వేటగాణ్ని ప్రేమికుడిగా మార్చిన వేక్ అప్ కాల్ కథ! బోయవాని వేటుకి గాయపడిన కోయిల పాట వింటుంటే.. వేటగాడిదెంత కరుడుగట్టిన మనస్తత్వం అనిపిస్తుంది కదా! కానీ, ఓ పక్షి వేటనంతరం.. ఓ కరడుగట్టిన వేటగాడి హృదయం చలించి.. మనిషిగా మారి… ఆ మహనీయుడే ఎన్నో జీవుల పాలిట దేవుడయ్యాడు. కోహిమాకు చెందిన రువుటో బెల్హో వేకప్ కాల్ స్టోరీలోకి ఓసారి విహంగ వీక్షణమై తెలుసుకుని వద్దాం పదండి. భక్షకుడు-రక్షకుడయ్యాడు 64 ఏళ్ల రువుటో బెల్హో. నాగాలాండ్ లోని […]
tv9 రజినీకాంత్‌కు జనం నాడి తెలుసా..? వెంకట్రావు చానెల్‌పై ఓ జ్ఞాపకం…
Murali Buddha….. జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ – టివి 9…. యజమానుల నాడియే జనం నాడి… ఓ జ్ఞాపకం సోడాబుడ్డి కళ్లద్దాలు , పెరిగిన గడ్డం , లాల్చీ, పైజామా … ఇదీ పాత తెలుగు సినిమాల్లో జర్నలిస్ట్ అనగానే కనిపించే రూపం .. జనం మనసుపై ఈ ముద్ర బలంగా పడిపోయింది. ఓసారి విశ్వనాథ్ ఆనంద్ ను ఒకరు ఏం చేస్తావ్ అని అడిగితే చెస్ ప్లేయర్ ను అని చెప్పాడట … చెస్ ఆడుతావు […]
బాబాలకూ కనిపించని బాధలేవో ఉంటయ్… కోటరీల బందిఖానాల్లో బతుకులు…
Murali Buddha…….. వ్యతిరేకంగా రాయండి ప్లీజ్ ….బాలసాయిబాబా…….. ఓ జ్ఞాపకం …. మ్యూజియంలో ఓ పుర్రెను చూసి విద్యార్థులు ఆసక్తిగా అడిగితే గైడ్ అది హిట్లర్ పుర్రె అని చెబుతాడు … మరో చిన్న పుర్రె కనిపిస్తే అది హిట్లర్ చిన్నప్పటి పుర్రె అంటాడు … ఇది చిన్నప్పుడు చదివిన జోక్ … ఈ జోక్ ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కనిపిస్తే ? 1987లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డిలో … అప్పుడే అయూబ్ ఖాన్ […]
ప్రజాస్వామిక సర్పయాగం అనబడు కన్నడ పాముల కథ…
Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు ఒళ్లు […]
బంగారం కూడా తినేస్తున్నాం… మన ‘ఘన ఖనిజ ఆహార వైభోగం’ అట్లుంటది మరి…
Eatable Gold: “లక్షాధికారి అయినా లవణమన్నమె కానీ… మెరుగు బంగారంబు మ్రింగబోడు” అని ధర్మపురి నరసింహ స్వామి గుడి మెట్ల మీద కవి శేషప్ప కొన్ని శతాబ్దాల క్రితం అమాయకంగా అనుకున్నాడు. లక్షాధికారులు మెరుగు బంగారం మింగబోయే రోజులొస్తాయని కవి శేషప్ప ఊహించి ఉండడు. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. అక్కడి పూతరేకుల తయారీ రాకెట్ సైన్స్ కంటే గొప్పదని అనాదిగా కథలు కథలుగా లోకం చెప్పుకుంటోంది. చక్కర, బెల్లం, ఖర్జూరం, డ్రయి […]
ఓ రాజకీయ పార్టీ… పుట్టనేలేదు, ఆవిర్భావ సమావేశమే చివరి సమావేశం…
Murali Buddha………. మేధావులు పార్టీ పెడితే …. ఓ జ్ఞాపకం అసలే ఎన్నికల కాలం ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా , ఎవరికి సంతోషం వేసినా , ఎవరు ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా కొత్త పార్టీ పుడుతుంది . మంచి హోటల్ లో ఐదారుగురు కుటుంబ సభ్యులు డిన్నర్ కు వెళితే పది వేల బిల్ అవుతుంది . అలాంటిది ఓ పది వేల ఖర్చుతో ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ […]
చెక్కందురు, డిప్పందురు, ముక్కందురు, డొక్కందురు, మామిడి పిక్కందురు
Prabhakar Jaini………. ఆవకాయ మీదొట్టు ..ఈ వ్యాసం నేను రాయలేదు సుమా ఆవకాయ ‘నవగ్రహ’ స్వరూపం ఆవకాయలో ఎరుపు— “#రవి“ ఆవకాయలోవేడి, తీక్షణత—“#కుజుడు“ ఆవకాయలో వేసే నూనె, ఉప్పు—“#శని“ ఆవకాయలో వేసే పసుపు,మెంతులు— “#గురువు“ మామిడిలో ఆకుపచ్చ—“#బుధుడు“ మామిడిలో పులుపు—“#శుక్రుడు“ ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం—“#కేతువు“ తిన్న కొద్దీ తినాలనే ఆశ—“#రాహువు“ ఆవకాయ కలుపుకునే అన్నం—“#చంద్రుడు“ ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే, సమస్త గ్రహ దోషాలు ఔట్, […]
దిక్కుమాలిన ఈ సిలబస్‌ను తగలెట్ట… బతుకు పాఠం ఒక్కటీ నేర్పించలేదు కదరా…
మన చదువులు దేనికి..? దండుగ..! అవి బతకడాన్ని నేర్పించలేవు… బతికి సాధించడాన్ని నేర్పించలేవు… అసలు సిలబస్‌లో బతుకు సూత్రాలు పాఠం ఉంటే కదా, పిల్లలు నేర్చుకోవడానికి, బుర్రలోకి ఎక్కించుకోవడానికి..! ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని, పెంచుకుని, మురిపెంగా చూసుకునే తల్లిదండ్రులకు ఎంత గుండెకోత… ఎవడైనా ఆలోచిస్తే కదా… ఈ చదువులు పాడుగాను… ఏమవుతుంది..? ఒక ఏడాది గ్యాప్ వస్తే ఏమవుతుంది..? కొంపలు మునిగిపోతాయా..? మరో ఏడాది పరీక్షలు రాయలేరా..? ఐనా అదీ పాస్ కాకపోతే ఏమవుతుంది..? బతకలేకపోతారా..? చదువులు […]
ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య… అప్పట్లో రోజూ వార్తల్లో వ్యక్తి… ఆ కథేమిటనిన…
Murali Buddha………. ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య … ఓ జ్ఞాపకం శంకర పిచ్చయ్య తెలుసా ? అని నేటి ఐటీ కుర్రాళ్లను అడిగితే , ఎవరూ ? సుందర్ పిచాయ్ కు ఏమవుతారు అని అడుగుతారు . ఏమీ కారు . ఆగండాగండి నేను కూడా మీ కన్నా ముందే శంకర పిచ్చయ్య గురించి గూగుల్ ఏమన్నా చెబుతుందేమో అని చూస్తే ఆది శంకరాచార్య గురించి మోయలేనంత సమాచారం చూపించింది . ఆ ప్రయత్నాలను పక్కన […]
యాణ్నుంచి వస్తారుర భయ్ మీరంతా… పగటి చిల్లర వేషాల కంపిటీషన్సా ఇవి..?!
మొత్తానికి మళ్లీ ఈటీవీయే ఈవిషయంలో చాలా నయం… ఈ చానెల్లో పాడుతా తీయగా గానీ, స్వరాభిషేకం గానీ నాణ్యత ప్రమాణాలు పడిపోయినా సరే, హుందాగా నడిపిస్తున్నారు… కాస్త సంస్కారం కనిపిస్తోంది… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలలో జీతెలుగు జీసరిగమప షో ఎవరూ దిగజారనంత నీచస్థాయికి వేగంగా వెళ్లిపోతుండగా… హేయ్, నేనేం తక్కువ, నేనూ వస్తున్నాను ఉండు అంటూ ఆహా ఇండియన్ ఐడల్ షో కూడా పోటీకి సై అంటోంది… వీళ్లకు సిగ్గూశరం లేదా అనడక్కండి ప్లీజు… అవి […]
నీ పళ్లు వజ్రాలు గానూ… వజ్రదంతి యాడ్ కాదు, అపూర్వ దంతజ్ఞానఘట్టం…
Dental Jewelers: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!” ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అన్నీ గుర్తుంచుకోదగ్గ పద్యాలే. అందులో మంచి పద్యమిది. వయసుడిగి, కాటికి కాళ్లు చాచినప్పుడు కాకుండా…పళ్లూడిపోవడానికి ముందే, శరీరం పట్టుదప్పకముందే, ఒంట్లోకి నానా రోగాలు ప్రవేశించకముందే, మన శరీరం మనకే వింతగా అనిపించడానికంటే ముందే, తల ముగ్గుబుట్ట కావడానికంటే ముందే…కాళహస్తీశ్వరుడి కాళ్లు పట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది కానీ…ఇవన్నీ అయ్యాక […]
మోకాలి బుర్రకు ఓ సర్జరీ… మిత్రుల దురాత్మీయ పరామర్శపర్వం…
Gopi Reddy Yedula ……. ‘దురాత్మీయ పరామర్శలు’ మనిషికి ఏదైనా ఆపరేషన్ కావడం మంచిది కాదు. అందునా మోకాలుకు అసలే కాకూడదు. నా మోకాలు అరిగింది అని ఎక్సరే చూసిన డాక్టర్లు చెప్పారు. దాన్ని రీప్లేస్ చేయాలి అనికూడా నొక్కి చెప్పారు. ఎందుకు అరిగింది అంటే మటుకు ఎవరూ సరైన కారణం చెప్పలేదు. డాక్టర్లు సరైన కారణం చెప్పలేదు అంటే మా ఆవిడ ఊరుకోదు. నా మెదడు మోకాలులో ఉంది అని మా ఆవిడకు ఏనాడో తెలుసు. […]
కాంగ్రెస్ అంటే సోనియా మాత్రమే కాదు… చాలామంది ఉన్నారందులో…
Murali Buddha………… శ్రీకృష్ణ కమిటీ నివేదికతో TDLP లో సంబరాలు, నా జోస్యమే నిజమైంది… ఓ జ్ఞాపకం తెలంగాణ అంశంపై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చింది . అసెంబ్లీలోని TDLP కార్యాలయంలో ఉన్నాం … కమిటీ నివేదికలో తొలి సిఫారసు టీవీ స్క్రీన్ పై కనిపించగానే TDLP లో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి . తొలి సిఫారసు రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా అలానే ఉంచాలి అని … Tdlp లో సిబ్బంది, నాయకులు ఒకరినొకరు అభినందించుకున్నారు […]
ఆ ఇద్దరు మహిళానేతలు డిష్యూం డిష్యూం… కొప్పుల కొట్లాట…
Murali Buddha…….. నన్నపనేని రాజకుమారి భయపడిన వేళ …. ఓ జ్ఞాపకం …… 83 తెలుగుదేశం బ్యాచ్ మహిళా నాయకులు రాజకీయాల్లో ఓ సంచలనం … ఈ బ్యాచ్ టీడీపీ ద్వారా వచ్చినా అన్ని పార్టీల్లో ఓ వెలుగు వెలిగారు . ఆంధ్రలోనే కాదు …. తెలంగాణలోనూ .. మూలాలు ఆంధ్ర ఐనా కాట్రగడ్డ ప్రసూన , గడ్డం రుద్రమ దేవి వంటి వారు తెలంగాణాలో ఆ కాలంలో వెలిగి పోయారు .. భయం అనేది నా […]
జై మోడీ జై జై మోడీ… రిపబ్లిక్ టీవీ, చంద్రబాబు పోటీ కీర్తనలు…
నాయకులను కీర్తించడం వర్తమాన జర్నలిజంలో కొత్తేమీ కాదు… నిజానికి అది పాత్రికేయంలో ఓ భాగమైపోయింది… జర్నలిస్టులు అంటేనే వందిమాగధులు… కానీ రిపబ్లిక్ టీవీ చేష్టలు విచిత్రంగా ఉన్నయ్… దీనికి మోడీ కీర్తన కొత్తేమీ కాదు, అసలు దాని పనే అది… అది బీజేపీ చానెలే కాబట్టి తప్పులేదు అనుకుందాం కాసేపు… కానీ ఏకకాలంలో మోడీతోపాటు బాబును కీర్తిస్తూ… బీజేపీ- టీడీపీ కలిసిపోవాలని లేదా ఎన్డీఏలో టీడీపీ చేరిపోవాలని ఈ టీవీ వెంపర్లాడిన తీరు ఆశ్చర్యంగా ఉంది… టైమ్ […]
మన జీవితాల నిండా జంతువిన్యాసాలు… నిజమైన సర్కస్ ఎవరు చూస్తారు…
Circus – Life: జెమిని సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ నిండు నూరేళ్లూ బతికి…పోయాడు. జెమిని సర్కస్ చరిత్ర రాస్తే రామాయణమంత రాయవచ్చు. చెబితే మహాభారతమంత చెప్పవచ్చు. గుర్రం గుర్రం పని; గాడిద గాడిద పని చేసే కాలంలో కాబట్టి శంకరన్ సర్కస్ ఫీట్లు చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు ప్రతి అడ్డ గాడిద తనను తాను సింహమనే అనుకోవడంతో…గుర్రాల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిని…కళ్లకు గంతలు కట్టుకుని…గుంతల్లో పడి…లేచి పరుగెత్తలేకుండా ఉన్నాయి. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందని మనం అతిగా ప్రచారం చేయడం […]
అవసరానికి మరఠ్వాడా మీడియా… ‘అవసరం లేని’ హైదరాబాద్ మీడియా…
మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చే రూ.5 కోట్లు హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు చేయడానికే రూ.5 లక్షల కేటాయింపు మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లోనూ భారీగా యాడ్స్ మరఠ్వాడాలో హాట్‌టాపిక్‌గా గులాబీసభలు ……… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ… పైన ఉన్న డెక్స్ చదివితేనే అర్థమైపోయిందిగా స్టోరీ సారాంశం ఏమిటో… మరఠ్వాడా ఏరియాలో సభల […]
లెక్కల తాబేలు… అంకెల మాంత్రికుడు… ఓ జ్ఞాపకం…
Murali Buddha……….. లెక్కల తాబేలు – అంకెల మాంత్రికుడు…… ఓ జ్ఞాపకం నాలుక పైనే అంకెలు , రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల్లో గొనె ప్రకాష్ వంటి వారు ఇంకొకరు లేరు . పతంజలి గారు లెక్కల తాబేలు అని ఓ అద్భుతమైన కథ రాశారు . కథ సంక్షిప్తంగా . తాబేళ్ల రాజ్యం లో ఓ తాబేలు సరదాగా లెక్కలు నేర్చుకుంది. 27వ ఎక్కం ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఎలా అంటే అలా చెప్పగలదు […]
వైఎస్ఆర్ ఓ పిలుపునిచ్చాడు… చంద్రబాబు అక్షరాలా పాటించాడు… ఇలా…
Murali Buddha………… కరెంట్ బిల్లు కట్టవద్దన్న ysr .. కట్టని బాబు… అట్టుడికిన అసెంబ్లీ .. ఓ జ్ఞాపకం ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ బిల్లులు కట్టవద్దు అని ysr పిలుపును ఇస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాటిస్తే ఎలా ఉంటుంది .. ఇది నిజంగా జరిగింది, అసెంబ్లీ అట్టుడికింది … అలా జరగడానికి తనకు తెలియకుండానే సహకరించిన వ్యక్తికి ఆ విషయం ఇప్పటికీ తెలియదు . 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యుత్ అంశం రాష్ట్రాన్ని అట్టుడికించేట్టు చేసింది .. […]
ఖలిస్తానీ శక్తులకు తెల్ల తోళ్ల మద్దతు… భారతదేశానికి ఇదొక రాచపుండు…
పార్ధసారధి పోట్లూరి …….. వారిస్ దే పంజాబ్ నాయకుడు భీంద్రన్ వాలే-2 గా చెప్పుకుంటున్న అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ! 37 రోజుల నుండి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఎట్టకేలకి అరెస్ట్ అయ్యాడు ! గత మార్చి నెల 18 న నుండి పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ లోని మొగాలో పోలీసులకి లొంగిపోయాడు ! పంజాబ్ లోని మొగా జిల్లా, రోడే అనే గ్రామంలోని గురుద్వారాలో […]
- « Previous Page
- 1
- …
- 96
- 97
- 98
- 99
- 100
- …
- 133
- Next Page »