అఖిల్ సార్థక్… పేరు గుర్తుందా..? బిగ్‌బాస్ ఫేమ్… కొన్ని టీవీ షోలలో కూడా చేశాడు… కుండబద్ధలు కొట్టేశాడు టీవీ డాన్స్ షోల తీరుపై..! ప్రత్యేకించి స్టార్ మాటీవీలో వచ్చే నీతోనే డాన్స్ షో మీద చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగు… తనేమంటాడంటే..? ‘ఇప్పుడే ఓ ప్రోమో చూశాను… చాాలా దారుణంగా ఉంది… డ్యాన్స్ చేస్తే మార్క్స్ ఇవ్వరు… స్టంట్స్ చేస్తే చాలంటా… జడ్జ్‌లు వాళ్ల స్థాయికి తగ్గట్టుగా లేరు… ఇలా అంటున్నందుకు క్షమించండి… స్టార్ మా ఈ సారి […]
వేలు స్వామి… మడత కుర్చీ… ఇప్పుడివేనా సార్ ట్రెండింగ్ టాపిక్స్…
నా పేరు వేలు స్వామి అంటూ బిత్తిరి సత్తి ఓ పేరడీ వేషంతో వేణుస్వామిని అనుకరిస్తూ కనిపించాడు జీతెలుగు వాళ్లు ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమోలో… ఇదయితే మరీ 5 నిమిషాల ప్రోమో… సరే, వేణుస్వామిని ఏదో డ్యామేజీ చేస్తున్నట్టుగా, కించపరిచినట్టు అభ్యంతరకరంగా ఏమీ లేదు కానీ నెగెటివ్, పాజిటివ్ ఏదయినా సరే, వివాదాలు ఏమున్నా సరే, తన ఉనికిని అందరూ ఏదోరకంగా గుర్తించక తప్పని స్థితి… ఏదో ఓ రకంగా తనను ప్రచారంలో ఉంచుతున్నారు… తనకు […]
రష్మికే కాదు… యాంకర్లు అందరికీ ఈ చిన్న పరీక్ష పెడితే ఎలా ఉంటుంది..?
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్ ఒకసారి తప్పుల్లేకుండా చదవడానికి ప్రయత్నించండి… అర్థాలు, తాత్పర్యాలు అక్కర్లేదు, ఉచ్ఛరణ దోషాలు లేకుండా చదవగలమా అనేది పరీక్ష… అబ్బే, మనకెందుకండీ ఈ పరీక్షలు అంటారా..? పోనీ, మన టీవీ న్యూస్ రీడర్లకు, డిబేట్ ప్రజెంటర్లకు, టీవీ యాంకర్లకూ ఈ పరీక్ష పెడితే […]
ఆ డ్యాష్ ప్రశ్నలేమిటో… ఆ షో ఏమిటో… ఈ హోస్టింగ్ అవసరమా తల్లీ…
బూతులు, హాట్ సీన్లు, వెగటు కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీలను ఎవడూ చూడరనే భ్రమ ఏదో ఆవహించినట్టుంది ఆహా యాజమాన్యానికి కూడా..! అసలే నడపలేక అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా వెగటు కంటెంట్ వైపు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు… ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక హోస్టింగ్ చేసే చెఫ్ మంత్ర అనే కుకరీ షోలో రీసెంటు ఎపిసోడ్లో పరమ చెత్తా డైలాగులను పెట్టారు… ఆహా కూడా మెగా క్యాంపుకు చెందినదే కదా… […]
ఈ అమృతం అప్పాజీ గుర్తున్నాడా..? ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదేమో..!!
ఈ సినిమా ఎప్పుడొచ్చి పోయిందో గుర్తు లేదు గానీ… సినిమా పేరు సౌండ్ పార్టీ… బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ ఇందులో హీరో… సినిమా ఫ్లాపో, హిట్టో తెలియదు గానీ… బిగ్‌బాస్ పాపులారిటీ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్‌కూ పెద్దగా ఉపయోగపడదు… జస్ట్, కొన్నాళ్లు టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తారు… ఆమధ్య సొహెయిల్ వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూశాం కదా… ఈ సౌండ్ పార్టీ సినిమా కూడా సన్నీకి పెద్ద ఫ్లెచింగ్ అవుతుందని అనుకోలేం… […]
ఓహో… మంగ్లి మరోరూపం… బాగుంది… రాహుల్‌తో కెమిస్ట్రీ కూడా..!
మొత్తానికి స్టార్ మాటీవీలో సూపర్ సింగర్ పేరిట, సినిమా పాటల పోటీ పేరిట ఓ వినోద కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా క్లైమాక్సు దశకు తీసుకొచ్చారు… ఆరుగురు ఫైనలిస్టులను షార్ట్ లిస్టు చేసేసి, ఫినాలేకు తమన్‌ను పిలిచారు… మొదటి నుంచీ అద్భుతంగా పాడుతున్న ప్రవస్తి ఈ షో గెలుస్తుందా లేదా ఫినాలేలో తేలుతుంది… ఆమె చిన్నప్పటి నుంచీ పాడుతోంది… ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని కూడా… పర్లేదు, ఆ ఆరుగురూ మెరిట్ ఉన్నవాళ్లే… చెప్పదలుచుకున్నదేమిటంటే… మొదటి నుంచీ […]
కన్నడ కస్తూరి..! బెంగుళూరు టు హైదరాబాద్… ఇదొక టీవీ నటప్రవాహం…!
తెలుగు సీరియల్స్ చూసేవాళ్లకు బాగా తెలుసు ఈ విషయం… దాదాపు కన్నడ టీవీ తారలే డామినేట్ చేస్తున్నారు… తప్పు కాదు, వాళ్లకు ఆ మెరిట్ ఉంది… ప్రూవ్ చేసుకుంటున్నారు… సినిమాలకు సంబంధించి తమిళ, మలయాళ తారలు తమ ప్రతిభతో నిలదొక్కుకుంటున్నారు… కష్టపడతారు… టీవీలకు వచ్చేసరికి మాత్రం కన్నడ తారలే… అన్నింటికన్నా ముఖ్యంగా త్వరగా తెలుగులో ఫ్లూయెన్సీ సాధించేస్తారు… యాంకర్లుగా సౌమ్యారావు వంటి కన్నడ మొహాలు ఫెయిలైనా సరే… సీరియల్స్‌లో మాత్రం వాళ్లదే హవా… తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ […]
బాగుంది… తెరపై వెలిగే కంటెస్టెంట్లు, జడ్జిలకే కాదు… ఆర్కెస్ట్రా టీంకూ చప్పట్లు…
టీవీల్లో అనేక సాంగ్స్ కంపిటీషన్ ప్రోగ్రామ్స్ వస్తుంటయ్ పలు భాషల్లో… హిందీ ఇండియన్ ఐడల్ వంటి బిగ్ షోలలో వాడినన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బహుశా లైవ్ కచేరీలలో కూడా వాడరేమో… మంచి ఆర్కెస్ట్రా లేకపోతే కంటెస్టెంట్ల గొంతు, పాట కూడా మధురంగా ఉండదు… కానీ ఎప్పుడూ ఆర్కెస్ట్రకు నాలుగు చప్పట్లు, నాలుగు మంచి మాటలు దక్కవు… జడ్జిలు, కంటెస్టెంట్లే హైలైట్ అవుతుంటారు… అప్పుడప్పుడూ ఎస్పీ బాలు పాడుతా తీయగా ప్రోగ్రాం, స్వరాభిషేకం కార్యక్రమాల్లో తన టీంలోని ఆర్కెస్ట్రా […]
పాములు కార్లు నడుపుతాయి… కథలే నడుపుతాయి… విఠలాచార్య మార్క్ సీరియళ్లు..,
పాతవి విఠలాచార్య సినిమాల్ని ఈతరం పెద్దగా చూడకపోవచ్చు… యూట్యూబులో బోలెడు ఉన్నాయి… మాయలు, మంత్రాలు, జంతువులు మనుషులైపోతూ, మనుషులు రకరకాల జంతువులు అయిపోతూ… మాయల ఫకీర్లు, రాజకుమారులు, రాజకుమార్తెలు, రాజ్యాలు, కుట్రలు, దేవుళ్లు, అబ్రకదబ్ర హాంఫట్ గట్రా మస్తుంటయ్… జంతువులు ఫైటింగులు చేస్తయ్, ఎక్కడో ఉన్న హీరో లేదా హీరోయిన్ పిలవగానే పరుగెత్తుకు వస్తయ్, విలన్ల భరతం పడతయ్… అప్పట్లో ఆ సినిమాలు ఫుల్లు హిట్లు… ఏదో సినిమాకు సంబంధించి హీరోతో గొడవ వస్తే, కథలో తను […]
అనసూయా, అభిప్రాయం చెబితే తప్పేమీ లేదు… Right, You have that right…
అనసూయ… నటి, యాంకర్… మాట పడదు, పడితే ఊరుకోదు… కానీ మాట అనడానికి ఆల్వేస్ తయ్యార్… తనకు కంట్రవర్సీ కావాలి… ఏదో ఒకటి… లేకపోతే సోషల్ మీడియాలో గెలికి మరీ ఓ వివాదాన్ని క్రియేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది… కంట్రవర్సీ లేకపోతే తనకు తోచదు… ఇది ఒక కోణం… నాణేనికి మరో కోణం ఏమిటంటే… కొన్నిసార్లు సెలబ్రిటీలు బయటికి చెప్పలేనివీ బడబడా కక్కేస్తుంది… దాని పరిణామాలు ఏమైనా రానీ జానేదేవ్… తన అభిప్రాయాన్ని చెప్పస్తుంది… నిజానికి ఇండస్ట్రీలో […]
అమ్మకానికి ఆహా ఓటీటీ..! ఈ మెగా ప్రొడ్యూసర్ ‘సినిమా’కు కలెక్షన్లు లేవు..!!
ఓ సూపర్ స్టార్ హీరో… మంచి గిరాకీలో ఉన్న హీరోయిన్, ఇతర నటులు… 24 క్రాఫ్ట్స్‌లో కూడా పేరొందిన ప్లేయర్స్… మంచి కథ… భారీ ఖర్చు… పేద్ద బ్యానర్… ఖర్చుకు వెరవని నిర్మాత… ఇంకేం… సూపర్ హిట్, బంపర్ హిట్ గ్యారంటీ అంటారా..? తప్పు… డిజాస్టర్ కూడా కావచ్చు… సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎవడూ ఊహించలేడు… అఫ్కోర్స్, అలా ఖచ్చితమైన అంచనాలు సాధ్యమయ్యే పక్షంలో అసలు ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకొస్తాయి..? మరి సినిమాలు, వినోదరంగానికి సంబంధించి ఏ […]
శ్రీముఖి కాళ్ల ప్రదర్శనతో… అనంత శ్రీరామ్ మనోభావాలు ఉబ్బితబ్బిబ్బట…
ఒకప్పడు సూపర్ సింగర్ షో అంటే ఓ థ్రిల్… పాటల పోటీ పోటాపోటీగా ఉండేది… కంటెస్టెంట్ల గానసామర్థ్యం మీద సునిశిత విశ్లేషణ ఉండేది, హుందాగా ఉండేది షో… కానీ ఇప్పుడు..? వెగటుతనం, వెకిలితనం… వెరసి ఓ వెధవతనం… అప్పట్లో కూడా శ్రీముఖి ఈ షోను హోస్ట్ చేసింది… ఇప్పుడు కూడా చేస్తోంది తాజా సీజన్‌కు… కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే..? అప్పట్లో శ్రీముఖి పద్దతైన డ్రెస్సులతో కనిపించేది… కానీ ఇప్పుడు అంటారా… ఒకసారి ఈ ఫోటో […]
ఫాఫం సుమ… పాపులారిటీలో మరీ అంతగా జారిపోయిందా..?
మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్… అంటే..? టీవీ షోలు, సినీ ఫంక్షన్ల హోస్టులు, యాంకర్లు, యూట్యూబర్లు ఎట్సెట్రా… లేదా హఠాత్తుగా సెలబ్రిటీలు అయిపోయిన బర్రెలక్క, కుమారి ఆంటీ, మడత కుర్చీ పెద్దాయన, పల్లవి ప్రశాంత్ ఎట్సెట్రా… వీళ్లలో మిగతావాళ్లు వచ్చీపోయే కేటగిరీ.., కానీ టీవీ యాంకర్లు, హోస్టుల పాపులారిటీ కాస్త స్థిరంగానే కొనసాగుతూ ఉంటుంది… విషయానికొస్తే… ఆర్మాక్స్ అనే సంస్థ ఎప్పటికప్పుడు ఈ విభాగంలో కూడా పాపులారిటీ సర్వే నిర్వహిస్తుంది… అదేలెండి, ఆన్లైన్ వోటింగ్… ఎందరు […]
మళ్లీ బుల్లితెరపై కార్తీకదీపం… ఇంకెన్ని విన్యాసాలో, మరెన్ని వికారాలో…
అనుకుంటున్నదే… కార్తీకదీపం సీరియల్‌ను చివరలో నానా బీభత్సం చేసి, కథను నానా మలుపులూ తిప్పి, ప్రధాన పాత్రధారుల్ని చంపేసి, కొత్త జనరేషన్ కథ కొనసాగింపు పేరిట ప్రేక్షకుల్ని, కార్తీకదీపం సీరియల్ ప్రేమికుల్ని నానా హింస పెట్టాడు ఆ దర్శకుడెవరో గానీ… తరువాత ఇక తమకే చిరాకెత్తి, ప్రేక్షకుల తిరస్కారం ఎక్కువైపోయి, రేటింగుల్లో దిగజారిపోయి, ఇక కుదరదు అనుకునే స్థితిలో అర్థంతరంగానే కార్తీకదీపం సీరియల్ కథకు ముగింపు పలికాడు అప్పట్లో సదరు దర్శకరత్నం… ఒక సీరియల్ ఎలా ఉండి, […]
డ్రామా కంపెనీలోకి కూడా కుమారి ఆంటీని ఫుడ్ డబ్బాలతో సహా పట్టుకొచ్చేశారు..!
మొన్న స్టార్ మా టీవీలో బిగ్‌బాస్ ఉత్సవం షోలోకి ఫుడ్ డబ్బాలతో సహా కుమారి ఆంటీని తీసుకొచ్చారు కదా… జోకులతో సరదాలు చేసుకున్నారు కదా… మరి ఇలాంటి హఠాత్ పాపులర్ స్టార్లను టీవీ తెర మీదకు తీసుకొచ్చు అలవాటున్న ఈటీవీ ఊరుకుంటుందా… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి తీసుకొచ్చేశారు… హాయ్ నాన్నా, అందరూ బావున్నారా అని తన అలవాటైన పలకరింపుతో ఈ షోలో ఆంటీ ఏకంగా ఓ ఫుడ్ స్టాలే తెరిచింది… ఈటీవీ ఆస్థాన కమెడియన్లందరూ ఆమె […]
మిస్ నాట్ పర్ఫెక్ట్..! త్రిపాఠీ లావణ్యం, నటన అంట్లు తోమడానికే సరిపోయాయ్…!
Ms not so Perfect… సాధారణంగా సీరీస్లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు….. డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ నటించాడు. దీనిని […]
అబ్బో… ఆంటీని మునగ చెట్టు ఎక్కిస్తున్నారుగా… జెర పైలం తల్లీ…
గంగవ్వ… బర్రెలక్క… కుర్చీ మడత పెద్దాయన… ఒక్కోసారి ఒకరు సోషల్ మీడియాలో ఫుల్లు పాపులర్ అయిపోతారు… గంగవ్వ అయితే ఓ ఇల్లు కట్టుకుంది… బిగ్‌బాస్ ఇంటికి వెళ్లొచ్చింది… బర్రెలక్క మంచి వోట్లే సాధించి రాజకీయాల్లో కొనసాగే సూచనలు కనిపిస్తున్నయ్… ఫాఫం, ఆ మడత కుర్చీ పెద్దమనిషికి పాపులారిటీ వచ్చింది గానీ ఇంకేమీ దక్కలేదు… ఇప్పుడు ట్రెండ్ కుమారీ ఆంటీ… తెలుసు కదా… ఫుడ్ స్టాల్, ఫుల్లు గిరాకీ పెంచేసిన సోషల్ మీడియా… ఎగబడిన జనం… పోలీసుల కన్నెర్ర, […]
ఫాఫం మణిశర్మ… మంగ్లి మాటకు నోరుతెరిచాడు… భలే సరదా ఎపిసోడ్…
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ… అలియాస్ మణిశర్మ… మొన్నామధ్య ఎంతసేపూ తమన్, డీఎస్పీయేనా… నాకూ చాన్స్ ఇస్తే వైవిధ్యం ఉంటుంది కదా అంటూ నిర్మాతలను కోరుతూ హఠాత్తుగా ప్రచారతెర మీదకు వచ్చాడు… నిజంగా ట్రాజెడీ… 30 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మణిశర్మ నాకూ చాన్సులు ఇవ్వండి సార్ అనడగడం బాగనిపించలేదు… అడగడం బాగా లేదని కాదు… అలా అడిగే సిట్యుయేషన్ బాగా లేదని… ఎస్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్, డీఎస్పీ టాప్ మ్యూజికల్ […]
యాంకర్ రష్మి ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… అరుదైన ప్రశంసే మరి…
మురళీమోహన్… ఒకప్పటి హీరో… తెలుగుదేశం నాయకుడు… వయస్సు 83 ఏళ్లు… ఇప్పటికీ తన ఆరోగ్యాన్నిబాగా కాపాడుకుంటున్నాడు… తన సంపాదన, తన ఆస్తులు, తన వ్యవహారాలే తప్ప పెద్దగా వివాదాల్లోకి రాడు… పిచ్చి విమర్శల జోలికి పోడు… ప్రత్యేకించి టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనిపించడు… తనను శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు పిలిచారు… ఎప్పటిలాగే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలిసి ఏవో మూస పంచులు వేస్తారు కదా… వేశారు… తరువాత మురళీమోహన్ వచ్చాడు […]
రచయిత అనంత శ్రీరాం తప్పు… స్టార్ మాటీవీది మరీ తప్పున్నర…
అనంత శ్రీరాం మంచి గీత రచయితే… కానీ నోటి దూల ఎక్కువ… తనంతటతనే ఇజ్జత్ తీసుకుంటూ ఉంటాడు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ… ఆమధ్య దిగుదిగునాగ అనే ఓ పిచ్చి గీతాన్ని సమర్థించి నవ్వులపాలయ్యాడు… తరువాత ఏదో మరో వివాదం… సూపర్ సింగర్ టీవీ సినిమా సాంగ్స్ కంపిటీషన్స్ షోలో నలుగురు జడ్జిల్లో తను ఒకడు ప్రస్తుతం… అంతకుముందు జీతెలుగులో ఇలాంటి షోలో కూడా జడ్జిగా చేస్తూ, పిచ్చి గెంతులు వేస్తూ చిరాకెత్తించాడు… ఈ సూపర్ సింగర్ షోలో […]
- « Previous Page
- 1
- …
- 6
- 7
- 8
- 9
- 10
- …
- 40
- Next Page »