. ‘‘నా పేరు కృతి మహేశ్ మిద్య… ఈ మిద్య అనే పేరు ఈమధ్య ఎనిమిదేళ్ల క్రితం మొగుడిగా మారిన బాయ్‌ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చి చేరింది లెండి… తండ్రి పేరు మహేశ్… నా ఒంటి పేరు కృతి… నాన్న ఇష్టంగా పెట్టుకున్న పేరు ఇది… ముంబైలో ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను… మధ్యతరగతి… ఇద్దరం అక్కాచెల్లెళ్లం… శ్యామ్ సింగరాయ్ సినిమావాళ్లు నాకు క్రెడిట్స్ ఇవ్వలేదనే ఓ వార్త చదివాను… నిర్వేదంగా ఓ నవ్వు పుట్టుకొచ్చింది… […]
అచ్చు శ్యాంసింగరాయ్ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
. (By… రమణ కొంటికర్ల…) శ్యాంసింగరాయ్ సినిమా అనంతరం ఇప్పుడు గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువ కనిపిస్తున్న పేర్లలో శాంతిదేవి ఒకటి. అయితే ఈ పేరును శ్యాంసింగారాయ్ లో కోర్ట్ సీన్ లో… నాని తరపు లేడీ అడ్వకేట్ కేసు వాదనలో భాగంగా ఉటంకించడం.. ఏకంగా మాహాత్మాగాంధీనే శాంతిదేవి పునర్జన్మ తాలూకు విశేషాల గురించి పూర్తి పరిశోధన చేయాలని ఓ కమిటీ వేయడంతో.. ఇంతకాలం చరిత్రగా ఉన్న శాంతిదేవి పేరు మరోసారి వార్తగా చర్చల్లోకి వస్తోంది. ఇప్పటికే […]
కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
ముందుగా ఓ కథ చదవండి, నీతి కథ… బాగుంది… పూర్తిగా చదవండి… తరువాత అదేమిటో చెప్పుకుందాం… ఈ కథ వాట్సప్పు, ఫేస్‌బుక్కల్లో తెగ చక్కర్లు కొడుతోంది ఈ నడుమ… మరి చెప్పుకోకపోతే ఎలా..? ఇదీ విస్తృత ప్రచారంలో ఉన్న ఆ కథ… యథాతథంగా… కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు …? మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు… (మలప్పురం అంటే కేరళ రాష్ట్రం) ఆమె చేతి గడియారం తప్ప […]
కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
. ఈగలు పగబడతాయా..? ఓ ప్రశ్న… ఎందుకు పగబట్టవు..? రాజమౌళి తీసిన ఈగ అనే ఫిక్షన్ చూడలేదా..? ఇన్నేళ్లూ పాములకే పగలుంటయ్ అనుకున్నాం కదా అమాయకంగా… కానీ రాజమౌళి అనే మేధావి ఛట్, ఈగలకూ పగలుంటయ్ అన్నాడు… ఈగలకూ పునర్జన్మలుంటయ్, పగలుంటయ్, ప్రేమలుంటయ్, హీరోయిక్ చేష్టలుంటయ్…… హహహ… ఎహె, అది సినిమా, ఓ కల్పన, ఆఫ్టరాల్ ఈగలేమిటి, అంత సీన్ ఏమిటి అని నవ్వొస్తోందా..? మనిషి కూడా జంతువే కదా, మరి మనిషికి ఉన్నట్టే జంతువులకు ఉద్వేగాలుంటయ్ […]
ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
. కార్యకారణ సంబంధం… ఎక్కడో ఓ గడ్డిపోచ ఇటు నుంచి అటు పడిపోయిందంటే దానికీ ఓ కారణం ఉంటుంది, ఎక్కడో ఏదో ప్రభావం ఉండి ఉండవచ్చు… లేదా ప్రభావం వల్ల కావచ్చు… దేన్నీ తేలికగా తీసుకోవద్దు… సెప్టెంబరు 11… అమెరికాను కుదిపేసిన జంట టవర్ల ధ్వంసం సంఘటన అందరికీ తెలిసిందే… ఆ చేదు అనుభవాల నుంచి, భయాల నుంచి కాస్త తేరుకున్నాక, గతంలో ఆ టవర్లలో ఓ పెద్ద ఆఫీసు నడిపించిన కంపెనీ ఏం చేసిందంటే… ఆ […]
ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
. ఓ మిత్రుడి పోస్టు సొరకాయను (తెలంగాణలో అనపకాయ, ఆన్యపుకాయ) మించిన కాయ లేదు అని..! నిజమే, దాని ఇంపార్టెన్స్ తెలియదు చాలామందికి… ప్రత్యేకించి ఈ తరానికి..! ఎప్పుడూ ఎగుడు దిగుళ్లు లేని రేటు… కాస్త అటూఇటూ ఒకటే రేటు ఎప్పుడూ… మంచి ఆర్గానిక్… ఎరువులు అక్కర్లేదు, పెస్టిసైడ్లు అక్కర్లేదు… పంట దెబ్బతినడాలు, అకస్మాత్తుగా రేట్లు పడిపోవడాలు, పెరిగిపోవడాల్లేవ్… ఊళ్లల్లో చాలావరకూ ఇరుగూపొరుగు నడుమ ఉచితంగా పంపిణీ కాబడే స్నేహపు దినుసు… పట్టణాల్లో కష్టంలే గానీ, ఊళ్లల్లో, […]
‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
. ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..! వాస్తవానికి అది మాంసాహారం కాదు, జంతు జాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం మీద కనిపించే గజ్జి… అదుగో ఆ జాతి… శిలీంధ్రజాలం… ఫంగస్… దాని పేరు పుట్టగొడుగులు..! నో, నో, అది శాఖాహారమే అంటారు కొందరు… కానేకాదు, మాంసాహారమే […]
ఇది రసజ్ఞుల కోసం మాత్రమే… రసహీనులు దూరముండగలరు…
. ఈమధ్యే సోషల్ మీడియాలో అలనాటి యుగపురుష్ అన్నగారి ఆటగాడు అనే అద్భుతమైన సినిమాకు సంబంధించి ఏదో ఒక ఆక్రోశపూరితమైన భీకర పోస్టు చదవబడితిని… అప్పుడంతగా పట్టలేదు గానీ, ఓ మిత్రద్రోహి కుట్రపూరితంగా, కక్షతో ఓ పాటను వాట్సప్పులో పంపించి మరీ వెక్కిరించెను… ‘‘ఈమధ్య కొన్ని పాటల్లో సాహిత్యం, విలువలు, ప్రమాణాలు, తొక్కాతోలూ అని రాసి ఉంటివి కదా, ఈ పాట చూసి తరించుము, ఈసారి ఏదైనా సినిమా పాట గురించి రాసి, లిటరరీ వాల్యూస్ అన్నావనుకో […]
గుండె తడిని తాకే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
. నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, తీసేవాళ్లు కూడా దాన్నలాగే భ్రష్టుపట్టించారు… కాకపోతే ఆరుద్ర, […]
అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!
. బాలసుబ్రహ్మణ్యం గొప్ప పాటగాడు… సకల ప్రపంచమూ ముక్తకంఠంతో అంగీకరించింది… నీరాజనాలు పట్టింది… కానీ ఒక సందేహం మాత్రం సజీవంగా ఉండిపోయింది… ఆయన కొన్ని వందల (వేలు కూడా కావచ్చు బహుశా) కచేరీలు చేశాడు… చిన్న గాయకుల నుంచి పెద్ద పెద్ద గాయకుల దాకా అందరి పాటలూ పాడాడు… కొన్నిసార్లు ఆ గాయకులకన్నా బాగా పాడాడు… తప్పులొచ్చిన చోట వినమ్రంగా, హుందాగా ప్రేక్షకులకు చెప్పాడు… కానీ ఏ కచేరీలోనూ తను మంజునాథ సినిమాలోని మహాప్రాణదీపం పాటను, జగదేకవీరుడి […]
నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
. నో కరెంట్, నో టీవీ, నో బ్రాడ్ బ్యాండ్, నో స్మార్ట్ ఫోన్, నో కనెక్టివిటీ… ఊహించండి… నెవ్వర్, ప్రస్తుత జనరేషన్ అరగంట కూడా తట్టుకోలేదు… అంతెందుకు, దిక్కుమాలిన సోషల్ సైట్లు కొన్ని గంటలు పనిచేయకపోతేనే తల్లడిల్లిపోతాముగా… మరి అవేవీ లేకుండా, అసలు మనిషి పొడ గిట్టకుండా… అడవిలో… జంతువుల నడుమ ఓ జంతువుగా పదిహేడేళ్లపాటు బతకడం అంటే..?! నమ్మడం లేదు కదా… కానీ నిజమే… ఎక్కడో కాదు, మన పొరుగునే… దక్షిణ కన్నడ జిల్లాలోని […]
జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
.. నిజానికి ఇది రాయడానికి విశేష సందర్భం ఏమీలేదు, పనికట్టుకుని రాసిందీ కాదు… ఒకప్పటి నిర్మాత కాట్రగడ్డ మురారి రాసుకున్న బయోగ్రఫీ ‘నవ్విపోదురుగాక’ పుస్తకం మరోసారి తిరగేస్తుంటే… ఈ ఎపిసోడ్ దగ్గర చాలాసేపు మనం ఆగిపోతాం… మథనంలో పడిపోతాం… మనం చదువుకున్న చరిత్ర మీద మనమే సందేహంలో ఇరుక్కుపోతాం… ఇది గాంధీ కొడుకు కథ… గాంధీ కథతో పోలిస్తే నిజానికి తన కొడుకుది కథే కాదు… పైగా భ్రష్ట జీవితం… అయితే అలా మారడానికి తండ్రే కారణమా..? […]
నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
. మరీ వెనక్కి అవసరం లేదు… కాస్త వెనక్కి… ఇప్పుడంటే… పండించిన వడ్లు అమ్ముకోవాలి, దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాలి కదా ట్రెండు… కానీ గతం… సన్నవో, దొడ్డువో… వడ్లు వడ్లే… (వడ్లు అంటే ఏమిటని అడిగే తరం ఇది…) వడ్లు అంటే ఇంకా ప్రాసెస్ చేయబడని బియ్యం, అంటే ధాన్యం… సరే, రాళ్లూరప్పా, మట్టీబేడా లేకుండా చూసి, తమ వడ్లను తీసుకుని గిర్నికి తీసుకుపోయేవాళ్లు రైతులు… చిన్న చిన్న గిర్నీలు ప్రతి ఊరిలోనూ ఉండేవి… (గిర్నీ అంటే […]
విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
. ఆమధ్య లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్న ఓ వీడియో, ఓ పోస్ట్… అందులో ఆమె ఆకు గానీ, విస్తరి గానీ, ప్లేటు గానీ లేకుండా… తను నేల పైనే కూర్చుని.., ఉత్త నేల మీదే వడ్డన చేసిన ఆహారాన్ని భోంచేస్తోంది… మన తెలుగు జనానికి కొత్తగా అనిపించవచ్చుగాక… కానీ తమిళనాడులో.., కేరళ, కర్నాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గుళ్ల దగ్గర చాలాకాలంగా ఉన్న ఆచారం ఇది… దేవుడికి మరింత సరెండర్ కావడం… […]
Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
. కొంతకాలం క్రితం… పశ్చిమ ఆఫ్రికా నుంచి ఓ వార్త వచ్చింది… మాలీకి చెందిన హలిమా నిస్సే అనే పాతికేళ్ల యువతి ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది… ఇది మానవచరిత్రలోనే రికార్డు… అసాధారణం, అసహజం అని కాదు… అత్యంత అరుదు… నిజానికి ఒకే కాన్పులో ముగ్గురు పుడితేనే అబ్బో అని అబ్బురపడతాం… అలాంటిది తొమ్మిది మంది, పైగా అందరూ బతికారు… మొదట ఏడుగురు అని స్కానింగులో కనిపించింది, తీరా పుట్టేసరికి తొమ్మది లెక్కతేలింది… ఇంతమందిని […]
అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
. సినిమా పాటకు సాహిత్యంకన్నా ట్యూనే ప్రాణం… జనంలోకి తీసుకుపోయేది అదే… హిట్టో ఫ్లాపో తేల్చేదీ అదే… మంచి ట్యూన్లతో పాటలు హిట్టయితే సహజంగానే సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చిన ఉదాహరణలు బోలెడు… అసలు పాటలతోనే నడిచిన సినిమాలూ బొచ్చెడు… చాలామంది సంగీత దర్శకులు పాపులర్ ట్యూన్లను కాపీలు చేస్తూ, కాస్త మార్పులు చేసుకుని తమ క్రియేటివ్ ఖాతాలో వేసుకోవడమూ చూస్తూనే ఉన్నాం… అదేమని అడిగేవారు ఎవరుంటారు..? ట్యూన్లకు కాపీరైట్లు గట్రా ఏముంటయ్..? (నిజంగా అలాంటి రక్షణ […]
‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
, పావురాలు శాంతిదూతలు, శాంతిపతాకలు, శాంతిసూచికలు మాత్రమే కాదు… ప్రేయసీ ప్రియుల నడుమ సమాచార వాహకాలు… ప్రియుడు గానీ, ప్రియురాలు గానీ తమ మనస్సుల్లో భావాల్ని పావురాలతోనే పంచుకునేవాళ్లు… అప్పట్లో మరి మొబైళ్లు, వాట్సపులు లేవు కదా… తెలుగు సినిమాలే కాదు, అనేకానేక భాషల్లో పావురాల మీద అనేక పాటలొచ్చినయ్… కానీ మనకు స్వాతంత్ర్యం కూడా రాకముందు 1945లో తెలుగులో ఓ పాట వచ్చింది… అది కాస్త విశేషం… సినిమా పేరు స్వర్గసీమ… నిజానికి ఈ సినిమాకు […]
హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
. జాలిపడతారో, నవ్విపోతారో, ఎలా స్పందించాలో తెలియక ఎడ్డి మొహాలు వేస్తారో మీ ఇష్టం… ముందుగా టీటీడీ అధికార ప్రకటన ఒకటి చదవండి… ముందే చెబుతున్నా, నవ్వొద్దు.,. ప్లీజ్… . ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా […]
మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
. ముందుగా వార్త చదవండి… అవి రెండు మామిడి చెట్లు… ఉన్నవే ఏడు కాయలు… కానీ ఆ మామిడి కాయల ఓనర్ వాటి రక్షణకు ఏకంగా ఆరు వేటకుక్కలు, నలుగురు మ్యాంగో గార్డ్స్ పెట్టాడు… కిలోకు రెండున్నర లక్షల రూపాయల ధర పలికే ఈ మామిడి పళ్ల స్పెషాలిటీయే వేరు… అత్యంత అరుదైన రకం… అందుకే వాటి రక్షణకు ఇన్ని తిప్పలు, ఇంత ఖర్చు అంటూ నిన్న చాలామంది రాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు… ఇది మధ్యప్రదేశ్‌లోని […]
గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
. 24 U.S. states, 3 territories, and the District of Columbia …. గంజాయిని చట్టబద్ధం చేశాయనీ, మరికొన్ని ప్రాంతాలు మెడికల్ యూజ్‌కు అనుమతించాయనీ, ఇంకొన్ని ప్రదేశాల్లో స్వల్పమొత్తాల గంజాయి ఉన్నా నేరంగా పరిగణించడం మానేశాయనీ ఓ వార్త కనిపించింది… మరి గంజాయిని మనం ఎందుకు సరిగ్గా వాడలేకపోతున్నాం… ఏదో ఓ చర్చ ఎక్కడో మొదలవుతుంది… అది తరువాత ఎటెటో వెళ్లిపోతుంది… ప్రధాన చర్చలోనే కొన్ని ఉపచర్చలు కూడా పుట్టుకొస్తయ్… అవి నిజానికి ప్రధాన చర్చకన్నా […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- …
- 18
- Next Page »