చెప్పుకోవాలి… జర్నలిస్టు కులస్థుడిగా తప్పకుండా చెప్పుకోవాలి.,. తెలుగు రాష్ట్రాల అందరు ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యంత భీకరమైన జర్నలిస్టు వ్యతిరేకి కేసీయార్… ఈ మాట అనడానికి సందేహం, సంకోచం ఏమీ అక్కర్లేదు… అక్షరాలా నిజం కాబట్టి…
పాతాళం లోతుల్లోకి పాతేస్తామని బెదిరిస్తే… పెద్దపెద్ద రామోజీరావు వంటి లెజెండరీలే గడగడా వణికిపోయి కాళ్లబేరానికి దిగిపోయిన దురవస్థలో… మీడియా హౌజులన్నీ కేసీయార్ పాదాల మీద పాకుతున్న సందర్భాల్లో… తను ఆఫ్టరాల్ జర్నలిస్టులకు మంచి చేయాలని ఎందుకు అనుకుంటాడు..? తనకు నిజంగానే జర్నలిస్టులు అంటే ఆఫ్టరాల్…
ఈరోజుకూ ఇంకా తనను కీర్తించేవాళ్లకు కూడా జవాబు చెప్పాలి… ఇదే ఆ సుదీర్ఘ వివరణ… కరోనా కాలంలో తను చేసిన సాయం ఏదో తెలుసా.? మరణిస్తే అంత్యక్రియలకు సరిపోయే ఖర్చు… అదీ తన అఖండ ఔదార్యం… అసంఘటిత కార్మికుల బీమా స్కీమ్‌లో చేర్చాడు… కావాలంటే పాత జీవోలు తవ్వి చూసుకొండి… పురుగుల్లా చూశాడు…
Ads
ప్రెస్ మీట్లలో ఎదురు దాడి, వెక్కిరింతలు, దబాయింపులు, బెదిరింపులు… అత్యంత అప్రజాస్వామిక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో…! ఏ నియంతకైనా నడిచినన్ని రోజులు నడుస్తుంది… తరువాత..? మొన్నటి ఎన్నికల్లోలాగా కొట్టుకుపోతాడు… అదే జరిగింది… చండీ యాగాలు, నవగ్రహ యాగాలే తనకు శ్రీరామరక్ష అనుకునే నియంత కదా…
అసలు మీడియా అకాడమీకి, జర్నలిస్టు యూనియన్‌కు ఒకే అధ్యక్షుడు ఏమిటి..? ప్రశ్నించేవాడూ తనే, ప్రభుత్వమూ తనే… వైచిత్రి… అదేనండీ అల్లం నారాయణ..! తన పదవే తనకు ముఖ్యం… పేరుకు పోరాటం, మావోయిస్టు మాటలు… ఒక్క మాటైనా తన వృత్తి సహచరుల సంక్షేమం, బాగు కోసం మాట్లాడిన దాఖలా ఉందా..? విసిరేసిన నాలుగు ముష్టి డబ్బులు మినహా… ఇదా నాయకత్వం..? ఒక్కరూ మాట్లాడరు, మాట్లాడే స్థితి రానివ్వరు… భయం… విధేయత…
పోనీ, దాంతో ఒరిగిందేముంది..? జేఎన్‌జే సొసైటీకి పేట్‌బషీరాబాద్ స్థలాల అప్పగింత విషయమే తీసుకుందాం… 18 ఏళ్ల పోరాటం, అందరూ జర్నలిస్టులే… ఏదో జర్నలిస్టుల పట్ల సానుభూతో, సానుకూలతో, సీనియర్ జర్నలిస్టుల ప్రయత్నమో… సుప్రీంకోర్టు జడ్జి రమణ సహకారంతో… అది గెలిచారు… నేను అఫిడవిట్ ఇచ్చాను, అందుకే సానుకూల తీర్పు అంటాడు కేసీయార్… కేటీయార్ స్వాగతిస్తాడు… కానీ ఏమైంది..?
స్థలాలు అప్పగించడు… ఎవడికీ టైమ్ ఇవ్వడు… ఎవడూ అడిగేవాడు ఉండడు, అడిగితే ఆ క్యాంపులోనే ఉండడు… సోకాల్డ్ మీడియా అకాడమీ నిర్వీర్వమై, జవజీవాలు కోల్పోయిన పార్థివదేహంలా… అసలు కారణం చెప్పేవాడే ఉండడు… ఆంధ్రావాళ్లు ఎక్కువ అని ఇవ్వడం లేదంటాడు ఒకడు… సో వాట్..? పెద్ద పెద్ద ఆంధ్రావాళ్లు మరణిస్తే, నివాళ్లకు వెళ్లి, రాచమర్యాదలతో అంత్యక్రియలు జరిపించడంకన్నా అన్యాయమా..?
ఆంధ్రుడి అరికాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తానంటివి కదా…! ఎవరో కడుపు నిండిన జర్నలిస్టు ఏదో వాట్సప్ న్యూస్ గ్రూపులో… ఇస్తే ఏముందిలే, క్రెడిట్ వైఎస్‌దే కదా అని ఏదో కూస్తే, దాన్ని పట్టుకుని కేసీయార్ స్థలాల అప్పగింతకు ససేమిరా అన్నాడట… మూర్ఖత్వం… ఈ మాట అనడానికి సాహసిస్తున్నా… సుప్రీంకోర్టు తీర్పు ఉంటే అమలు చేయడానికేముంది..? ప్రభుత్వం అంటేనే ఓ కంటిన్యూయేషన్ ప్రాసెస్… వైఎస్‌కు క్రెడిట్ వస్తే తప్పేమిటట..?
పోనీ, నీ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మాటెప్పుడైనా ఆలోచించావా..? సోకాల్డ్, కేసీయార్ వీరవిధేయ జర్నలిస్టులు ఏమైనా ఆలోచించారా..? విధేయతతో ప్రదక్షిణలు చేయడం కాదు, సొంత వృత్తి సహచరులకు పైసా సాయం చేశామా అని ఎందుకు ఆలోచించలేదు..? ఎందుకు ఆ పదవులు..? బతకలేకా..? చక్రవర్తి కరుణతో వేసే ముష్టితో కడుపు నింపుకోవాలా..? ఆత్మాభిమానం ఏమైంది..?
ఈరోజుకూ… తెలుగువాళ్లకు హైదరాబాదులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలైనా, మరే సాయమైనా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే… ఫ్యాక్ట్… చంద్రబాబులు, కేసీయార్‌లు కాదు… వాళ్లకు మీడియా అధినేతలు కావాలి… జర్నలిస్టులు దేనికి..? నాటి నుంచీ నేటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే జర్నలిస్టులకు కాస్తో కూస్తో సాయం చేసినవాళ్లు… తను అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తాను అన్నాడు రేవంత్ రెడ్డి… కుడోస్… నిలబెట్టుకున్నాడు… మరోసారి చెబుతున్నా…. ఈ కోణంలో కేసీయార్ కన్నా రేవంత్ వేలరెట్లు మేలు… మడమతిప్పని నాయకుడు…!!
Share this Article