అధికారంలో ఉన్నాం కదా, బోలెడు మార్గాల నుంచి డబ్బు వస్తుంది… సాక్షికి నాలుగు పైసలు పడేస్తే చాలు…… ఇలా అనుకుంటే చివరకు పుట్టి మునిగిపోతుంది… మార్కెట్‌ను బట్టి ఆ దుకాణం నిర్వహణ ఉండాలి…… నష్టాలు నషాళానికి అంటితే తప్ప జగన్‌కు ఈ తత్వం బోధపడలేదు… దాంతో హడావుడిగా ఈనాడు బాట పట్టాడు… నిజం… తెలుగు పత్రికలన్నింటికీ ఈరోజుకూ ఈనాడే మార్గదర్శి… అవలక్షణాలకు, కాసిన్ని మంచి లక్షణాలకు కూడా…! అందరికీ తెలిసిందే కదా, పత్రికా పరిశ్రమ సంక్షోభంలో ఉందని…! […]
చెట్టు గొంతులో దిగి… ఏకు మేకవుతుంది..!
“చెట్టునురా -చెలిమినిరా తరువునురా – తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా —- నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం —– చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా —– పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి మా పుట్టుక నుండి మీపైనే కద జాలి —– […]
గువ్వ, మొగ్గ, మింగు, పత్తి, పులిహోర..! క్షమించండి… ఇవన్నీ ఇప్పుడు బూతులే…
ఒక పదాన్ని దాని అసలు అర్థం గాకుండా… వ్యంగ్యం కోసమో, విమర్శ కోసమో వేరే అర్థంలో వాడితే… ఫాఫం, ఆ పదాల్ని నిజ అర్థంలో వాడటానికి కూడా భయమేసే పరిస్థితి..! అర్థం కాలేదా..? చెప్పుకుందాం… ఎందుకంటే…? వాటి అర్థాలు తెలిసో తెలియకో గానీ… ఈ తలతిక్క టీవీ షోలు చూసి, యూట్యూబ్ వీడియోలు చూసి, సినిమాలు చూసి… చాలామంది ఈమధ్య, ఆడవాళ్లతో సహా…. పీకినవ్ తీ, తొక్కేమీ కాదు, నీ బొక్క, తొక్కాతోలు… ఇలాంటి పదాలు యథేచ్ఛగా […]
… చివరకు మాజీ పెళ్లాల గుండెల్ని కూడా కరిగిస్తోంది కరోనా..!!
అసలే కరోనా కాలం! వంద వద్దులే! యాభై కోట్లివ్వు చాలు! ఎంత చెట్టుకు అంత గాలి. పిండి కొద్దీ రొట్టె లాంటి సామెతలకు కరోనా టైమ్ లో బాగా పాపులారిటీ వస్తోంది. డబ్బున్నవారి కష్టాలు డబ్బున్నవారికే తెలుస్తాయి. వారు నాలుగు కోట్ల బెంట్లీ కారులో తిరుగుతుంటారు కానీ- ఆ నెల ఆ కారు నడిపే డ్రైవర్ కు జీతమివ్వడానికి ఆ కారులోనే వెళ్లి అప్పు అడగాల్సిన పరిస్థితి రావచ్చు. శిఖరం అంచు దాకా వెళ్లడం కష్టం. అక్కడే […]
ఆ అమ్మాయి బీఎస్సీ (చేతబడి)… అల్లుడు గారేమో ఎంఎస్సీ (కాష్మోరా)….
అబ్బాయి భూతాల డాక్టర్! అమ్మాయి పిశాచాల సర్జన్! ———————— ఇది పూర్తిగా దయ్యాలకు సంబంధించిన అకెడెమిక్ సబ్జెక్ట్. ఇష్టం లేనివారు, భయపడేవారు ఇక్కడితో చదవడం ఆపేయగలరు. భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిని…ఇలా దయ్యాల్లో ఎన్నో రకాలు. అన్ని దయ్యాలూ చెడ్డవి కావు. కొన్ని దయ్యాలే మంచివి కావు. విఠలాచార్య సినిమాలతో తెలుగులో దయ్యాలకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. వంశపారంపార్యంగా మనకందిన విజ్ఞానం ప్రకారం- దయ్యం తెల్ల రంగు, లేదా బూడిద రంగుతో ఉంటుంది. కళ్లల్లో గుంతలు […]
మరణించని అమరజవాన్..! చదివి తీరాల్సిన ఓ వీరుడి పోరాటగాథ..!!
యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం అసువులు బాశాడు ఆ జవాను… కానీ ఈరోజుకూ తను సర్వీసులో ఉన్నట్టుగానే భావిస్తూ ప్రమోషన్లు ఇస్తుంది ప్రభుత్వం…! మహావీరచక్ర పురస్కారం ఇచ్చింది… తను బలిదానం చేసిన చోట ఓ గుడి వెలిసింది… ఆ ప్రాంతం నుంచి వెళ్లే జవాన్లు అక్కడ ఆగి మనసారా మొక్కుకుని వెళ్తారు… తన పేరిట ఓ చలనచిత్రం కూడా వచ్చింది… ఇంట్రస్టింగు కదా… అవును, జశ్వంత్‌సింగ్ రావత్… భారతీయ సైన్యం ఎప్పుడూ మరిచిపోలేని పేరు… ఈమధ్య సోషల్ […]
7 కోట్ల ప్రశ్న..! కేబీసీ ఇలాంటి కంటెస్టెంట్‌ను చూసి ఉండలేదేమో…!!
కౌన్ బనేగా కరోడ్‌పతి… ఇప్పటికే పదోపదకొండో సీజన్లు అయిపోయాయ్… ఏళ్లు గడుస్తున్నయ్… ఇప్పుడు పన్నెండో సీజన్ నడుస్తోంది… బోలెడుమంది వచ్చారు, పోయారు… కానీ ఆ హాట్ సీట్ మీద కూర్చోగానే చాలామందికి టెన్షన్, అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు సరదాగా మాట్లాడుతూ, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నా సరే, చాలామంది ఆ ఒత్తిడిని జయించలేరు… సరే, అదొక ఆట… కానీ ఎదురుగా అంత పెద్ద సెలబ్రిటీని కూర్చోబెట్టుకుని, కుదురుగా, నిమ్మలంగా మాట్లాడటం కష్టమే… కానీ ఈమె అదరగొట్టేసింది… ఒత్తిడీ […]
గన్ బాసూ..! అన్నీ సెట్ చేసేది, డిసిప్లిన్ అమలు చేసేదీ అదే బాసూ..!
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా! బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క!………… By….. పమిడికాల్వ మధుసూదన్ తెలంగాణాలో గన్ లైసెన్సులు తొమ్మిది వేలే ఉన్నాయని ఒక వార్త. వెనకటికి శివ ధనుస్సు విరిగిన సందర్భాన్ని చెబుతూ కరుణశ్రీ ఒక పద్యంలో…ఒక్క నిముషంలో నయము; జయము; భయము, విస్మయము కదురా! అన్నాడు. అలా ఈ తుపాకుల వార్తను మనం కూడా క్రమాలంకారంలో పూరించుకుందాం. నయం:- నాలుగు కోట్ల తెలంగాణ జనాభాకు ఒక శాతం లెక్క వేసినా నాలుగు లక్షల తుపాకి లైసెన్సులు […]
అబ్బ.., ఎంత మంచి కలెక్టరో అనుకున్నారు పిచ్చిజనం… ఆహాఓహో అన్నారు…
ముందుగా ఓ కథ చదువుదాం… మనం ‘ముచ్చట’లో రాసుకున్నదే… 2018 నాటి మాట… కొన్ని హఠాత్తుగా తమిళనాడులో, సోషల్ మీడియాలో మస్తు ప్రశంసలతో ప్రచారానికి వస్తయ్… అందులో ఒకటి మనం అలా పికప్ చేసి రాసుకున్నది… ఆహా, ఇంత మంచి కలెక్టర్ అసలు ఉంటాడా…? ప్రభుత్వ ఉద్యోగులకే తలమానికం కదా ఈ ధర్మప్రభువు అనిపించేలా ఉంటుంది కథ… నిజానికి 99.99 శాతం బ్యూరోక్రాట్లు ఇలా ఉండరు… ఉంటే ఈ భారతదేశ అధికార వ్యవస్థలకే అవమానం కదా… సరే, […]
కరోనా పిశాచి కోరలు పీకే కొత్త సంవత్సరమా..? వచ్చెయ్ వచ్చెయ్…!
కొత్త సంవత్సరమా! కరోనా లేని వసంతమై వస్తావా? ———————— శుభ ప్లస్ ఆకాంక్ష – సవర్ణదీర్ఘ సంధి కలిస్తే శుభాకాంక్ష అవుతుంది. బెస్ట్ విషెస్ అన్న ఇంగ్లీషు మాటకంటే శుభాకాంక్ష అన్న సంస్కృతం లేదా తెలుగు మాట అర్థ విస్తృతి, లోతు, బరువు ఎక్కువగా ఉన్నట్లు అనిపించి; అంత గుండెలోతుల్లోనుండి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదనుకుని ఇంగ్లీషు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం. భాషదేముంది? ఇప్పుడిప్పుడే మాటలు, అక్షరాల్లేని ఇమోజి భాష నేర్చుకుంటున్నాం. ఇక ప్రపంచ భాషలన్నీ అంతరించి పాతరాతి […]
మన ఖర్మ కాకపోతే… బజారు రౌడీలకు పోస్టల్ స్టాంపులేమిట్రా..?
మన వీధి రౌడీల స్టాంపులు ఎప్పుడొస్తాయో? ———————— వాల్మీకి రామాయణం సుందరకాండ. అశోకవనం. ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి? అని చెట్టు కొమ్మకు తలవాల్చి పడుకుని, పడుకోనట్లు దిగులుగా ఉన్న సీతమ్మ. ఈలోపు తాగిన మత్తులో, ఊగుతూ మందీ మార్బలంతో రావణాసురుడు సీతమ్మ వైపు వస్తున్నాడు. మధ్యలో గొంతు పిడచకట్టుకుపోతే ఇబ్బంది అని బంగారు పాత్రల్లో మద్యం పట్టుకున్న అమ్మాయిలు రావణుడి చుట్టూ ఉన్నారు. రోజూ కనీసం తెల్లవారినతరువాత వచ్చి ఏదో వాగేవాడు. ఈరోజేమిటి పొద్దున్నే […]
ఫోటో చూస్తేనే పెళ్లివిందు ఆరగించినట్టుంది… ఇదేమిటో తెలుసా..?
ఒకటే కులం… ఒకే ప్రాంతం… వేర్వేరు కుటుంబాలు… వేర్వేరు రాజకీయ రంగులు రుద్దుకుంటారు… తెల్లారిలేస్తే కత్తులు, కారాలు నూరుకుంటారు… రాజకీయ విభేదాలేమీ ఉండవ్… ఉన్నదంతా కుటుంబకక్షలే… అవి దిగువన కార్యకర్తల వరకూ విస్తరిస్తాయి… నిప్పురవ్వ పడితే చాలు నరుక్కోవడమే… ఎన్ని పుస్తెలు రాలిపడినా, ఎందరు తల్లుల కడుపులు కోసుకుపోయినా ఆ విద్వేషాలు అలాగే కొనసాగుతూ ఉంటయ్… బొచ్చెడు ఉదాహరణలు… సరే, ఇక్కడ సీన్ కట్ చేయండి… ఆ ఇద్దరూ ప్రత్యర్థులు… పొలిటికల్ గోదాలో దిగారంటే తిట్టేసుకుంటారు… సవాళ్లు […]
నేను భారతీయుడినే..! మరి నేను వాడే వస్తువులేమిటంటే…?
రానున్న 2021 కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడుతామని మనకు మనం సంకల్పించుకుని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని మన ప్రధాని మన్ కీ బాత్. ఈ వార్తను ఎలా అన్వయించుకోవాలో? ఎలా అర్థం చేసుకోవాలో? తెలియక తికమకపడుతున్నాను. కడప జిల్లా తాళ్ళపాక పక్కన పల్లెలో పుట్టి, అనంతపురం జిల్లా లేపాక్షిలో పెరిగి- ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో; ఎస్ కె యు, ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీల్లో చదువుకున్న నేను పూర్తిగా స్వదేశీనే. భారతదేశం, […]
దత్తపుత్రిక ప్రత్యూషకు కేసీయార్ పెట్టిన పెళ్లికట్నం ఏమిటో తెలుసా..?
నిజంగా ప్రత్యూషది ఓ కథే… ఆమె కథ ముందు పదీపన్నెండు టీవీ సీరియళ్లు, తెలుగు సినిమాలు కూడా సరిపోవు… ఆమె పాత విషాదం గురించి ఇక్కడ చెప్పుకోవడం వద్దు గానీ… ఒక ప్రభుత్వ శాఖ మొత్తం ఆమెను సొంత బిడ్డలా పరిగణించడం… చదివించి, కొలువు ఇప్పించి, పెళ్లి చేస్తుండటం… సాక్షాత్తూ ముఖ్యమంత్రి సతీమణి వెళ్లి, పెళ్లికూతురిని చేసి, ఆశీర్వదించడం… అవును, ఓ కలలాంటి, ఓ కథలాంటి వార్త… ఈ ఫోటో బాగా నచ్చేసింది… ముఖ్యమంత్రి సతీమణి ప్రత్యూషకు […]
చావు చదివింపులు..! మనం మరిచిపోయిన మన మంచి ఆనవాయితీ…
Nagaraju Munnuru…………….. ఈ విషయం చెప్పడానికి ఇది సరిఅయిన సందర్భమో కాదో తెలియదు కానీ చెబితే నలుగురికి ఉపయోగపడుతుందని చెబుతున్నా… పెళ్ళిళ్ళలో సాధారణంగా బంధుమిత్రులు కట్నాలు చదివించడం చూస్తుంటాం.. తెలంగాణలో ఇలాంటి దృశ్యం సాధారణం… పట్టణాల్లో, హైటెక్ పెళ్ళిళ్ళలో గిఫ్టులు స్టేజి మీదే వధూవరులకు అందజేస్తున్నారు, కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కులపెద్దలు ఒక నోటు బుక్కు పెట్టుకుని బంధుమిత్రులు ఇచ్చే నగదును వారి ఇంటి పేర్లతో సహా రాసి, ఆ కుటుంబ సభ్యులకు అందజేస్తారు… […]
ఒక నలంద, ఒక తక్షశిల… మల్లారెడ్డిపై మాటతూలితే మర్యాద దక్కదు సుమీ…
ఎంతసేపూ మల్లారెడ్డి మీద పడి ఏడుస్తారు గానీ… ఓ వింత సక్సెస్ స్టోరీకి తను హీరో అని గుర్తించరెందుకో..? చదువురాని వాడినని దిగులు చెందకుండా… ఒక తక్షశిల వంటి ఘన విద్యాశ్రమాన్ని నిర్మించి… ఏటా వేల మంది చెక్కీ చెక్కీ, సమాజం మీదకు వదులుతున్న ఓ నిస్వార్థ సమాజసేవకుడిపై నిందలు వేయడం కరెక్టేనా..? అసలు ఆయన మూడు ఆశ్రమాలకు వెళ్తే… ఏ ఆశ్రమంలో ఏం బోధిస్తారో తనకే అర్థం కాదు… అంత పెద్ద క్యాంపసులు, అన్ని వేల […]
రాధాకృష్ణ గారూ… ఈ మరక మాటేమిటి సారూ..? అసహ్యంగా లేదా..?!
ఒక వార్త చాలా డిస్టర్బ్ చేసింది… ఫేస్బుక్లో ఎవరి వాల్ మీదో, ఏదో వ్యాఖ్యతో ఉంది… ఆ అభిప్రాయాలతో ఇక్కడ పనిలేదు… చాలా చిన్నవార్త… అసలు చాలామంది నోటీస్ కూడా చేయరేమో… కానీ తప్పు తప్పే కదా… మరీ ఇంత ఘోరంగా ఉందా మన పాత్రికేయం…? తమ పత్రికల్లో ఏం వార్తలొస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, అవి తప్పులో, ఒప్పులో కూడా ఒకసారి వెనక్కి చూసుకునే దిక్కు కూడా లేదా పత్రిక సంస్థల్లో..? ఇది తెలుగు పాఠకుల దురవస్థా..? […]
క్రెడిట్స్ ఇవ్వలేదు… క్రెడిబులిటీ కోల్పోయాడు… కాపీ బిగ్ క్యాట్ అట…
‘‘కొన్ని పాత స్మృతుల తేయాకులు వేసి, ఆ కాసిన్ని నీళ్లలో ఆనందపు పాలు పోసి… నవ్వుల పంచదార కూడా కాస్త కలపండి కొద్దిసేపు ఆ కలల్ని అలాగే మరిగించండి… వడబోసి, సౌకర్యపు కప్పులో పోసుకుంటే ఒక్కొక్క చుక్కా మధురమైన జీవితేనీరు…’’ …… మరీ గూగుల్ అనువాదంలాగా గాకుండా… మక్కీకిమక్కీ గాకుండా… పాత చాయ్ పత్తా వేసి మళ్లీ మళ్లీ మరిగించిన టీలాగా గాకుండా… కాస్త బాగానే ఉంది కదా… అసలే మనకు ద్రావిడత్వం ఎక్కువ… అంటే హిందీ […]
పువ్వై పుట్టి… పూజే చేసి… పోనీ… రాలిపోనీ!
“జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం…” ఇది రావణాసురుడు రాసి, పాడగా అనంతరకాలంలో లోకంలో అందరూ పాడుకుంటున్నారని ప్రచారంలో ఉంది. వేద, పురాణాలను, మంత్రం పుట్టుపూర్వోత్తరాలను శాస్త్రీయంగా అంచనా వేయగలిగినవారు మాత్రం ఇది రావణుడు రాసింది కాకపోవచ్చు అని అంటారు. రావణాసురుడు సంస్కృతంలో, రుద్రవీణ వాయించడంలో ఎంత పండితుడయినా శివతాండవం క్రెడిట్ రావణుడికి ఇవ్వడానికి ఏవో ఇబ్బందులున్నట్లున్నాయి. ఆ గొడవ ఇక్కడ అనవసరం. సంస్కృతంలో ఉన్న ఆ శివతాండం స్థాయిలో […]
చైనాకు సాయపడుతూ… రష్యా క్రమేపీ మనకు దూరమవుతోందా..?
మన చిరకాల మిత్రదేశం రష్యా మనకు దూరం జరుగుతోందా..? మన శత్రుదేశం చైనాకు దగ్గరవుతోందా..? మనం అమెరికా కూటమికి చేరువయ్యేకొద్దీ రష్యా మనల్ని వదిలించుకుంటోందా..? ప్రస్తుతం కేవలం తన ఆయుధ అమ్మకాలకు మాత్రమే ఇండియా ఉపయోగపడుతోందా..? అందులోనూ చైనాకు అనుచిత మద్దతునిస్తూ, ఇండియాను మోసగిస్తోందా..? మన విదేశాంగ విధానానికి సంబంధించి ఇవి కీలకప్రశ్నలే… మొన్నటికిమొన్న సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరీ పెరగకుండా రష్యాయే మధ్యవర్తిత్వం వహించి, వేడి చల్లార్చిందనే ప్రచారం ఉంది… పైన ప్రశ్నలన్నీ ఊహాజనితాలే అంటారు చాలామంది… […]