ఆహా ఓటీటీ… తెలుగు ఇండియన్ ఐడల్ షో… పోటీలు ముగిశాయి… టాప్ ఫోర్ లేదా టాప్ ఫైవ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు బాలయ్య ముఖ్య అతిథి… ఫినాలే అని ప్రకటించలేదు గానీ అది ఫినాలేలాగే సాగింది… నిజానికి అదే ఫినాలే గానీ, అంతకుముందే చిరంజీవికి కోపమొచ్చింది… అల్లు అరవింద్‌కు ఫోనొచ్చింది… దాంతో చిరంజీవితో ఫినాలే షూట్ చేసి, ప్రసారం చేశారు… మమ అనిపించారు… బాలయ్య తొలిసారి బుల్లితెరకొచ్చాక ఆహాలోనే అన్‌స్టాపబుల్ షో… అది మరో బాలయ్యను ఆవిష్కరించింది… షో […]
సమంత ఆల్రెడీ డయాబెటిక్… కొత్తకాదు, మయోసైటిస్తోనూ చాన్నాళ్లుగా ఫైట్…
మీకు గుర్తుందా..? పోనీ, ఆర్కైవ్స్‌లోకి వెళ్లి వెతికినా కనిపిస్తుంది… అది డిసెంబరు 13, 2021…. సమంతకు బాగా అస్వస్థత… ఎఐజీ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స… తరువాత ఇంట్లో విశ్రాంతి… ఈ వార్త దాదాపు ప్రతి మెయిన్ సైటులోనూ వచ్చింది… కానీ అంతకుముందు పలు సోషల్ సైట్లు ఆమె అనారోగ్య కారణాలపై ఏదేదో రాసేయడంతో ఆమె మేనేజర్, పీఆర్వోలు అది మామూలు దగ్గు, జలుబు మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు… కానీ అప్పటి నుంచే చాలామందికి తెలుసు ఆమె ఓ […]
భలే మూవీ… డ్రామా, ఫార్ములా దశల్ని దాటేసి… హఠాత్తుగా ఆత్మాన్వేషణ బాటలోకి…
Sunitha Ratnakaram….. రేవా (REVA)… ప్రతీ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం వుంటుంది ఎక్కువగా ఒక అమ్మాయి వైపో ఏదో సాధించడం వైపో ప్రయాణమూ అందులో భాగంగా రకరకాల ఆటంకాలు; అవన్నీ ఎట్లా దాటేసి సాధించాడూ, లేదూ అన్నదే ఫార్మాట్ సినిమా. సాధారణమైన ఫార్మాట్. ఈ సినిమా కూడా ఆ లెక్కలో ఏమీ అసాధారణం కాదు. ఫక్తు commercial ఫార్మాట్, అందులోనూ పెద్ద ఊహించలేని రైటింగ్ కూడా కాదు. కానీ, ఒకానొక దశలో ఈ సినిమా మనతో […]
పూరీ జగన్నాథ్ బాధలో నిజాయితీ ఉంది… కానీ తోడుగా నిలబడేవాడే లేడు…
శరత్ కుమార్ చింత……… డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాపులు చూసిన దర్శకుడు.. ఇప్పుడు లైగర్ అనే ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ తో ఎప్పుడు లేనంత నెగెటివిటీని ఫేస్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడం, విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని […]
‘‘ఒకవేళ పంజూరి వదిలినా సరే.., తప్పు చేస్తే నిన్ను గుళిగ మాత్రం వదలడు…’’
కాంతారా.., ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడంలో అర్థం: రహస్యమైన అరణ్యం) నేను మీకు స్థూలంగా కథ చెప్పదలుచుకోలేదు. ఆ మార్మికారణ్యం బోధించిన శివతత్వం ఏమిటో చెప్పదలిచాను… ఈ చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ: సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ… మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నేల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance […]
రిషబ్ శెట్టికి ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ ఓ పాట పంచాయితీతో తలబొప్పి…
కాంతార సినిమాకు బలమే వరాహరూపం పాట… అసలు ఆ పాట లేకపోతే సినిమాయే లేదు… కానీ ఓ ప్రైవేటు మలయాళ మ్యూజిక్ కంపెనీ కేసు వేసింది… తమ ప్రైవేటు వీడియో నవరసం పాటకు వరాహరూపం కాపీ అని..! సినిమాలో ఆ పాట తీసేయాలనీ, అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద ఆ పాట నిలిపివేయాలనీ తీర్పు పొందింది… నిజానికి ఆ రెండు పాటల నడుమ పెద్ద పోలికలు లేవు… పాటల కంటెంటు వేరు, వాటిల్లో చూపించిన కళారూపాలు వేరు… సరే, […]
‘‘నా మనమరాలు పెళ్లి గాకుండానే తల్లి అయితే తొలి ఆశీస్సు నాదే…’’
గుర్తుందా..? పెళ్లికి ముందు శృంగారం తప్పేమీ కాదని ఖుష్బూ అప్పట్లో అన్నందుకు ఆమెపై సంప్రదాయవాదులు భగ్గుమన్నారు… గుడికట్టి ఆరాధించిన వాళ్లే కనిపిస్తే ఖతం చేస్తామంటూ వీరంగం వేశారు… ఒకప్పుడు అది సంప్రదాయ విరుద్ధం… కానీ ఇప్పుడు అలా ఎవరైనా వ్యాఖ్యానిస్తే ఎవరూ పట్టించుకోరు… సమాజం దాన్ని ఆమోదించిందని కాదు… దాన్ని ఓ ప్రాధాన్యాంశంగా పరిగణించడం మానేసింది… జయాబచ్చన్ తెలుసు కదా… లెజెండ్ అమితాబ్ బచ్చన్ భార్య… తనూ ఒకప్పుడు హీరోయినే… రాజ్యసభ సభ్యురాలు… సమాజ్‌వాదీ పార్టీ తరఫున… […]
అల్లు అరవింద్ తప్పు చేస్తున్నదెక్కడ..? అసలు టార్గెట్ కొట్టాల్సిందెక్కడ..?
ఒక టీవీ వినోద చానెల్ వేరు… ఓటీటీ వేరు… ఓటీటీ అనగానే ప్రేక్షకులు సినిమాలు, ఆయా ఓటీటీల ఎక్స్‌క్లూజివ్ వెబ్ సీరీస్ ఎట్సెట్రా చూస్తారు… అవి ఎప్పుడైనా చూసేలా ఉంటయ్… మళ్లీ వాటికి సబ్‌టైటిళ్లు, సపరేట్ భాషల ఆడియో అదనం… కేవలం సబ్స్క్రిప్షన్ మీద ఆధారపడి అంత కంటెంట్ క్రియేట్ చేసి, డంప్ చేయడం కష్టం… టీవీ వేరు… సీరియళ్లు అనబడే ఫిక్షన్ కేటగిరీ ఉంటుంది, నాన్-ఫిక్షన్లో రియాలిటీ షోలు, ఇతర ప్రోగ్రాములు ఉంటయ్… రెగ్యులర్ యాడ్స్ […]
గరికపాటిపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్య మళ్లీ వైరల్… ఇంకా చల్లారినట్టు లేదు…!!
ముందుగా సందర్భం ఏమిటో చూద్దాం… సినిమా జర్నలిస్టు ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం ఆవిష్కరణ… ముఖ్య అతిథి చిరంజీవి… కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు బొకే ఇచ్చి, సెల్ఫీ అడిగారు… ఈ సందర్భంగా చిరంజీవి ‘ఇక్కడ వారు లేరు కదా’ అన్నాడు… అంటే గరికపాటిని పరోక్షంగా ఉద్దేశించి… అక్కడున్నవాళ్లంతా పడీ పడీ నవ్వారు… మొన్నమొన్నటిదాకా వివాదం నడిచిందే కదా… దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ ప్రోగ్రాంలో వివాదం రేగిందే సేమ్, ఇలా మహిళల […]
చేతిలో 10 సినిమాలు..! అబ్బురమే… మిగతా పాత రక్తానికీ గిరాకీ ఉందండోయ్…!!
అలోన్, ఒలవుం తీరవుం, బర్రోజ్, రామ్ (పార్ట్-1), రామ్ (పార్ట్-2), లిజోజోస్ మూవీ (పేరు పెట్టలేదు) , వివేక్ మూవీ (పేరు పెట్టలేదు), లూసిఫర్ సీక్వెన్స్ ఎంపురాన్… ఇలా మొత్తం పది సినిమాలు ఉన్నయ్ 62 ఏళ్ల మలయాళ వెటరన్ హీరో మోహన్‌లాల్ చేతిలో…! నిజానికి సినిమాల ఫ్యాక్టరీ అంటే అక్షయ్ కుమార్ పెట్టింది పేరు… హిట్టా, ఫ్లాపా అక్కర్లేదు… ఉత్పత్తి మాత్రం ఆగకూడదు… కరోనాలు, విపత్తులు వాళ్లను ఆపవు… ఆపలేవు… మోహన్‌లాల్ కొడుకు కూడా హీరో, […]
వరాహరూపం దైవవరిష్టం… టైమ్ కూడా కలిసివచ్చి… డబుల్ థియేటర్లు…
దీపావళికి ముందు ఏం సినిమాలున్నయ్..? కొన్నిరోజులు బింబిసార, సీతారామం బాగానే నడిచాయి… వాటికి డబ్బులొచ్చాయి… రెండూ హిట్… ఇక కార్తికేయ-2 అనూహ్యమైన హిట్… హఠాత్తుగా అదీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది… కోట్లకుకోట్లు నడిచొచ్చాయి… వోకే, ఇంకా..? దీపావళికి రిలీజైన నాలుగు సినిమాల్లో జిన్నాది ఓ విషాదగాథ… ఫాఫం, మా అధ్యక్షుడు మంచు విష్ణు అందులో హీరో, పాన్ ఇండియా సినిమా… సన్నీలియోన్, పాయల్ రాజపుత్ కూడా ఉన్నారు… కోన వెంకట్ కథ… ఇంకేం కావాలి..? కనీసం […]
అనుకోని ప్రయాణం… వనరులున్నా వాడుకునే సోయి కనిపించలేదు…!
చిన్న సినిమా అని తేలికగా తీసుకునే పనిలేదు… అది తప్పు కూడా… ప్రత్యేకించి ‘పెద్ద సినిమాల’కు రోజులు బాగాలేవు… స్టార్లు, బిల్డప్పులను జనం ఇష్టపడటం లేదు… అక్షయ్, అజయ్, చిరంజీవి, మోహన్‌లాల్ అందరూ ఈ ఫలితాల్ని అనుభవిస్తున్నవాళ్లే… అదేసమయంలో సరిగ్గా తీయబడిన కొన్ని చిన్న సినిమాలు తోకపటాకులు అనుకుంటే సుతిలి బాంబుల్లా పేలాయి… ఉదాహరణకు, కార్తికేయ-2, కాంతార, సీతారామం ఎట్సెట్రా… ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ వంటి గ్రాఫిక్ మసాలాల గురించి చెప్పుకోవడం దండుగ… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… దర్శకుడికి […]
ఆలీ… అందరూ బాగుండాలి, అందులో తెలుగు కథకులూ ఉండాలి…
ఆలీవుడ్… టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తరహాలో ఆలీవుడ్… అనగా ఆలీ అనబడే కమెడియన్ కమ్ పొలిటిషియన్ కమ్ టీవీ ప్రజెంటర్ కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్… తాజాగా నిర్మాత ఆలీ తీయబోయే సినిమాలను ఆలీవుడ్ అని పిలవాలట… పేరు బాగుంది… క్రియేటివ్‌గా ఉంది… ఓ సినిమా తీశాడు… అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి… సినిమా పేరు అదే… ఆలీ తత్వం కూడా అదే… సినిమా తీశాడు కానీ థియేటర్ల దాకా రానివ్వలేదు… అందులో అంత దృశ్యము లేదని […]
మరోసారి కన్నడ ప్రేక్షకుడి కంటతడి…! ఆ జ్ఞాపకాల ఉద్వేగంలో వెండితెర..!
కన్నడ ప్రేక్షకుడు మరోసారి కన్నీరు పెట్టుకుంటున్నాడు… ఏడాదిక్రితం హఠాత్తుగా మరణించిన తమ అభిమాన కథానాయకుడు అప్పు అలియాన్ పునీత్ రాజకుమార్‌ను తలుచుకుని, చివరిసారిగా వెండితెర మీద చూస్తూ ఉద్వేగానికి గురవుతున్నారు… నిజం… తను ఓ పెద్ద హీరో కొడుకు, కానీ ఎక్కడా ఆ వారస దుర్లక్షణాల్ని చూడలేదు కన్నడ సమాజం… పైగా తనలోని గొప్ప ఔదార్యాన్ని, నేల మీద నడిచే సంస్కారాన్ని, పదిమందిలో ఒకడిగా నడిచిన వ్యక్తిత్వాన్ని చూసింది… మన సినీ ఇండస్ట్రీల్లోని చెత్తా బిల్డప్పు గాళ్లకూ […]
సింగిల్ సమంతపై విజయ్ కన్ను… ఫాఫం, రష్మికకు మళ్లీ శోకాలేనా..?!
అతనికన్నా ఆమే రెండుమూడేళ్లు పెద్ద… ఫాఫం, విజయ్ దేవరకొండ కాలేజీలో చదువుతున్నప్పుడే సమంత వెండితెరకు ఎక్కింది… ఆమెను చూసి తనకు పిచ్చెక్కింది… అప్పటి నుంచీ ఆరాధిస్తూనే ఉన్నాడు… మొదట్లో ఆమె సిద్ధార్థ్ మాయలో పీకల్లోతు పడిపోయింది, మునిగిపోయింది… విజయ్ కాలేజీ నుంచి బయటికి వచ్చి, సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు కానీ తనను దేకేవారు ఎవరు..? సమంత ఓ ప్రేమ దేవత… వెండితెరపై వెలిగిపోతున్న దేవత… విజయ్ను చూసేంత సీన్ ఉందా..? కానీ మెల్లిమెల్లిగా తనూ హీరో […]
బాలయ్య అంటే అంతే… కమర్షియల్ యాడ్స్‌లో కూడా అవే భుజకీర్తులు…
సెలబ్రిటీలు… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీలు కాస్త పాపులరైతే చాలు… రకరకాల కమర్షియల్స్‌లో నటించి ఎడాపెడా డబ్బు తీసుకుంటారు… తప్పుకాదు… బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో ఉభయతారకం… అయితే తాము ప్రచారం చేస్తున్న సరుకులతో ప్రజలకు నష్టం వాటిల్లే పక్షంలో వాటికి ఆయా సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది… లీగల్‌గానే… ఈ విషయం చాలామందికి తెలియదు… అంతెందుకు..? అనైతికంగానూ డబ్బు సంపాదిస్తుంటారు కొందరు… అప్పట్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ తదితరులు గుట్కా సరోగేట్ యాడ్స్ చేసి, తరువాత చెంపలేసుకున్నారు… […]
డియర్ ఆలీ భాయ్… ఈ యెల్లో టీవీ చానెళ్లను కాస్త కంట్రోల్లో పెట్టాలోయ్…
సినిమా నటుడు ఆలీ… ఇండస్ట్రీలో అందరికీ ఇష్టుడే… చిన్నప్పటి నుంచీ కష్టపడ్డాడు… కుటుంబాన్ని ఆదుకున్నాడు… పదిమందికీ సాయం చేస్తాడు… నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతున్నాడు… కానీ ఒక్కసారిగా తనకు తీవ్ర అసంతృప్తి… అదీ జగన్ వైపు నుంచి..! అసలు జగన్ పట్ల మద్దతుగా నిలిచిన సినిమావాళ్లు ఎవరున్నారు..? పోసాని వంటి ఒకటీరెండు కేరక్టర్లు తప్ప… పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నా ఆలీ జగన్‌కు మద్దతుగా ఉన్నాడు, పార్టీలో చేరాడు… మరి ఆ ఆలీకి జగన్ ఏం […]
పేరుకేనా అన్‌స్టాపబుల్..! అప్పుడే స్టాపా..? ఏదీ ఆ మూడో ఎపిసోడ్..?!
అదుగదుగో అన్‌స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్లో అనుష్క… ఇక ఆహా ఓటీటీ దద్దరిల్లిపోవాల్సిందే అని వీరభక్తితో రాస్తూపోయాడు ఓ యూట్యూబర్… కానీ ఏది..? ఎక్కడ.? ప్రోమో ఏది..? అసలు ఆమె చాన్నాళ్లుగా ఏ ఇంటర్వ్యూలకూ రావడం లేదు… నో, నో, రోజాతో మూడో ఎపిసోడ్ రాబోతోంది… ఇక చూస్కో నా రాజా అని మరో వీరభక్తుడు థంబ్ నెయిల్ వెలిగించి మరీ వీడియో పెట్టేశాడు… అసలే జగన్ దగ్గర ఫుల్ మైనస్ మార్కుల్లో ఉంది ఆమె… సొంత నియోజకవర్గంలో […]
నెగెటివ్ ప్రచారంలోనూ స్టడీగా కాంతార… ఓ అరుదైన రికార్డు ఛేదన…
కాంతార సినిమాలోని సూపర్ హిట్ పాట ఓ ప్రైవేటు ఆల్బమ్ నవరసం పాటకు కాపీ అని ఓ వివాదం… లీగల్ నోటీసులు… మీడియా కవరేజీ… గతంలో ఇదే మంగుళూరు ప్రాంతం నుంచి వచ్చిన పింగారా సినిమాకు కాంతార కాపీ అని మరో వివాదం… ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిందట.,.. ఇప్పుడు దాన్ని తెలుగులోకి డబ్ చేసి వదులుతారట… దీనిపైనా మీడియా కవరేజీ… పనిలోపనిగా భూత్ కోళ సంప్రదాయానికీ హిందూ మతానికీ సంబంధం లేదని మరో […]
హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!
ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]
- « Previous Page
- 1
- …
- 88
- 89
- 90
- 91
- 92
- …
- 130
- Next Page »