Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నా వాచాలత్వం జీడి పప్పు… మీ వక్తృత్వం జిల్లేడు పప్పు…

May 25, 2026 by M S R

.

Gottimukkala Kamalakar …. చాలామంది మగపుంగవపురుషోత్తములు వయస్సు తేడాలతో సంబంధం లేకుండా పక్కింటి పంకజలక్ష్మి గురించి; ఎదురింటి ఎంకటలక్ష్మి గురించి; ఇరుగింటి ఇందిరాలక్ష్మి గురించి మాటతూలరు. జాగ్రత్తగా మాట్లాడతారు. ఆమె ముందు, ఆమె పరోక్షంలో చాలా పద్ధతిగా మాట్లాడతారు.
దీనికి 90% కి పైగా కారణాలు ఇవే..!

అమ్మ భయమో; పెళ్లాం భయమో; ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చనో; కామించి వశం చేసుకోవచ్చనో; పడకకు తోడౌతుందనో; పాలకు తోడిస్తుందనో; చెల్లి స్నేహితురాలికి చెల్లిగా చూడకపోతే, ఆ అమ్మాయి అన్నయ్య తన చెల్లిని ఎలా చూస్తాడనో… వగైరా వగైరాలు…!

Ads

అందుకే స్వంత చెల్లెలు అపెండిసైటస్ తో విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా అజ్ఞాతవాసులయ్యే ఈ అన్నయ్యలు, పక్కింటి చెల్లెమ్మకు కాస్త అలసట వస్తే ఆపద్బాంధవుడిలా అపోలోకి వెళ్లాలన్నంత హడావిడి చేస్తారు. ఎందుకంటే, వీళ్ళతో ఛాన్సేమన్నా దొరుకుతుందేమో అన్న శునకకుతూహలం…!

ఇదే మగాళ్ళు ఐశ్వర్యారాయ్ గురించో; కత్రినా కైఫ్ గురించో; టైరాబ్యాంక్స్ గురించో; బియాన్సే గురించో చాలా చిల్లరగా వదరుతారు. వీళ్ళతో ఛాన్స్ దొరికే ఛాన్సేలేదు కాబట్టి ఆ పళ్ళు పుల్లటివని వదిలేసే జంబూకనైరాశ్యం.

మన మహిళా శిరోమణులూ అంతే..! రంగారావు అన్నయ్య గారి గురించి; అంకయ్య నాయుడన్నయ్య గారి గురించి తెగమర్యాదగా మాట్లాడి, రజినీకాంత్ నీ, అమితాబ్ బచ్చన్నీ బండబూతులు తిడతారు.
మనం బావిలో కప్పలం.. మన NRI లు చెరువులో కప్పలు. అంతే తేడా. బెకబెకల్లో తులం తేడా ఉండదు.

మన ఫ్రెండొకడు షార్ట్ ఫిలింని తీసి యూట్యూబ్ లో పెడితే, కనిపించిన ప్రతోడికీ చెప్పి ప్రచారం చేస్తాం. రాజమౌళి బాహుబలిని మాత్రం, మన చిలుంపట్టిన బ్లేడుతో ఖండఖండాలుగా చీల్చి చెండాడుతాం.
మనోడి గల్లీ క్రికెట్ ని పదిమందికి చెప్పుకుని; విరాట్ కొహ్లీ ఆటెలా మెరుగుపెట్టుకోవాలో, పాన్ డబ్బా వాడితో సిగరెట్ కి అప్పు పెడుతూ చర్చిస్తాం.

ఉత్తరం అచ్చయితే, నోబెల్ సాహిత్య బహుమతి వచ్చినట్టు ఫీలయ్యే మనం, కవి రచించిన దీర్ఘకావ్యాన్ని గురించి సుదీర్ఘంగా సొల్లేస్తూ విమర్శిస్తాం…!
ఆ.. శ్రీశ్రీ దేంటి గొప్ప..? అంతా అక్కరకు రాని కమ్యూనిజం గోల & బ్రాహ్మణీకమూనూ..!
ఈ చెలానికి ఎప్పుడూ ఆడ గోలే..! ఎవత్తో హాండిచ్చుంటుంది..!!
రావిశాస్త్రికి ఏ ముండో తెగ నచ్చేసుంటుంది గురూ.., లేకపోతే అస్తమానం అదే కంపినీల గోలేంటీ…?
అట్టడుగువర్గాల గురించి రాయని పాపయ్య శాస్త్రి, పాలో కోయిల్హోలు కూడా రచయితలేనా…?
అబ్బే రావూరి భరద్వాజ జ్ఞానపీఠ్ కి అస్సలు అర్హుడు కాదు…!
సినారె వేస్టు…!
అంటూ వదిరే ఈ బాపతుగాళ్లు మనకు తగుల్తూనే ఉంటారు.

పేడపురుగు కూడా దానిలా పుట్టి, దానిలా బతికి, దానిలా ఛస్తుంది.
మనిషికి ఇది కూడా ఎందుకు సాధ్యం కావడం లేదు..? సాధ్యమైతే ఎంత బావుంటుంది. కొంచెం కదిలిస్తే mind your own business అని అదిలించే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ప్రపంచపు కావిడి మోస్తున్నట్టు ఎందుకు ఆయాసపడిపోతారు..?

వీళ్లందరూ “అమ్మను తిడతావేంట్రా లం- కొడకా..!” అనే బాపతు. సాటివాళ్లకు సభ్యతాసంస్కారాలు నేర్పే మహత్తర బాధ్యత నెత్తికెత్తుకున్నప్పుడు వీళ్ళూ కొంచెం మర్యాదగా మాట్లాడాలి కదా…? నా వాచాలత్వం జీడిపప్పు; మీ వక్తృత్వం జిల్లేడుపప్పు అంటే ఎలా కుదురుతుంది…?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బావల్లేని మరదళ్లు… మరదళ్లు లేని బావలు… ఉత్తములు- గుణవంతులు…
  • నా వాచాలత్వం జీడి పప్పు… మీ వక్తృత్వం జిల్లేడు పప్పు…
  • IPL-2026 …. ప్లేఆఫ్‌లోకి రాజస్థాన్…! పంజాబ్ కల మళ్లీ భగ్నం..!
  • డ్రగ్స్ మత్తు దిగింది సరే… ఆ ‘థార్ పోరగాళ్ల’ డబ్బు బలుపు దిగేదెలా..?
  • అవును, సీఎం విజయ్ హీరోయిన్ సూసైడ్ చేసుకుంది… సో వాట్..?!
  • Ugly story … ఓ సైకో మొగుడి డార్క్, ప్రాక్టికల్ షేడ్స్ కథ…
  • బెంగాల్‌లో బీజేపీ చేస్తే తప్పు..! అదే పని కేరళలో కాంగ్రెస్ చేస్తే..?
  • తెలంగాణ బీజేపీ మరో మణిమకుటం… ఇదీ తన ‘క్నాలెడ్జి’…
  • సెల్వమణితో రోజా ప్రేమకథ ఇక్కడ పుట్టి… పదేళ్లకు వర్కవుట్…
  • RDSS … కేసీయార్ మరిచిన విజ్ఞత-! రేవంత్ చూపించిన పరిణతి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions