Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!

September 4, 2026 by M S R

.

సినిమా కదా… ఏదో ఓ ఫాంటసీ… ఆశ్చర్యంతో కూడిన వినోదాన్ని పంచేందుకు కొన్ని పాత్రలు క్రియేట్ చేయబడతాయి… అసలు స్టార్ హీరోలు చేసే ఫైట్లే పెద్ద ఫాంటసీ ఇండియన్ సినిమాలో… అలాంటిది ఫాంటసీ పాత్రలు, కథలు పెద్ద లెక్కా ఏం..?

ఓ చేయి, ఒకరికి అతికించబడిన ఓ డాన్ చేయి… దానికీ బుర్ర ఉంటుంది, ఉద్వేగాలుంటయ్, పాత పగల్ని గుర్తుంచుకుంటుంది, మనుషుల్ని తరుముతుంది… పోరాటాలు కూడా చేస్తుంది… అతికించబడిన దేహం జస్ట్ రక్తం అందిస్తే చాలు, ఇక దానంతటదే ప్రతీకార పోకడలు కూడా పోతుంది…

Ads

అవును, ఐయామ్ గేమ్ సినిమా గురించే చెప్పుకుంటున్నాం… నిజానికి దుల్కర్ సల్మాన్ పాత్రల ఎంపిక బాగుంటుంది… భిన్నంగా ఉంటాయి పాత్రలు, వాటికి ప్రాణం కూడా పోస్తాడు… అందుకే తెలుగులో కూడా ప్రేక్షక ఇష్టుడు తను… కానీ మూణ్నాలుగేళ్ల తరువాత తన పేరెంట్ మలయాళ ఇండస్ట్రీ కోసం చేసిన ఈ పాత్ర స్థూలంగా ఓ అబ్సర్డ్…

దుల్కర్

ఈ పాత్ర ఓ జూదగాడి పాత్ర… జూదమే వ్యసనం… ప్రత్యేకించి క్రికెట్ బెట్టింగుల పిచ్చోడు… విలాసాలతో బతికే ఈ పంటర్ కోట్లు కోల్పోతాడు… ఫలితంగా అప్పులు… ప్రతి జూదగాడిలాగే తనూ లూజర్, తండ్రి తిడుతుంటాడు… పైసాపైసా కూడబెట్టి, కాపాడుతున్న డబ్బుల్ని కూడా కొడుక్కి ఇచ్చి తల్లి, నీ అప్పులు తీర్చేసుకో నాన్నా అంటుంది…

వాటినీ పోగొట్టేస్తాడు… కానీ బెట్టింగుల మాయాజాలం తెలిసొచ్చి, ఆ రాకెట్ నడిపే డాన్ జోలికి వెళ్లి చేయి కోల్పోతాడు… ఆ చేయి బదులు మరొకరి చేయి అతికించబడుతుంది హీరోకు… అప్పటికే పంటర్ అనే నెెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర… ఆ తరువాత ఆ చేయి సొంత వ్యక్తిత్వంతో తనే హీరో అయిపోతుంది… గందరగోళం అనిపిస్తోంది కదా…

అవును, కానీ ఆ గందరగోళపు పాత్ర కూడా దుల్కర్ పోషించాడు కాబట్టి తెరపై కాస్త అమిరింది… అంతే… సినిమాలో మరో ప్లస్ జేక్స్ బిజోయ్ బీజీఎం… గతంలో ఓ బ్లాక్ బస్టర్ ఆర్డీఎక్స్  (RDX: Robert Dony Xavier) తీసిన నహాస్ హిదాయత్ (Nahas Hidhayath) దీనికి దర్శకుడు… కానీ మెప్పించలేదు ఈసారి… ఎందుకంటే..?

Iam game

హీరోయిన్ పాత్ర కాయదు లోహర్‌‌కు కథలో ఏ ఇంపార్టెన్సూ లేదు… ఎక్కడా కామెడీ వర్కవుట్ కాలేదు… పైగా మూడు గంటల నిడివి… మొదట్లో ఏదో ఈ కథ భిన్నంగా ఉందిగా అనే ఆసక్తిని క్రియేట్ చేసినా, రాను రాను ఓ రొటీన్ కమర్షియల్ మూవీలా తయారై విసిగిస్తుంది… పలుచోట్ల ల్యాగ్…

వీటికితోడు నిర్మాతల చెత్త ప్లానింగ్… ఆల్రెడీ పలుసార్లు వాయిదాలు పడితే ఏవేవో సాకులు చెప్పారు… తీరా రిలీజ్ రోజున మలయాళ వెర్షన్ తప్ప మిగతా భాషల్లో డిజిటల్ సినిమా ప్యాకేజీలు (DCPs) సకాలంలో అందజేయలేక చతికిలపడి, మార్నింగ్ షోలు రద్దు చేశారు… నిజానికి మార్నింగ్ షో టాక్ ఏ సినిమా భవిష్యత్తునైనా తేల్చేసేది… తరువాత కూడా థియేటర్లలో రన్ అయినట్టు లేదు…

అసలే సినిమా మీద పెద్దగా హైప్ లేదు, ప్రమోషన్స్ లేవు, దానికితోడు డిస్ట్రిబ్యూషన్ గొడవలు… వీటన్నింటికి జతగా ఆ కథ పెద్దగా రక్తికట్టలేదు… ఫలితంగా ఈ జూదగాడు ఇక్కడా లూజరే..!! Iam a Game Looser !!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!
  • మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!
  • గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!
  • అన్నీ మంచి శకునములే ! తలనొప్పులూ తలెత్తుకునేలా చేశాయి !!
  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions