Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!

June 17, 2025 by M S R

.

Mohammed Rafee …….. మీకూ బాధ్యత ఉండాలిగా దిల్ రాజు గారూ!

తెలంగాణ ఉద్యమ నేత, సీనియర్ న్యాయవాది, సినీ నటుడు సివియల్ నరసింహారావు గారు ఫోన్ చేసి “రెండు పాసులు ఉంటే చూడండి, కాంతారావు గారి కుటుంబ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు వెళ్తారట పాపం” అన్నారు!

Ads

పాసులు తెప్పించి వారికి ఇవ్వడం పెద్ద సమస్య కాదు! కానీ, ప్రభుత్వ వేడుకలో అధికారికంగా వారికి ఆహ్వానం అందడం న్యాయం అనిపించింది! కానీ, ప్రభుత్వానికి అంత ఓపిక తీరిక ఎక్కడిది?

తెలంగాణ తొలి సూపర్ జానపద హీరో కాంతారావు గారి పేరిట పురస్కారం ఏర్పాటు చేశారు సంతోషమే! తొలి పురస్కారాన్ని మహబూబ్ నగర్ కు చెందిన రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండకు ఇచ్చారు ఇంకా సంతోషమే!

వ్యక్తిగత అవార్డులు ఇస్తున్నప్పుడు వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించడం ఒక ఘనమైన గౌరవమైన సంప్రదాయం! కానీ, ఆ సంప్రదాయాన్ని FDC చైర్మన్ దిల్ రాజు పూర్తిగా మరచిపోయారు! అంతెందుకు, అసలు తెలంగాణ సినిమా అవార్డు పైగా గద్దర్ అవార్డు అంటే, దాసి, మాభూమి లాంటి తెలంగాణ సినిమాలు తీసిన బి. నర్సింగరావు గారు వేదికపై అతిధులతో పాటు ఉంటే ఎంతో గౌరవంగా హుందాగా ఉండేది!

ఇదే మాట నేను సంబంధిత అధికారికి గుర్తు చేస్తే, “ఆయన అవార్డు వద్దు అన్నారండి” అని చెప్పారు! గద్దర్ అవార్డుల విధి విధానాలు రూపొందించిన కమిటీ చైర్మన్ గా అవార్డు తీసుకుంటే, కమిటీలో ఉండి తీసుకున్నారని అంటారని ఆయన బాధ్యతగా వద్దు అన్నారు! అంత మాత్రాన ఆయన్ని వేడుకకు ఆహ్వానించకపోతే ఎలా? అలాంటి వారు వేదికపై ఉంటే కదా తెలంగాణ అవార్డులు అని గుర్తుకొచ్చేది!

మరుసటి రోజు దిల్ రాజు గారు ఫిల్మ్ నగర్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి “బాధ్యత ఉండక్కరలేదా” అని అవార్డులు వచ్చినా వేడుకకు రాని వారిని ఉద్దేశించి మాట్లాడారు! సరే, మహర్షి మహేష్ బాబు, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ ఇంకా చాలామంది రాలేదు! వారి షూటింగ్ బిజీ కావచ్చు ఇంక వేరే కారణాలు కావచ్చు! ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న లోపాలు ఉండి ఉండొచ్చు!

ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అధికారులను, నటులను, ప్రభుత్వంలో వున్న నేతలను బాగా చూసుకుని ఉండొచ్చు! కనీసం ప్రేక్షకులకు మంచి నీటి సౌకర్యం సరిగా కల్పించలేక పోయారు! ఇంత చిన్న అవసరమైన విషయాన్నీ మరచిపోయినప్పుడు నావి, సివియల్ నరసింహారావు గారి లాంటి వారి ఆలోచనలు, సూచనలు మీరు ఆశిస్తారనుకోవడం అత్యాశ అవుతుందేమో!

ఇకనైనా తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన శ్యాం బెనెగల్, పైడి జయరాజు, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు పేరిట అవార్డులు ఇచ్చినప్పుడు, ఇవ్వాలనుకున్నప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించండి! కనులారా చూసి మురిసిపోతారు! ఎందుకంటే ఆ అవార్డు తీసుకునే వారే కాదు, ఆ అవార్డు ఎవరి పేరుతో వుందో వారి కుటుంబ సభ్యులకు కూడా ఆనందం ఇవ్వాలి! ఇది కనీస బాధ్యత!…. - డా.మహ్మద్ రఫీ... డిజిటల్ చిత్రం :ఆర్టిస్ట్ మహమ్మద్ గౌస్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions