Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన దగ్గర లస్కుటపా హీరోలు సైతం కోట్లకుకోట్లు తీసుకుంటారు…

June 18, 2024 by M S R

5 సంవత్సరాల క్రితం కొత్త కారు కొని, మూడు నెలల తర్వాత సర్వీసింగ్ కి ఇచ్చి సర్వీసింగ్ అయ్యాక తీసుకొని బయటికి రాగానే, డ్యాష్ బోర్డ్ మీద లైట్లు అన్నీ వెలుగుతున్నై (కార్ లో అన్నీ రాంగ్ గా ఉన్నై అని చూపిస్తుంది). వెంటనే వెళ్ళి సర్వీసింగ్ పిలగాడిని అడిగితే, సారీ అన్నా, నేను అన్నం కూడా తినలేదు. రోజంతా 100 కార్ల కి పైగా సర్వీసింగ్ చేయాలి, ఏదో పొరపాటు జరిగింది అన్నాడు.

నిజానికి అతను లంచ్ కి ఒక గంట తీసి, మిగతా 8 గంటల్లో 16 కార్లు మాత్రమే సర్వీసింగ్ చేస్తే జపాన్, జర్మనీ కంటే బెటర్ గా సర్వీసింగ్ చేసేవాడు. కానీ మన దగ్గర యజమానులు డబ్బు కక్కుర్తితో రోజుకి వందల కార్లు సర్వీసింగ్ చేయాలి అని పెట్టుకుంటారు. క్రింది స్థాయి ఉద్యోగులకి ఒకరకంగా ఉంటుంది, IAS/IPS లకి ఒకరకంగా ఉంటుంది. కనీసం భోజనం చేయటానికి కనీసం అర్ధ గంట అయినా ఇవ్వకపోతే ఎలా..?

ఇంకా 1000 రూపాయల పీజు కట్టి డాక్టర్ దగ్గరికి సామాన్యుడు వెళ్తే 2 నిమిషాలు మాట్లాడి ఏదొ ఒకటి రాసి పంపిస్తారు. అదే అమెరికా, కెనడాలో ఒక డాక్టర్ 20 నుంచి 30 మంది పేషెంట్స్ ని మాత్రమే, అది కూడా అపాయింట్ మెంట్ ప్రకారం చూస్తారు. ఒక అర్ధగంట మాట్లాడి ప్రతి అంశం క్షుణ్ణంగా మాట్లాడి తెలుసుకుంటారు. ఒక ఇంజెక్షన్ వేసాక అర్ద గంట అక్కడే కూర్చోపెట్టుకొని ఏమీ నెగటివ్ ఎఫెక్ట్ లేదు అని నిర్దారణ అయ్యాక పంపిస్తారు.

Ads

మన దగ్గర కొన్ని వందల వేల పేషెంట్స్ ని ఒక డాక్టర్ చూడాల్సిన పరిస్థితి. నిజానికి ప్రపంచంలో మన డాక్టర్సే బెస్ట్. వాళ్ళు కూడా రోజుకి 20 మందిని మాత్రమే చూస్తే బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఆ విధంగా రూల్స్ చేస్తే ఎక్కువ మందికి జీవనోపాధి కలుగుతుంది. కానీ కొంతమంది డాక్టర్స్ వందల వేల కోట్లు సంపాదిస్తారు, మిగతా వాళ్ళకి కనీస జీవనోపాధి కూడా ఉండదు.

లియోనార్డ్ డీకాప్రియో, విల్ స్మిత్ నటించిన సినెమాలు ప్రపంచం అంతా చూస్తారు. ప్రపంచంలోనే ఫైనెస్ట్ యాక్టర్స్ వాళ్ళు. నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కష్టపడి సినెమా తీస్తే వాళ్ళు తీసుకునే పారితోషకం 50 కోట్లు. మన దగ్గర లస్కుటపా హీరోలు కూడా అంతకంటే ఎక్కువే డిమాండ్ – లాభం వస్తే హీరోకే, నష్టం వస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత, దర్శకుడు ఇంకా చాలా మంది నష్టపోతారు. లాభాలు వస్తే మాత్రం అందరికీ సరిగ్గా రావు, హీరోకే ఎక్కువ బెనిఫిట్. అందుకే మన దగ్గర మంచి సినెమాలు దాదాపు రావు.

మన దేశంలో గంటకి ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో ఒకసారి గూగుల్ లో చూడండి. డబ్బులు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అసలు ఎంతమందికి డ్రైవింగ్ రూల్స్ తెలుసు..? సంవత్సరానికి ఎన్ని వందల, వేల, లక్షల ప్రాణాలు పోతున్నై, ఎంత మందికి గాయాలు అయ్యి జీవితాలు నాశనం అవుతున్నై..? ఎవడూ పట్టించుకోడు.

నిజానికి మన రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎఫీషియంట్ మరియూ డైనమిక్ పర్సన్. గూగుల్ సుందర్ పిచ్చయ్య లాగా పెన్సిల్వేనియా యూనివర్శిటీలో చదువుకున్నాడు, ఇంకా రాజకీయంలోకి రాక ముందు IAS గా ఒరిస్సాలో పని చేశాడు. అంతకుముందు IIT కాన్పూర్ లో చదువుకున్నాడు. అయితే అతను ఒక్కడే పర్ ఫెక్ట్ గా ఉంటే రైల్వే ప్రమాదాలు ఆగుతయా…?

మన వ్యవస్థ అంతా చిందరవందరగా ఉంది. రైల్వే ఉద్యోగులకి ప్రోపర్ ట్రయినింగ్ ఉందా..? రికమెండేషన్స్ తో ఉద్యోగాలకి వస్తారు చాలా మంది. మన దేశంలో అజాగ్రత్త, నిర్లక్ష్యం, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా పనులు చేయటం. ప్రతిదీ డబ్బుతో ముడి పెట్టి చూడటం… ఇవి అన్నీ మారాలి, ఏదో ఒక రోజు మార్పు వస్తుంది కాని ఎప్పుడు వస్తుందో తెలియదు.

క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది. మన దేశంలో ప్రతి ఒక మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అంటే వ్యక్తులు మారాలి మరియూ వ్యవస్థలు మారాలి. అప్పటి వరకు అయోమయం జగన్నాధంలా బతకాల్సిందేనా …! – సామాన్యుడు జగన్నాథ్ గౌడ్ (వ్యక్తిగత అభిప్రాయం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions