Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Makutam ! ఓ సోది కథ – నరుకుడు, దంచుడు… పాపం, విశాల్ !!

August 14, 2026 by M S R

.

ఒకవైపు టాప్ హీరో సూర్య కూడా రొటీన్ బీభత్సపు హింస, వెగటు మసాలాల్ని వదిలేసి… ఆ కమర్షియల్ లెక్కల్ని వదిలేసి… పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా చేశాడు, విశ్వనాథ్ అండ్ సన్స్… సరిగ్గా ఇదేరోజు మరో హీరో విశాల్ (చాన్నాళ్లుగా హిట్ లేదు పాపం) మాత్రం అదే పిచ్చి ఫార్ములా పంథాలో తనే దర్శకుడిగా మారి ఓ సినిమా చేశాడు… ఈ సినిమా పేరు మకుటం…

ఒకడిని భరించడమే కష్టం, అలాంటిది మూడు రకాల షేడ్స్… పోనీ, కాస్తయినా క్రియేటివిటీ చూపించాడా..? నెవ్వర్… విశాల్ మారడు, మారలేడు… మారాల్సింది ప్రేక్షకులే… తనను వదిలేసి వెళ్లాల్సిందే ఇక…

Ads


సినిమా అంటే కేవలం రెండు ఫైట్లు, మూడు పాటలు, కథతో సంబంధం లేని ఒక కామెడీ ట్రాక్, లీటర్ల కొద్దీ నెత్తురు చిందించే హింస మాత్రమేనా? కథనం కొత్తగా ఉండక్కర్లేదా? అనే విసుగు ప్రశ్నలకు నిలువెత్తు సినిమా రూపం ఈ ‘మకుటం’.

విశాల్ తన పాత సినిమాల ఫార్ములానే నమ్ముకుని తీసిన ఈ చిత్రం, కొత్తదనం ఆశించే ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్షే పెడుతుంది. అదే పాత కథ మళ్లీ మళ్లీ… తండ్రి పాత నేర చరిత్ర, కొడుకు కోసం మళ్లీ కత్తి పట్టడం.. ఇది మనం దశాబ్దాలుగా చూస్తున్న కథే. ఇందులో ఎలాంటి కొత్త ట్విస్ట్‌లు కానీ, సర్ప్రైజ్‌లు కానీ లేవు.

సినిమా నిడివి 3 గంటల పైమాటే… మొదటి భాగంలో కథ అస్సలు ముందుకు కదలదు… కేవలం నిడివి పెంచడం కోసమే సీన్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది… కథతో ఏమాత్రం సింక్ అవ్వని ఒక సపరేట్ కామెడీ ట్రాక్ పెట్టడం వల్ల సినిమా ఫ్లో దెబ్బతింది. ఆ కామెడీ కూడా నవ్వించకపోగా, చిరాకు తెప్పిస్తుంది… పైగా అదే తమిళ అతి…

ఏదో తెలుగులోనూ నేను పరిచయమే కదా, నాలుగు డబ్బులు రాకపోవు పరిగె ఏరుకున్నట్టుగా… అన్న భావనతో తెలుగులో రిలీజ్ చేయడం, అంతే… యాక్షన్ పేరుతో స్క్రీన్ నిండా రక్తం, నరుక్కోవడాలు చూపించారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు ఇది తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. థియేటర్‌లో గుప్పున కొట్టే నెత్తుటి కమురు వాసన…

జి.వి. ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్…  ఈ రొటీన్ డ్రామాలో కాస్తో కూస్తో ఊరటనిచ్చేది ఆయన సంగీతమే… నటుడిగా విశాల్ యాక్షన్ సీన్స్ కోసం పడిన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ పేలవమైన కథాకథనాల కారణంగా సార్థకత లేదు, పైగా తన నటనకు ఇప్పటికీ పరిమితులున్నాయి…

చివరగా… ఒకవైపు సూర్య లాంటి టాప్ స్టార్లు కూడా వైవిధ్యమైన కథలతో మనసులను గెలుచుకుంటుంటే, విశాల్ లాంటి సీనియర్ హీరోలు ఇంకా అదే పాత ఫార్ములా, అదే ల్యాగ్, అదే హింసను నమ్ముకోవడంపై జాలి పడాల్సిందే…

రొటీన్ మాస్ మసాలా సినిమాలకే అలవాటు పడీ పడీ, అవే టేస్టీ సినిమాలుగా భ్రమాత్మకంగా బతికే జీవితాలు కొన్ని ఉంటాయి… వాళ్లకు ఏమైనా కాస్త నచ్చుతుందేమో ఈ సినిమా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions