Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్.., ఏజ్ గ్యాప్ – కెమిస్ట్రీ పండలేదు – మరీ అక్కాతమ్ముళ్లలాగా !!

August 29, 2026 by M S R

.

అసలే నయనతార సొంత సినిమా… ఈమధ్య హీరోలు, హీరోయిన్లు తామే సినిమాలు నిర్మించుకుంటున్నారు కదా, ఇదీ ఆ బాపతు సినిమాయే… పైగా ఇందులో ఆమె పాత్ర ప్రభావమే ఎక్కువ… చాలా సీన్లను డామినేట్ చేసేట్టుగా చూసుకుంది… అంతే కాదు, ఇందులో ప్రభు, కెవిన్, భాగ్యరాజా, రాధిక, సుహాసిని వంటి తారాగణం ఉండటంతో నిజానికి మంచి కథను ప్రజెంట్ చేసి ఉండొచ్చు… నయనతార భర్త మాత్రం దర్శకుడు కాదు…

కోయంబత్తూరు నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఇది… మయిల్ సామి (కేవిన్) ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి మోసపోతాడు. అదే గ్రామానికి చెందిన దేవయాని (నయనతార) చిన్నప్పుడే అమ్మను కోల్పోతుంది. తాగుబోతు తండ్రి (ప్రభు) చేసిన భారీ అప్పుల కారణంగా, ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తారు. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి దేవయాని చెన్నైకి పారిపోతుంది.

Ads

అక్కడ ఆమెకు మయిల్ పరిచయమవుతాడు. ఆమెను మయిల్ తన ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని అంటాడు. కానీ ఆమె మూడు నెలల గర్భిణి అని అందరికీ చెబుతాడు. ఆ తర్వాత జరిగే ఊహించని పరిణామాలు, దేవయాని తల్లి (సుహాసిని) ఎంట్రీ, చివరికి వీరిద్దరి ప్రేమ ఏమైందనేదే ఈ సినిమా అసలు కథ.

hi

సినిమా మొదలుకావడం ఎమోషనల్‌గానే ఉన్నా, మొదటి భాగంలో వచ్చే చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకోవడంతో కాస్త బోరింగ్ అనిపిస్తుంది.

ద్వితీయార్థంలో డ్రామా, ట్విస్టులు ఉన్నప్పటికీ కథనం ఆకట్టుకునేలా లేదు. అయితే, క్లైమాక్స్ ముందు సుహాసిని ఎంట్రీ ఇచ్చిన తర్వాతే అసలు భావోద్వేగాలు పండుతాయి. ప్రభు, సుహాసిని, నయనతార మధ్య వచ్చే సీన్లు సినిమాను నిలబెడతాయి.

నయనతార బాధ్యతాయుతమైన పాత్రలో పరిణతితో నటించింది. బాధితురాలిగా, ఎమోషనల్ సీన్లలో ఆమె నటన చాలా బాగుంది. కానీ సమస్య ఏమిటీ అంటే..? ప్రధాన జంట కెమిస్ట్రీ ఫెయిల్యూర్… కెవిన్‌కన్నా నయనతార వయస్సు పెద్దగా కనిపిస్తూనే ఉంటుంది… కాకపోతే కేవిన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.

ప్రభు, సుహాసిని, భాగ్యరాజ్, రాధిక తమ అనుభవంతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. అతిథి పాత్రలో కనిపించిన సుహాసిని నటన బాగుంది. పెద్ద తారాగణం ఉన్నప్పటికీ, బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం కాస్త నిరాశపరుస్తుంది… ప్చ్, నయనతారా, నీ ఏజ్ గ్రూప్ నటుడిని పెట్టుకుని, నీ భర్తతోనే దర్శకత్వం చేయిస్తే ఏమైనా మెరుగైన ఫలితం ఉండేదేమో… ఇలా ఏదో ఒకటి చుట్టేసి ప్రేక్షకుల మీదకు వదలడంకన్నా..!!

నయనతార, కెవిన్ వయస్సులో తేడా అయిదేళ్లు, ఆమె పెద్దది, ఆ తేడా కనిపిస్తోంది, మరీ అక్కాతమ్ముళ్లలాగా ఉంది జంట... సో వాట్, ముసలి హీరోలు తమ మనమరాలి వయస్సున్న హీరోయిన్లతో నటించడం లేదా అని దర్శకుడు ఎక్కడో స్పందించాడు, వాదన బాగానే ఉంది గానీ తెరపై జంట కుదరలేదోయ్ సామీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్చ్.., ఏజ్ గ్యాప్ – కెమిస్ట్రీ పండలేదు – మరీ అక్కాతమ్ముళ్లలాగా !!
  • రాముడు ముంచుతాడో తేల్చుతాడో – మునుపెన్నడూ ఎరుగని భారీ పందెం !!
  • The Economist – ‘కొత్త హైదరాబాద్ ప్లాన్’ను అర్థం చేసుకుంది !!
  • రాఖీ సురేఖ కొలువు కాపాడుతుందా..? రాఖీ కట్టే కొత్త చెల్లెలు వస్తుందా?
  • ఈ నవ్వు వందలసార్లు చూసి ఉంటారు కదా… ఇదొక్కసారి చదవండి…
  • పుతిన్ అణుదాడి చేస్తాడు ! బ్రిటన్ మీదా కీవ్ మీదా చూడాల్సి ఉంది !
  • అబ్బే.., జగన్ రెడ్డి, కేసీయార్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదట…
  • ₹22 వేల కోట్ల అప్పు… ₹6.5 కోట్లకే కథ ముగిసిందా? ఇదీ అసలు కథ !!
  • హరీష్ రావు క్షుద్ర పూజలు ఎవరిపై, ఎందుకు – కవిత ఇచ్చిన మరో ట్విస్టు !!
  • సోనియా ఆత్మకథకు బ్రేకులు – ప్రచురణకు పెంగ్విన్ వెనుకంజ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions