టీవీ9 దేవి తర్జని చూపిస్తూ గెటౌట్ ఫ్రం మై స్టూడియో అని హైపిచ్‌లో అరిచి, వెళ్లగొట్టిన ఉదంతం కూడా గుర్తొస్తుంది… దాని మీద బోలెడంత రచ్చ… ప్రజలకు వినోదం మాటేమిటో గానీ, సినిమాల చిల్లర ప్రమోషన్ల మీద మంచి చర్చ జరిగింది… ఐతే నిజంగా సదరు హీరోకు ఈ వివాదం వల్ల ఏమైనా మంచి […]
హైవే… ఈ దర్శకుడు డ్రైవింగ్‌ను మధ్యలోనే వదిలేసినట్టున్నాడు…
కేవీ గుహన్… పెద్ద పెద్ద సినిమాలకు సినిమాటోగ్రాఫర్… సీనియర్… మెరిట్ కూడా ఉంది… తను దర్శకుడిగా మారి నందమూరి కల్యాణరాంతో తీసిన 118 సినిమా కూడా పర్లేదు, బాగుంటుంది… కానీ ఎందుకో పెద్దగా ఆడలేదు… ఇప్పుడు హైవే పేరిట ఆహా ఓటీటీ కోసం ఓ సినిమా తీశాడు… అల్లు అరవింద్ దీన్ని కేవలం ఓటీటీకే ఎందుకు పరిమితం చేశాడో తెలియదు… ‘‘ఎంతొస్తే అంత’’ పాలసీతో థియేటర్లలోకి పుష్ చేస్తాడేమో అనుకున్నారు, కానీ చేయలేదు… సినిమా విషయానికి వస్తే… […]
బొడ్డు తాత రాఘవేంద్రరావు ఇజ్జత్ తీసేసిన ‘పండుగాడ్’…!!
తెలుగు దిగ్దర్శకుడిగా పేరొంది, ఒకప్పటి స్టార్ హీరోలందరికీ సూపర్, బంపర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు ప్రస్తుత ఆలోచన సరళి, వెళ్తున్న బాట తన మీద జాలేసేలా ఉంటోంది… ఎనభయ్యేళ్ల వయస్సులో తను ఎంత ఆదర్శంగా ఉండాలి ఈ తరానికి..? ఫాఫం… కొందరు అంతే… వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా చూస్తుంటే రాఘవేంద్రరావు మీద జాలివేయడం మినహా ఇంకేమీ ఫీలింగ్ కలగదు… జస్ట్, జాలి, సానుభూతి… ఈరోజుకూ రాఘవేంద్రరావు అనగానే జనం బొడ్డు-పండు అని వ్యాఖ్యానిస్తుంటే దాన్ని గొప్పతనంగా […]
ఫాఫం ఆది సాయికుమార్… ఓ శాపగ్రస్తుడు… తీస్మార్ఖాన్ తన తప్పిదమే…
ఇది ఖచ్చితంగా ఆది తప్పే… ఆది అంటే పినిశెట్టి ఆది కాదు… సాయికుమార్ కొడుకు ఆది… పుడిపెద్ది ఆది… పీజే శర్మ మనమడు… నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తనకు బాబాయ్… మంచి నటనకు, మంచి వాయిస్ ఓవర్‌కు పెట్టింది పేరైన ఆ కుటుంబంలో ఆది ఓ హిట్ కోసం తన్నుకుంటున్నాడు పదకొండేళ్లుగా… తను ఏదో తక్కువ చేస్తాడని కాదు… తన మ్యాగ్జిమం ఇస్తాడు… కానీ ఓ శాపగ్రస్తుడు… తీసిన సినిమాలన్నీ ఫట్… మరీ కొన్నాళ్లుగా ఇంకా […]
డాక్టర్ దిల్‌రాజు వైద్యం… తెలుగు సినిమా రోగం వేరు, చికిత్స వేరు…
ఫాఫం తెలుగు సినిమా నిర్మాతలు…! ఇండస్ట్రీ అసలు సమస్య ఏమిటో వాళ్లకు అర్థం కావడం లేదా..? కానట్టు నటిస్తున్నారా..? ఎగ్జిబిటర్ల మాఫియాకు భయపడుతున్నారా..? ఇంకా ఇంకా ఊబిలోకి కూరుకుపోతున్నారా..? వేల కోట్ల టర్నోవర్‌కు రిస్క్ తీసుకుంటున్న పెద్ద పెద్ద నిర్మాతలతోపాటు చిన్న చిన్న బడ్జెట్లతో అదృష్టాల్ని పరీక్షించుకునే చిన్న నిర్మాతలూ ఉన్నారు… వాళ్లలో ఇక మాట్లాడేవాళ్లు, నిర్ణయాలు తీసుకోగల పరిణతి ఉన్నవాళ్లు ఎవరూ లేరా..? నిర్మాతలకూ దిల్ రాజే ప్రతినిధి… ఎగ్జిబిటర్లకూ దిల్ రాజే ప్రతినిధి… ఏ […]
ఫాఫం నిత్యామేనన్… ఫాఫం ప్రకాష్‌రాజ్… ప్రేక్షకుడికి ‘తిరు’నామాలు…
అప్పుడెప్పుడో నువ్వేకావాలి అనే సినిమా వచ్చింది ఉషాకిరణ్ మూవీస్… ఎదురెదురు ఇళ్లలో ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… కలిసి చదువుకుంటారు… అల్లరి సరేసరి… దాపరికాల్లేవు… తమ నడుమ ఉన్నది ఉత్త స్నేహం కాదనీ, అది ప్రేమేనని తెలిసి ఒక్కటయ్యే కథే సినిమా… పాటలు బాగుంటయ్, కథనం సరదాగా సాగుతుంది… తరుణ్, రిచాల జంట బాగుంటుంది… వెరసి సినిమా అప్పట్లో సూపర్ హిట్… సీన్ కట్ చేయండి… తిరు అనే సినిమా ఒకటి రిలీజైంది… ధనుష్ హీరో, నిత్యా […]
జబర్దస్త్ తరహా బూతు టెండెన్సీలో బాలీవుడ్ పెద్ద మొహాలు..!!
నిజానికి తాప్సీ పన్ను మెంటాలిటీకి ఆ వెకిలి, కంపు వ్యాఖ్య విన్న వెంటనే పరుషంగా రియాక్టయి ఉండాలి… కాఫీ విత్ కరణ్ షోకు ఎందుకు పోలేదు అనే ప్రశ్నకు, నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు కాబట్టి పోలేదు అంటూ ఖతర్నాక్ రిటార్ట్, సెటైర్ వేసిన తీరు గుర్తుంది కదా… అంతేకాదు, మా చిన్న బడ్జెట్లో మేమే సొంతంగా ఓ షో ప్లాన్ చేస్తున్నాం, కటింగ్ విత్ కశ్యప్ తర్రా విత్ తాప్సీ పేర్లు ఆలోచిస్తున్నాం […]
లాల్‌సింగ్ దెబ్బ చిన్నది కాదు… అమీర్‌ఖాన్‌కు అసలు నష్టం వేరే…
రివ్యూయర్ :: పార్ధసారధి పోట్లూరి ……… అదన్న మాట సంగతి ! ఈ చిరంజీవికి ఏమయింది ? భారత దేశంలోనే అమీర్ ఖాన్ లాంటి నటుడు లేడు అంటూ పొగిడాడు హైదరాబాద్ లో, లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో… గతంలో కూడా ఉప్పెన సినిమా ప్రమోషన్ లో విజయ్ సేతుపతిని తెగ పొగిడేశాడు చిరంజీవి. సరే, ఉప్పెన అంటే స్వంత ఫామిలీ మెంబర్ హీరో కాబట్టి తెగ పొగిడేశాడు అనుకుందాం ! కానీ […]
సౌతిండియా హవాకు విరుగుడు మసాలాయేనట… ఏక్తాకపూర్ ‘డర్టీ ప్లాన్’…
ఏక్తాకపూర్ డర్టీపిక్చర్ సీక్వెల్ ప్లాన్ చేస్తోందని వార్త… కొన్ని ఆలోచనలు ముసురుకునేలా చేసింది… సదరు వార్తలో ఆకర్షించిన పాయింట్స్ ఏమిటంటే… సీక్వెల్ ప్లాన్స్ తెలియగానే కృతిసనన్, తాప్సీ పన్ను అర్జెంటుగా, విడివిడిగా ఏక్తాను కలిశారట… చాన్స్ మాకే కావాలని అడిగారట… ముందైతే కథ రెడీ కానివ్వండి, తరువాత చూద్దాం అని ఆమె అభయహస్తం చూపించిందట… నిజానికి మళ్లీ విద్యాబాలనే బెటర్ అనుకున్నారట గానీ, ఆమె కాస్త ఎక్కువ బరువు పెరిగి, డర్టీ మసాలాకు పనికిరాదేమో అనుకుని, కంగనా […]
రెండు ‘అనుపమ’ ఫ్యాక్టర్స్… కార్తికేయుడికి భలే కలిసొచ్చినయ్…
నిజానికి చిన్న సినిమా… పాన్ ఇండియా సీన్ ఊహించలేం… హీరో నిఖిల్ రేంజ్ కూడా సెకండ్, థర్డ్ లేయర్… స్టారిజం ఇంకా తలకెక్కలేదు… కానీ హిందీలో కలకలం క్రియేట్ చేస్తోంది… ఎందుకంటే..? అమీర్‌ఖాన్ వంటి సూపర్‌స్టార్ చతికిలపడ్డాడు… అక్షయ్‌కుమార్ బోల్తాకొట్టాడు… వాళ్లను దాటేసి, ఒకవైపు వందలాదిగా వాళ్ల సినిమా షోలను ఎత్తిపారేస్తూ, కార్తికేయ సినిమా షోల సంఖ్య పెంచుతున్నారు… ఇంకా పెరుగుతోంది… ఎందుకిలా..? ఈ సినిమాను తొక్కడానికి దిల్‌రాజు ప్రయత్నించాడు, తను తెలుగు ఇండస్ట్రీకి మంకీపాక్స్ వైరస్ […]
సారీ, దానవీరశూరకర్ణ నేను రాయలేను… ఓ ఉద్దండుని పరిచయం చేస్తాను…
Bharadwaja Rangavajhala………… ‘‘కులము… కులము …. కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది. ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది. నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. వీడు నీ వరాల తండ్రి కాదు. తెలిసీ తెలియని పడుచుతనపు ఉన్మాదంలో దూర్వాసదత్తమైన మంత్ర శక్తిని […]
Cadaver… వైద్య బోధనకు ఉపయోగపడే మృతదేహం… ఈ సిన్మా ఏంటంటే..?
Cadaver… కడవర్ అంటే మెడికల్ స్టూడెంట్స్ అనాటమీ నేర్చుకొనేందుకు ఉపయోగించే మృతదేహం….. అమలాపాల్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి తీసిన ఈ కడవర్ సినిమా పేరు సజస్ట్ చేస్తున్నట్లుగానే ఒక మెడికో లీగల్ కేస్కి సంబంధించిన మిస్టరీ మూవీ… ముందుగా సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం…. నాన్-లీనియర్ మెథడ్‌లో చెప్పిన ఈ కథని సాధ్యమైనంతవరకు ఇల్లాజికల్ అంశాలు లేకుండా తీయడానికి శ్రమించారు. అరవింద్ సింగ్ చేసిన సినిమాటోగ్రఫీకీ సంబంధించినంతవరకు తను ఎంచుకున్న కలర్ స్కీం, సీన్‌కి అవసరమైన, అనుగుణమైన […]
వెబ్ వరల్డ్‌లోకి నీహారిక… ఆ పాత ఆర్యన్ రాజేష్, నటి సదా… ఓ వృథా శ్రమ…
ఆర్యన్ రాజేష్… పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..? ఈవీవీ పెద్ద కొడుకు… హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని బాగా ప్రయత్నించాడు ఆయన… కానీ లెగ్గు… అసలు కెరీర్ కదిలితే కదా… ఇరవై ఏళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు… ఏమాత్రం వెలగని తెలుగు వారసహీరోల్లో తన పేరూ ఉంటుంది… ఇక సినిమాలు చేయడమే మానేశాడు… తమ్ముడు అల్లరి నరేష్ కాస్త నయం… ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు గానీ, అప్పట్లో కామెడీ జానర్‌తో కాస్త నిలబడ్డాడు… ఇలాంటోళ్లకు ఓటీటీలు మళ్లీ […]
కార్తికేయుడి విజయంతో… థియేటర్ల మాఫియా పెద్దలు కుళ్లుతో కుతకుత…
లాల్‌సింగ్‌చద్దా గతి ఏమైంది..? బాబ్బాబు, నా సినిమా చూడండి, పాత తప్పులన్నీ కాయండి అని అమీర్‌ఖాన్ బతిమిలాడుతున్నాడు… ఒక పరిమితి దాటితే, జనం తిరస్కరించడం మొదలైతే ఇక అంతే… మరి ఆ గతి దిల్‌రాజుకు కూడా పడుతుందా..? ఇదీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చను రేకెత్తిస్తున్న ప్రశ్న… పూర్తిగా థియేటర్లను చెరబట్టిన ఓ నలుగురి సిండికేట్ ఇండస్ట్రీని శాసిస్తోందనే విషయం బహిరంగ రహస్యమే… తాము అనుకున్న సినిమాలే రిలీజ్ కావాలి, తాము చెప్పినప్పుడే రిలీజ్ చేయాలి, తాము […]
ఓ దైవకార్యంలో నాస్తికుడు..! కృష్ణపురాణానికీ వర్తమానానికీ లంకె..!!
నిజానికి ఓ పురాణకాలానికి వర్తమానాన్ని జోడించి ఓ కథను ఆసక్తికరంగా చెప్పడం… అందులోనూ ఓ దైవకార్య సాధనలో ఓ నాస్తిక కథానాయకుడి సాహసయాత్రను ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడం చాలా పెద్ద టాస్క్… అదంత వీజీ కాదు… అదే ఒక అడ్వెంచర్… అడుగు తప్పుగా పడితే ఇక ఢమాలే… కార్తికేయ-2 సినిమా దర్శకుడు చందు ఆ సాహసం చేశాడు… చాలావరకూ మెప్పించాడు… ఎంతసేపూ చెత్త ఫార్ములాలు, ఇమేజీ బిల్డప్పుల సోది కథలతో విసుగెత్తించే మన సినిమా కథల […]
…. ఇదుగో ఇందుకే ఓటీటీలు ప్రేక్షకులను ఆ-కట్టేసుకుంటున్నాయి..!
ఓ సినిమానో, సీరిసో చూస్తున్నప్పుడు… నెక్స్ట్ ఏం జరుగుతుందో… వందలకొద్ది చూసేవాళ్లు సులభంగానే పసిగట్టగల్గుతారు. ఇంకా ఆయా సినిమాల్లోనో, సీరిస్ ల్లోనూ కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే అనుమానపు క్యారెక్టర్స్ తో కథ నడుపుతున్నప్పుడు… ఫలానావాళ్లే విలన్ అని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అయితే అలాంటి క్యారక్టర్స్ సంఖ్య ఎక్కువైనప్పుడు సగటు వీక్షకుల్లో ఫలానావాళ్లై అయిఉంటారని అనుకున్నాక… కాదుకాదు వీళ్లేమో అనిపించేలా అంచనాలు ఆ సినిమా, సీరిస్ చూస్తున్నంతసేపూ మారిపోతుంటాయి. కానీ, ఆ సస్పెక్టెడ్ క్యారెక్టర్సేవీ ఆ […]
లాల్‌సింగ్‌చద్దా… వందల షోలు ఎత్తేస్తున్నారు… మరేం చేస్తారు ఫాఫం..?!
కంగనా రనౌత్ హృదయం ఇప్పుడు హాయిగా ఉన్నట్టుంది… ఓ ప్రొఫెషనల్‌గా, బాలీవుడ్ పాపులర్ హీరోయిన్గా నిజానికి అలా ఫీల్ కాకూడదు… బాధపడాలి… ఆందోళన పడాలి… కానీ, అలా పడితే ఆమె కంగనా ఎందుకు అవుతుంది..? అప్పట్లో, మే నెలలో ఆమె సినిమా ధాకడ్ రిలీజైంది… ఉత్త రొటీన్ ఫైటింగుల పిచ్చి సినిమా అది… 2100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తే రెండు రోజుల్లోనే 300 స్క్రీన్లలో ఎత్తిపారేశారు… మరీ కొన్ని షోలకు 10 నుంచి 15 మంది మాత్రమే… […]
- « Previous Page
- 1
- …
- 84
- 85
- 86
- 87
- 88
- …
- 118
- Next Page »