Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కేసులో అమ్మాయి మేజర్ కాబట్టి సరిపోయింది..!!

May 19, 2026 by M S R

.

నిన్న ఒక వార్త కనిపించింది… జనగామ జిల్లా, బచ్చన్నపేటలో… 45 ఏళ్ల ఓ బీఆర్ఎస్ నాయకుడు తనకు రావల్సిన 20 లక్షల అప్పు కిందకు, 18 ఏళ్ల ఓ యువతి తల్లిదండ్రులను బెదిరించి పెళ్లి చేసుకున్నాడు అని వార్త… ఆ యువతి మహిళ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం కోరిందని సారాంశం… అసలే బండి కుమారుడి పోక్సో కేసు మీద బీఆర్ఎస్ రచ్చ రచ్చ చేస్తూ, విపరీతమైన క్యాంపెయిన్ చేస్తోంది కదా… మరి ఈ 45 ఏళ్ల నాయకుడి అప్పు, పెళ్లి కథేమిటి, ఎవరూ మాట్లాడరేమిటి అని ఆశ్చర్యం కలిగింది…

తీరా ఈరోజు భిన్నమైన వెర్షన్లు వినిపిస్తున్నాయి… సరే, నిన్నటి వార్త ఏమిటంటే..? బచ్చన్నపేటకు చెందిన రాకేశ్ గౌడ్ కొన్నేళ్ల క్రితం ఓ ఎస్టీ మహిళను పెళ్లి చేసుకున్నాడు… ఓ కూతురు… ఇప్పుడు ఆ అమ్మాయి వయస్సు 18… తరువాత ఆయన ఆ భార్యను వదిలేసి తన సొంత సామాజికవర్గానికి చెందిన మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు…

Ads

వాళ్లు పెంబర్తికి చెందిన శ్రీశాంత్ రెడ్డికి 20 లక్షలు బాకీ ఉన్నారు… మరికొంత అప్పు కావాలని అడిగితే శ్రీశాంత్ మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండని నిర్బంధపెట్టాడు… దాంతో తండ్రి, పినతల్లి కలిసి తనను బెదిరించి, శ్రీశాంత్‌తో స్థానికంగా, జీడికల్ గుడిలో కులాంతర పెళ్లిచేశారనీ, (అంటే అమ్మేశారనీ) స్నేహితుల సాయంతో న్యాయం కోసం మహిళ కమిషన్‌ను ఆశ్రయించానని ఆ అమ్మాయి లహరి ఆరోపించింది…

ఈరోజు వార్త పూర్తిగా భిన్నమైన వెర్షన్… పెళ్లయిన మర్నాడే బంగారం, నగదు తీసుకుని కొత్త పెళ్లికూతురు మాయం అయిపోయిందని సదరు శ్రీశాంత్ రెడ్డి జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు… అది దర్యాప్తు చేస్తున్నారు, ఇటు ఆ అమ్మాయి మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది… ఆమె మేజర్ కాబట్టి సరిపోయింది… లేకపోతే శ్రీశాంత్ రెడ్డి మరోరకంగా బుక్కయ్యేవాడు… (తన వయస్సు 45 కాదు, 34 మాత్రమే అంటున్నాడు)…

ఈ వార్తలు చదువుతుంటే మరో విషయం కాస్త ఆసక్తికరంగా అనిపించింది… ఈ అమ్మాయికి గత నవంబరులో ఓ కులాంతర వివాహం జరగాల్సి ఉంది… కానీ ఆ పిల్లాడు మైనర్ అట, ఈ ఫిర్యాదు రాగానే అధికారులు ఆ పెళ్లిని ఆపివేయించారట… అంటే… అమ్మాయి తండ్రి గౌడ్, తను పెళ్లిచేసుకున్నది ఎస్టీ మహిళను, ఈమెను రెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు, ఈ అమ్మాయికి అంతకుముందే ఓ ఇతర కుల మైనర్‌తో పెళ్లి జరగబోయి తప్పిపోయింది… స్థూలంగా ఇదీ విషయం… !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions