Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థానీ డమ్మీ రాకెట్… చైనా డిఫెన్స్ మిసైల్ ఫ్లాప్… మనం ఆనాడే చెప్పాం…

May 30, 2025 by M S R

.

ఇది మూడున్నరేళ్ల క్రితం స్టోరీ… పాకిస్తాన్‌కు చైనా అందించే యుద్ధపరికరాల నాణ్యత, దాని డ్రామా ఏమిటో ఆనాడే మనం ఊహించిన స్టోరీ… వాడంతే… చైనా అంటేనే నాసిరకం… నమ్మలేనితనం… ఒక్కసారి ఆ పాత కథనంలోకి వెళ్దాం… (డిసెంబరు 2021…)



…. By… పార్ధసారధి పోట్లూరి……. భారత్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ కి చెక్ పెట్టింది ! ప్రపంచ దేశాలలో చాలావరకు పాకిస్తాన్ కి ఆయుధాలు అమ్మడానికి నిరాకరిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఏదో విధంగా తనకి కావాల్సిన ఆయుధాలని కొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది.

Ads

తాజాగా తన సబ్‌మెరైన్స్ కి కావాల్సిన టార్పేడోలని కొనడానికి నేరుగా ఇటలీకి చెందిన లియోనార్డోను టర్కీ ద్వారా సంప్రదించింది. టార్పేడోల వివరాలని అడిగి తెలుసుకుంది. పాకిస్థాన్ దగ్గర ఉన్న మెరైన్లు ఏవైతో ఉన్నాయో వాటి నుండి ప్రయోగించగలిగే టార్పేడోలని సెలెక్ట్ చేసుకుంది టర్కీ ద్వారా.

ఇక బేరసారాల కోసం, MoU కుదుర్చుకోవడానికి 6 గురు సభ్యులు గల హైలెవల్ పాకిస్తాన్ నావీ టీం రియర్ అడ్మిరల్ అబ్దుల్ సమద్ నేతృత్వంలో ఇటలీలోని లియోనార్డో ఫాక్టరీని సందర్శించింది. తనకి కావాల్సిన వాటిని ఎన్నుకొని, తదుపరి చర్యల కోసం పాకిస్తాన్ తిరిగి వచ్చింది. కానీ పాకిస్తాన్ నేవీ అధికారులు లియానార్దోని సందర్శించిన విషయం తెలుసుకొని భారత్ చాలా వేగంగా స్పందించింది.

గత 7 సంవత్సరాల నుండి ఇటలీకి చెందిన లియోనార్డో సంస్థ మీద నిషేధం ఉంది మన దేశంలో… అగస్టా వెస్ట్ లాండ్ హెలీకాప్టర్ కుంభకోణం వెలికివచ్చిన సందర్భంలో అగస్టాతో పాటు లియోనార్డోని కూడా బ్లాక్ లిస్టులో పెట్టింది భారత్ ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా…

అయితే పాకిస్థాన్ లియోనార్డోతో చర్చలు జరపకుండా ఉండేందుకు, వ్యూహాత్మకంగా భారత్ లియోనార్డో మీద నిషేధం ఎత్తివేయడంతో లియోనార్డోకి విషయం అర్ధం అయిపోయింది. MoU కోసం పాకిస్తాన్ వెళ్ళడానికి నిరాకరించింది. అంటే పరోక్షంగా మీకు అమ్మబోము అని చెప్పినట్లయింది…

FATF పాకిస్తాన్ మీద విధించిన గ్రే లిస్టు వల్ల డాలర్ల రూపంలో చెల్లింపులు చేయడం కష్టం అని లియోనార్డోకి తెలుసు. అలాంటిది MoU కుదుర్చుకునేటప్పుడు చెల్లింపులు డాలర్ల రూపంలో కాకుండా వస్తు మార్పిడి విధానంలో చెల్లింపులు చేస్తామని చెప్పవచ్చు. కానీ పాకిస్తాన్ నుండి ఇటలీ దిగుమతి చేస్కునే వస్తువులు అంత పెద్ద మొత్తంలో ఏమున్నాయి ?

నిషేధం ఎత్తివేసింది కాబట్టి భారత్ టెండర్లలో పాల్గొనే అవకాశం దొరికింది. పైగా భారత్ ఫ్రాన్స్ నుండి సబ్మేరైన్స్ కొంటున్నది కాబట్టి తనకి అవకాశం ఉంటుంది అన్న ఆశ లియోనార్డోలో కలిగింది. అందువల్లనే పాకిస్థాన్ ని పక్కన పెట్టేసింది.

చేసేది లేక పాకిస్తాన్ టర్కీ నుండి టార్పేడోలని కొనడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. అదీ చెల్లింపులు వస్తు మార్పిడి విధానంలో మాత్రమే. నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇలా తెలివిగా చర్యలు తీసుకుంటే చాలు పాకిస్థాన్ ని ఇరుకున పెట్టడానికి !

గతంలో పుతిన్ పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు S-400 కొనడానికి ప్రయత్నించింది. దానికి పుతిన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ చెల్లింపులు డాలర్ల రూపంలోనే కావాలి అని అడిగాడు. దాంతో అది సాధ్యం కాదని వెనక్కి తగ్గి, ఇప్పుడు షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం కోసం మళ్ళీ చైనానే ఆశ్రయించింది కానీ … ఇప్పటికే చైనా నుండి కొన్న కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సరిగా పనిచేయట్లేదు అంటూ రెండు నెలల క్రితం ఆ ఆర్మీ మొత్తుకుంది.

మిసైల్ టెస్ట్ కోసం ప్రయోగించిన రాకెట్ ఆకాశంలోకి వదిలిన తరువాత చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టం దానిని కొట్టడానికి మిసైల్ ని ప్రయోగించాలి. కానీ ఎంతసేపు చూసినా ఎయిర్ డిఫెన్స్ సిస్టం మిసైల్ ని లాంచ్ చేయలేకపోయింది.

అక్కడే ఉన్న చైనా ఇంజినీర్లు గంట సేపు కుస్తీ పట్టి మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీని మరో టెస్ట్ రాకెట్ ని ప్రయోగించమని కోరారు. కానీ ఈసారి కూడా టెస్ట్ రాకెట్ ఆకాశంలోని దూసుకెళ్లింది కానీ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టం మాత్రం ఏ మాత్రం స్పందించలేదు.

ఇప్పుడు మళ్ళీ అదే ఎయిర్ డిఫెన్స్ సిస్టం కోసం మళ్ళీ ఆర్డర్ చేసింది పాకిస్తాన్. ఎయిర్ డిఫెన్స్ విషయంలో ప్రతి ఒక్క సెకను కూడా చాలా విలువ అయినది అవుతుంది. ఎందుకంటే శత్రు మిసైల్ దూసుకొచ్చేస్తుంది మాక్ 3 వేగంతో. రియాక్ట్ అవడంలో ఒక్క సెకండ్ ఆలస్యం అయినా సరే మొత్తం ధ్వంసం అవుతుంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions