మీ దుంపలు తెగ… అసలే బిగ్‌బాస్ షో మీద సీపీఐ నారాయణ వంటి వృద్ధ నేతలు వ్యభిచారకొంప అని తిడుతూ ఉంటారు… మరోవైపు శివాజీ అనే మరో వృద్ధ వెగటు నటుడు మా పల్నాడు స్పెషల్ అంటూ బూతులు యథేచ్ఛగా వదులుతూ ఉంటాడు… ఇవి సరిపోవన్నట్టుగా అమర్దీప్ కూడా రెచ్చిపోయి బిగ్‌బాస్ షోను కాస్తా జబర్దస్త్ 2.0 గా మార్చేశాడు… ఫాఫం, ప్రియాంక, హౌజులో చివరకు మిగిలిన ఆడ లేడీ పోటీదారు కదా… అమర్దీప్ భాషకు, ద్వంద్వార్థాల వెకిలి కామెడీకి తలవంచుకుంది…
అందరూ ఫైనల్స్‌లో చేరారు కదా… రిలాక్స్ మోడ్‌లోకి వచ్చేశారు… నామినేషన్లు లేవు, హీట్ లేదు, టాస్కుల్లేవ్, పోటీల్లేవ్, ఎంటర్టెయిన్మెంట్ లేదు… బోరింగ్ అయిపోయింది షో… అది రేటింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది కదా… అందుకని ఏదో వినోదం కోసం నానా పాట్లు పడుతోంది బిగ్‌బాస్ టీం… ఆరుగురు ఫైనలిస్టులు కూడా పాత పగలు, పోటీలన్నీ మరిచి కలిసిపోయారు… ఇక ఏకంగా బూతులతో వినోదానికి దిగడమే ఇక్కడ నచ్చనిది…
అమర్‌దీప్‌కు జ్యోతిష్కుడి వేషం వేసి, అందరి జాతకాలూ చెప్పించే ఓ వినోద ప్రయాస పెట్టారు… (గతంలో హరితేజ హరికథలాగా…) మిగతా యవ్వారాలు, ఫౌల్ గేమ్స్ ఎట్సెట్రా వేషాలు ఎలా ఉన్నా సరే అమర్ దీప్ మంచి నటుడు… కామెడీ టైమింగ్ కూడా ఉంది… కానీ మరీ ప్రశాంత్ చేతిని భూతద్దంతో చూస్తూ… ‘‘నీది చాలా పె-ద్ద-ది, ఇంత పె-ద్ద-గా ఉంది’’ అంటూ డబుల్ మీనింగ్ కొడుతుంటే మిగతావాళ్లు ఎంజాయ్ చేయడమే చిరాకు యవ్వారం… థూ-నీ… ఇది బిగ్‌బాస్ అనుకున్నారా, జబర్దస్త్ షో అనుకున్నారా..?
Ads
మరోచోట అమర్దీప్ మనిషి మంచోడే అని ఎవరినో అంటుంటే, పక్క నుంచి శివాజీ అందుకుని ‘గుణమే గుడిసేటిది’ అంటున్నాడు… ఆ బూతులే శివాజీ ఆస్తులు… ప్రతిచోటా ఏదో ఓ బూతు వాడేస్తూనే ఉంటాడు… అదేమంటే నా జన్మభూమి కల్చర్ అంటాడు, అదో తిక్క సమర్థన, అన్నట్టు శివాజీ అంటే గుర్తొచ్చింది… తనకు ఇద్దరు మగపిల్లలు అన్నాడు కదా… నో, ఆడపిల్ల కూడా ఉందని బయట సీనియర్ నటుడు సమీర్ చెబుతున్నాడు… శోభ, ప్రియాంకలను ఉద్దేశించి, మా ఇంట్లో వాళ్లయితే మెడ మీద కాలేసి తొక్కుతా అని పిచ్చికూతలు కూశాడు కదా శివాజీ, ఏదో ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వస్తే సమీర్ ‘‘తనకూ బిడ్డ ఉంది’’ అన్నాడు… మరి ఎందుకు గోప్యంగా ఉంచినట్టు..? భలేవారే, శివాజీ చేష్టలకు అర్థాలేముంటయ్..?
అమర్దీప్ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా తేజస్వి గౌడతో వర్చువల్ రియాలిటీని వాడి, ఇద్దరినీ ముఖాముఖి మాట్లాడింపజేయడం మాత్రం బాగుంది… (ఆమె కూడా పాపులర్ తెలుగు సీరియళ్ల నటే… ఈసారి అందరూ వాళ్లే కదా… శోభ, అమర్, అర్జున్, ప్రియాంక ఎట్సెట్రా…) టెక్నాలజీని అలా వాడుకోవాలి… గుడ్… బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్లు ఉండకపోవచ్చు, పోవచ్చు ఏమిటి..? ఉండదు… ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నేరుగా ఫినాలే స్టార్ట్ అవుతుంది… ఆల్రెడీ శ్రీముఖిని పంపించి, అందరినీ 20 లక్షలు ఇస్తాం, వెళ్లిపొండి అంటూ టెంప్టింగ్ చేయడం వంటి ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్తయింది..! అన్నట్టు… ఫినాలేకు మహేశ్ బాబు చీఫ్ గెస్ట్ అట… ఐతే ఫినాలే ఓ రేంజ్లో ఉండబోతోంది అన్నమాట… గుడ్…
Share this Article