Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హసీనా పార్కర్..! దావూద్ చెల్లెలు, ముంబై లేడీ డాన్… బయోపిక్ ఫ్లాప్..!!

December 31, 2024 by M S R

.

.   (  కే ఎన్ మూర్తి  ) ..       ….  ఆమె తన అన్నను అనుసరించింది.. కోట్లు సంపాదించింది. చీకటి సామ్రాజ్యానికి కొడుకును రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు. రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా…

చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన మహిళా డాన్ ఈమె. డిఫరెంట్ స్టైల్ లో అనుచరుల చేత పనులు చేయించుకునేది. ఇంతకూ ఈ లేడీ డాన్ ఎవరో కాదు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సొంత చెల్లెలు. దావూద్ తండ్రి ముంబయిలో హెడ్ కానిస్టేబుల్ గా చేసేవాడు. ఆయన ఏడవ సంతానం హసీనా.

Ads

హసీనా ఇబ్రహీం పార్కర్ ను పెళ్లి చేసుకుని తన కాపురమేదో తాను బుద్ధిగా చేసుకుంటున్నది.  ఈ క్రమంలో ఆమె జీవితంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 1992 లో దావూద్ పై కోపంతో అరుణ్ గావ్లీ తన అనుచరులు  దయానంద్ పూజారి మరి కొందరి సహాయంతో హసీనా భర్త పార్కర్ను చంపేశారు. అంతకుముందు అరుణ్ గావ్లీ, రామానాయక్ తదితరులు దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసేవారు.

dawood

వీరంతా పోలీసుల కళ్లుగప్పి స్మగ్లింగ్ లో చురుగ్గా ఉండేవారు. భూముల కబ్జా వ్యవహారంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు దిగారు. అందులో భాగంగానే హసీనా భర్తను కాల్చేశారు. దావూద్ గ్యాంగ్ తిరిగి అరుణ్ గావ్లీ సోదరుడు బప్పా మరికొందరు అనుచరులను చంపేశారు. దావూద్ 93 లో బాంబు పేలుళ్ల తరవాత దేశం విడిచి పారిపోయాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి ఆమె తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.

తర్వాత మెల్లగా హసీనా అండర్ వరల్డ్ కార్యకలాపాల్లోకి ఎంటర్ అయింది. అప్పట్లో ముంబయి సమీపంలోని  నాగ్‌పాడ్‌లోని గోల్డెన్ అపార్టుమెంట్స్ లో హసీనా ఉండేది. అక్కడ నుంచి ముంబాయికి మకాం మార్చింది. అన్న దావూద్ ఇబ్రహీం చెప్పాడో లేక తనే అన్నను చూసి స్ఫూర్తి పొందిందో తెలీదు కానీ డాన్ గా మారింది.

lady don

అంతకుముందు దావూద్ దగ్గర పనిచేసిన వాళ్ళను చేరదీసి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంది. మెల్లగా దందాలు మొదలెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం, భూములు ఆక్రమించడం , డబ్బులు దండుకోవడం వంటి పనుల నుంచి హవాలా కార్యకలాపాలు చేసే వరకు ఎదిగింది.

మిడిల్ ఈస్ట్ నుంచి ఇండియాకు, ఇతర దేశాలకు మనీ ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకుంది. ముంబాయి  వ్యాపార వర్గాల వ్యవహారాల్లోకి దూసుకెళ్లింది. ఇంకా డ్రగ్స్ సరఫరా, ఇతర సెటిల్మెంట్ విషయంలో తన సత్తా చాటుకుంది. కొన్ని చోట్ల తన అన్న దావూద్ పేరు కూడా వాడుకుంది.

పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేది. అన్న తరహాలోనే బాలీవుడ్ సినీ పరిశ్రమపై పట్టు సాధించే ప్రయత్నాలు చేసింది. నిర్మాతలను బెదిరించి సినిమా రైట్స్ రాయించుకునేది. పోలీసులు దావూద్ తో హసీనాకు సంబంధాలు లేవని చెబుతారు. కానీ రహస్యంగా హసీనా దావూద్ తో మాట్లాడేదని స్థానికులు అంటారు.

స్వల్పకాలంలోనే ఆమె ఆస్తుల విలువ సుమారు 5 వేల కోట్లకు చేరుకున్నాయి. మెల్లమెల్లగా ముంబాయిలో హసీనా జోరు పెంచాలని ప్రయత్నించింది. అయితే పోలీస్ నిఘా బాగా పెరగడంతో ఆమె అనుకున్నట్టు జరగలేదు.

హసీనాపై మొత్తం 88 కేసులు నమోదు కాగా ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. పోలీసుల కళ్ళు కప్పి చాకచక్యంగా తప్పించుకుని  తిరిగేది. అయినా అనుక్షణం భయంతోనే బతికింది.

పోలీసుల వేధింపులు బాగా పెరగడంతో ఒక దశలో విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించింది. పాస్ పోర్ట్ పోగొట్టుకుని కొత్త దాని కోసం అప్లై చేయగా హసీనా దావూద్ సోదరి అని గమనించి,  ఆమెపై కేసులు పరిశీలించి  పాస్ పోర్ట్ జారీ చేయడానికి అధికారులు నిరాకరించారు .దాంతో ముంబాయిలో హసీనా ఉండిపోయింది.

ఇక 2006 లో  హసీనా కుమారుడు డానిష్ పార్కర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక చిన్న కేసులో ఇరుకున్న డానిష్ పార్కర్ అంతకుముందు వారం నుంచి తల్లికి కూడా కనబడలేదట. అతగాడు చనిపోవడంతో హసీనా ఆశలు తల కిందులయ్యాయి. అతగాడిని  చీకటి సామ్రాజ్యానికి రాజుని చేయాలని హసీనా భావించింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. మనోవ్యధతో కొన్నాళ్ళు మంచాన పడింది.

అదే సమయంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజంటుని బెదిరించిన  కేసులో ఇరుక్కుంది. పోలీసులు నెలల తరబడి వేధించారు. చివరికి బెయిల్ తెచ్చుకుని బయటపడింది. అపుడే అన్న దావూద్  కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండమని సూచించారు.  అక్కడ నుంచి ఆమెను వ్యాపారవర్గాలు పట్టించుకోవడం మానేశాయి. ఇతర గ్రూపులు పుంజుకోవడంతో హసీనా రేసులో వెనుకబడింది. పోలీసులు ఆమె అనుచరులను పలు కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసారు.

అప్పట్లో హసీనా రెండో కుమారుడు అలీషా పార్కర్ ఈ అండర్ వరల్డ్ కార్యకలాపాలపట్ల అంత సుముఖత చూపలేదు. అలా అలా హాసీనా అండర్ వరల్డ్ కార్యకలాపాలకు దూరమై  2014 లో గుండె పోటుతో మరణించింది. ఇక ఈమె జీవితాన్నే కొన్ని మార్పులు .. చేర్పులతో  ‘హాసీనా పార్కర్’ పేరిట సినిమాగా తీశారు.

haseena

సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. తొలుత కుటుంబ సభ్యులు సినిమాకు అనుమతి ఇవ్వలేదు. కానీ దర్శకుడు అపూర్వ లఖియా వారిని ఒప్పించి సినిమా తీశారు. శ్రద్దాకపూర్ హసీనా పాత్రలో నటించింది. సినిమా ఆసక్తికరంగా రూపొందలేదనే విమర్శలు వచ్చాయి.  యుట్యూబ్ లో సినిమా ఉంది … ఆసక్తి గలవారు చూడవచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions