తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ.. వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు సైట్ ఓపెన్ చేసి స్పెషల్ ఎంట్రీ పేజి క్లిక్ చేసి, మనకు కావాల్సిన రోజులో కావాల్సిన టైము స్లాట్ సెలెక్ట్ చేసుకు,ని ఆధార్ డీటైల్స్ ఇస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి […]
ఇంకెన్ని ప్రాణాల్ని మింగుతాయో ఈ కార్పొరేట్ అనకొండలు..!!
ఉత్త ముచ్చట్లు — విద్యా వ్యాపారంలో రాలిపోతున్న “Thar e zameen par” ————————— పిల్లలకు ఏం కావాలో… పిల్లలు ఏం కావాలో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు పోటీ ప్రపంచంలో ఇతర పిల్లలతో పోల్చుతూ వారి జీవితాన్ని ఆగం చేస్తారు. ఎవరి పిల్లలో ఏవో ర్యాంకులు సాధించారని నమ్ముతూ… అదే కాలేజీలో తమ పిల్లల్ని చేర్పిస్తే… జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తారు. కానీ… కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు… పిల్లల జీవితాల్ని అగమ్యగోచరం చేస్తాయి. ఆఖరికి […]
యండమూరి ఇష్టపడటమే గొప్ప… పైగా పరిచయ ప్రచారం మరీ అరుదు…
యండమూరి ఏది చేసినా కాస్త డిఫరెంటు… ఓ కథల సంపుటి అందింది తనకు… ముందుమాట రాయాలి, రాయాలంటే చదవాలి… కొత్త రచయిత… ఏదో నిర్లిప్తతతో చదవడం స్టార్ట్ చేసి, అదే బిగితో చదివేశాను అంటున్నాడు ఆయన… దాన్ని తన ఫేస్బుక్ వాల్ మీద పరిచయం చేశాడు… అఫ్కోర్స్, రచయిత కూడా తనలాగే సీఏ చేశాడు కాబట్టేమో… పైగా ఆ రచయితపై తన రచనల ప్రభావం బాగా ఉందని గమనించిన ప్రేమ కాబట్టేమో… కానీ ముందుమాట రాయడమే కాదు, […]
కళాక్షరిక… ఇంట్రస్టింగ్ ప్రయోగం… మన లిపికి ఇంకొన్నాళ్లు ఆయుష్షు…
తెలుగు అక్షరాలు సులభంగా నేర్చుకోవడానికి- ‘కళాక్షరిక’ దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది […]
బురద వార్తల నడుమ ఈ ఆఫ్‌బీట్ స్టోరీ బాగుంది… బట్, సరిపోలేదు..!!
సాక్షి ఫస్ట్ పేజీలో… (హైదరాబాద్ ఎడిషన్‌లో…) డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు హైదరాబాద్ ఎలా డెస్టినేషన్‌గా మారుతుందో ఓ వార్త కనిపించింది… ఆహ్లాదంగా అనిపించింది… తెల్లారిలేస్తే రాజకీయ బురద తప్ప మరేమీ కనిపించని పత్రికల ఫస్ట్ పేజీలో… వాడిని వీడిలా తిట్టాడు, వీడిని వాడలా తిట్టాడు బాపతు చెత్తా వార్తలే ప్రధాన పాత్రికేయంగా మారిపోయిన దుర్దినాల్లో… ఓ ఆఫ్ బీట్ వార్త ఫస్ట్ పేజీలో (అఫ్కోర్స్, ఈమధ్య స్లీవ్‌లెస్ జాకెట్ బాపతు నిలువు సగం పేజీలు వేస్తున్నారు కదా, అందులో…) […]
అబ్బే… ఇది ‘ఛాంపియన్’ తరహా రచన అస్సలు కాదు గురూ…!
నిన్నటి ఇండియా – బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ మీద ‘ఈనాడు’ ఓ వార్త పబ్లిష్ చేసింది… హార్ధిక్ పాండ్యా మీద కథనం… గేలి చేసినోళ్లే… అని శీర్షిక… నిజంగానే పాండ్యా ఫామ్ కోల్పోయాక ఈమధ్య మళ్లీ గాడిలో పడ్డ తీరును, తన ఫెయిల్యూర్లను సమప్ చేసి రాశారు, బాగుంది… అందులో ఈ మ్యాచ్‌లో పాండ్యా అర్ధశతకం గురించి కూడా ప్రస్తావించారు… పైన ఇచ్చిన మెయిన్ వార్తలో స్కోర్ కార్డులో కూడా పాండ్యా 50 పరుగులు చేసినట్టు […]
చివరకు యోగాను కూడా యాంటీ- మోడీ కళ్లతోనే చూస్తున్నారు..!
ఒక లేడీ ఫోటో… ఆమె టీ షర్టుపై ఇంగ్లిషులో రాసి ఉంది… యోగాకన్నా సంభోగం బెటర్ అని అర్థం… పోనీ, ఆమె అభిరుచి, ఆసక్తి అదే అయితే ఆచరించనీ, అనుసరించనీ… మధ్యలో యోగాను ఎందుకు లాగడం… చిల్లరతనం కాకపోతే… ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థుల్లో ఇలాంటి పోకడలు ఎక్కువ గమనిస్తుంటాం… ఆ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయడానికి మనస్కరించడం లేదు… చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంది… యోగా కూడా బీజేపీ ఎజెండా అని… మోడీ దాన్ని పాపులర్ చేసేసరికి […]
CM చంద్రబాబులో ఈ కొత్త మార్పు గమనించారా ఎవరైనా..?!
చంద్రబాబు కొత్త అలవాటు రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాడీ లాంగ్వేజ్..మేనరిజమ్స్ ఒకలా ఉంటే పూర్తిగా కాకపోయినా ఇంచుమించుగా వైఎస్ జగన్ బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది ముఖ్యంగా నవ్వటంలో ఇక ఎన్టీఆర్ స్టైల్ ఒకరకంగా ఉంటే చంద్రబాబు స్టైల్ ఇంకో రకంగా ఉంటుంది ఎన్టీఆర్ జనంలోకి వెళ్ళినప్పుడు నవ్వుతూ కలిసిపోతే చంద్రబాబు మాత్రం గంభీరంగా పెద్దరికంగా ఉంటారు నవ్వటం కూడా అరుదే చూసేవాళ్లలో చంద్రబాబులో ఏదో తెలియని హుందా తనం […]
Beerocracy… మాకిష్టమైన ఆ బీర్లే మాక్కావాలి… అవి మా హక్కు..!!
చీప్ లిక్కర్ మాకొద్దు! మాకిష్టమైన మందే మాక్కావాలి! తాగడం, తాగుడు, తాగుబోతు లాంటి మాటల వ్యుత్పత్తి ప్రకారం చూస్తే అందులో నిందార్థం, నీచార్థం ఉండనే ఉండదు. నీళ్లయినా, మద్యమయినా తాగాల్సిందే. కానీ నీళ్లను ఎవరూ పుచ్చుకోరు. నీళ్లను ఎవరూ కొట్టరు. అదే మద్యం అయితే పుచ్చుకుంటారు. ఆ మద్యం ముందుగా కొడతారు. బహుశా సీసా మూత తీయడానికి ముందు తట్టి, కొట్టి… ప్రారంభించడం వల్ల “మందు కొట్టడం” మాట పుట్టి ఉండాలి. కొన్ని వేల మందు పార్టీల్లో […]
రాళ్లేరుకోవడం కాదు… వేళ్లేరుకోవాలి, కప్పలేరుకోవాలి, పాములేరుకోవాలి…
ఐస్ క్రీమ్ లో తెగిన వేలు; అన్నంలో ఎగిరే కప్ప 1. ఫుడ్ డెలివరీ యాప్ లో ఐస్ క్రీమ్ కు ఆర్డర్ ఇస్తే- ఐస్ క్రీమ్ తో పాటు తెగిన వేలు టాపప్ గా ఫ్రీగా వచ్చింది. 2. విమానంలో అందాల గగనసఖి (ఎయిర్ హోస్టెస్) ఇచ్చిన అన్నం పొట్లంలో చచ్చిన బొద్దింక వచ్చింది. 3. ఫుడ్ ప్యాకెట్లో బతికి ఉన్న కప్ప బెకబెకమంటూ బయటికొచ్చింది. 4. ఆమెజాన్ లో బొమ్మ ఆర్డర్ ఇస్తే-బొమ్మతోపాటు బుస్ […]
ఈ ఐఏఎస్ మన తెలుగువాడే… గట్టి పిండం… ముందుగా ఇదయితే చదవండి…
మైలవరపు కృష్ణతేజ… ఐఏఎస్… ఇది నాలుగేళ్ల క్రితం వార్త… ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతటా… కాదు, ప్రపంచ స్థాయి సంస్థలు సైతం అభినందనలు చెప్పేంతగా మారుమోగిపోయింది… ఎవరీయన..? ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడే… కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్… స్వస్థలం చిలకలూరిపేట… నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ (NEC) గుంటూరులో బీటెక్ పూర్తి చేసాడు… 2009లో… తరువాత ఐఏఎస్ మీద కన్నుపడింది… అప్పటికే సోదరుడు నరేంద్రనాథ్ ఐఎఫ్ఎస్ అధికారి, కానీ సివిల్స్ అంత ఈజీ టాస్క్ కాదు కదా… చాలా ఫోకస్డ్గా చదవాలి… […]
SPERM DONATION – కొన్ని అపోహలు – కొన్ని నిజాలు…
గతంలో ఏమైనా వచ్చాయో, లేదో తెలియదు కానీ, 2012లో హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్’ సినిమా Sperm Donation గురించి విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇచ్చింది. ‘వీర్యదానం’ అనే అంశాన్ని సాధారణీకరించేలా చేసేందుకు చాలా ఉపయోగపడింది. ఆ సినిమాను ఆ తర్వాత ‘నరుడా డోనరుడా’ పేరిట తెలుగులో, ‘ధారాళ ప్రభు’ పేరిట తమిళంలో తీశారు. తెలుగులో ఫ్లాప్, తమిళంలో యావరేజ్‌గా ఆ సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ‘మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి’ […]
మెర్సీకిల్లింగ్..! అప్పట్లోనే యండమూరి ఆ సబ్జెక్టు టచ్ చేశాడు…!!
“ఎక్కడున్నావ్ రవీ, నువ్వు?” “ఎందుకు?” “నేను వస్తున్నాను”. “ఇప్పుడా?” “అవును. ఇప్పుడే!” “వద్దు, వద్దు” అన్నాడతడు. “అదేమిటి రవీ?” అతడు సమాధానం చెప్పటానికి తటపటాయించాడు. ఆమెని కూడా ప్రమాదంలోకి లాగటం అతడికి ఇష్టంలేదు. అయినా ముఖ్య కారణం అదికాదు. ఈ ఊరు, ఈ దేశం, ఈ మనుష్యులు అన్నీ వదిలేస్తూ అతడు దూరంగా వెళ్ళిపోవటానికి తయారవుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆమెను చూడటం అతడికి ఇష్టంలేదు. “మనం ఇంతవరకూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నాకు మీ పేరు కూడా […]
ప్రపంచంలో అత్యధికులు కోట్ చేసే పదిమందిలో ఆయనొకడు…
THE GREAT CHOMSKY EFFECT ……………………………………………….. 1988 – 89 లో హైదరాబాద్ లో నోమ్ చొంస్కీని ఆర్టిస్ట్ మోహన్ కలిసిన తర్వాత రాసిన వ్యాసం ………………………………………………….. 95 ఏళ్ల చొంస్కీ చనిపోయారన్న వార్త వొట్టి పుకారు మాత్రమేనని ఆయన భార్య చెప్పారు …………………………………………………… ప్లేటో,అరిస్టాటిల్, మార్క్స్,ఐన్ స్టీన్ ఇలాటి పేర్లు చిన్నప్పట్నుంచి వద్దన్నా వింటుంటాం. నోమ్ ఛోమ్-స్కీ పేరు మాత్రం మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత వినిపించింది. మా పొలిటికల్ క్లాసుల ప్రిన్సిపాల్ మోహిత్ సేన్ […]
పింక్ మీటీ రైస్..! ఈ హైబ్రీడ్ అన్నం తింటే మటన్ బిర్యానీ తిన్నట్టే…!!
ఒక వార్త కనిపించింది… దక్షిణ కొరియా మాంసపు బియ్యం తయారు చేసిందట… అంటే హైబ్రీడ్, జెనెటికల్లీ మోడిఫైడ్, టెక్నికల్లీ ఇంజినీర్డ్ అని ఏ పేరయినా పెట్టుకొండి… ఈ బియ్యం స్పెషాలిటీ ఏమిటిట అంటే..? ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన బీఫ్ మాంస కణాన్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి, సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించారన్నమాట… దాంతో ఉపయోగం ఏమిటీ అంటే..? సాధారణ బియ్యంలోకన్నా 8 శాతం అధిక ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు ఉంటాయట… మీటీ రైస్ […]
మరణించిన ఓ మనిషి… వచ్చిన యమదూత… ఓ సూట్‌కేసు కథ…
ఓ మనిషి మరణించాడు… యమదూత వచ్చాడు తీసుకుపోవడానికి… యమదూత దగ్గరకు వచ్చేకొద్దీ తన చేతిలో ఓ సూట్‌కేసు ఉండటాన్ని మనిషి గమనించాడు… . ఇద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది కాసేపు… . యమదూత :: నీ సమయం ముగిసింది, పద, ఇక బయల్దేరుదాం… మనిషి :: ఇంత త్వరగానా..? నా జీవితానికి సంబంధించి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు… అవన్నీ కుదరవు వత్సా, పద, టైమయింది… అది సరే, నీ సూట్‌కేసులో ఏమున్నాయి స్వామీ…? […]
సెలబ్రిటీ పెళ్లిళ్లు అంటే… మన హైదరాబాదీ ఫోటోగ్రాఫరే మస్ట్…
అంబానీ, అదానీ.. ఎవరింట్లో పెళ్లైనా.. ఫోటోగ్రాఫర్ మాత్రం మన హైదరాబాదీనే! ఆ ఫోటోగ్రాఫర్ ఖర్చు ఒక్కరోజుకు లక్షా 25 వేల నుంచి 1 లక్షా 50 వేల మధ్యనుంటుంది. ఐతే, ఆ ఫోటోగ్రాఫర్ మన తెలుగోడు. హైదరాబాద్ వాసి. మరెందుకతనికి అంత డిమాండ్…? ఎవరా ఫోటోగ్రాఫర్…? ఆయా రంగాల్లో వారి ప్రతిభను కనబరుస్తూ… ఇవాళ సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీలుగా మారిపోయిన ఎందరివో అందమైన ఫోటోల వెనుక ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ రాధిక్. ఇప్పుడెందుకితగాడి ప్రస్తావన అంటే… […]
మన దగ్గర లస్కుటపా హీరోలు సైతం కోట్లకుకోట్లు తీసుకుంటారు…
5 సంవత్సరాల క్రితం కొత్త కారు కొని, మూడు నెలల తర్వాత సర్వీసింగ్ కి ఇచ్చి సర్వీసింగ్ అయ్యాక తీసుకొని బయటికి రాగానే, డ్యాష్ బోర్డ్ మీద లైట్లు అన్నీ వెలుగుతున్నై (కార్ లో అన్నీ రాంగ్ గా ఉన్నై అని చూపిస్తుంది). వెంటనే వెళ్ళి సర్వీసింగ్ పిలగాడిని అడిగితే, సారీ అన్నా, నేను అన్నం కూడా తినలేదు. రోజంతా 100 కార్ల కి పైగా సర్వీసింగ్ చేయాలి, ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. నిజానికి అతను […]
ఆ ఆదివార చషకంలో పక్కా చీప్ లిక్కర్ అనువాద గీతాలు…
ఈ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆ హిందీ సినిమా పాటల కాలం ఏమిటండీ బాబు? ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ, కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ… చెల్లని రూపాయికే గీతలెక్కువ… … అన్నట్టు, ఏమీ తెలియనివాడికే అందరికీ అన్నీ నేర్పించాలని వుంటుందట.. వాడికి వేదికనిచ్చేది ఇంకా ఏమీ తెలియనివాళ్ళట! ఎంత చూడకూడదనుకున్నా ఎవరో ఒకరు చూపిస్తారు.. చూసిన తరువాత ఎంత వద్దనుకున్నా తిట్టకుండా వుండలేను.. పోనీ తిడితే వాళ్ళు పద్ధతి […]
హవ్వ… వేణుస్వామి పబ్బులో కనిపించాడట… ఇంకేం, లోకవినాశనమే…
ఆశ్చర్యమేసింది… అదేదో హెలో పబ్బులో వేణుస్వామి దొరికిపోయాడట… ఇంకేముంది..? ఇంత అన్యాయమా..? అయిపోయింది, లోకం నాశనమే… ఇంత ఛండాలమా..,? ఏమిటీ దరిద్రం..? అన్నట్టుగా ఎడాపెడా పోస్టులు, ట్వీటులు… విమర్శలు, కారెడ్డాలు (వ్యంగ్యాలు)… నిజానికి చాన్నాళ్లుగా వేణుస్వామి వ్యవహారశైలిని గమనిస్తున్న నాకు అధికాశ్చర్యం ఇది… ఈమధ్య టీడీపీ బ్యాచ్‌కు తను టార్గెటయ్యాడు ప్రముఖంగా… ఎందుకంటే, తను జగన్ మళ్లీ గెలుస్తాడని జోస్యం చెప్పడమే… అవును, అది తప్పే, ఇకపై ఏ సెలబ్రిటీకి జోస్యం చెప్పబోను, నా విద్య అనుమతించిన, […]
- « Previous Page
- 1
- …
- 20
- 21
- 22
- 23
- 24
- …
- 108
- Next Page »