Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జ్యోతి బెడ్రూం, బాత్రూముల్లోకే వెళ్లగలదు… ఈనాడు మనిషి బుర్రల్లోకీ జొరబడగలదు…

October 25, 2024 by M S R

చెప్పుకోవాలి… ఖచ్చితంగా చెప్పుకోవాలి… ప్రపంచంలోకెల్లా అత్యంత నికృష్టమైన, నీచమైన దరిద్ర రాజకీయాలకు అడ్డా ఏపీ… సరే, జగన్- షర్మిల వివాదానికే వద్దాం…

అన్న మీద కోపంతో అయ్య పేరు చెప్పుకుని తెలంగాణలో తిరిగింది… ఆమే, గతంలో సమైక్యవాది, ఎహె, ఫోఫోవమ్మా అని జనం ఛీకొట్టేసరికి… తత్వం బోధపడింది… అప్పటికే కోట్ల ఖర్చు… ఏ కుటుంబమైతే తమకు ద్రోహం చేసిందో ఆ కాంగ్రెస్ పంచనే చేరింది… కాంగ్రెస్ అంటేనే ఓ మాదచ్చోద్ పార్టీ… చేరదీసింది… జగన్‌ను బూతులు తిట్టించింది…

కాగాల కార్యం షర్మి ల తీరుస్తోంది అన్నట్టుగా చంద్రబాబు, అండ్ హిజ్ యెల్లో గ్యాంగ్ ఖుషీ… తీరా ఏమైంది…? ఏ చంద్రబాబు తన కుటుంబాన్ని తొక్కాడో అదే చంద్రబాబు కుర్చీ ఎక్కాడు, అంటే, అదే చెల్లె అన్నను భ్రష్టుపట్టించింది… ఆమే ఇప్పుడు అమాయకంగా నీకు ప్రేమలకన్నా ఆస్తులు ఎక్కువా అనడుగుతోంది…

Ads

jagan

మరి ఆ ఆస్తుల కోసమే కదా నువ్వు నీ కుటుంబ ద్రోహులతో చేతులు కలిపింది… లేడీ విభీషణ్… అంటే ఇక్కడ జగన్ రావణుడని కాదు… సరే, అనుకున్నా పెద్ద ఫరక్ పడదు… కాకపోతే చంద్రబాబును రాముడు అనుకున్న ఆమె అజ్ఙానమే ఆశ్చర్యం… ఇప్పుడు సరస్వతి షేర్ల బదిలీ మీదా వివాదమే… నన్ను వ్యతిరేకించి నా ప్రత్యర్థులతో చేతులు కలిపి నన్ను బదనాం చేస్తావా అనేదే జగన్ అభ్యంతరం… అందుకే తల్లి లేదు, చెల్లి లేదు అనే అభిప్రాయానికి వచ్చాడు… అఫ్‌కోర్స్, భారతి ప్రభావం ఉంటుంది కదా…

ఈ షేర్ల బదిలీ వెనుక టీడీపీ కుట్ర, బెయిల్ రద్దు దుర్మార్గం ఉందని జగన్ అంటున్నాడు గానీ… నాన్సెన్స్… ఎవడైనా రాజకీయమే ఆలోచిస్తాడు… నువ్వు ఆలోచించిందీ అదే కదా గత అయిదేళ్లూ… చంద్రబాబు ఆలోచింకూడదని ఎందుకంటావు..? నువ్వు ఒక్కడినైనా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకున్నావా..? నువ్వు ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రెస్ లేని గాడిద కొడుకుల్ని నమ్మావు… కోట్లు దండుకున్నారు… ఒక్కడైనా నీకు మద్దతుగా నిలిచారా..? చివరకు… ఎస్, చివరకు ఆ వాసిరెడ్డి పద్మ కూడా తిట్టి వెళ్లిపోయింది…

(ఓ చిన్న విషయం… జగన్ ఒకాయనకు ఓ పేద్ద పోస్టు ఇచ్చాడు… తనెప్పుడూ అంతే కదా, అనర్హులకే పెద్ద పీట వేస్తుంటాడు… ఏదో ఇష్యూ ఉంది, వస్తావా అని సజ్జల కాల్ చేస్తే, సారీ, నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాలేను అన్నాడట… నల్లబడిన సజ్జల మొహం ఈరోజుకూ తేటపడలేదు… అలా ఎందరిని మోశారు సార్… అనర్హులను, విశ్వాసరహితులను…)

అటు సాక్షిలో, ఇటు పార్టీలో, మరోవైపు నీ వ్యాపార సంస్థల్లో నీ భార్య ప్రభావంతో జరిగిన నష్టం తెలిసిందా..? సరే, ఇక్కడ కాస్త వేరే చెప్పుకుందాం… జగన్‌ కూడా మనిషే, రాగద్వేషాలు ఉంటాయి, చెల్లి అయితేనేం, తల్లి అయితేనేం… తనకు నష్టం చేస్తుంటే ఎవరినైనా ద్వేషిస్తాడు, సహజం… జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో షర్మిల తనకేదో హక్కున్నట్టు రాద్ధాంతం చేస్తోంది… ప్చ్, మళ్లీ బయటికి మాత్రం దేవుడి వాక్యాలను ప్రచారం చేస్తుంది….

jagan

ఈనాడు ఏం రాసింది..? షర్మిలకు రాసిచ్చిన షేర్ల బాపతు కంపెనీ ఆస్తుల్లో, భూముల్లో 10 వేల కోట్ల నిక్షేపాలున్నాయి, అందుకే జగన్ మాటమార్చి, మాటతప్పి, చెల్లికి ద్రోహం చేశాడు అని… వాడు అంతే… రాధాకృష్ణ కేవలం వ్యక్తుల బాత్‌రూముల్లో, బెడ్‌రూముల్లో మాత్రం కెమెరాలు, స్పై మైకులు పెట్టగలడు… ఈనాడు మాత్రం మనిషి బుర్రల్లోకి దూరి, ఆలోచనల్లోకి దూరి మరీ …. ఇదుగో ఇదేనట అసలే నిజం అని స్టోరీలు రాస్తుంది… ఈరోజు దాని ప్రచారం, బదనాం అదే…

బీజేపీ, కాంగ్రెస్, మీడియా… ఇప్పుడెవరూ జగన్ వెంట లేరు… జగన్ ఇప్పటికైనా మారు… నీ నిజ శ్రేయోభిలాషులెవరో తెలుసుకో… నీ భార్య కాదు, నీ సర్కిల్ కాదు, నీ మీడియా కాదు… కాస్త భిన్నంగా ఆలోచించు… పోయేదేమీ లేదు… నీ చుట్టూ ఉన్న దరిద్రం తప్ప..!! ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ రెండూ నవ్వుతున్నాయి నిన్న చూసి…. ఆ నవ్వులు వినిపిస్తున్నాయా..?! అన్నట్టు నీ సాక్షి రాసింది కదా నీ వెర్షన్, ఓ ఫుల్ పేజీ నిండా…. బాబు వదిలిన కుట్ర బాణం అని… అదెవరి తప్పు… ప్రత్యర్థికి బాణాలు అందించింది ఎవరు..? అఫ్‌కోర్స్, బాణానికి స్వీయ విచక్షణ ఉండదు కదా..! అది వాడుకోబడుతుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions