Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేజ్రీవాల్‌కు మరిన్ని ‘న్యాయచిక్కులు’… క్రిమినల్ కంటెంప్ట్ కేసు…

May 19, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  కేజ్రీవాల్‌కు పెరుగుతున్న న్యాయపరమైన చిక్కులు! “రాజకీయ ప్రతీకారం”, “వెండెట్టా”, “జడ్జ్ బైయాస్” అంటూ ఎప్పటికప్పుడు నాటకీయ ఆరోపణలు చేసే రాజకీయాలకు ఢిల్లీ హైకోర్టు మరోసారి గట్టి సందేశం ఇస్తోందా? అవుననే చెప్పాలి.

Arvind Kejriwal, Manish Sisodia, Sanjay Singh తదితర ఆప్ నేతలపై క్రిమినల్ కాంటెంప్ట్ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌లు Navin Chawla , Ravinder Dudeja ధర్మాసనం ముందుకి విచారణకు వచ్చింది, విచారణ మొదలు అయ్యింది. .

Ads

ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ ఇద్దరు న్యాయమూర్తుల ట్రాక్ రికార్డ్ “మిక్స్‌డ్”. అంటే కొన్ని కేసుల్లో ఆప్‌కు అనుకూల నిర్ణయాలు, మరికొన్ని సందర్భాల్లో ఆప్‌కు వ్యతిరేక ఆదేశాలు ఇచ్చారు. అందుకే “ఇవాళ తీర్పు నచ్చలేదు కాబట్టి జడ్జ్‌లు బీజేపీ వాళ్లు” అనే వాదనలు చేయలేరు.

జస్టిస్ నవీన్ చావ్లా ఒకప్పుడు కేజ్రీవాల్‌పై వచ్చిన “ఖలిస్తానీ లింక్స్” ఆరోపణలపై వేసిన PIL ను కొట్టివేశారు. కొన్ని యాక్టివిస్ట్ కేసుల్లో ఢిల్లీ పోలీసులను కూడా కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. కోర్టు గౌరవం, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కఠిన వైఖరి తీసుకుంది.

అదే సమయంలో బీజేపీ నేత దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆప్ నేతలు చేసిన కొన్ని పోస్టులను తొలగించాలని ఆదేశాలు వచ్చాయి, ఎక్సైజ్ కేసులో కూడా కోర్టు ED విచారణను పూర్తిగా అడ్డుకోలేదు.
అంటే… తీర్పులు “పార్టీ ప్రాతిపదికన” కాకుండా కేసు మెరిట్ ఆధారంగా వస్తున్నాయని చాలామంది చెబుతున్నారు.

ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే , రాజకీయ నాయకులు కోర్టులపై సోషల్ మీడియాలో నిరంతరం దాడులు చేయడం, “జడ్జ్ షాపింగ్” ఆరోపణలు చేయడం, ప్రజల్లో న్యాయవ్యవస్థపై అనుమానాలు పెంచడం ఎంతవరకు సమంజసం? అనే అంశం.

కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, “ప్రతిసారి కేసు అనుకూలంగా రాకపోతే కోర్టులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం” అంటున్నారు. ఎందుకంటే చివరికి సామాన్యుడికి న్యాయం చేసే చివరి ఆశ్రయం కోర్టులే.

మరో కీలక అప్డేట్: ప్రధాన లిక్కర్ / ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ ఇప్పుడు జస్టిస్ మనోజ్ జైన్ వద్దకు వెళ్లింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పుకున్న తర్వాత ఈ మార్పు జరిగింది. ప్రస్తుతం చావ్లా- దుదేజా బెంచ్ కేవలం కాంటెంప్ట్ అంశాన్ని మాత్రమే విచారిస్తోంది.

క్రిమినల్ కాంటెంప్ట్ కేసు చిన్న విషయం కాదు. చట్టం ప్రకారం: 6 నెలల వరకు జైలు శిక్ష, ₹2000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
అయితే నిజమైన క్షమాపణ ఉంటే కోర్టులు శిక్ష తగ్గించే అవకాశమూ ఉంటుంది. కానీ నిరంతరంగా సోషల్ మీడియా ప్రచారాలతో న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటే కోర్టులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.

ఇక ఎక్సైజ్ / లిక్కర్ పాలసీ కేసులో ED వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. PMLA కేసుల్లో గత కొన్ని సంవత్సరాల్లో ED కన్విక్షన్ రేట్ 94- 95% మధ్య ఉందని తరచూ ప్రస్తావిస్తున్నారు.

చివరికి పెద్ద ప్రశ్న ఇదే  “Rule of Law” గెలవాలా? లేక “Political Drama” కొనసాగాలా?
న్యాయమూర్తులు భయపడకుండా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తమ పని చేసేందుకు అవకాశం ఇవ్వాలా? లేక ప్రతి కేసును రాజకీయ ప్రచారంగా మార్చాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఆ చర్చను కావాలి అనే కొంత మంది రాజకీయ నాయకులు ముందుకు తీసుకొస్తున్నారు.
— ఉపద్రష్ట పార్ధసారధి

#Kejriwal #AAP #DelhiHighCourt #ArvindKejriwal #ManishSisodia #SanjaySingh #ExcisePolicyCase #ContemptOfCourt #RuleOfLaw #IndianJudiciary #Politics #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేజ్రీవాల్‌కు మరిన్ని ‘న్యాయచిక్కులు’… క్రిమినల్ కంటెంప్ట్ కేసు…
  • విజయ్ మంత్రుల్లో కీలకుడు… ఈ ‘సోషల్ షో’ చూడండి ఓసారి…
  • రంకు మొగుడు అంటే మాస్ ముతక… రంజు మొగుడు అంటే పాలిష్డ్…
  • ఇడ్లీని చక్కెరపాకంలో ముంచితే రసగుల్లా అట…! ఎవడా ఇడ్లీ ద్రోహి..?!
  • ఈ కేసులో అమ్మాయి మేజర్ కాబట్టి సరిపోయింది..!!
  • కన్నీటి అబద్ధాలకంటే… కాలర్‌ ఎగరేసే నిజాలే ఎప్పుడూ గొప్పవి!
  • సొంత ప్రధానినే ఆక్షేపిస్తే… సోయిలేని ‘పత్తాలాట మాటలు’ అంటారు..!!
  • బెంగాల్‌లో ఏం జరుగుతోంది..? మాయ రోగాలకు ‘కాయకల్ప చికిత్స’..!!
  • రక్తికట్టిన ఐపీఎల్… నాలుగో బెర్త్ కోసం ఐదు జట్ల సమరం…
  • నాటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తున్నదంటే…?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions