Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెంగాల్‌లో ఏం జరుగుతోంది..? మాయ రోగాలకు ‘కాయకల్ప చికిత్స’..!!

May 19, 2026 by M S R

.

సువేందు శుద్ధి ఆపరేషన్..? బెంగాల్‌లో ఒక్కో నిర్ణయం రాజకీయ భూకంపమే! 

మమత పశ్చిమ బెంగాల్‌ను ఓ బంగ్లాదేశ్‌గా మార్చింది… ఓ రౌడీ రాజ్యంగా మార్చింది… దేశభద్రతకెే ప్రమాకరంగా మారింది… అవినీతి, అక్రమాల సిండికేట్ల రాజ్యంలో భయం రాజ్యమేలింది… టీఎంసీకి వోట్లేయకపోతే కూడా దాడులు… పర్టిక్యులర్‌గా వందల కుటుంబాలు అస్సాం వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాయి… అదొక నరకం…

Ads

ఎట్టకేలకు బెంగాల్‌కు విముక్తి దొరికింది… యాంటీ బీజేపీ కళ్లతో ఎవరెంత మమతను వెనకేసుకొస్తున్నా… ఈ దేశం చూసిన అత్యంత ప్రమాదకర రాజకీయవేత్త మమత… సరే, సువేందు వచ్చాడు, సీఎం అయ్యాడు, ఏమైనా మార్పు ప్రారంభమైందా..? మామూలు మార్పు కాదు, ప్రభుత్వపరంగానూ, ప్రజలపరంగానూ…

ఆక్రమించుకున్న గుళ్లకు విముక్తి… బళ్లకు విముక్తి… బీజేపీ, సీపీఎం ఆఫీసులకు విముక్తి… ఎక్కడపడితే అక్కడ టోల్ గేట్లు పెట్టుకున్న సిండికేట్ల నుంచి రోడ్లకు విముక్తి… రాష్ట్రంలో సంబురాలు… ఒక జాతి విముక్తి పొందింది అన్నంత వాతావరణం… మరి ప్రభుత్వం..?

అదే టీఎంసీ క్యాంపు నుంచి వచ్చిన సువేందు మార్పు అంటే ఏమిటో చూపిస్తున్నాడు… (తను అనుభవశూన్యుడైన జోసెఫ్ విజయ్ కాదు… ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగిన నిర్ణయం లేదు ఇప్పటికి… లంచ్ బాక్సుల ఫోటోలు తప్ప)… ప్రధానమైన ప్రభుత్వ నిర్ణయం ఏళ్లుగా బంగ్లా అక్రమ వలసదార్ల కోసం, ఆ వోట్ల కోసం తాటకి సరిహద్దుల్లో కంచెకు భూమి ఇవ్వలేదు, సొరంగాలు తవ్వుతున్నా సోయి లేదు… పైగా అక్రమ వలసదార్లకు ఆధార్ కార్డులు, వోటర్ కార్డులు, రేషన్ కార్డులు… అంతేకాదు…

76 ముస్లిం కులాల్ని ఏకంగా ఓబీసీల్లో కలిపేసింది… ప్రభుత్వ పథకాలు ఇచ్చేసింది… అనేక హిందూ కులాలు ఏళ్లుగా తమను బీసీల్లో కలపాలని కోరుతున్నా పెడచెవిన పెట్టింది.. కోర్టు కూడా తప్పుపట్టింది… ఇప్పుడు సువేందు ఆ మతాధారిత పథకాల్ని రద్దు చేసి, ఓబీసీ జాబితా నుంచి ఆ కులాలను తీసేసింది… మార్పు అంటే ఇదీ… కుదిపేస్తున్నాడు… జాతి పునర్నిర్మాణ దశలో ఉంది…

సంక్షేమం వైపు… మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, “అన్నపూర్ణ” పథకం, ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు వంటి పాపులర్ నిర్ణయాలు ఒకవైపు… మమత మైనారిటీ అనుకూల ప్రభుత్వ విధానాల సమీక్ష సాగుతోంది మరోవైపు… అత్యంత భావోద్వేగ అంశమైన RG Kar Medical College rape and murder case విషయంలో కూడా సువేందు ప్రభుత్వం దూకుడు చూపించింది…

ఈ కేసులో “దర్యాప్తు మేనేజ్ చేశారు”, “సాక్ష్యాలు దాచారు” అన్న ఆరోపణలతో ముగ్గురు IPS అధికారులను సస్పెండ్ చేయడం బెంగాల్‌లో సంచలనమైంది… మాజీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పైనా చర్యలు తీసుకోవడం ద్వారా — “ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని వారినీ ఇప్పుడు వదలమన్న సందేశం” ఇచ్చారనే విశ్లేషణలు వచ్చాయి…

ఈ కేసు సమయంలో రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు, మహిళా సంఘాలు, సాధారణ ప్రజలు… “నిజం బయటకు రావాలి” అని నెలల తరబడి ఆందోళనలు చేశారు… ఇప్పుడు అదే కేసును రాజకీయంగా BJP మళ్లీ ముందుకు తీసుకురావడం గమనార్హం… ఇక మరో హాట్ టాపిక్ — Abhishek Banerjee కుటుంబంపై పెరుగుతున్న ఒత్తిడి…

పేరుకు మమత నిరాడంబరురాలు… కానీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓ రాజకుమారుడు… అత్యంత విలాసం, అవినీతి… అభిషేక్ భార్య రుజిరా బెనర్జీపై ఉన్న డ్యుయల్ పాస్‌పోర్ట్ ఆరోపణలు మళ్లీ చర్చకు వచ్చాయి… పాత ఫైళ్లు తెరుచుకోనున్నాయి… ఆమె థాయ్ పౌరురాలు… రుజిరా సోదరి మీద బోలెడు ఆరోపణలు, ఈడీ కెేసులు, విచారణలు సరేసరి…

టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్, మున్సిపల్ అవినీతి కేసులు, కట్‌మనీ ఆరోపణలు — ఇవన్నీ తిరిగి యాక్టివ్ అవుతుండటంతో తృణమూల్ నేతల్లో ఆందోళన పెరిగింది… పాపం పడుంతోంది సరే… కానీ ఈ యాక్షన్ ఇలాగే స్థిరంగా కొనసాగుతుందా..? ఎక్కడ సువేందు వెనక్కి తగ్గినా, తాటకి మళ్లీ ప్రాణం పోసుకున్నా ఈసారి సిలిగురి కారిడార్‌సహా అసలు బెంగాలే చేతుల్లో లేకుండా పోతుంది…

బంగ్లాదేశ్ నుంచి ఈ బెదిరింపులు స్టార్టయ్యాయి… వాళ్లకు మమత అంటే అనుకూల దేవత, దీదీ… ఏకంగా కేంద్రం ముళ్లకంచెలు మమ్మల్ని ఆపలేవు అని బంగ్లాదేశ్ విదేశాంగ వర్గాలు, నాయకులు మాట్లాడుతున్నారంటే ఎంతగా బరితెగించారో, మమత ఎవరి కోసం పనిచేసిందో అర్థమవుతోంది… గతం వేరు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఐఎస్ఐ గుప్పిట్లోకి చేరిపోయింది… బంగ్లాదేశ్ ఇప్పుడు శతృదేశమే ఇండియాకు… మరి బంగ్లాదేశ్ ప్రజలను మాత్రమే ప్రేమించే మమతను ఏమందాం..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బెంగాల్‌లో ఏం జరుగుతోంది..? మాయ రోగాలకు ‘కాయకల్ప చికిత్స’..!!
  • రక్తికట్టిన ఐపీఎల్… నాలుగో బెర్త్ కోసం ఐదు జట్ల సమరం…
  • నాటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తున్నదంటే…?
  • అమెరికాలో అదానీ కేసు వింత ‘సెటిల్మెంట్’ కథ ఇదీ…
  • అధికారమే పరమావధి… ఓ జర్నలిస్టుకు అనుభవంతో తత్వబోధ
  • చట్టిలో సరుకేదో నింపుకెళ్లు… భువనచంద్రుడూ వేటూరికి తీసిపోడు…
  • పాపం సాయి భగీరథ్… ఆంధ్రజ్యోతికి కన్నీళ్లొక్కటే తక్కువ…
  • అయోధ్యకు బాలీవుడ్ డబ్బు… సెలబ్రిటీల భారీ పెట్టుబడులు…
  • ఎర్రన్నలు మొత్తుకుంటుంటారు కదా… చైనాలో ప్రెస్ ఫ్రీడమ్ తెలుసా..?!
  • ఎబోలా…! ఏమో, అజాగ్రత్తగా వదిలేస్తే మరో కోవిడ్..? అసలే ప్రాణాంతకం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions