Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?

April 30, 2026 by M S R

.

కథ…: ధనుష్ ఒక ఆరితేరిన దొంగ. ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే, తన భార్య (మమితా బైజు) ముందు మాత్రం తాను చాలా మంచివాడినని నమ్మిస్తుంటాడు. ఒకానొక సందర్భంలో పోలీసులకు (సూరజ్ వెంజారమూడు) పట్టుబడటంతో అతని అసలు రూపం భార్యకు తెలిసిపోతుంది.

పోలీసుల నుంచి తప్పించుకున్న ధనుష్, తన భార్యతో కలిసి సొంత గ్రామానికి వెళ్తాడు. అక్కడ తన తండ్రి (కె.ఎస్. రవికుమార్) అప్పుల ఊబిలో కూరుకుపోయాడని తెలుస్తుంది. క్రూరమైన బ్యాంకర్ల నుంచి తన కుటుంబాన్ని, పొలాన్ని ధనుష్ ఎలా కాపాడాడు? తండ్రి కోల్పోయిన గౌరవాన్ని ఎలా తిరిగి తెచ్చాడు? అనేదే ఈ సినిమా మిగతా కథ.

Ads

విశ్లేషణ..: దర్శకుడు విఘ్నేష్ రాజా 1990ల నేపథ్యంలో ఈ కథను రూపొందించాడు. గ్రామీణ ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలు ఎలా దోచుకుంటాయనే అంశాన్ని చూపించాలనుకున్నాడు.  (అక్కడెవరో గిరిజనుడు తనే సమాధి చేసిన సొంత సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చి బ్యాంకర్లకు చూపించిన తీరు, వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ కదా…)

పాయింట్ మంచిదే అయినా, కథనం మాత్రం చాలా పాత కాలం నాటిదిగా అనిపిస్తుంది. భారతీయ సినిమాల్లో ఇప్పటికే మనం అనేకసార్లు చూసిన ‘ఆర్ధిక అణచివేత – హీరో పోరాటం’ అనే ఫార్ములాలోనే ఈ సినిమా సాగుతుంది. హీరో వేసే ప్లాన్ కూడా అంత కొత్తగా ఏమీ అనిపించదు.

సినిమా ప్రారంభంలో వచ్చే రాబరీ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉన్నా, ఆ తర్వాత కథనం నెమ్మదిస్తుంది. క్లిషేలు (పాతకాలపు సీన్లు), పదే పదే వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. ధనుష్ గతంలో నటించిన ‘అసురన్’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి సినిమాల్లోని పాత్రల్లో ఉన్న లోతు, పరిణితి ఇందులో కనిపించదు.

  • ధనుష్…: తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు… పాత్రలో లోతు లేకపోయినా, తనదైన సబ్టల్ యాక్టింగ్‌తో ఎమోషన్స్ పండించేందుకు విఫల ప్రయత్నం చేశాడు…

  • మమితా బైజు…: కొన్ని సీన్లలో మెరిసినా, ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యత లేదు… ఆమెకు ఎందుకింత ప్రాచుర్యం లభించిందో మీడియాలో అర్థం కాదు…

  • ఇతర నటులు…: సూరజ్ వెంజారమూడు తన పాత్రకు న్యాయం చేశాడు…. జయరామ్, కరుణాస్ వంటి ప్రతిభావంతులైన నటులు ఉన్నా వారికి సరైన స్కోప్ దక్కలేదు…

ప్లస్ పాయింట్స్: ధనుష్ నటన, సినిమా ప్రారంభ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్: ఊహించదగ్గ కథ, కథనం (Predictable Screenplay), నెమ్మదించిన సాగతీత సీన్లు, కొత్తదనం లేని క్లైమాక్స్

ముగింపు…: ధనుష్ తన నటనతో ఎంత కష్టపడినా, ‘కర’ ఒక రొటీన్ రిడెంప్షన్ డ్రామాగా మిగిలిపోయింది… పాత కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు విఫలమవ్వడంతో, ఈ సినిమా బోర్ కొట్టించే అవకాశాలే ఎక్కువ…

ఒక్క మాటలో…: పాత చింతకాయ పచ్చడిలాంటి ‘కర’!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
  • ‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?
  • TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!
  • ఆ అసందర్శపు, అసంగత ప్రశ్నకూ… ఆమె పరిణత జవాబు సూపర్…
  • ఆపద్బాంధవుడు… కాసిన్ని కాసులు… బోలెడన్ని చప్పట్లు- అవార్డులు…
  • తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి తెలివైన ‘ఎత్తు’గడ… బీజేపీని లాగాడు…
  • రాజీవ్ హంతకుడు ఇప్పుడు లాయర్ వృత్తిలోకి..! మళ్లీ ఓ చిక్కుముడి..!!
  • అంబానీ ఐపీఎల్ జట్టుకు ఇక సెలవు… కొత్త ఆటగాళ్లే శరణ్యం…
  • అనామకంగా ఆ భక్తిమాధుర్యం… అది అపురూప స్వరసంగమం…
  • 250 + 250 + టార్గెట్స్..? నో ప్రాబ్లం… సరదాగా కొట్టేద్దాం… ఇదేం ఆటరా బాబోయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions