.
హైద్రాబాద్ లో వీళ్ళ న్యూసెన్స్ మాములుగా వుండదు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని పెళ్ళి కూతురు ఎక్కాల్సిన బస్సులో బట్టలిప్పదీసుకుని ముందే ఎక్కికూర్చున్నారు , ఆ డిమాండ్ డబ్బులిస్తే అప్పుడు దిగి వెళ్ళిపోయారు…
.
Ads
ఇదీ ఓ మిత్రుడి పోస్ట్ ఫేస్బుక్‌లో…. హహహ… ఇక్కడ నవ్వును సూచించే అక్షరాలు అత్యుక్తి కావచ్చుగాక… కానీ నాట్ ఓన్లీ హైదరాబాద్… ప్రతిచోటా ఉంది… మామూలుగా లేదు… అదొక మాఫియా… పక్కా ఆర్గనైజ్డ్ యవ్వారం…
ఓ వార్త కనిపించింది… గృహప్రవేశం రోజున డబ్బులు డిమాండ్ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ల అరెస్టు అని… గ్రేట్… అసలు ఎక్కడా వాళ్ల జోలికి ఒక్క పోలీసోడూ పోడు… హార్ష్‌గా ఉన్నా కఠిన వాస్తవం…
టౌన్ ప్లానింగ్, చెత్తా ఆ ఏరియా కంట్రిబ్యూటర్ల సిండికేట్లు, కులసంఘాలు, కాలనీ సంఘాలు ఎవరెన్ని లంచాలు వసూలు చేసినా సరే, అన్నింటికీ మించింది హిజ్రాల వసూళ్లే… పెళ్లి మాత్రమే కాదు, గృహప్రవేశమే కాదు… చివరకు సమర్త, బర్త్‌డే ఫంక్షన్లయినా సరే వాలిపోతారు…
పరువు తీస్తారు… డబ్బు వసూలు చేస్తారు… పది మంది ఎదుట పరువు పోకూడదని ఎంతో కొంత ఇస్తామంటారు… కానీ ఒప్పుకోరు… అదో పెద్ద బేరం… అయ్యాక గేటు మీద ఏవో గీతలు గీస్తారు… ఆల్రెడీ పెయిడ్, ఇంకెవడూ రాడు, వస్తే అది చూపించడు అని తమ ఔదార్యాన్ని కనబరుస్తారు…
పక్కాగా చెప్పాలంటే వాళ్లకు నిజాయితీ ఉంది… లోకల్ కంట్రిబ్యూటర్లకు, సంఘాలకు, ప్లానింగ్ చెత్తా గాడిద కొడుకులకు లేని నిజాయితీ వాళ్లది… ఐతే దీనికి పరిష్కారం ఉందా..? లేదు… ఉండదు… గొప్ప విశాల హృదయాలున్నట్టు ఫోజులు కొట్టే కొన్ని సంఘాలు అంతులేని మానవీయతను ప్రదర్శిస్తుంటాయి వీళ్ల మీద… అసలు వాళ్లను తన్నాలి మొదట…
అక్కడెక్కడో మరీ వీవీఐపీ ఉన్నట్టున్నాడు… అందుకే పోలీసులు స్పందించి లోపలేశారు… నిజానికి తెలంగాణలో ప్రతిచోటా కనీసం వీళ్లను కూడా అణిచివేసే సత్తా లేదా పోలీసుల్లో, ప్రభుత్వంలో… పోనీలే, అదొక టాక్స్ కట్టేయండి పర్లేదు అనేదేనా విధానం..?
కేసులు పెడితే ఏం జరుగుతుంది.? ఏమీ కాదు… వ్యభిచారుల కేసులు పెట్టి కాలర్లు ఎగరేసుకునేవాళ్లు, ఆ వార్తలు రాసి ఆహా ఎంత గొప్ప రాశాను అనుకునే గొప్ప వ్యభిచార జర్నలిస్టులు కాదు కదా… ఎవరూ ఓ సోషల్ ఇష్యూను సాల్వ్ చేయలేరు… నిజానికి ప్రభుత్వానికి ఇవి సమస్యలుగానే కనిపించవు… అనుభవించేవాడికి తప్ప…
చాన్నాళ్ల క్రితం సిద్దిపేటలో ఒకాయన పాన్ షాపు ప్రారంభించబోతున్నాడు… హిజ్రాలు వచ్చారు… రచ్చ… పైసా ఇవ్వను అంటాడు ఓనర్… వీళ్లు ఒప్పుకోరు… చివరకు కొబ్బరికాయలు వాళ్లపైకి విసిరేసి, తాళాలు వేసేసి, వెళ్లిపోయాడు సదరు ఓనర్… అంతటి ది గ్రేెటెస్ట్ నంబర్ టూ సీఎం హరీష్ రావు కూడా ఏమీ చేయలేకపోయాడు… అఫ్‌కోర్స్, నంబర్ వన్ యాక్టింగ్ సీఎం కేటీయార్ కూడా సిరిసిల్లలో ఏమీ చేయలేదు…
అవునవును,.. అక్కడికే వస్తున్నా… రేవంత్ సర్కారు మరీ దారుణం… ఐ అగ్రీ… అవునూ, గజ్వెల్, అంటే కేసీయార్ ఇలాకాలో దారుణాల గురించి చెప్పమంటారా సార్…!! అంటే ఈ గుడ్డి సర్కారుకు సర్టిఫికెట్ కాదు, వీళ్లు అంతకన్నా ఫ్లాప్..!!
Share this Article