Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హవ్వ… జబర్దస్త్‌లో హోం‌ టూర్..! వీటిని ‘నవ్వులాట స్కిట్స్’ అంటారా..?!

February 7, 2022 by M S R

home tour

రీసెంటుగానే మాటీవీ కామెడీ స్టార్స్ షోలో ఒక స్కిట్… ఎక్స్‌ప్రెస్ హరి అనే కమెడియన్ స్కిట్ అది… తను ‘‘వరుసగా సెలబ్రిటీల ఇళ్లల్లో చోరీ’’ అని చదువుతాడు, మరో కమెడియన్ ‘‘వాళ్ల ఇళ్లకు సెక్యూరిటీ బాగా ఉంటుంది, పెద్దగా ఉంటయ్ ఇళ్లు, చోరీ అంత సులభం కాదు కదరా’’ అని అడుగుతాడు అమాయకంగా… దానికి ఆ హరి ‘‘ఏముందిలేరా..? ఈమధ్య అందరూ హోం టూర్స్ అంటూ వీడియోలు పెట్టేస్తున్నారు కదా యూట్యూబులో… మా తలుపులు ఇవీ, మా […]

చమ్మక్ చంద్రను కూడా పంపించేశారు… కానీ కామెడీ స్టార్స్‌లో కొత్త హుషారు…

February 7, 2022 by M S R

comedy stars

చమ్మక్ చంద్ర… టీవీ కమెడియన్లలో తన రేంజే వేరు… జబర్దస్త్‌కు ఓ పెద్ద అస్సెట్‌లా ఉండేవాడు… అలాంటోళ్లు ఈటీవీకి పనికిరారు కదా, పొగబెట్టారు… దాంతో కాస్త ఎక్కువ పేమెంట్ కోసం ప్లస్ ఈటీవీ నుంచి మార్పు కోసం నాగబాబు వెంట వెళ్లిపోయాడు… జబర్దస్త్ డైరెక్టర్లే జీటీవీలో అదిరింది కామెడీ షో చేసినా అది అట్టర్ ఫ్లాపయింది… తరువాత మాటీవీ కామెడీ స్టార్స్‌కు అడ్డా మారింది… ఆ షోకు తను మంచి అస్సెట్ అవుతాడు అనుకున్నారు… పైగా నాగబాబు […]

‘‘రష్మి, సుధీర్ తొమ్మిదేళ్ల లాంగ్ లవ్వు… రాళ్లతో టీవీలు పగుల గొడుతున్నారట…’’

February 5, 2022 by M S R

sudigali sudheer

కామెడీ అంటే ఇదే… చాన్నాళ్ల తరువాత వీసమెత్తు బూతు వాసన లేని ఓ స్కిట్ ఎక్సట్రా జబర్దస్త్‌లో మనసారా నవ్వించింది… అన్నింటికీ మించి ఓ విషయంలో మెచ్చుకోవాలని కూడా అనిపించింది…… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు సహజమే కదా… ఒకవేళ ఇప్పుడు సెకండ్ లేయర్ కమెడియన్లుగా ఉన్న వాళ్లు టాప్ రేంజుకు చేరిపోయి, ఇప్పుడు పాపులర్ కమెడియన్లుగా ఉన్న గెటప్ సీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ గనుక చితికిపోతే..? పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్టుగా ఆ […]

హమ్మయ్య… సిరి, శ్రీహాన్ కలిసిపోయారు… నెక్స్ట్ దీప్తి, షన్నూయేనా..?!

February 4, 2022 by M S R

siri

గుర్తుందా..? ఆమధ్య కొన్నిరోజులపాటు యూట్యూబ్ చానెళ్లు, సైట్లే గాకుండా సోషల్ మీడియా పోస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు సైతం ఓ అంశాన్ని రచ్చ రచ్చ చేశాయి… ఏమిటంటే..? బిగ్‌బాస్ గత సీజన్‌లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హన్మంతు, మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ ఫుల్లు రెచ్చిపోయి బిహేవ్ చేసి, మొత్తం షో అంతా కంపు చేశారని బోలెడు విమర్శలొచ్చినయ్ కదా… తీరా చూస్తే సిరికి బయట శ్రీహాన్ అనే లవర్… లవర్ ఏమిటి సహజీవనమే అన్నారు… […]

రాజేంద్రప్రసాద్ ప్రవర్తన మీద మాట్లాడటానికే ఇష్టపడని మాళవిక..!!

February 2, 2022 by M S R

malavika

సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే… క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు, చాలా అంశాల్లో వాళ్లను మనుషుల్లాగే చూడరు… ప్రతి ఒక్కడూ వాళ్లను సొంత ఆస్తిలా చూసేవాడే… ఐతే కాస్త టెంపర్‌మెంట్ ఉన్న లేడీ ఆర్టిస్టులయితే కొన్ని అంశాల్లో హఠాత్తుగా రియాక్టవుతారు, గొడవ అవుతుంది… ప్రత్యేకించి హీరోల ఇగోస్ వల్ల సమస్యలొస్తుంటయ్… ఐతే ఏళ్లు గడిచిపోయినా ఆ లేడీ ఆర్టిస్టులు ఇక వాటి గురించి ఎక్కడా బయటపెట్టరు… కానీ మాళవిక కథ […]

హవ్వ… సుమ నోరు అదుపుతప్పింది… అంతటి అనసూయనే కించపరిచింది…

February 1, 2022 by M S R

anasuya

కొన్ని నవ్వొస్తయ్… రెగ్యులర్‌గా టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకు అర్థమవుతుంది… మనకిప్పుడు టీవీ షోలు మినహా వేరే వినోదం ఏముంది..? లేదంటే ఆ ఆదర్శప్రాయుడైన హీరో పుష్పలు, ఆ సూపర్ ధర్మపరిరక్షకుడు అఖండలు, ఆ పునర్జన్మవాది సింగరాయ్‌లు… అంతే కదా… సరదాగా యాంకర్ సుమ హోస్ట్ చేసే క్యాష్ చూశారా ఎప్పుడైనా..? తోచిన సెలబ్రిటీలను పిలిచి, తోచిన ఆటల్లా ఆడించి, తోచిన హౌలా వేషాలు వేయించి, ఇది ఏదీ తోచక నవ్వడం కోసమే, తోచినట్టు నవ్వండిర భయ్ అని […]

అనసూయ నుంచి దీపిక దాకా… కురచ బట్టలపై ఏమీ అనొద్దు… ఊరుకోరు…

February 1, 2022 by M S R

deepika

ఖైదీ అనే చిరంజీవి సినిమా… సుమలతతో ఒక విలనుడు ‘నమస్కారం’ అంటాడు… కాస్త కంఫర్టుగానే కట్టేయబడి ఉన్న ఆమె ‘సంస్కారం లేనివాళ్లకు నమస్కారం దేనికిలే’ అని ఈసడిస్తుంది… అంటే ఇక్కడ సంస్కారం లేనిదెవరికి..? ఏమని ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలి..? అలాగే చాలా పాపులర్ డైలాగ్ మరొకటి… ఓ మగ అహంకారి, ఓ ఆడ అహంకారి ఎదురుపడతారు… ఎవరికీ ఎవరు దారినివ్వరు… చివరకు మూర్ఖులకు నేను దారి ఇవ్వను అంటాడు వాడు… నేను ఇస్తాను అని పక్కకు జరుగుతుంది […]

ఇష్టారాజ్యం ప్రసారాలు కుదరవ్… తొలిసారిగా ఓ చానెల్ మీద నిషేధాస్త్రం…

February 1, 2022 by M S R

media one

ఒక టీవీ చానెల్ మీద నిషేధం వేటు పడింది… మీడియావన్ అనే మలయాళం టీవీ బ్యాన్ అయిపోయింది… అయ్యో, దారుణం, దుర్మార్గం, భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం, ఈ సిగ్గుమాలిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ఉందా..? ఇదేమైనా ప్రజాస్వామ్యమా..? అని ది గ్రేట్ కమ్యూనిస్ట్ సెక్షన్ ప్లస్ కాంగ్రెస్ ఏడుస్తోంది… కేరళ ప్రభుత్వం శోకాలు పెడుతోంది… ఆ పార్టీ ప్రేమించే, ఆరాధించే, ఆధారపడే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వ హయంలో చైనా ఏం జరుగుతున్నదో దానికి అక్కర్లేదు… ఇప్పుడు […]

ఓ చరిత్రకు రామోజీ ఫుల్‌స్టాప్… దాసరి కథకు వీడ్కోలు… ఓ సాగదీత తెగిపోయింది…

February 1, 2022 by M S R

abhishekam

రామోజీరావు బాగా అన్యాయం చేశాడు ఒక చరిత్రకు..! ఇక ఎవరూ అధిరోహించలేని రికార్డుల ఎవరెస్టు శిఖరాన్ని తన ఈటీవీ సీరియల్ ఒకటి ఎక్కుతుంటే, మధ్యలోనే కాళ్లు విరగ్గొట్టి, ఇక చాల్లేఫో దిగిపొమ్మన్నాడు… ఏం సార్, మీకిది న్యాయమా..? మీ టీవీ సీరియలే కదా… అది ఇంకా ఎన్ని శిఖరాలు ఎక్కితే అన్ని పేరుప్రఖ్యాతులు మీవే కదా… ఐనా ఏమిటీ నిర్దయ..? క్రియేటివిటీని చంపేయడం న్యాయమేనా..? ఒక చరిత్రకు ముగింపు పలకడం సమంజసమేనా..? బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు… అప్పట్లో […]

చచ్చినట్టు యాడ్స్ చూడాల్సిందే… కథలోనే కలిపేస్తాం… కొత్త ట్రెండ్…

February 1, 2022 by M S R

ads in serials

ఓ దిక్కుమాలిన తెలుగు సీరియల్ వస్తోంది… ఆ కోడలు ఎప్పుడూ ఆ ఇంట్లో అసలు వంట చేయదు, వంటవాళ్లున్నారు… కానీ హఠాత్తుగా అత్త ఏదైనా మంచి డిష్ చేయి కోడలా అంటుంది… సరే, అత్తమ్మా, ఆలూ ఫ్రై చేస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది… అత్తమ్మను ఎలా శాటిస్‌ఫై చేయాలి అనుకుంటుంటే ఐడియా తడుతుంది… వెంటనే MTR గరం మసాలా పాకెట్ కట్ చేసి, ఫ్రై మీద చల్లేస్తుంది… అత్తమ్మ, కోడలు ఇద్దరూ కలిసి సదరు MTR మసాలాల […]

సునీతాంటీ ప్లీజ్… చంద్రబోసంకుల్ ప్లీజ్… *పాడుతా చేదుగా* అవసరమా..?!

January 30, 2022 by M S R

spbalu

ఈటీవీ… 16.1.2022… ఆదివారం… మధ్యాహ్నం… పన్నెండు గంటల నుంచి ఒంటి గంట… ప్రోగ్రాం పేరు పాడుతా తీయగా… తాజా హైదరబాద్ బార్క్ రేటింగ్స్ ఎంతో తెలుసా..? ఊహించలేరు… 0.79… నమ్మలేక, ఒకటికి పదిసార్లు చెక్ చేసినా అదే కనిపిస్తోంది… మరీ ఇంత ఘోరమా అనుకోనక్కర్లేదు… ఈ టీఆర్పీ రేంజ్ ఏ ప్రోగ్రాంకు వచ్చినా సరే, ఇక చాల్లేగానీ మూస్కోవోయ్ అని టీవీ ప్రేక్షకుడు చెబుతున్నట్టు లెక్క… అడ్డంగా తిరస్కరించినట్టు లెక్క… ఏమీ ఆశ్చర్యం అక్కర్లేదు… సింగర్ సునీత […]

తగ్గేదేలా…! హైపర్ ఆది, సుడిగాలి సుధీర్… భలే చిత్రమైన ఒక పోటీ నడుస్తోంది…!

January 29, 2022 by M S R

spoof

యూట్యూబ్ వీడియోల ఆదరణను మనం సాధారణంగా దేన్ని చూసి అంచనా వేస్తాం..? వ్యూస్, లైక్స్, కామెంట్స్ చూస్తాం… అదీ ఎంత తక్కువ రోజుల్లో అని చూస్తాం… అంతే కదా… కానీ ఈమధ్య ఆ అంకెలు కూడా మేనేజబుల్ అయిపోయాయి… మరీ ప్రధానంగా పెద్ద హీరోల టీజర్లు, ట్రయిలర్లు విడుదలైనప్పుడు ఈ పెయిడ్ నంబర్లు గిర్రున తిరిగిపోతుంటయ్… సరే, దాని గురించిన చర్చ కాదు ఇది… అంతకుమించి… ఈమధ్యలో బంపర్ హిట్ సినిమా పుష్ప… ఎవరు ఔనన్నా, ఎవరు […]

వాటీజ్ దిస్ హైపర్ ఆదీ… జబర్దస్త్ ఐనాసరే, ఈ రేంజ్ డబుల్ మీనింగులా..?!

January 28, 2022 by M S R

hyper

సాధారణంగా తెలుగు టీవీ తెర మీద సుడిగాలి సుధీర్ తరువాత ఆ రేంజ్ పాపులారిటీని కమెడియన్‌గా సంపాదించుకున్నది హైపర్ ఆది… తను స్వయంగా పంచులు రాసుకుంటాడు… అటు ఢీ షోలో ఏవో పంచ్ డైలాగులు, ఇటు జబర్దస్త్ స్కిట్‌కు పంచులు… కొత్తగా ఏం రాయాలో అర్థం అవుతున్నట్టు లేదు… అందుకే ఏదిపడితే అది రాసేసుకుంటున్నాడు… బూతులు, ద్వంద్వార్థాలను నమ్ముకుంటున్నాడు… అవి పలుసార్లు శృతి తప్పుతున్నయ్… మరీ జబర్దస్త్ ఎంత బూతు షో అయితేనేం, మరీ ఈ రేంజ్ […]

మళ్లీ జోరుగా ప్రచారంలోకి రవిప్రకాష్ కొత్త మీడియా..! పోరుకు రెడీయా..?!

January 26, 2022 by M S R

raviprakash

చాలా రోజులుగా వింటున్నదే, చదువుతున్నదే ఇది … ఏమిటంటే… ‘‘రవిప్రకాష్ మళ్లీ తెర మీదకు రాబోతున్నాడు… తనదైన చానెళ్లతో, డిజిటల్ మీడియాతో పలు భాషల్లో ప్రవేశిస్తున్నాడు..’’ ఇవీ ఆ పలు వార్తల సారాంశం..! ఇప్పుడు మళ్లీ కొన్ని వార్తలు కనిపిస్తున్నయ్… ‘‘ఫిబ్రవరి 20న లాంచ్… ఏడు ప్రాంతీయ భాషల్లో రంగప్రవేశానికి అంతా రెడీ… మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్, సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ సంస్థల అండదండలతో ఈ మీడియా సంస్థ పలకరించబోతోంది..’’ ఇవీ తాజా […]

కామెడీ స్టార్స్ కథ మారుతోందా..? ఎక్సట్రా జబర్దస్త్‌ షోకు ఎదురుగాలి..?

January 26, 2022 by M S R

comedy stars

మాటీవీలో కామెడీ స్టార్స్ అని ఈటీవీ జబర్దస్త్‌కు పోటీగా ఓ కామెడీ షో వస్తుంది తెలుసు కదా… ఏం చేసినా సరే, రేటింగ్స్‌లో అది లేవడం లేదు, నానాటికీ పడిపోతోంది… డబ్బు దండుగ యవ్వారం అయిపోతోంది… దాంతో ఖాళీగా ఉన్న నాగబాబును కన్విన్స్ చేసి ఈ షో కోసం పట్టుకొచ్చారు… మరి ఆయన వస్తే కొన్ని మార్పులుంటయ్, చేర్పులుంటయ్, ఆయన రాగద్వేషాలుంటయ్… కథ వేరే ఉంటుంది కదా… వచ్చాడు… అప్పట్లో ఈటీవీ జబర్దస్త్‌ నుంచి డైరెక్టర్లు నితిన్, […]

పాతవన్నీ తవ్వుకుంటూ… ఈటీవీ మీద సెటైర్లు వేస్తూ… ఇదోరకం కామెడీ…

January 26, 2022 by M S R

comedy stars

‘‘ఇన్నాళ్లూ ఇది మా అడ్డా అనుకున్నా, ఒక్క ఈవెంట్ బయటికి వెళ్లి చేసేసరికి, ఇక్కడ నాలుగు ఎపిసోడ్లు కట్ చేశారు… నువ్వూ ఇలాగే చేస్తే షో నుంచే పంపించేస్తారురా…’ ఈ మాట అన్నది ముక్కు అవినాష్… అవును, కామెడీ స్టార్స్ అనే మాటీవీ కామెడీ షో నుంచి నిర్మొహమాటంగా నాలుగు ఎపిసోడ్లు బయటికి పంపించేశారు… ఈ షో అంతా నేను చెప్పినట్టే అనే ఫీల్‌తో ఉన్న అవినాష్‌కు ఓ షాకే ఇది… అసలే ఈటీవీకి పెనాల్టీ కట్టి […]

అత్తా అనొద్దట, అక్కా అనొద్దట… ఆది మాత్రం ఏమైనా అనొచ్చునట అనసూయను..!!

January 22, 2022 by M S R

dakshayani

అనసూయకు బాగా కోపమొచ్చింది… అవును, ఆమె అంతే… ఇతర సెలబ్రిటీల్లాగా ఎవరేమైనా ట్రోలింగుకు దిగితే మూసుక్కూర్చోవడం కాదు, ఈమె మాటకుమాట సమాధానమిస్తుంది… అవసరమైతే కేసు పెట్టి, తాటతీస్తానురోయ్ అని బెదిరించగలదు కూడా… ప్రత్యేకించి ఆమె బట్టల మీదో, వేసే వేషాల మీదో కామెంట్స్ గనుక చేస్తే ఆమెకు చర్రుమంటుంది… అసహనంతో ఊగిపోతుంది… ఈమధ్య ఇన్‌స్టాలో AMA session (ask me anything) లో ఓ నెటిజన్ అడిగాడు… ‘‘నిన్ను ఆంటీ అని పిలవాలా..? అక్క అని పిలవాలా..?’’ […]

ఆహా… బాలయ్య ఓ గుడ్ హోస్ట్… మహేశ్‌‌బాబు ఎపిసోడ్‌కు హ్యూమన్ టచ్…

January 22, 2022 by M S R

unstoppable

నిజం చెప్పాలంటే బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అనే షోను హోస్ట్ చేయడం నాకూ నచ్చలేదు మొదట్లో… హీరోలు టీవీ షోలు చేయడం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తారనీ, తమ పాపులారిటీని సుస్థిరం చేసుకుంటారనీ భావించేవాళ్లలో నేనూ ఒకడిని… నాని, జూనియర్, నాగార్జున తదితరుల బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు షోల హోస్టింగును అందుకే ఇష్టపడ్డాను… చిరంజీవి ఇందులో ఫ్లాప్… ఐనాసరే, బాలయ్య ఆహాలో షో చేయడం నచ్చలేదు… ఎందుకంటే..? టీవీ వేరు, ఓటీటీ వేరు… […]

చివరకు రష్మి, సుధీర్ లవ్వుకూ కత్తెర..? ఈమెతో కొత్త కథ మొదలెట్టేశారా..?!

January 20, 2022 by M S R

nandita

తెలుగు టీవీ తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్… తను ఏ సీరియళ్లలోనూ నటించడు… ప్రతి షోకు యాంకరింగు చేస్తానంటూ ముందుకురాడు… కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తనకు… తను ఆ ఆదరణకు అర్హుడే… డౌన్‌టుఎర్త్… స్కిట్ కోసమే అయినా సరే, తన మీదే సెటైర్లు పేల్చినా సరే, లైట్ తీసుకుంటాడు… కానీ మల్లెమాల కంపెనీ తాలూకు వర్గకలహాల్లో పడి నలుగుతున్నాడు, ఒక్కో షోలో అడ్డంగా కత్తిరించుకుంటూ వెళ్తున్నారు… అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం… పండుగ […]

కొడిగడుతున్న ‘కార్తీకదీపం’… ఎహె, ఫోఫోవమ్మా అనేస్తున్నారు ప్రేక్షకులు…

January 20, 2022 by M S R

kartikadeepam

ఒక చిన్న డిస్‌క్లెయిమర్ :: ఈ కథనంలో చెప్పబోయే ఏ సీరియలైనా సరే… ఓ రీతి, రివాజు ఉండదు… తలాతోకా లేని కథనం, లాజిక్కుల్లేని కథ, దిక్కుమాలిన దర్శకత్వం, తలకుమాసిన కేరక్టరైజేషన్స్, ప్రేక్షకులు ఎడ్డోళ్లు అనే క్రియేటివ్ పొగరు, ప్రత్యేకించి తెలుగు ఆడవాళ్లకు బుర్రల్లేవనే పైత్యం… ఇత్యాది అవలక్షణాలతో కునారిల్లుతున్న సీరియల్సే… ఒక్కటీ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకంగా మగ వేషాలన్నీ ఆలోచనల్లో, అడుగుల్లో హిజ్రా తరహా… ఇంకా చెప్పుకుంటే పోతే దిమాక్ ఖరాబ్… కానీ కోట్ల […]

  • « Previous Page
  • 1
  • …
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • …
  • 37
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions