Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బంగ్లాదేశ్‌పై చైనా డెట్ ట్రాప్… షరతులు అంగీకరించని షేక్ హసీనా…

August 8, 2024 by M S R

bangla

షేక్ హసీనా జులై 10 న చైనా పర్యటనకు వెళ్ళింది! ఆ పర్యటన మూడు రోజులుగా ముందే షెడ్యూల్ ప్రకటించారు! చైనా అద్యక్షుడు జీ జింగ్ పింగ్ తో పాటు లీ కీయాంగ్ తో కూడా సమావేశం అయ్యారు! రెండు దేశాలు మొత్తం 21 ఒప్పందాల మీద సంతకం చేశాయి! మరో రెండు MoU లని రెన్యువల్ చేసింది! అయితే షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అప్పు కోసమే చైనా పర్యటనకి వెళ్ళింది! చర్చలలో అప్పు […]

ఒకే ఒక్కడు… సుప్రీం చీఫ్ జస్టిస్… గొడుగుపాలుడు… ఒక్క రోజు కుర్చీ..!!

August 8, 2024 by M S R

godugupaludu

శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఛత్రం (గొడుగు) పట్టుకుని ఉండేవాడే గొడుగుపాలుడు (పేరు భూమా నాయుడు). శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజూ పంపా విరూపాక్షస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం రివాజు. ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారి దర్శనానికి తన వేసవి విడిది పెనుగొండ నుండి తన రాజధాని హంపీకి బయలుదేరవలసి వచ్చింది. సమయం తక్కువ ఉండటంతో తన గుర్రమెక్కి అతి వేగంగా హంపీ వైపు బయలుదేరారు. రాజు ఎక్కడికి వెళితే ఛత్రం పట్టేవారు కూడా వెళ్లాలి కాబట్టి గొడుగుపాలుడు […]

తక్కువ బరువు కేటగిరీలో పోటీపడుతున్నప్పుడు… అప్రమత్తంగా ఉండాలి కదా…

August 7, 2024 by M S R

phogat

మిత్రుడు జగన్నాథ్ గౌడ్ చెబుతున్నట్టు…. వినేష్ ఫోగాట్ మొదటి అంతర్జాతీయ ప్రపంచ పోటీ న్యూ ఢిల్లీ లో 2020 సంవత్సరంలో ఆసియన్ రెస్లర్ పోటీలో 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు. చివరి అంతర్జాతీయ పోటీ 2022 లో ప్రపంచ రెస్లర్ పోటీల్లో కూడా 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం 53 కాకుండా 50 కేజీల విభాగంలో పాల్గొని చివరికి పోటీ రోజు బుధవారం బరువు చూసినప్పుడు 50 కేజీల కంటే ఎక్కువ ఉండటం వలన […]

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా..? నెవ్వర్, అసలు ప్లాన్ అది కాకపోవచ్చు..!!

August 7, 2024 by M S R

brs

ఇటీవలి రాజకీయ పరిణామాలలో BRS (రాజ్యసభ) నుండి పార్లమెంటు సభ్యులు (MPలు) భారతీయ జనతా పార్టీ (BJP)లో విలీనం కాబోతున్నారని ఢిల్లీ రాజకీయ సర్కిల్‌లోని ఉన్నత స్థాయి వర్గాలు సూచిస్తున్నాయి… రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనలో భాగమే ఈ చర్య అట… రాజ్యసభలో అవసరమైన సంఖ్యలో సీట్ల కొరతను ఎదుర్కొంటున్న బిజెపి, “ఆపరేషన్ కమలం” అని వ్యవహారికంగా పిలవబడే ఆపరేషన్ మళ్లీ ప్రారంభించింది… ఇతర పార్టీల నుండి ఎన్నికైన సభ్యులను బిజెపిలో చేరేలా ఆకర్షించడం ఈ […]

సో వాట్…? కలెక్టర్ ఆటవిడుపు ఫోటోలకు ఈనాడు మెయిన్ పేజీ ఇంపార్టెన్సా..?!

August 6, 2024 by M S R

collector

ఒక వార్త… అదీ ది గ్రేట్ ఈనాడులో.,. పొలం బాటలో కలెక్టర్ దంపతులు అని శీర్షిక… పొలం బాట అనేది సర్కారీ ప్రోగ్రాం పేరు కాదులెండి… నిత్యం సమీక్షలు, క్షేత్ర పర్యటనలో తీరిక లేకుండా విధులు నిర్వహించే కలెక్టర్ ఆదివారం పూట ఆటవిడుపుగా పొలం బాటపట్టారు… అనేది వార్త సారాంశం… నిజానికి అది ఓ ఫోటో వార్త… అంటే రైటప్‌కు ఎక్కువ, వార్తకు తక్కువ… సదరు కలెక్టర్ మెదక్ జిల్లాకు కలెక్టర్, పేరు రాహుల్ రాజ్… ఆయన […]

ఆటోఫాగీ..! ఉపవాసం ఆరోగ్యానికి ఎందుకు మంచిదో చెప్పే శాస్త్రీయ పదం..!

August 5, 2024 by M S R

autophagy

దాదాపు అన్ని మతాల్లోనూ దేవుడి పేరిట ఉపవాసం చేస్తారు. అయితే, ఈ ఉపవాసాల వెనుక ఉన్న సైన్స్ ని 2016 వరకు ఎవరూ శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. ఉపవాసం యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యతను గుర్తించడం చాలా ఆలస్యంగా జరిగింది. 2016 ముందు వరకు, ఎందుకూ పనికిరాని ఉపవాసాలు ఎందుకు? దేవుడు లేడు, గీవుడు లేడు. ఛస్ ఉపవాసం ఒక చెత్త, పరమ రోత, ఎందుకూ పనికిరాని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. ఉపవాసం ఒక మూర్ఖత్వం, అది ఒక […]

సిట్యుయేషన్‌షిప్… బెంచింగ్… కఫింగ్… హాహాశ్చర్యపోకండి, చదవండి…

August 4, 2024 by M S R

situationship

మిత్రుడు మంగళంపల్లి శ్రీహరి పోస్టు ఓసారి సావధానంగా చదవండి… అమ్మా కూతురు కల్యాణి సౌజీ స్నేహితుల్లా ఉంటారు… బెంగళూరులో జాబ్ లో జాయిన్ అయ్యాక మూన్నెల్లకి గానీ రావడం కుదరలేదు సౌజీకి… మొదటి వారం రోజూ ఫోన్ మాట్లాడుకున్నా… షిఫ్టులు సరిగా ఉండకపోవడం… ఎక్కువ టైం వర్క్ ఉండడం వల్ల ఫోన్ కూడా కుదరలేదు…. ఇద్దరికీ… ఈ వారం రోజులు అన్నీ చెప్పేసుకోవాలి… కూతురుకిష్టమైనవన్నీ చేసి పెట్టాలి… రాత్రి తిన్నాక ఇద్దరూ రూఫ్ గార్డెన్ లో కూర్చున్నారు… […]

అమ్మతనపు స్పూర్తి..! వయనాడు వార్తల్లో వెంటనే కనెక్టయిన ఓ వార్త…

August 4, 2024 by M S R

mother

వయనాడు కొండచరియలు విరిగిపడిన విపత్తు వేళ సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ బాసటగా నిలబడింది… గుడ్ ఊరుఊరంతా కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం నిక్షేపంగా ఉంది… ఆ ఇంటాయన వేరే ఊరికి వెళ్లడం వల్ల బతికిపోయాడు, తిరిగి వచ్చి చూసేసరికి తనవాళ్లెవరూ లేరు, గల్లంతు… బతికిన ఆనందమా, అందరినీ కోల్పోయిన విషాదమా… ఓ వార్త… ఓ స్కూల్ పిల్ల అచ్చం ఇదే విపత్తును సూచిస్తూ వారం క్రితమే తమ స్కూల్ మ్యాగజైన్‌కు ఓ కథ రాసింది… ఇప్పుడు ఆ […]

ప్రపంచంలో జర్నలిస్టు అనేవాడు మారడు.., కడుపు చించుకున్నా వాడంతే…

August 4, 2024 by M S R

mall bags

  అరవై నాలుగు కళల్లో చోర కళ ఒకటి అంటే ఏమో అనుకున్నాం. ఇందులో పొట్ట నింపుకోవడానికి చేసేవి (అదే వృత్తిగా బతికేవారు), జల్సాలకు అలవాటుపడి చేతివాటం చూపేవాళ్ళు, సరదాగా చేతి దురద కొద్దీ చేసేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పొతే అంతూ పొంతూ ఉండదు. జనం జీవన శైలి, అలవాట్లు, అభిరుచులు మారుతున్నట్టే దొంగల అవసరాలు కూడా మారుతున్నాయి. కాదేది చోరీకి అనర్హం అన్నట్టు చేతికి అందిన వస్తువుని, కంటికి నదురుగా కనిపించినవి నొక్కేస్తున్నారు. ఇటీవల ఓ […]

కర్కడక వావు… వావు బాలి… ఓ సామూహిక పితృతర్పణాల సందడి…

August 4, 2024 by M S R

vavu bali

ఓ మిత్రుడు తన పదిహేను రోజుల నార్త్ స్పిరిట్యుయల్ టూర్ విశేషాలు చెబుతూ… కాశి, ఉజ్జయిని, అయోధ్య, ప్రయాగ, గయ, బృందావనం తదితర ప్లేసుల గురించి వివరిస్తున్నాడు… అయోధ్య, బృందావనం కట్టడాలు భక్తికే గాకుండా ఆ ఆర్కిటెక్చర్, ఆ వాతావరణం పర్యాటకులకు అబ్బురం… మరి కాశి, ప్రయాగ, గయ..? దర్శనాలకే కాదు… నదీస్నానాలకు, అంతకుమించి పితృకర్మలకు ప్రాముఖ్యం… తమ పూర్వీకులకు అక్కడే పిండతర్పణం చేసిరావడానికి భక్తజనం ప్రాధాన్యమిస్తారు… హిందూ మతస్తులకు ఇవి పితృకర్మల కోణంలో ముఖ్య సందర్శనీయ […]

మరక మంచిదే… మురికీ మంచిదే… అనుకోకుంటే ఇక ఉండలేం…

August 4, 2024 by M S R

mud life

  ఒక్క మాటలో చెప్పాలంటే “మరక మంచిదే” అన్నట్లు “మురికి మంచిదే” అనుకోవడం తప్ప మా కాలనీ చేయగలిగింది లేదు. రోజులో అన్ని వేళల్లో, సంవత్సరంలో అన్ని రుతువుల్లో అలా రోడ్లమీద మురుగు నీరు పొంగి ప్రవహించడానికి వీలుగా ప్రణాళిక రచించిన టౌన్ ప్లానింగ్ వారి అమేయ, అమోఘ, అనితరసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భావితరాలకు ఒక పాఠం. నగర నిర్మాణ, నిర్వహణకు ఒక గుణపాఠం. జాతకాలు చెప్పేవారిమీద ఒక ఫేమస్ జోక్ ప్రచారంలో ఉన్నా…అందులో ఎంతో గాంభీర్యం, […]

ఈ అయిదు రకాల ఫ్రెండ్స్‌లో నిఖార్సయిన ఫ్రెండ్‌షిప్ ఎవరిది..?

August 4, 2024 by M S R

friends

ఒక రోమన్ తత్వవేత్త ప్రకారం స్నేహితులు 5 రకాలు 1. బెస్ట్ ఫ్రెండ్స్: ప్రతి మనిషికి 1- 2 ఉంటారు. ఈ స్నేహం ఎందుకు ఏర్పడుతుందో, ఎలా ఏర్పడుతుందో తెలియదు కానీ ప్రతి మనిషి జీవితం లో ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మన జీవితం అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నా, పరిస్థితులు బాగా లేని స్థితిలో ఉన్నా ఈ స్నేహంలో మార్పు ఉండదు. ఇద్దరికి మించి ఏ ఒక్కరికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. మనకు ఉన్న […]

అసలు పేరు యామినీ పూర్ణ తిలక… ఇంతకీ ఏమిటీ ఆమె గొప్పదనం…

August 3, 2024 by M S R

yamini

84 వ ఏట న్యూఢిల్లీలో అస్తమయం … నా నాట్యంతోనే పండుగలు సందడి చేస్తాయి (డా. పురాణపండ వైజయంతి) హస్తినాపురిలో జాతీయ పండుగలకైనా, తెలుగువారి పండుగలకైనా… ఆమె చిరు మువ్వల సవ్వడి చేయాల్సిందే… ఆమె అడుగులు నెమలికి నాట్యం నేర్పాయి… ఆమె జతులు లేళ్లకు గెంతులు నేర్పాయి… ఆ వయ్యారాలు నదులకు పరుగులు నేర్పాయి… ఆ కళ్లు నాట్యాన్ని పలికాయి… ఆ పెదవులు కావ్యాలను ఒలికాయి… ఆమె కదిలితే మెరుపు తీగలు….. ఆమె కంటిలో విద్యుల్లతలు… ఆమె నర్తిస్తే మెరుపులు, ఉరుములు… ఆవిడ ముద్దుపేర్లు పేరు […]

శ్రీశ్రీ, రారా, చేరా… రెండు కాదు.., ఒకే అక్షరంతో జగత్ ప్రసిద్ధుడు… మో…!!

August 3, 2024 by M S R

mo

‘మో’ కవిత్వంతో బతికిన క్షణాలు… Magical, surreal and insane at times ——————————– శ్రీశ్రీ నుంచి రా.రా, చేరా దాకా రెండక్షరాలతో పాపులర్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నా ఒకే ఒక్క అక్షరంతో కవితాజగత్ ప్రసిద్ధుడైనవాడు మాత్రం ‘మో’ వొక్కడే! జీవితాంతమూ సర్రియలిస్టు మబ్బుల్ని పట్టుకు వేలాడి సప్తవర్ణ మాలికల సౌందర్యంతో కవితామ్ల వర్షమై కురిసిన వాడూ ఆయనొక్కడే! ఆశాభంగం చెందిన అక్షరాలనన్నిటినీ పోగుచేసి, వాటికి క్షోభనూ, కన్నీళ్లనూ జతజేసి… “అలా అని పెద్ద బాధా […]

చూడ చూడ ఈ మూర్ఖ భక్తుల పైత్యాలు వేరయా విశ్వదాభిరామా…

August 3, 2024 by M S R

aliens

అదసలే తమిళనాడు… నాస్తికత్వం, హేతువాదం గట్రా పార్టీల సిద్ధాంతాల్లో ఉంటాయి గొప్పగా… ఆస్తికత్వం, భక్తితత్వానికీ కొరతేమీ లేదు… ఎటొచ్చీ కొందరు మూర్ఖభక్తులుంటారు… దరిద్రులు… సినిమా తారలకు, హీరోలకు, రాజకీయ నాయకులకు గుళ్లు కట్టి పూజిస్తుంటారు దేవతలుగా… అదంతే… ఒకవైపు తెలివైన సమాజం, అదేసమయంలో మరోవైపు పూర్తి భిన్నమైన మూర్ఖ సమూహం… దేవుళ్లు, దేవతలు జాన్తానై కానీ… జయలలిత దూరంగా వెహికిల్‌లో వెళ్తుంటే ఉన్నచోటే సాష్టాంగ ప్రణామాలు చేసేంత పైత్యమూ అక్కడే… తాజాగా ఓ వీరభక్గుడు ఏకంగా ఓ […]

నగరాల్లో కోళ్లెక్కడివి… పొద్దున్నే కుక్కల కూతలే… ఎగబడి పంటి కోతలే…

August 3, 2024 by M S R

dogs

మా కాలనీలో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసాలు లేవు కాబట్టి…పూల పుప్పొడులమీద జుమ్ జుమ్మని వాలే తుమ్మెదల ఝుంకారాల్లేవు. వాలే కోయిలలు లేవు. పాడే కోయిలలు రావు. కొమ్మలకు చిలకపచ్చ చిగుళ్లు తొడిగే చిలుకలు రానే రావు. ఒకవేళ వచ్చినా పిలిచి పీట వేయడానికి చెట్టంత ఎదిగిన చెట్లు లేనే లేవు. కాబట్టి సూర్యుడు తూరుపు తెర చీల్చుకుని “దినకర మయూఖతంత్రుల పైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన… పలికిన […]

ఓహ్… బీర్ అలా పుట్టిందా..? ప్రపంచవ్యాప్తంగా అలా మత్తెక్కిస్తోందా..?!

August 2, 2024 by M S R

beer day

బీర్ అనేది ప్రపంచం లోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్‌ డ్రింక్స్‌లో ఒకటి.. మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు తెలుసా..? అసలు బీరుకు ఓ రంగును, రూపుని, రుచిని ఇచ్చింది, తెచ్చింది, అంతా మహిళలే నని మీకు తెలుసా..? ఈ రోజు అంతర్జాతీయ బీర్ డే సందర్భంగా బీరు పుట్టు పూర్వోత్తరాలు.. దాని చరిత్ర గురించి తెలుసుకుందాం..! సుమారు 7 వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు తయారీ ఆసక్తికరంగా ప్రారంభమైంది.. […]

రాహులయ్యా… రాజీవుడి మరణానికీ వయనాడ్ విపత్తుకూ లింకేమిటయ్యా…

August 2, 2024 by M S R

rahul

వయనాడ్‌ విషాదానికి, రాజీవ్‌ చావుకూ పోలిక ఉందా? మోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! …………………. ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ బాధితులను చూస్తే.. నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్న మాటలివి. ‘‘నా అన్నకు కలిగిన బాధే నన్నూ […]

ఆలీ మీమ్ ఎక్స్‌ప్రెషన్ గుర్తుంది కదా… అసలు ఎవడు మమ్మీ వీడు…

August 1, 2024 by M S R

dikec

మన తెలుగు మీమ్స్‌లో తరచూ కనిపించే ఓ ఎక్స్‌ప్రెషన్… కమెడియన్ ఆలీ ఓ విచిత్ర వేషంలో ‘అసలు ఎవడు మమ్మీ వీడు..?’ అని ఆశ్చర్యపోతూ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు… ఈసారి ఒలింపిక్స్‌లో షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ కొట్టిన తీరు చూస్తే అలాగే అనాలని అనిపిస్తుంది ఎవరికైనా… తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… […]

లేటవుతుందీ అంటే… ఇజ్రాయిల్ అటాక్ భీకరంగా ఉండబోతున్నదీ అని…

August 1, 2024 by M S R

israel

ఇజ్రాయెల్ తాను ఎంత శక్తిమంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది! ఇరాన్ హుతిల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకొని ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది యెమెన్ మీద! యెమెన్ లోని సముద్ర తీరం లో ఉన్న పోర్టు నగరం అల్ – హోదేయా ( Al – Hodeideh) ను నేల మట్టం చేసింది! ఆపరేషన్ యద్ అరుక ! ఇజ్రాయెల్ పెట్టిన పేరు! Yad Aruka అంటే Long Arm . ఆపరేషన్ యద్ అరుక […]

  • « Previous Page
  • 1
  • …
  • 70
  • 71
  • 72
  • 73
  • 74
  • …
  • 135
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions