Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బంగారు లోదుస్తులు! – వామ్మో ఇరాక్ ఎంపీ!! విస్తుపోయిన ప్రపంచం!!

July 3, 2026 by M S R

.

పురుషులేమిటి..? స్త్రీలేమిటి..? ఎవరూ అవినీతికి అతీతం కాదు, ఏ దేశమూ మినహాయింపు కాదు, అసలు ఓ లెక్కన పురుషులకన్నా స్త్రీలకే అక్రమ సంపాదన పట్ల మోజు అంటుంటారు కొందరు… ఓ వార్త చూస్తుంటే జయలలిత గుర్తొచ్చింది…

తెలుసు కదా, జయలలిత అవినీతి సామ్రాజ్ఙి… దత్తపుత్రుడి పెళ్లి జరిపించిన తీరు చూసి దేశమే నివ్వెరపోయింది… అవినీతి కేసులో ఇరికి, అధికారులు ఇంటి మీద దాడి చేస్తే దొరికిన నగలు గట్రా పక్కన పెట్టండి, ఎలాగూ స్త్రీలకు బంగారం అంటే కక్కుర్తే కదా…

Ads

సుమారు 27.5 కిలోల బంగారు ఆభరణాలు (వీటిలో వజ్రాలు పొదిగిన నగలు, బంగారు కిరీటాలు, ఖడ్గం),  సుమారు 1,116 కిలోల వెండి వస్తువులు… 1,500 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న వ్యవసాయ, ఇతర భూములకు సంబంధించిన పత్రాలు… అసలు ఇవి కాదు, 11,344 ఖరీదైన పట్టు చీరలు, 750 జతల డిజైనర్ చెప్పులు, 250కి పైగా డిజైనర్ షాల్స్, 91 రిస్ట్ వాచీలు… 65 నుంచి 100 వరకు హేండ్ బ్యాగులు…

ఆడవాళ్ల పిచ్చి దేనిపైనే జయలలిత ఆస్తులు చెప్పాయి… ఎస్, రీసెంటుగా ఇరాక్‌లో బోలెడుమంది ప్రజాప్రతినిధుల మీద అవినీతి నిరోధక దాడులు జరిగాయి… ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లపై వరుస దాడులు, కోట్ల డాలర్ల నగదు స్వాధీనం, బంగారం, ఆస్తుల వెలికితీత, 47 మంది అరెస్టు… ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో “27 కిలోల బంగారం, 57 మిలియన్ డాలర్లు, బంగారు లోదుస్తులు” అనే కథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది…

ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది… టర్కీ, రష్యన్ భాషా మీడియా, అజర్‌బైజాన్‌కు చెందిన కొన్ని వార్తా వెబ్‌సైట్ల కథనాల ప్రకారం ఒక మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసీ ఇంట్లో 57 మిలియన్ డాలర్లు, 27 కిలోల బంగారం, బంగారంతో తయారైన లోదుస్తులు దొరికాయట…

gold under garments

నిజానికి దోచుకున్నది దాచుకోవాలి అనేది అవినీతి కథల్లో ప్రాథమిక సూత్రం, కానీ ఆడవాళ్లు ఊరుకోరు… సంపద ఊరుకోనివ్వదు… మరీ బంగారు లోదుస్తులు ఏమిటి..? విస్మయాన్ని, వెగటును కలిగించే ఫోటోలు… అఫ్‌కోర్స్, ఆడవాళ్లకు సంపద ప్రదర్శన అంటే ఓ పిచ్చి…

వాళ్లే కాదు, ఇదేమీ కొత్త కాదు… గాలి జనార్దన్ రెడ్డి బంగారు సింహాసనమే చేయించుకున్నాడనీ వార్తలు చూశాం కదా… అప్పనంగా వచ్చి పడుతున్న వందలు, వేల కోట్లను ఏం చేసుకోవాలో తెలియనంత అట్టహాసం, ఆడంబరం, ప్రదర్శన… తన ఇంట్లో పెళ్లి కూడా నిరూపించింది అదే కదా… వాడెవడో బంగారు కమోడ్ చేయించుకున్నట్టు కూడా చదివినట్టు గుర్తు…

ఇరాక్ ఎంపీ లేడీ కదా, బంగారు డిజైనర్ లోదుస్తులు చేయించుకుంది… అవినీతి అంతే, దానికి నీతి ఉండదు, రీతి ఉండదు… ఈ లేడీయే పక్కా ఉదాహరణ!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • ఒక ఆదిపురుష్ – ఒక అఖండ2 – ఒక నాగబంధం!!
  • బంగారు లోదుస్తులు! – వామ్మో ఇరాక్ ఎంపీ!! విస్తుపోయిన ప్రపంచం!!
  • “ప్రతి పొరపాటు వైఫల్యం కాదు… కొన్నిసార్లు అదే ఒక అవకాశం”
  • నాగబాబూ.., మహానటుడు ఎన్టీఆర్‌‌పై మరీ అంత చౌకబారు స్కిట్..!!
  • సవాళ్లు- డిమాండ్లు- తోపులాటలు… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస!
  • NEET – ప్లస్ టూ మార్కులకు వెయిటేజీ- లేదా 70% వస్తే నీట్ అర్హత?
  • ఎట్టకేలకు జననాయకుడికి మోక్షం! 2, 3 రోజుల్లో CBFC క్లియరెన్స్!
  • గడీలోకి వెళ్తే మరో జీవన్‌రెడ్డి – కాషాయం ఇక రానివ్వదు – మరేమిటి..?!
  • పెళ్లి తంతు కూడా ముఖ్యమే! రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions