Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… సంచయిత కాదు.., వేరే మగవారసులూ ఉన్నారు… ఓ ఇంట్రస్టింగు కథ…

June 16, 2021 by M S R

sanchaitha

సంచయిత గజపతిరాజు… వేల కోట్ల రూపాయల మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా ఆమె నియామకాన్ని కొట్టేసిన హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందా..? తను తీసుకున్న నిర్ణయాలను, జారీ చేసిన జీవోలను డిఫెండ్ చేసుకుంటూ, ఆమెను తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుందా..? అవకాశాలున్నాయా..? ఆ కుటుంబ వారసురాలిగా ఆమె చేస్తున్న వాదనలకు అసలు చట్టబద్ధత ఉందా..? ఇంతకీ ఆమె బీజేపీలో ఉన్నట్టేనా..? లోకల్ బీజేపీ ఏమంటోంది..? ఒక మహిళ వంశపారంపర్య ఆస్తులకు, […]

అసలు పార్టీలు మారడం అంటే… ఈయన రికార్డును ఎవరూ బీట్ చేయలేరేమో…

June 14, 2021 by M S R

siddique

పార్టీలు ఫిరాయించడం మీద… ఎప్పుడూ ప్రతి రాష్ట్రంలోనూ ఏదో చర్చ నడుస్తూనే ఉంటుంది కదా… సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాన్తానై… ఫ్యూడల్, కుటుంబ పార్టీలే కాదు, చివరకు కరడుగట్టిన లెఫ్ట్, రైట్ నేతలు సైతం ‘జంపర్ల’ జాబితాల్లో కనిపిస్తున్న కాలమిది… ఆ బెంగాలీ ముకుల్ రాయ్ చూడండి, బీజేపీలోకి వెళ్లాడు, అది అధికారంలోకి రాలేదు, మమత బ్యాటింగ్ మీద భయమేసింది… అక్కోయ్, నువ్వే దిక్కు అంటూ పోయి కాళ్ల మీద పడ్డాడు… ఎందుకు పార్టీ వదిలేసినట్టు..? మళ్లీ ఎందుకొచ్చినట్టు..? […]

అమ్మో… ఈ నుస్రత్ జహాన్ అసాధ్యురాలే… మనకు తెలియని కొత్త మొహం..!!

June 14, 2021 by M S R

suzette

మొన్న మనం ఒక సుదీర్ఘమైన కథ చదువుకున్నాం… తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి యవ్వారం… ఓ ధనిక వ్యాపారి నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుంది… ఏడాదిలో గొడవలు… దూరంగా ఉంటున్నారు… ఆయన గారు విడాకులకు అప్లయ్ చేస్తే, అసలు మాది పెళ్లే కాదుఫో అనేసింది… టర్కీలో పెళ్లి జరిగింది, అక్కడి చట్టాల ప్రకారం మా పెళ్లికి గుర్తింపు లేదు, ఇండియాలో పెళ్లిని రిజిష్టర్ చేసుకోలేదు కాబట్టి ఆ పెళ్లే జరగనట్టు లెక్క… జరగని పెళ్లికి విడాకులేంటి […]

మెగాస్టార్‌కు రాజ్యసభ సీటు..? జగన్ సానుకూలమేనా..? లెక్కల్లో ఫిట్టవుతాడా..?!

June 13, 2021 by M S R

cm chiru

ఏపీ నుంచి ఆదానీకి రాజ్యసభ సభ్యత్వం… జగన్ ఢిల్లీ పర్యటనలో ఇదీ ఓ కాన్పిడెన్షియల్ ఎజెండా ఐటమ్ అని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే కదా… నిజానికి మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం అనేదే ఇంకాస్త ముఖ్యమైన చర్చనీయాంశం… స్థూలంగా, హఠాత్తుగా వింటే నమ్మబుల్ అనిపించదు కానీ… వైసీపీ ముఖ్యుల్లో తరచూ చర్చకు వస్తున్న పేరే ఇది… అయితే జగన్ లెక్కల్లో చిరంజీవి ఎలా ఫిట్ అవుతాడో, జగన్ ఏం ఆలోచిస్తున్నాడో బయటికి ఎవరికీ తెలియదు, […]

భేష్..! ఒక్కసారి ఈ కరోనా ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లను చూడండి..!

June 10, 2021 by M S R

covid jcb

నిజమే… దేశమంతా వినిపిస్తున్న విమర్శ నిజమే… మెయిన్ స్ట్రీమ్ మీడియా.., పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు… కరోనా మీద ప్రజలను బెంబేలెత్తించేవి, ధైర్యాన్ని చంపేసేవి, ఆందోళనకు గురిచేసేవి, అబద్ధాలతో హోరెత్తించే భీకరమైన వార్తలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది… నెగెటివిటీని వ్యాప్తి చేస్తోంది… కానీ పాజిటివిటీని పెంచే వార్తల్ని ఇగ్నోర్ చేస్తోంది… చిన్న చిన్న అంశాలు కూడా కొన్నిసార్లు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయి… ఆశను కలిగిస్తాయి… వ్యవస్థ మీద, సమాజం మీద, భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచుతాయి… ఉదాహరణకు ఒక […]

టైం బాసూ టైం… హఠాత్తుగా పాములు మింగేస్తయ్… నిచ్చెనలు పైకి లేపుతయ్…

June 8, 2021 by M S R

setupati

ఈరోజు నేను మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను, ఇక నాకేముంది అని ఎవరైనా అనుకుంటే, దానంత వెర్రి భ్రమ మరొకటి ఉండదు…. అయ్యో, నేనిలాగే దిక్కుమాలిన పొజిషన్‌లోనే ఉండిపోవాలా అని ఎవరైనా నిరాశలోనే ఉంటే, దానంత పిచ్చితనం కూడా మరొకటి ఉండదు… డెస్టినీ నిర్ణయిస్తుంది… అనగా ప్రాప్తం..! ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం చాలా వేగంగా మనం చూస్తూనే ఉంటాం… కొందరి జాతకచక్రాలు గిర్రున తిరుగుతూ ఉంటయ్… పరమపదసోపానపటంలో హఠాత్తుగా […]

చెవిరెడ్డికి చప్పట్లు..! ఆనందయ్య మందుపై క్షుద్రరాజకీయాల్ని దాటిన జనకోణం..!

June 7, 2021 by M S R

chevireddy2

ఒక్కసారి రాజకీయాలు ఎంటరయ్యాక… అది ఏ అంశమైనా సరే, భ్రష్టుపట్టాల్సిందే… ఆనందయ్య మందు ఓ లెక్కా..?! హాయిగా నడుస్తున్న మందు పంపిణీని ఎవరో చెప్పినట్టు కలెక్టర్ ఆపివేయించాడు… ఈరోజుకూ మళ్లీ చక్కబడలేదు… ఈలోపు కొన్ని లక్షల మందికి మందు అందేది కదా… అధికార యంత్రాంగం కాస్త బుర్ర పెట్టి పనిచేయకపోతే జరిగే అనర్థాల్లో ఇదీ ఒకటి… దీనికితోడు పాలిటిక్స్… టీడీపీ నాయకుడు సోమిరెడ్డి ఆనందయ్యకు మద్దతుగా నిలిచాడు, సరే, అందులో మళ్లీ రాజకీయ లబ్ధి చూసుకునే ప్రయత్నాలు, […]

హనుమ జన్మస్థలి రచ్చలోకి బ్రహ్మి..! ఏబీఎన్ చర్చలో మరీ కామెడీ వాదన..!!

June 5, 2021 by M S R

brahmi

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ అకశేరుక ప్రపంచం… అంటే వెన్నెముకల్లేని జీవజాతులు కొన్ని వంగుతూ, పాకుతూ నడుస్తుంటాయి… తప్పదు… వెన్నెముక ఉన్నట్టు గానీ, విద్యత్తు ఉన్నట్టు గానీ, జోకుడు జ్ఞానం తప్ప ఇంకేమైనా జ్ఞానమున్నట్టు గానీ పసిగడితే సినిమా పెద్దలు మెడలు విరిచేస్తారు… ఇక స్త్రీలయితే తాము రక్తమాంసాలున్న ప్రాణులమని కూడా మరిచిపోవాల్సిందే… ఈ స్థితికి అలవాటుపడ్డవాడే ఉంటాడు… ఏళ్ల తరబడీ స్టార్ కమెడియన్‌గా వెలిగిన బ్రహ్మానందానికి ఈ విషయం తెలుసు… తను స్వతహాగా కాస్త […]

ఎంత బాపు అయితేనేం… రాజాధిరాజు నిర్మొహమాటంగా ఉల్టా తన్నేసింది…

June 4, 2021 by M S R

bapu

Bharadwaja Rangavajhala……..   మార్క్సీయ వాక్యం … శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి. అదే వాక్యం కొంచెం కామెడీ గా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని … ముళ్లపూడి వెంకట్రమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ … ఆయన తన సినిమాల్లో రాజకీయాలు బానే రాశారు … మన ఊరి పాండవులు చిత్రంలో ఆయన […]

The Journalist..! మిత్రులు ఓ యజ్ఞమే చేశారు… కానీ కరోనాయే గెలిచింది…

June 4, 2021 by M S R

ysr

మనం పలుసార్లు చెప్పుకున్నట్టు… ఓ టైం వస్తుంది… అదంతే, తరుముకుంటూ వస్తుంది… అది యమపాశం… దానికి అడ్డు ఉండదు… మెడకు పడి బిగుసుకుంటుంది… ఊపిరి ఆగిపోతుంది… అది డెస్టినీ…. వైఎస్ఆర్… అనగా వై.శ్రీనివాసరావు అనే ఓ జర్నలిస్టు… హైదరాబాదులో తనను ప్రేమించని జర్నలిస్టు లేడు… భిన్న సిద్ధాంతరాద్ధాంత వర్గాలకు అతీతంగా అందరికీ ఇష్టుడు… జర్నలిస్టు అంటే అదుగో ఆయన అని చెప్పుకునే టైపు… ఆస్ట్రాలజీ, అస్ట్రానమీ మాత్రమే కాదు, మనుషుల్ని చదివాడు… ఆజన్మ బ్రహ్మచారి… జిజ్ఞాసపరుడు… వృత్తిలో […]

జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను పీవీ పరపరా నమిలేశాడు..!

June 3, 2021 by M S R

pv

అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ… తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు ఓ […]

ఇంద్రచాపం… వరదగుడి… సింగిడి… సన్ హాలో… నెటిజనమంతా ఫోటోగ్రాఫర్లే…

June 2, 2021 by M S R

siun halo2

ఒక్కసారిగా హడావుడి… హైదరాబాద్ నెటిజనమంతా స్మార్ట్ ఫోన్లలో, కెమెరాల్లో ఈ సీన్లను బంధించడానికి పోటీలు పడ్డారు… అరుదైన దృశ్యాల్ని చూస్తూ సంబరపడిపోయారు… వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ షేర్లు, ఇన్‌స్టా పోస్టులు మొత్తం ఇవే ఫోటోలతో నిండిపోతున్నయ్… కొందరికి ఇదేమిటో తెలుసు, కొందరికి తెలియదు… మొత్తానికి ఓ చర్చ… ఇళ్ల నుంచి బయటికి వచ్చి అనువైన కోణాలు వెతికి ఫోటోలు తీయడంలో బిజీ అయిపోయారు చాలామంది… నిజానికి ఏమిటిది..? ఇదొక వింత కాదు, విడ్డూరం కాదు… ఒక […]

‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…

June 2, 2021 by M S R

love story

ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్‌ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్‌ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్‌… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ యువతి […]

  • « Previous Page
  • 1
  • …
  • 124
  • 125
  • 126

Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions