Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాటమయ్య రక్ష..! కల్లు గీత కార్మికుడికి సేఫ్టీ కిట్… అభినందనీయం…

July 13, 2024 by M S R

ముందుగా ఒక వార్త చదవండి… గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’… సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ను రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి…

ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం, లష్కర్‌‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగనుంది. గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Ads

చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను హైదరాబాద్‌ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా తాళ్లు ఎక్కేలా ఈ కిట్లను రూపొందించారు.

ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ పరికరాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఒక్కో కిట్‌లో మొత్తం 6 పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్‌, స్లింగ్ బ్యాగ్, లెగ్‌ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే, యూజర్ ఫ్రెండ్లీగా ఈ పరికరాలు ఉంటాయి…

kit

…. ఇదీ వార్త… అభినందనీయం… ఎందుకంటే… ఎంత టెక్నాలజీ పురోగమిస్తున్నా సరే, సగటు గీత కార్మికుడు నిరపాయంగా చెట్టెక్కి దిగే సౌకర్యం అందుబాటులోకి రావడం లేదు… ఇన్నేళ్లలో ఎన్ని ప్రయోగాలు జరిగాయో గానీ, ఏవీ సరైన ఆచరణలోకి రాలేదు… ఈరోజుకూ గీత కార్మికుడు తమ సంప్రదాయ మోకును మాత్రమే నమ్ముకున్నాడు… అది కాలపరీక్షకు నిలిచింది…

ఐతే ఒక విషయం… ఒక ప్రమాదం జరిగాక కుటుంబానికి ఎంత పరిహారమిచ్చినా ఆ నష్టం పూడదు… గీత కార్మికుడికి వైకల్యం సంభవిస్తే ఇక ఆ క్షణంతో తను వృత్తికి కటీఫ్… బతుకు దుర్భరం… అందుకని ప్రమాదం తగ్గించడమే శరణ్యం… ఆ దిశలో ఈ సేఫ్టీ కిట్ నిజంగానే గీత కార్మికులకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం…

ఇది పలు పరీక్షల దశను దాటిందనీ, అన్నిరకాల సేఫ్ అని ప్రూవయ్యాకే ప్రభుత్వం ఈ కిట్ల పంపిణీకి పూనుకుందని సమాచారం… అంతకుమించి గీత కార్మికులకు కావల్సిందేముంది… పథకం పేరు కూడా కాటమయ్య రక్ష అని పెట్టడమూ ఆప్ట్… ఇదుగో ఇలాంటివే ఓ ప్రజాప్రభుత్వం నుంచి ఆశించేవి, రావల్సినవి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!
  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions