Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాళ్లను ఎంచక్కా బ్లాకండి… ఇక రిలాక్స్… ఎందుకొచ్చిన తలనొప్పులు…

October 12, 2024 by M S R

డిచ్ కావ్ ….. స్టాక్ మార్కెట్ గురించి హిందీ ఇంగ్లీష్ వీడియోలు చాలానే వింటా … బసంత్ మహేశ్వరీ అని ముంబైలో ఉండే కలకత్తాకు చెందిన మార్వాడీ … అరగంట వీడియోలో ఐదు నిముషాలు అతని సొంత వ్యాపారం . 25 నిముషాలు ఇతరత్రా బాగా ఉపయోగ పడే విధంగా ఉంటుంది .

జపాన్ లో జీరో వడ్డీ రేటు …. నుంచి అరశాతం పెంచారు, ఆ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పై ఎలా ప్రభావం పడుతుందో మొదట అతని వీడియో విన్నాకే అర్థం అయింది . ఓ మూడు రోజుల తరువాత తెలుగులో ఒకరు చెప్పారు … మొదట మేమే చెబుతున్నాం అని గర్వంగా ప్రకటించుకున్నారు .

బసంత్ మహేశ్వరీ కుటుంబంతో పాటు నార్వే పర్యటనకు వెళ్ళాడు … అక్కడి నుంచి కూడా రోజూ వీడియోలు చేస్తాడు … ఆ వీడియోపై కొందరి ట్రోలింగ్ … నార్వే వెళ్లినా బిజినెస్ ఆపవా అని .. దానికి అతను ఎంత బాగా సమాధానం చెప్పాడు … ‘‘ఇంట్లో వాళ్లకు కూడా ఇదే చెబుతాను బిజినెస్ ఉంటేనే నార్వే యాత్ర … బిజినెస్ లేకుంటే ఇక్కడికి ఎలా వస్తాం … బిజినెస్ నాకు తిండి పెడుతుంది, మొదటి ప్రాధాన్యత దానికే’’ అని నిజాయితీ గా చెప్పాడు …

Ads

అతని గురించి ఎందుకు ప్రస్తావన అంటే మర్యాదకరమైన ట్రోలింగ్ ను అతనే చేయమని కోరుతాడు … హద్దు దాటి కామెంట్ చేస్తే … అకౌంట్ నుంచి అతని పేరు తీసేస్తాడు … బ్లాక్ చేస్తాడు … దీనికి అతను పెట్టిన పేరు డిచ్ కావ్ …..

వయసు 55 + ఐనా సినిమాలో ఫైటింగ్ సీన్ లో వచ్చే డిచ్ కావ్ అనే మాటను భలే వినిపిస్తాడు … దేశాన్ని ఉద్ధరించడం ఏమీ అతని డ్యూటీ కాదు . అతనిది వ్యాపారం .. అతను చెప్పే విషయంలో ఉపయోగం అనుకుంటే వీడియో వింటాం లేదంటే లేదు … కొందరు అతి తెలివి చూపిస్తే డిచ్ కావ్ అంటూ వారిని బ్లాక్ చేస్తున్నట్టు వీడియోలోనే చెబుతాడు ..

ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ఫేస్ బుక్ ఏమీ ఉద్యోగం కాదు . మనకు నచ్చినది రాస్తాం, చదువుతాం … మనకు చిరాకు పెట్టే వారికి దూరంగా ఉండాలి .. మన పోస్ట్ లలో చిరాకు పెట్టే వారిని దూరం పెట్టాలి .. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే డిచ్ కావ్ ను నమ్ముకోవాలి … డిచ్ కావ్ సౌకర్యం ఉన్నప్పుడు మనం అసౌకర్యంగా ఉండాల్సిన అవసరం లేదు … ఈ డిచ్ కావ్ పాలసీ ని నేను మొదటి నుంచి గౌరవిస్తూనే ఉన్నాను …. (బుద్దా మురళి, లక్ష్మీకటాక్షం పుస్తకరచయిత)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!
  • ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!
  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…
  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions