Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి స్టార్ డైరెక్టర్ దాసరి ఆ హీరో కాళ్లు ఎందుకు మొక్కాడు..?!

July 2, 2026 by M S R

.

దాసరి ఓ స్టార్ డైరెక్టర్ తన కాలంలో..! ఇప్పటి దర్శకుల్లాగా హీరోల కాళ్ల మీద పాకే బానిసల బాపతు కాదు… ఇప్పుడంతా హీరోస్వామ్యం కదా, మరో టేక్ అనడానికి కూడా సాహసించలేని రోజులు… కానీ దాసరి కథలో, డైలాగుల్లో, ప్రజెంటేషన్‌లో రాజీపడేవాడు కాదు… హీరోలు వేలుపెట్టడానికీ అనుమతించేవాడు కాదు… తనతో పనిచేసిన హీరోలు కూడా తనకు ఆ గౌరవం ఇచ్చారు, తమ గౌరవం కాపాడుకున్నారు… అలాంటిది ఎన్టీయార్‌ కాళ్లకు ఎందుకు మొక్కాడు దాసరి..?

ఇది గతంలో కూడా చాలాసార్లు చదివినట్టు గుర్తు… మళ్లీ సోషల్ మీడియాలో కనిపిస్తోంది… ఇలా…

Ads



ఊటీలోని చల్లని వాతావరణం… ‘సర్దార్ పాపారాయుడు’ చిత్ర షూటింగ్‌లో విరామ సమయంలో ఎన్.టి.రామారావు , దర్శకుడు దాసరి నారాయణరావు ఒకచోట కూర్చుని ఉన్నారు… ఆ సంభాషణలో అకస్మాత్తుగా ఒక పాత వేదన బయటకు వచ్చింది…

“దాసరీ, నాదో తీరని కల ఉంది… ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటించాలని కథ, సంభాషణలన్నీ సిద్ధం చేసుకున్నాను. కానీ, ఒక నటుడి కారణం వల్ల ఆ కల నెరవేరలేదు” అని ఎన్.టి.ఆర్ తన మనసులోని మాటను విప్పి చెప్పాడు… ఆ మాటల్లో ఒక అసంపూర్ణమైన కళాత్మక ఆవేదన కనిపించింది…

దాసరి నారాయణరావు చిరునవ్వు నవ్వి, “సార్, ఆ పాత్ర పట్ల మీకున్న ఆరాటం వృథా పోనివ్వను… ఈ సినిమాలోనే ఆ అవకాశం కల్పిస్తాను… నారాయణరెడ్డి అద్భుతమైన బుర్రకథ రాశారు, వినండి” అని వినిపించాడు… ఆ సాహిత్యం ఎన్.టి.ఆర్ మనసును తాకింది…

కొద్దిసేపటికే… మేకప్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి… బయటకు వచ్చింది ఒక నటుడు కాదు, సాక్షాత్తు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు…! ఆ గెటప్‌లో, ఆ తేజస్సుతో ఎన్.టి.ఆర్ నడుచుకుంటూ వస్తుంటే అక్కడున్న వారంతా మంత్రముగ్ధులయ్యారు… ఆ సీన్ చూసి దాసరి నారాయణరావు భావోద్వేగానికి లోనయ్యాడు… కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, ఎన్.టి.ఆర్ పాదాలకు నమస్కరించాడు…

ఎన్.టి.ఆర్ చలించిపోయాడు… “బ్రహ్మాండమైన వ్యక్తిత్వం ఉన్న అల్లూరి సీతారామరాజు గనుకనే ఆయన పాత్ర చేయాలని ఇంతగా తపించాను. కానీ దాసరీ, రేపు మనల్ని చూసి ఇలాగే ఎవరైనా ప్రేరణ పొందుతారా? అలా జరగాలంటే మనం ఏం చేయాలి?” అని ఒక గంభీరమైన ప్రశ్నను సంధించాడు…

దాసరి సమాధానం సూటిగా, స్పష్టంగా ఉంది… “ప్రజాసేవే మనకున్న ఏకైక మార్గం…” అదే సమయంలో మద్రాసు నుండి వచ్చిన విలేకరుల ముందు ఎన్.టి.ఆర్ ఒక కీలక ప్రకటన చేశాడు… మధ్యాహ్నం 3 గంటల సమయం… ఆయన ఆవేశంగా, దృఢ నిశ్చయంతో “ఇకపై నెలలో 15 రోజులు షూటింగ్, మిగతా 15 రోజులు ప్రజాసేవ” అని ప్రకటించాడు… మరుసటి రోజు వార్తాపత్రికలు ఈ వార్తను ప్రధానంగా ప్రచురించాయి…

షూటింగ్ ముగించుకుని మద్రాసు చేరేసరికి, ఎన్.టి.ఆర్ కోసం అభిమానుల నుండి మూడు బస్తాల ఉత్తరాలు వేచి ఉన్నాయి. ప్రతి ఉత్తరంలోనూ ఉన్నది ఒకటే కోరిక— “మీరు రాజకీయాల్లోకి రావాలి…” ఎన్టీయార్‌కు రాజకీయాల్లోకి రావాలనే కోరిక బలపడిన సందర్భాల్లో ఇదీ ఒకటి అంటారు…

paparayudu



కానీ… సర్దార్ పాపారాయుడు పాటలో అల్లూరి మరణాన్ని ఎలా తీశారంటే… ఒంటరిగా అల్లూరి పొద్దున్నే సంధ్యావందనానికి వెళ్తే, అదే అదునుగా బ్రిటిష్ సైనికులు తనపై కాల్పులు జరిపి హతమార్చినట్టు..? కానీ ఇదే ఎన్టీయార్ పుణ్యభూమి నాదేశం సినిమాలోనూ ఓ పాటలో ఇదే అల్లూరి గెటప్‌లో కనిపిస్తాడు… దీనికి రాఘవేంద్రరావు దర్శకుడు (అప్పట్లో దాసరికీ, రాఘవేంద్రరావుకూ భలే పోటీ ఉండేది)…

ఈ సినిమాలో మాత్రం అల్లూరి ఒంటరిగా చర్చల కోసం బ్రిటిష్ అధికారుల వద్దకు వెళ్తే, మోసం చేసి, అక్కడే కాల్పులు జరిపి హతమార్చినట్టు చూపించారు… ఇక్కడ ఈ దర్శకుల మీద, ఈ కథకుల మీద డౌట్… అల్లూరి అప్పట్లో బ్రిటిష్ రాజ్యానికి మోస్ట్ వాంటెడ్… వారి దృష్టిలో టెర్రరిస్ట్, నక్సలైట్, తిరుగుబాటుదారు, ద్రోహి, ఎట్సెట్రా…

ఎప్పుడూ అల్లూరి వెంట ఓ సాయుధ టీమ్ ఉండేది… పోలీస్ స్టేషన్ల నుంచి బాజాప్తా ఎత్తుకొచ్చిన తుపాకులు, విల్లంబులతో ఉండేది ఓ రక్షణదళం… తనది మంచి ఆర్గనైజ్డ్ విప్లవం… మావోయిస్టు భాషలో చెప్పాలంటే టెక్ ఉండేది అప్పట్లోనే… లీడర్ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లడానికి విప్లవం ఒప్పుకోదు…

(నిజానికి అల్లూరి వేషధారణ, లుక్ విషయంలో కూడా ఎన్టీయార్, కృష్ణ మరీ స్వేచ్ఛ తీసుకున్నారనే విమర్శ కూడా ఉంది, అది వేరే కథ)

alluri

కానీ ఆ పాటలో గానీ, ఈ పాటలో గానీ ఒంటరిగా ఎందుకు వెళ్లాడు అల్లూరి… పెద్ద ప్రశ్న… సినిమాటిక్ లిబర్టీ అంటారా..? సర్లెండి… ఆ పేరుతో ఏదైనా తీయొచ్చు కదా… ఆర్ఆర్ఆర్‌లో అల్లూరినీ, కుమ్రం భీమ్‌నూ కలిపి ఓ చెత్త కథనాన్ని క్రియేట్ చేసి, చరిత్రకు ద్రోహం చేయలేదా రాజమౌళి..!? దాంతో పోలిస్తే అల్లూరి విషయంలో తీసుకున్న క్రియేటివ్ బ్లండర్స్ ఎంత..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై సుప్రీం అధికారాల పరిధి ఏమిటనేదీ కీలకప్రశ్నే!!
  • సేమ్… ఫ్రాన్స్‌లోనూ బొద్దింకలు – ఈ స్క్రిప్టులు రాస్తున్నదెవరు?!
  • విడాకులు – సెటిల్మెంట్ చిక్కులు ! న్యాయంలో ఏదో తేడా కొడుతోంది !!
  • దృశ్యం: ది కన్‌క్లూజన్ — మాతృకను వదిలి.. మ్యాజిక్‌ పట్టుకున్నారు..
  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!
  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!
  • ఉత్త స్క్రాప్! ఈ సంతను యాణ్నుంచి పట్టుకొచ్చావురా బిగ్‌బాస్..!
  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions