చనిపోయినవారికే ఆత్మలు ఉంటాయనడం శాస్త్ర విరుద్ధం. అసలు ఆత్మకు చావే లేదని గీతలో శ్రీకృష్ణుడు బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆత్మను కత్తి కోయలేదు. అగ్ని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. మనసులోపలి మనసును అంతరాత్మ అంటున్నాం. అంటే ఆత్మకంటే అంతరాత్మ ఇంకా గొప్పది అనుకుంటే చాలు. అంతకంటే లోతుగా వెళితే ఆత్మల అంతరాత్మల మనోభావాలు దెబ్బతింటాయి. మనస్సాక్షి కంటే అంతరాత్మ సాక్షి ఇంకా గొప్పది. అందుకే నీ అంతరాత్మను నువ్వే […]
ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
ఒకాయన… అకస్మాత్తుగా మరణించాడు… తనకు కొంత ఆస్తి ఉంది… అందులో ఎవరికి వారసత్వపు హక్కు ఉంటుంది..? మామూలుగా మనకు తెలిసిన వారసత్వపు పద్ధతులు, ఆనవాయితీలు, పెద్దల తీర్పులు, చట్టాల ప్రకారం… కొడుకు ప్రథమ హక్కుదారు… ఇప్పుడు స్త్రీలకూ ఆస్తి హక్కు వర్తిస్తున్నది కాబట్టి బిడ్డ కూడా హక్కుదారు… భర్త ఆస్తిపై సహజంగానే భార్య హక్కుదారు… కొడుకుల సంతానం, బిడ్డల సంతానం కూడా హక్కుదారులే… అంతేకదా… ఆ భార్య తరపు తమ్ముళ్లు, అన్నలు వచ్చి, ఆ ఆస్తి మీద […]
రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
కరోనా వ్యాప్తి నిరోధానికి రైల్వేశాఖ చిట్కా వైద్యం! ——————- ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల వలన, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం అంటారు. తెలుగులో మనం ప్రయత్నపూర్వకంగా మరచిపోయిన విభక్తి ప్రత్యయాల్లో మరికొన్ని కలిపి ప్రజల కిన్, కున్, యొక్క, లోన్, కంటెన్, వలనన్, పట్టి, చేతన్, చేన్, తోడన్, తోన్ అని కూడా గంభీరంగా అనుకోవచ్చు. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక ఆదర్శం. పునాది. సూత్రం. సిద్ధాంతం. ప్రజలకు ఏమి కావాలో ప్రభుత్వం […]
వడ్డీ లేని అప్పు అనగానే తలొగ్గకండి… నడ్డి విరిగిపోగలదు..!!
కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో ఓ పది నిముషాలు: గుడ్ మార్నింగ్ సార్, బజాజ్ ఫైనాన్స్ నుండి రాజేష్ మాట్లాడుతున్నాను సార్. సుదర్శన్ గారేనా మాట్లాడుతున్నది? అవును చెప్పండి. సార్ బజాజ్ ఫైనాన్స్ నుండి 4 in 1 సూపర్ కార్డు మీకు approve అయ్యింది సార్. ఈ కార్డు స్పెషాలిటీ, దీన్ని మీరు EMI కార్డ్, లోన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గా వాడుకోవచ్చు సార్. 4 ఇన్ 1 కార్డ్! OK […]
పుస్తకావిష్కరణకు ఢిల్లీ నుంచి రాక..? ఏ కాలంలో ఉన్నారు సారూ మీరు..?
ప్రజెంట్ పాపులర్ రైటర్స్ మీద ఏదో వ్యాసం చదువుతుంటే… కొన్ని అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి… 1) అందరూ అనుకున్నట్టు ప్రజల్లో పఠనాసక్తి ఏమీ చచ్చిపోలేదు… చేతన భగత్ పుస్తకాలు కొన్ని 70 లక్షలు అమ్ముడయ్యాయి… అమిష్ రాసినవి 50 లక్షలు… అనేక భాషల్లోకి అనువాదం… వీళ్లు రియల్ పాన్ ఇండియా స్టోరీ టెల్లర్స్… 2) పాత పురాణాలను కూడా కొత్త పద్దతుల్లో, కొత్తకొత్తగా చెబుతున్న తీరు పాఠకుడిని ఆకట్టుకుంటోంది… ఉదాహరణకు భారతాన్ని భీముడి కోణంలో, రామాయణాన్ని తార […]
ఆ దృశ్యం మళ్లీ అదిరింది..! హీరో, దర్శకుడు అభినందనలకు అర్హులే…!
ఇప్పటి ట్రెండ్ ఏమిటి..? ఒక స్టార్ హీరో సినిమా తీస్తే… కనీసం నాలుగైదు భాషల్లో… చేతనైతే ఏడెనిమిది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా పేరిట దేశమంతా విడుదల చేయడం… ప్రతి భాషలోనూ టీవీ రైట్లు, ఓటీటీ రైట్లు, ఓవర్సీస్ రైట్లు కలిపి కుమ్మేసుకోవాలి… థియేటర్లలో హోర్డింగులు గట్రా ఫుల్ హైప్ క్రియేట్ చేయడం… సినిమాలో ఫుల్ మాస్ మసాలా నింపేయడం… కథా మన్నూమశానం ఎలా ఉన్నా పర్లేదు, కథనం సంగతి వదిలేయండి… వేయి శాతం హీరోయిక్ […]
రాజరికం బంగారు పంజరం… ఎగిరిపోయిన జంట మళ్లీ ఎందుకొస్తుంది..?!
బకింగ్ హ్యాం ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్! ——————- బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో దుకాణం తెరిచిన నాటికి బహుశా ఇంగ్లాండ్ జనాభా యాభై లేదా అరవై లక్షలు ఉండి ఉండాలి. అదే సమయానికి భారత జనాభా హీనపక్షం ఇరవై అయిదు కోట్లు దాటి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ జనాభా అయిదు కోట్లా అరవై లక్షలు. భారత జనాభా 135 కోట్లు. పట్టుమని పది నాటు పడవల్లో గాలివాటుగా వచ్చిన పాతికమంది కంపెనీ వ్యాపారులు […]
‘కొండా’ను తవ్వి..!! ఏడాదిన్నర స్టడీ, కానీ జనానికి ఎక్కితేనే కదా ఫాయిదా..?!
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ ట్వీట్ చేశాడు… అందులో ఓ వీడియో… దాదాపు 80 వరకూ పరిశోధన వ్యాసాల్ని, పుస్తకాల్ని, డాక్యుమెంట్లను చదివి, అర్థం చేసుకుని, ఏడాదిన్నరపాటు శ్రమపడి ఈ వీడియోను చేశాను అన్నాడు అందులో… తనే తెర మీద కనిపిస్తూ ఆ డాక్యుమెంటరీ వీడియో వివరాలు చెబుతూ ప్రజెంట్ చేశాడు… దాదాపు 23 నిమిషాలున్న ఆ వీడియోలో తన శ్రమ కనిపిస్తోంది… అభినందించాలి… అదే వీడియో సారాంశాన్ని వెలుగు పేపర్లో ఓ ముప్పావు […]
వెరీ ఇంట్రస్టింగ్ ‘ఫర్టిలిటీ’… తనే తల్లి, తనే తండ్రి… అక్షరాలా…!!
ఒకామె పురుషద్వేషి… సంభోగమంటే ఏవగింపు… కానీ పిల్లలు కావాలి తనకు… అందుకని ఒక వీర్యనిధికి వెళ్లింది, కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో, ఎంచక్కా తన అండంతోనే సంతానం… సింగిల్ మదర్‌గా పెంచుకుంది… ఒక ఉదాహరణ… ఇందులో మగాడి నీడ ఆమెపై పడలేదు కానీ… మగాడి అంశతోనే సంతానం… అది తప్పదు, ప్రకృతి నిర్దేశించింది లేదా జీవపరిణామగతి మనల్ని అలా మార్చింది… మనిషి ఉభయలింగజీవి కాదు కదా… సో… ఆడ, మగ అంశల కలయిక తప్పదు… సరే, మరో ఉదాహరణ […]
ఒక కోడలు మోసిన అవమాన భారం! మనం ఎప్పటికీ మారం…!!
మధ్యప్రదేశ్ లో ఒక మహిళను అనాగరికంగా శిక్షించారని, హింసించారని, అవమానించారని ఒక వార్త. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండగా అత్తింటివారు ఆమెపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. ఒక యువకుడిని ఆమె భుజంపై ఎక్కించి శిక్షగా మూడు కిలోమీటర్లు నడిపించారు. అలా మోయలేని బరువు మోస్తూ నడుస్తున్నప్పుడు కూడా ఒళ్లు వాచేలా కొట్టారు. చివరికి ఆ కోడలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆమెను హింసించిన అత్తింటివారిలో కొందరిని అరెస్టు చేశారు. కేసు సహజంగా […]
యూటీ హైదరాబాద్..! ఏమిటీ ఒవైసీ వ్యాఖ్యల వెనుక రాజకీయ మర్మం..?!
యూటీ… కేంద్రపాలిత ప్రాంతం… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట… అసలు ఏమిటీ దీని కథ..? మజ్లిస్ బాస్ ఎందుకు దీన్ని తెర మీదకు తీసుకొస్తున్నాడు..? ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి..? ఒవైసీ వ్యాఖ్య చేసిన వెంటనే టీఆర్ఎస్ ఎందుకు అందుకుని, బీజేపీ మీదకు మాటల దాడికి దిగింది..? ఒక సమీకరణాన్ని ఊహించొచ్చు… టీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమ పార్టీ… ఎప్పుడైతే అది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందో యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచును పక్కకు తోసేసి బీటీ (బంగారు […]
బన్నీ సినిమాలో సుడిగాలి సుధీర్ గెస్ట్ రోల్… రోజా భలే చెప్పిందిలే…
టీవీలో సుడిగాలి సుధీర్‌ను చూస్తుంటే ఎందుకు ప్లజెంటుగా ఉంటుంది..? ఆఫ్టరాల్ టీవీ స్టార్ అని తీసిపారేయకండి… తను తెలియని తెలుగు ఇల్లు లేదు… బుల్లితెర సూపర్ స్టార్ తను… (సీరియల్ నటుల కథ వేరు…) తన పాపులారిటీ చూసి తోటి ఆర్టిస్టులే ఈర్ష్యపడుతూ ఉంటారు… తన స్కిట్లు, షోలలో బ్యూటీ ఏమిటంటే..? తన మీదే సెటైర్లు పడుతుంటయ్, వేసుకుంటాడు, అమాయకంగా మొహం పెడతాడు, అందరు ఎన్నిరకాలుగా తనపైనే పంచులు వేస్తున్నా సరే, హేపీగా యాక్సెప్ట్ చేస్తాడు… చివరకు […]
దటీజ్ హరీష్..! TRS అయోధ్య పంచాయితీలో భలే ట్విస్ట్ ఇచ్చాడు..!!
మిగతా టీవీలు, మిగతా పత్రికలకు ఈ వార్త ప్రాముఖ్యత అర్థమైందో లేదో తెలియదు గానీ… ఈనాడు మెయిన్ పేజీలో కనిపించింది… భలే పట్టుకుంది ఈ వార్తను…! ‘‘మంత్రి హరీష్ రావు అయోధ్య రాముడికి లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు… ఈ విరాళం ఇవ్వడం తన అదృష్టం అన్నాడు… రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రతినిధులు ఆయన్ని కలిసి అడిగిన వెంటనే ఆయన స్పందించాడు…’’ ఇదీ వార్త సారాంశం… దానికి ఒక ఫోటో… అంతే… సైజు రీత్యా పెద్ద వార్తేమీ […]
ఫాస్టాగ్..! ఫాస్ట్ వైరాగ్యానికి ట్యాగ్… వేగంగా తోలు తీయడం కూడా..!!
ఫాస్ట్ ట్యాగ్ వేదాంతం! ——————– హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం ఆపకండి. ఇది టోల్ గేట్లలో మన తోలు వలిచే ఫాస్ట్ ట్యాగ్ గురించి. వేదంలో నిజానికి ఎంత వెతికినా ఫాస్ట్ ట్యాగ్ కనిపించదు. వేదంలో అన్నీ ఉన్నాయిష…అని ఎగతాళి చేసినా- నిజానికి వేదంలో ఉన్నవే బయట ప్రపంచంలో ఉంటాయి. బయట […]
అంతర్జాతీయ పార్టీగా బీజేపీ..! నవ్వొద్దు… మా విప్లవదేవుడి మీదొట్టు…!!
త్రిపుర సీఎం… బిప్లబ్ దేబ్…. పలకడానికి కష్టంగా ఉందా…? నిజమే, కష్టమే, తనను అర్థం చేసుకోవడంలాగే తన పేరు కూడా…. తన పేరు విప్లవ్ దేవ్… బెంగాలీ భాషలో వ ఉండదు కదా, బ అని పలకాలి కదా… ఇదీ అంతే… జనం నవ్విపోతారు అనే సోయి కూడా లేకుండా, గతంలో పలుసార్లు అనేక అంశాల్లో తన అపరిమిత జ్ఞానసంపదను జాతికి ప్రదర్శించాడు కదా, ఈసారీ అంతే… ‘‘మా అమిత్ షా నేపాల్, శ్రీలంకల్లోకి కూడా బీజేపీని […]
30 కార్ల పార్కింగు స్పేస్ కొన్నదామె… గడుసుదే, విలువ తెలిసిన తెలివి…
నిలువలేని కారుకు విలువ లేదు! ——————– నటుడు సల్మాన్ ఖాన్ కు దేవుడిచ్చిన చెల్లెలుంది. ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఆ అమ్మాయి ఈమధ్య బాంబేలో ఒక డూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొన్నది. ఒకరకంగా సల్మాన్ కుటుంబం డెవెలప్ మెంట్ కు ఇచ్చిన నిర్మాణమది. అందులో తన చెల్లికి సల్మాన్ రెండంతస్థులను కలుపుతూ ఒక డూప్లెక్స్ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లున్నాడు. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కు స్టాంప్ […]
కాలు జారింది, నోరు జారింది… కథ బయటపడింది, కటకటాల పాలైంది…
‘‘హత్య సులభం… కప్పెట్టడమే కష్టం’’ ఇదీ నేరనీతి… ఈ నీతి అర్థం గాకే పోలీసులకు చాలామంది నేరస్థులు ఇట్టే దొరికిపోతుంటారు… అన్నింటికీ మించి నేరస్థులు నేరం చేసిన తరువాత తమ నోరును కట్టేసుకోవడం, మాటకు కట్టడి విధించుకోవడం ముఖ్యం… లేకపోతే జైలుపాలు కావల్సి వస్తుంది… ఐనా…. ఇన్ని టీవీ సీరియళ్లు, ఇన్ని సినిమాలు, ఇన్ని పుస్తకాలు, సోషల్ మీడియా కథనాలు ఎంత చెబుతున్నా సరే.., ఎన్ని చిట్కాలు బోధిస్తున్నా సరే.., బాడీ లాంగ్వేజీతోసహా నేరం చేశాక లాంగ్వేజీ […]
నవ్వుల్, నవ్వుల్…! ఏపీ పాలిటిక్సులో అకస్మాత్తుగా ఏమిటీ వైపరీత్యాలు…?!
నో, నో, ఈ ఏకగ్రీవాలు ఎన్నికల స్పూర్తికే విరుద్ధం, నేనంగీకరించను, ఠాట్, ఆపేయండి అని గర్జించిన నిమ్మగడ్డ వారు గవర్నర్‌ను కలిసి రాగానే ఏకగ్రీవాలకు వోకే అనేశాడు… గవర్నర్ ఏం చెప్పాడు, ఈయన ఎందుకు అనివార్యంగా వినాల్సి వచ్చింది అనేది మళ్లీ వేరే పెద్ద కథ… హోం శాఖకు ఎస్ఈసీ నుంచి ఏమైనా లేఖ చేరిందా..? గవర్నర్ కోపంగా ఉన్నాడా..? వంటి వివరాలు మళ్లీ ఏ కిషన్ రెడ్డో స్వయంగా, లేక ఏ విజయసాయిరెడ్డో తవ్వి వెల్లడించాలి… […]
మోడీ ఔదార్యం భేష్… కానీ కేసీయార్ అయితే ఇంకెలా స్పందించేవాడు..?!
ఇదే సందర్భం ఒకవేళ కేసీయార్‌కు ఎదురైతే ఎలా ఉండేది..? తను ఏం చేసేవాడు..? మోడీ ఏం చేశాడు..? నిజానికి ఏం చేయాలి..? ఒక ఊహ, ఒక కల్పన… ఎందుకంటే..? ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని కాదు… ఇష్యూస్ పట్ల నాయకుల స్పందన, వైఖరులు వేర్వేరుగా ఉంటయ్… కథలోకి వెళ్తే… ఈ పసికందు ముంబైలోని ఓ ధనిక కుటుంబంలోనే పుట్టింది… విషాదం ఏమిటంటే… పుట్టుకతోనే ఓ అత్యంత అరుదైన వ్యాధి… స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ… ఊపిరి పీల్చుకోవడం, […]
ఓహ్… ఆ వధువు పడీపడీ నవ్విన వైరల్ వీడియో అసలు కథ ఇదా..?!
మొన్నామధ్య ఓ వీడియో వార్త గురించి చెప్పుకున్నాం కదా…. ఓ పెళ్లి రిసెప్షన్, ఫోటోగ్రాఫర్ ఓవరాక్షన్, ఈడ్చి ఒక్కటి పీకిన వరుడు… కింద పడి పడీపడీ నవ్విన వధువు… అదీ వార్త… పనిలోపనిగా పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ప్రివెడ్ ఫూట్ల అతి బాగోతాల్ని కూడా చెప్పుకున్నాం… అక్కడ వధువు మరీ నేల మీద దాదాపు దొర్లినట్టుగా నవ్వాల్సిన అవసరం ఏముంది..? అక్కడే చాలామందికి డౌటనుమానం పొడసూపింది… ఇదేదో క్రియేటెడ్ వీడియో అయి ఉంటుందిలే అనుకున్నారు… వ్యూస్ కోసం అలాంటివి […]
- « Previous Page
- 1
- …
- 100
- 101
- 102
- 103
- 104
- …
- 108
- Next Page »