మేం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం అని 2004 ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ప్రకటించగానే అంతా అవాక్కయ్యారు . విలేకరుల కన్నా ముందు టీడీపీ ముఖ్యనాయకులంతా బాబు నోటి నుంచి ఈ మాట విని ఆ మాట అంటున్నది బాబేనా ? అని ఆశ్చర్య పోయారు . ఎందుకంటే అంతకన్నా ముందు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచవద్దు అని ఉద్యమిస్తే కాల్పులు జరిపి ముగ్గురి మరణానికి కారణం అయ్యారు […]
ఫోఫోవమ్మా… నీకు జీతం పెంచేదేముంది..? ఆర్టిఫిషియల్ రీడర్ను పెట్టేస్తాం…
Artificial Anchor: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి? కె. మేధ గ్రాఫిక్ మేధ యానిమేషన్ మేధ యంత్ర మేధ భ్రమ డిజిటల్ బొమ్మ…ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని కృత్రిమ నామాలను సృష్టించి ఇవ్వగలదు. ఒరియా భాషలో వార్తలు చదివే ఒక కృత్రిమ యాంకరమ్మ “లీసా”ను ఒరియాలో ఆవిష్కరించగానే…తెలుగులో బిగ్ టీ వీ వారు అలానే కృత్రిమ మేధతో వార్తలు తనంతట తానే చదివే […]
చూస్తుండండి… అమెరికా ఉక్రెయిన్ను నడిసంద్రంలో వదిలేస్తుంది…
పార్ధసారధి పోట్లూరి ….. వాడుకొని వదిలేయడంలో అమెరికాని మించిన దేశం మరొకటిది ఉండదు. నిన్న లిథువేనియాలోని విల్నియస్ (Vilnius) నాటో దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. నాటో సభ్యత్యం లేకపోయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ని కూడా ఆహ్వానించారు.ఇంతవరకు బాగానే ఉంది. జెలెన్స్కీ తన భార్యతో వెళ్ళాడు విల్నియస్ కి. సమావేశం మొదట్లో జెలెన్స్కీ ని సాదరంగా ఆహ్వానించారు అందరూ! తరువాత జరిగింది మాత్రం కొంచెం ప్రత్యేకం! నాటో దేశాల అధ్యక్షులు కానీ ప్రధానులు కానీ జెలెన్స్కీ ని పట్టించుకోకుండా […]
రేణుకా చౌదరి టోపీలో పంకా… వైఎస్ఆర్కు తలపాగా… జర్నలిస్టు జ్ఞాపకాలు…
వైయస్ఆర్ కు తలపాగా – రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్… అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————- ‘‘ఎన్టీఆర్ వద్ద ఉన్నప్పుడు నేను ఎన్నో చూశాను . వైయస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పాను. ఇది సరైన సమయం కాదు, ఇప్పుడే పాదయాత్ర వద్దు . ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు .,,’’ – ఇది పర్వత నేని ఉపేంద్ర చెప్పిన మాట . మెదక్ […]
అందరూ పక్కకి తప్పుకోండి… వరవరరావు తన దారిన తానే పోతాడు…
Taadi Prakash………… చాలా ఏళ్ళ క్రితం….. మౌనం ఒక యుధ్ధ నేరం అంటూ వరవరరావు గారు రాసిన దీర్ఘ కవితకి ఆర్టిస్ట్ మోహన్ రాసిన ముందుమాట ఇది … వరవరరావు కవితల ఆంగ్ల అనువాద సంపుటి జూన్ 13 న హైదరాబాద్ లో ఆవిష్కరణ సందర్భంగా…. త్యాగం నిలుస్తుందా? దురాక్రమణ నిలుస్తుందా ? …… artist Mohan ఇరాక్ మన పత్రికల మొదటిపేజీల నుంచీ, ప్రత్యేక పేజీలనుంచీ మెల్లగా తప్పుకుని ఎక్కడో ఏడో పేజీలో మూడోకాలంలోకి సెటిల్ […]
గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప
History Repeats: కళ్లున్నందుకు చూసి తీరాల్సిన శిల్పం రామప్ప. తెలుగువారు అయినందుకు వెళ్లి తీరాల్సిన గుడి రామప్ప. చేతులున్నందుకు తాకి పరవశించాల్సిన శిల్పం రామప్ప. గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప. ప్రాణమున్న మనుషులకన్నా శిలలే నయమన్న శిల్పి సృష్టిని అర్థం చేసుకోవడానికి కలియతిరగాల్సిన గుడి రామప్ప. సూది మొన మోపినంత శిలను కూడా వదలకుండా ఒళ్లంతా కళ్లు చేసుకుని చూడాల్సిన శిల్ప సంపద రామప్ప. భూకంపాలను తట్టుకోవడానికి పునాదిలో పునాది లోతు […]
ఓ బయోపిక్ తీయదగ్గ అనుభవాల పుస్తకం – క్రీడాస్థలి…
అది 2018 చివర్న ఓరోజు పొద్దున్నే 6.15 గంటలు. హైదరాబాద్.. శాప్, డెప్యూటీ డైరెక్టర్ కారంగుల మనోహర్ ఇల్లు. ఎవరో తలుపు తట్టారు. రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు తయారైన మనోహర్ తలుపు తీసేపాటికి ఎదురుగా ఆరుగురు.. వచ్చిన వాళ్లు ఏసీబీ పోలీసులని గుర్తుపట్టడానికి ఎంతో సేపు పట్టలేదు. చకచకా సోదాలు, స్వాధీనాలు.. ఆరోపణ.. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల వ్యవహారం. ఆటలు ఆడకుండానే ఆడినట్టు ఇమ్మని ప్రముఖుల పిల్లల పట్టు. కుదరన్నందుకు ఏసీబీకి ఫిర్యాదు. నిరూపించుకోలేక […]
చప్పట్లు ఓ మత్తు… జనంలోకి ఏ సంకేతాలు వెళ్తున్నాయనే సోయి అవసరం…
తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు… స్టార్ హోటల్ లో, అమెరికాలో చప్పట్ల మత్తు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించడంతో పాటు వై యస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేసే నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులకు టిడిపిలో విశేష గౌరవం లభించేది . తానాకు నాయకత్వం వహించిన వారిలో ఎక్కువ మంది టీడీపీ అభిమానులు , వీరిలో కొందరు ఆంధ్రాలో టీడీపీ టికెట్ల కోసం […]
ఇస్పాత్ నిగం – రొంబ తమిళమయం! అప్పట్లో అదుర్స్… ఆ కథేమిటంటే…
My First Crush In Telugu Journalism… గుబురు చెట్ల నీడల్లో పొగడ పూలు ఏరుకుంటున్న రోజులవి. నిజానికవి అక్షరాలు, నా దోసిట్లో మెరిసే నక్షత్రాలు. అవి నన్ను పిలిచేవి, నవ్వి రమ్మనేవి… ప్రేమించేవి.. మాధుర్యాన్ని పంచియిచ్చేవి. 1977 హైద్రాబాద్ ఈనాడులో తొలి రోజులవి. తెలుగు తక్కువ. ఇంగ్లీషు రాదు. అనువాదం తెలీదు. అలా అని పిచ్చి మొహాన్ని అనుకునేరు! మందార మకరంద మాధుర్యమును గ్రోలు… అటజనికాంచె భూమీసురుడు… బాలరసాలసాల నవ పల్లవ కోమలమైన పద్యాలెన్నో వచ్చు […]
ఈమెను కారల్ రంగనాయకమ్మ అనే పిలవాలి… తెలుగు సాహిత్యంలో విలక్షణి…
Bharadwaja Rangavajhala…. రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు. నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది. నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా 80 నుంచీ 82 దాకా … ఎక్కువ చదివింది రంగనాయకమ్మ, రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల రచనలే. మా అమ్మమ్మా వాళ్ల ఊళ్లో […]
థూనీయవ్వ… దీన్ని తెలంగాణ యాస అంటారట..? రష్మిక కూతల్లాగే రాతలు…
ఈమధ్య ఓ వార్త కనిపించింది… దిక్కుమాలిన వార్తలు అనే జాబితాలో తప్పకుండా చేర్చాల్సిన వార్త… అది తెలంగాణ పత్రిక… ఆమె ఎవరో రష్మిక అట… వచ్చేశెయ్, నీయవ్వ అని మాట్లాడిందట… హబ్బ, తెలంగాణ యాస ఇరగదీసిందని రాసేసిండు ఎవడో మహానుభావుడు… ఈమధ్య తెలంగాణ సినిమా పేరిట రుద్దుతున్న పైత్యాల్లో ఒకటి… తెలంగాణ అంటే తాగుడు కల్చర్ అని నోటికొచ్చిన కూతల్ని సమాజంలోకి కక్కడం..! ఒరేయ్, తెలంగాణ కల్చర్ అనగానే తాగుడు, బూతులు అని బదనాం చేస్తున్నారేమిట్రా, ఇన్నాళ్లూ […]
భజనస్వామ్యం… అంతటి ఉషశ్రీయే భరించలేక… రేడియో వదిలేశాడు…
1988లో ఉషశ్రీ షష్టి పూర్తి సందర్భంగా అప్పటి ఉదయం దినపత్రిక సంపాదకులు కె. రామచంద్రమూర్తి తన గురించి రాయమని ఉషశ్రీని కోరటంతో ఆయన ‘రేడియోలో రెండు దశాబ్దాలు’ శీర్షికన ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం చదువుతుంటే, ఉన్నత వ్యక్తులకే ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురైతే, రేడియోనే వదిలేసి వెళ్లిపోతే, ఇక చిన్న కొలువుల్లో వారికి ఇది పెద్ద విషయం కాదేమో అనిపించింది. ఉద్యోగ జీవితంలో ఉషశ్రీతో ఆయన కూతురు పురాణపండ వైజయంతికి కూడా పోలిక […]
సంసారాలకు సమయం లేదట… కృత్రిమ గర్భధారణలకూ కార్పొరేట్ పాలసీలు…
Bumper Offer: “విత్తొకటి పెడితే… చెట్టు మరేదో మొలుస్తుందా?” అని అన్నమయ్య పాపం అమాయకంగా వేంకటేశ్వరస్వామిని అడిగాడు. ఇప్పుడు విత్తు పెట్టకుండానే చెట్టు పుట్టించే రోజులను చూస్తే…అన్నమయ్య ఏమని ఉండేవాడో! గిచ్చి…ఓదార్చినట్లు కార్పొరేట్ కంపెనీల లీలలు భలే విచిత్రంగా ఉంటాయి. రోజుకు మూడు షిఫ్టుల్లో నయా వెట్టి చాకిరికి తలుపులు బార్లా తెరిచిందీ వారే. రాత్రి డ్యూటీలతో వైట్ కాలర్ ఉద్యోగులకు రాత్రి నిద్రను దూరం చేసిందీ వారే. భార్య భర్తతో; భర్త భార్యతో రాత్రి కలవకుండా చేసిందీ వారే. కలిసినా…ఒకరి ఒడిలో ఒకరు […]
అస్సాం కొండల్లోంచి గుండెల్లోకి జాలువారిన సంగీత జలపాతం…
Artist Mohan’s love letter to Begum Parveen sultana… ఈ అస్సాం హంసధ్వని పేరు బేగం పర్వీన్ సుల్తానా. పటియాలా ఘరానా క్వీన్ పద్మభూషణ్ పర్వీన్ పుట్టినరోజు నేడు. అస్సాం కొండల్లోంచి గుండెల్లోకి జాలువారే ఈ హిందూస్తానీ సంగీత జలపాతానికి జన్మదిన శుభాకాంక్షలు. 1980లో విడుదలైన ఖుద్రత్ సినిమాలో “ హమేతుమ్ సే ప్యార్ కితనా” పాట గుర్తుందా? ఈ దేశాన్ని అంతటినీ ఒక ప్రేమ పూలతోటగా మార్చిన ఆ పాట పర్వీన్ పాడిందే! 33 […]
తానాకు కొత్త కార్యవర్గం… ఎన్నికలు లేకుండా రాజీమార్గంలో ఎంపికలు…
తానా ఎన్నికలకు సంబంధించి ఫేస్బుక్లో Chennuri V Subba Row… పోస్ట్ ఆసక్తికరంగా ఉంది… అందులో ఆశ్చర్యపరిచిన వాక్యం ఏమిటంటే… మొన్నటిదాకా 36 వేల మంది సభ్యులున్న తానాలో ఇప్పుడు 70 వేల మంది ఉన్నారనేది… సరే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ అని ఆ పోస్టులో రాయబడిన వాక్యం నిజమో కాదో తెలియదు గానీ తానా అంటే తానాయే… అమెరికాలో కులాల వారీ, ప్రాంతాల వారీ వేర్వేరు సంఘాలు పెట్టుకున్నారు… వాటినీ తేలికగా తీసిపారేయలేం గానీ తానా ఇంపార్టెన్స్ను […]
ఆ ఎడిటర్ ఇంట్లో పెళ్లి… అచ్చం టీడీపీ మినీ మహానాడే…
ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గున్న ఏనుగులా ఉన్న పిల్లాడిని చూసి వీడెవడో మినీ మహానాడులా ఉన్నాడంటాడు . రిపోర్టర్ గా ఎన్నో మహానాడులు , మినీ మహానాడులు కవర్ చేసిన నాకు ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది . ఎన్ని సార్లు విన్నా నవ్వు వస్తుంది . మహా అంటే భారీ . మినీ అంటే చిన్నది . మినీ మహానాడు ఏంటో ? చిన్న పెద్ద నాడు అన్నట్టు . ఆంధ్రభూమిలో ఎడిటర్ […]
టైంపాస్ పల్లీస్వామ్యం… వోటు విలువ- ప్రతినిధి విలువ… అంతా ఓ భ్రమ
Jumping Japang: బాంబే చౌపట్టి బీచ్ ఒడ్డున సంధ్యా సమయం ఆహ్లాదకరంగా ఉంది. రోజంతా ఎంత గింజుకున్నా… కలవారి ఆకాశ హర్మ్యాలు దాటి…లేని వారి పూరి గుడిసెల మీద పడలేకపోయానే! అన్న దిగులుతో సూర్యుడు పడమటి అరేబియా సముద్రంలోకి దిగిపోతున్నాడు. వడా పావ్ లు తినాలన్న ఉబలాటం కొద్దీ అలలు చెలియలి కట్ట దాటి రావడానికి ఎగురుతూ…రాలేక వెనక్కు వెళుతున్నాయి. చౌపట్టి తీరంలో సిమెంటు దిమ్మెల మీద పల్లీలమ్ముకునే వారు మహారాష్ట్ర రాజకీయాల గురించి మరాఠీలో విసుగు విరామం లేకుండా మాట్లాడుకుంటున్నారు. […]
జర్నలిస్టు ఫోన్ సీజ్ చేయడానికి వీల్లేదు: కేరళ హైకోర్టు
ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్ను పోలీసులు సీజ్ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్ను సీజ్ చేయడానికి వీల్లేదని పేర్కొంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో ‘నాలుగో స్తంభం’లో భాగమని.. ఏదైనా కేసులో వారి ఫోన్ అవసరమని భావిస్తే, సీఆర్పీసీ నిబంధనలను అనుసరించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే..? కేరళకు చెందిన షాజన్ స్కారియా అనే వ్యక్తి.. ఓ యూట్యూబ్ న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. […]
తన పేరు ముక్తవరం పార్థసారథి… తెలుగు సాహిత్యానికి దొరికిన నిధి…
ఆయన పేరు ముక్తవరం పార్థసారథి… Loneliness of a long distance runner ———————————————————– గుడిపాటి వెంకట చలం, వరవరరావుకి రాసిన ఒక ఉత్తరంలో “హైదరాబాదులో కోటీకి దగ్గరే ఎక్కడో పార్థసారథి గారిని ఒకాయన ఉంటారు. కష్టాల్లో ఉన్నాడు. వీలైతే వెళ్లి కలవండి” అని కోరారు. చలం మాట కదా.. వెతుక్కుంటూ వెళ్లిన వరవరరావు, పార్థసారధిని కలిశారు. అది 1961లో. నిన్నటికి సరిగ్గా 60 ఏళ్ళ క్రితం. అప్పుడు ముక్తవరం వయసు 17 ఏళ్లు! “పార్థసారథి నాకు […]
అచ్చు మా అత్తయ్యలూ పిన్నులు మాట్లాడుకున్నట్టే అనిపించింది
Bharadwaja Rangavajhala…… మానవ సంబంధాలన్నీ… అను కథ… ( ఇది కేవలం కల్పితం… ఇందలి పాత్రలు పాత్రధారులు అందరు కూడా కల్పితం ) …. పొద్దున్న మెట్రో ప్రయాణం చేసా సరదాగా… నా పక్కన…సీట్లలో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయినులు కూర్చున్నారు… అనివార్యంగా వారి సంభాషణ నా చెవిన పడుతోంది. తీర్థయాత్రల గురించిన సమాచారం మాట్లాడుకుంటున్నారు. కాశీ వెళ్ళాం, ఇంకెక్కడికో వెళ్ళాం అని ఆల్రెడీ చూసొచ్చినావిడ చూడని మేడం కు వివరిస్తూన్నారు. అచ్చు క్లాసులో పిల్లలకి చెప్పినట్టే… […]
- « Previous Page
- 1
- …
- 71
- 72
- 73
- 74
- 75
- …
- 119
- Next Page »