ఓ సూపర్ స్టార్ హీరో… మంచి గిరాకీలో ఉన్న హీరోయిన్, ఇతర నటులు… 24 క్రాఫ్ట్స్‌లో కూడా పేరొందిన ప్లేయర్స్… మంచి కథ… భారీ ఖర్చు… పేద్ద బ్యానర్… ఖర్చుకు వెరవని నిర్మాత… ఇంకేం… సూపర్ హిట్, బంపర్ హిట్ గ్యారంటీ అంటారా..? తప్పు… డిజాస్టర్ కూడా కావచ్చు… సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎవడూ ఊహించలేడు… అఫ్కోర్స్, అలా ఖచ్చితమైన అంచనాలు సాధ్యమయ్యే పక్షంలో అసలు ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకొస్తాయి..? మరి సినిమాలు, వినోదరంగానికి సంబంధించి ఏ […]
శ్రీముఖి కాళ్ల ప్రదర్శనతో… అనంత శ్రీరామ్ మనోభావాలు ఉబ్బితబ్బిబ్బట…
ఒకప్పడు సూపర్ సింగర్ షో అంటే ఓ థ్రిల్… పాటల పోటీ పోటాపోటీగా ఉండేది… కంటెస్టెంట్ల గానసామర్థ్యం మీద సునిశిత విశ్లేషణ ఉండేది, హుందాగా ఉండేది షో… కానీ ఇప్పుడు..? వెగటుతనం, వెకిలితనం… వెరసి ఓ వెధవతనం… అప్పట్లో కూడా శ్రీముఖి ఈ షోను హోస్ట్ చేసింది… ఇప్పుడు కూడా చేస్తోంది తాజా సీజన్‌కు… కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే..? అప్పట్లో శ్రీముఖి పద్దతైన డ్రెస్సులతో కనిపించేది… కానీ ఇప్పుడు అంటారా… ఒకసారి ఈ ఫోటో […]
ఫాఫం సుమ… పాపులారిటీలో మరీ అంతగా జారిపోయిందా..?
మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్… అంటే..? టీవీ షోలు, సినీ ఫంక్షన్ల హోస్టులు, యాంకర్లు, యూట్యూబర్లు ఎట్సెట్రా… లేదా హఠాత్తుగా సెలబ్రిటీలు అయిపోయిన బర్రెలక్క, కుమారి ఆంటీ, మడత కుర్చీ పెద్దాయన, పల్లవి ప్రశాంత్ ఎట్సెట్రా… వీళ్లలో మిగతావాళ్లు వచ్చీపోయే కేటగిరీ.., కానీ టీవీ యాంకర్లు, హోస్టుల పాపులారిటీ కాస్త స్థిరంగానే కొనసాగుతూ ఉంటుంది… విషయానికొస్తే… ఆర్మాక్స్ అనే సంస్థ ఎప్పటికప్పుడు ఈ విభాగంలో కూడా పాపులారిటీ సర్వే నిర్వహిస్తుంది… అదేలెండి, ఆన్లైన్ వోటింగ్… ఎందరు […]
మళ్లీ బుల్లితెరపై కార్తీకదీపం… ఇంకెన్ని విన్యాసాలో, మరెన్ని వికారాలో…
అనుకుంటున్నదే… కార్తీకదీపం సీరియల్‌ను చివరలో నానా బీభత్సం చేసి, కథను నానా మలుపులూ తిప్పి, ప్రధాన పాత్రధారుల్ని చంపేసి, కొత్త జనరేషన్ కథ కొనసాగింపు పేరిట ప్రేక్షకుల్ని, కార్తీకదీపం సీరియల్ ప్రేమికుల్ని నానా హింస పెట్టాడు ఆ దర్శకుడెవరో గానీ… తరువాత ఇక తమకే చిరాకెత్తి, ప్రేక్షకుల తిరస్కారం ఎక్కువైపోయి, రేటింగుల్లో దిగజారిపోయి, ఇక కుదరదు అనుకునే స్థితిలో అర్థంతరంగానే కార్తీకదీపం సీరియల్ కథకు ముగింపు పలికాడు అప్పట్లో సదరు దర్శకరత్నం… ఒక సీరియల్ ఎలా ఉండి, […]
డ్రామా కంపెనీలోకి కూడా కుమారి ఆంటీని ఫుడ్ డబ్బాలతో సహా పట్టుకొచ్చేశారు..!
మొన్న స్టార్ మా టీవీలో బిగ్‌బాస్ ఉత్సవం షోలోకి ఫుడ్ డబ్బాలతో సహా కుమారి ఆంటీని తీసుకొచ్చారు కదా… జోకులతో సరదాలు చేసుకున్నారు కదా… మరి ఇలాంటి హఠాత్ పాపులర్ స్టార్లను టీవీ తెర మీదకు తీసుకొచ్చు అలవాటున్న ఈటీవీ ఊరుకుంటుందా… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి తీసుకొచ్చేశారు… హాయ్ నాన్నా, అందరూ బావున్నారా అని తన అలవాటైన పలకరింపుతో ఈ షోలో ఆంటీ ఏకంగా ఓ ఫుడ్ స్టాలే తెరిచింది… ఈటీవీ ఆస్థాన కమెడియన్లందరూ ఆమె […]
మిస్ నాట్ పర్ఫెక్ట్..! త్రిపాఠీ లావణ్యం, నటన అంట్లు తోమడానికే సరిపోయాయ్…!
Ms not so Perfect… సాధారణంగా సీరీస్లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు….. డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ నటించాడు. దీనిని […]
అబ్బో… ఆంటీని మునగ చెట్టు ఎక్కిస్తున్నారుగా… జెర పైలం తల్లీ…
గంగవ్వ… బర్రెలక్క… కుర్చీ మడత పెద్దాయన… ఒక్కోసారి ఒకరు సోషల్ మీడియాలో ఫుల్లు పాపులర్ అయిపోతారు… గంగవ్వ అయితే ఓ ఇల్లు కట్టుకుంది… బిగ్‌బాస్ ఇంటికి వెళ్లొచ్చింది… బర్రెలక్క మంచి వోట్లే సాధించి రాజకీయాల్లో కొనసాగే సూచనలు కనిపిస్తున్నయ్… ఫాఫం, ఆ మడత కుర్చీ పెద్దమనిషికి పాపులారిటీ వచ్చింది గానీ ఇంకేమీ దక్కలేదు… ఇప్పుడు ట్రెండ్ కుమారీ ఆంటీ… తెలుసు కదా… ఫుడ్ స్టాల్, ఫుల్లు గిరాకీ పెంచేసిన సోషల్ మీడియా… ఎగబడిన జనం… పోలీసుల కన్నెర్ర, […]
ఫాఫం మణిశర్మ… మంగ్లి మాటకు నోరుతెరిచాడు… భలే సరదా ఎపిసోడ్…
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ… అలియాస్ మణిశర్మ… మొన్నామధ్య ఎంతసేపూ తమన్, డీఎస్పీయేనా… నాకూ చాన్స్ ఇస్తే వైవిధ్యం ఉంటుంది కదా అంటూ నిర్మాతలను కోరుతూ హఠాత్తుగా ప్రచారతెర మీదకు వచ్చాడు… నిజంగా ట్రాజెడీ… 30 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మణిశర్మ నాకూ చాన్సులు ఇవ్వండి సార్ అనడగడం బాగనిపించలేదు… అడగడం బాగా లేదని కాదు… అలా అడిగే సిట్యుయేషన్ బాగా లేదని… ఎస్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్, డీఎస్పీ టాప్ మ్యూజికల్ […]
యాంకర్ రష్మి ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… అరుదైన ప్రశంసే మరి…
మురళీమోహన్… ఒకప్పటి హీరో… తెలుగుదేశం నాయకుడు… వయస్సు 83 ఏళ్లు… ఇప్పటికీ తన ఆరోగ్యాన్నిబాగా కాపాడుకుంటున్నాడు… తన సంపాదన, తన ఆస్తులు, తన వ్యవహారాలే తప్ప పెద్దగా వివాదాల్లోకి రాడు… పిచ్చి విమర్శల జోలికి పోడు… ప్రత్యేకించి టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనిపించడు… తనను శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు పిలిచారు… ఎప్పటిలాగే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలిసి ఏవో మూస పంచులు వేస్తారు కదా… వేశారు… తరువాత మురళీమోహన్ వచ్చాడు […]
రచయిత అనంత శ్రీరాం తప్పు… స్టార్ మాటీవీది మరీ తప్పున్నర…
అనంత శ్రీరాం మంచి గీత రచయితే… కానీ నోటి దూల ఎక్కువ… తనంతటతనే ఇజ్జత్ తీసుకుంటూ ఉంటాడు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ… ఆమధ్య దిగుదిగునాగ అనే ఓ పిచ్చి గీతాన్ని సమర్థించి నవ్వులపాలయ్యాడు… తరువాత ఏదో మరో వివాదం… సూపర్ సింగర్ టీవీ సినిమా సాంగ్స్ కంపిటీషన్స్ షోలో నలుగురు జడ్జిల్లో తను ఒకడు ప్రస్తుతం… అంతకుముందు జీతెలుగులో ఇలాంటి షోలో కూడా జడ్జిగా చేస్తూ, పిచ్చి గెంతులు వేస్తూ చిరాకెత్తించాడు… ఈ సూపర్ సింగర్ షోలో […]
కన్నవాళ్లను రోడ్లపై వదిలేశానా..? చట్టవ్యతిరేక పనులు చేస్తున్నానా..?
నిజానికి సుమ, అనసూయలతో పోలిస్తే రష్మి కొంత డైనమిక్, ఫెయిర్, స్ట్రెయిట్… ఏదైనా మాట్లాడితే డొంకతిరుగుడు, దాపరికం, మార్మికం మన్నూమశానం ఏమీ ఉండవు… ఫటాఫట్ అనేస్తుంది… స్నాక్స్, మీల్స్ వివాదంలో మీడియాకు క్షమాపణ చెప్పకుండా ఉండాల్సింది సుమ… ఎవరో ఓ జర్నలిస్టు ఏదో అంటాడు, దాంతో భయపడిపోవడమేనా అంత సీనియర్ హోస్ట్… ఇలాగైతే ప్రతి మీడియా మీట్లో ఆడేసుకుంటారు… ఇక అనసూయ మొత్తం టూమచ్… ఆంటీ అని పిలిచినా కేసులు పెట్టేస్తానని ఎగురుతుంది… మొగడితో మూతి ముద్దులు, […]
ప్రజెంట్ ఓటీటీ తెలుగు మూవీస్… ఓ సామూహిక సంక్షిప్త సమీక్ష…
Priyadarshini Krishna ………. OTT movies report of the month 1. Indian Police Force- by Rohith Shetti – బడ్జెట్ ఫుల్, ఎఫెక్ట్ నిల్… టైం వేస్ట్… ఇంక వేరే option లేదంటే టైంపాస్ కి చూడొచ్చు… 2. Devil- కళ్యాణ్ రామ్ నటించిన సినిమా చాలా మంది చూసి వుండరు. సర్ప్రైసింగ్లీ బావుంది… నాకు నచ్చింది. చాలా మైండ్‌లెస్ సినిమాలకంటే బెటర్‌గా వుంది. చూడొచ్చు. 3. కోటబొమ్మాళి- శ్రీకాంత్ నటించిన ఈ రీమేక్ […]
90’s … ఓ డిఫరెంట్ రివ్యూ… ఇది ఒక మిడిల్ క్లాస్ బయోపిక్…
#90s_AMiddleClassBiopic ‘Success is always a Success, Criticism is just a Criticism’ అనేది ఈ మధ్య కాలంలో నేను అర్థం చేసుకుంటున్న ఫార్ములా. ఎవరైనా సక్సెస్ కోసమే పని చేస్తారు. సక్సెస్ రావాలనే ఆశిస్తారు. అది వస్తే ఆనందిస్తారు. విమర్శ అనేది పక్కన అలా అలా తిరుగుతూ ఉన్నా, దృష్టి మొత్తం విజయం మీదే ఉంటుంది, ముఖ్యంగా సినిమా రంగంలో. సినిమా ఫ్లాప్ అయితే తప్ప ఎవరూ విమర్శల్ని పెద్ద పట్టించుకోరు! సినిమా హిట్ […]
ఉదయభాను..! తెలుగు తొలి యాంకరిణి రీ-రీ-ఎంట్రీ… కానీ నిలబడేనా..?!
ఒక వార్త… ఒక ప్రోమో… ఏమిటంటే..? వెటరన్ యాంకర్ ఉదయభాను టీవీల్లోకి రీఎంట్రీ… జీతెలుగు వాడయితే ఓ ప్రోమో రిలీజ్ చేస్తూ గోల్డెన్ లేడీ ఆఫ్ జీతెలుగు ఈజ్ బ్యాక్ అని గొప్పగా చెప్పుకున్నాడు… ఆమె జీతెలుగు టీవీకి ఏం గొప్ప సర్వీస్ అందించిందో తెలియదు గానీ ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం రేలారేరేలా… అది మాటీవీలో వచ్చేది… సరే, చాలా షోలకు కూడా హోస్ట్‌గా, యాంకర్‌గా చేసింది… కొన్ని సినిమాల్లో చేసింది, అదేదో సినిమాలో […]
ఆపాతమధురం… అప్పటి సూపర్ సింగర్ సీజన్ 9 ఈరోజుకూ సూపర్…
సంక్రాంతి పూట టీవీ స్పెషల్స్ ఏమంత బాగోలేవు… చూడబుద్ధి కాలేదు… సినిమాలు కూడా పాతవే… హనుమాన్ వోకే, మిగతా మూడు రొటీన్ ఫార్ములా సినిమాలు… చూడాల్సిన పనేలేదు… దరిద్రపు టీవీ సీరియళ్లకు తల అప్పగించే సాహసం చేయలేం… సూపర్ స్టార్ చూద్దామా అని మొన్నటి ఎపిసోడ్ ఓపెన్ చేస్తే (డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ) స్త్రీముఖి ఆంటీ కేకలు, అనంత శ్రీరాం గెంతులు నాట్ భరించబుల్… ఆమధ్య జీతెలుగులో వచ్చిన సరిగమప చూశాం కదా, ఇది దానికి క్లోన్ […]
ప్చ్… ఈసారి తెలుగు టీవీల్లో పెద్ద జోష్ లేని సంక్రాంతి సంబరాలు…
మొన్నటి పండుగపూట టీవీలు తీవ్రంగా నిరాశపరిచాయి… నిజానికి సంక్రాంతి అంటే స్పెషల్ ప్రోగ్రామ్స్, యాడ్స్, హంగామా… నిజానికి ఈరోజుల్లో టీవీ వినోదమే కదా ఇంటింటికీ దిక్కు… జేబులు కత్తిరించే, కుర్చీలు మడతపెట్టే చెత్తా సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే సాహసం లేదు… బయట ప్రోగ్రాముల నిర్వహణ కూడా తగ్గిపోయింది… తెలుగు టీవీల్లో మాత్రం ప్రధానంగా అవే పాత సినిమాలు, సాగదీత సీరియళ్లు… పండుగ కోసం జీవాడు ఏవో రెండు స్పెషల్ వంటలు చేసినట్టున్నాడు, ఒకటేమో పండగంటే ఇలా […]
కిల్లర్ సూప్..! మీకు భర్త- ప్రియుడు- ప్లాస్టిక్ సర్జరీ పాత క్రైం స్టోరీ గుర్తుందా..?
అప్పట్లో ఓ సెన్సేషనల్ కేసు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ జైలులో ఎలా ఉందో తెలియదు గానీ… ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, అచ్చం భర్తలా తన ప్రియుడికే ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ప్రవేశపెట్టింది… కాకపోతే చికెన్ సూప్ దగ్గర ఈ నకిలీ భర్త బయటపడిపోయి, బండారం బద్ధలై, మొత్తం కథంతా బయటపడింది… ప్రియుడితో కలిసి భర్త హత్య తాలుకు కేసులు బోలెడు… కానీ ఓ సినిమా కథలా ఉన్న ఈ కేసు ఇదే […]
ఆహాకు కూడా పాకిన జబర్దస్త్ మార్క్ పైత్యం… ఈ బాడీ షేమింగ్ ఏమిటర్రా…
మనకు లేడీ కమెడియన్లే చాలా తక్కువ… అప్పట్లో శ్రీలక్ష్మి… తరువాత ఆ రేంజులో క్లిక్కయిన లేడీ కమెడియన్ రాలేదు… విద్యుల్లేఖ, కోవై సరళ వంటి ఇతర భాషా తారలు వచ్చారు, కానీ వాళ్ల టోన్ అబ్బో… దుస్సహం… ఇంకెవరైనా ఉన్నారో లేదో గానీ ఈమధ్య టీవీ తెర మీద నుంచి వెండి తెరపైకి కూడా వచ్చిన రోహిణి గురించి చెప్పుకోవచ్చు… మంచి టైమింగ్, మంచి ఉచ్చారణ… (బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసినట్టుంది…) జబర్దస్త్ నుంచి ఎమర్జయిన ఫైమా […]
సినిమా సంగీతం వీళ్లకు కామెడీ అట… రేటింగుల్లో ప్రేక్షకుడు ఈడ్చి కొట్టాడు…
అంతటి బిగ్‌బాస్ రియాలిటీ షోను అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించే స్టార్‌మాటీవీ… ఇతర రియాలిటీ షోలలో అట్టర్ ఫ్లాప్..! ఆ చానెల్ ఏ రియాలిటీ షోను కూడా విజయవంతంగా జనంలోకి తీసుకురాలేకపోయింది… ఈమధ్య మరీ భ్రష్టుపట్టించారు గానీ కాస్తో కూస్తో ఈటీవీ రియాలిటీ షోలకే ఆదరణ ఎక్కువ ఉండేది… చివరకు జీతెలుగు కూడా స్టార్‌మా బాటలోనే… దానికీ రియాలిటీ షోలు అచ్చిరావు… నిజానికి స్టార్ మా, జీతెలుగు టీవీల్లో క్రియేటివ్ టీమ్స్ మరీ అంత క్రియేటివ్ కాకపోవడమే […]
మల్లెమాల తప్పే అది… సుమది కాదు… హైపర్ ఆది ఒప్పుకోకుండా ఉండాల్సింది…
నిజంగానే నచ్చలేదు… హైపర్ ఆది మొహం మీద యాంకర్ సుమ ఉమ్మేయడం ఏమిటి..? అసలు హైపర్ ఆది ఆ సీన్ ప్రసారానికి ఎందుకు ఒప్పుకున్నట్టు..? ఇదీ ప్రశ్న… ఇక్కడ సుమను తప్పుపట్టడం కాదు, ఆది మీద జాలిపడటం కాదు… అసలు మల్లెమాల ప్రొడక్షన్స్ గానీ, ఈటీవీ గానీ దాన్ని అలాగే ఎందుకు ప్రసారం చేసినట్టు..? రేటింగుల కోసమా..? అదే నిజమైతే అంతకన్నా దరిద్రం లేదు… విషయం ఏమిటంటే..? ఈటీవీలో సర్కస్ ఫీట్ల డాన్స్ షో ఒకటి వస్తుంది […]
- « Previous Page
- 1
- …
- 10
- 11
- 12
- 13
- 14
- …
- 37
- Next Page »