Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును.., ఈ ‘పచ్చి’ ప్యారడైజ్ భాషపైనే మరో విశ్లేషణ… వుయ్ పిటీ నానీ..!!

March 4, 2025 by M S R

.

ఇవాన్ ఇతిహాస్ …….. “ఇదొక లంజాకొడుకు కథ…” సూపర్ డూపర్ హిట్ గ్లింప్స్.. గాయి గత్తర లేపిన గ్లింప్స్…!! ఇక్కడ మోరల్స్ గురించి మాట్లాడడం దండగ.. సినిమాని, సినిమా ముచ్చట్లను వాటి పరిధిలోనే,.. ఆ విధంగానే చూద్దాం.., చూడాలి కూడా..

ఒకడు మరొకడిని చంపడం అప్పట్లో వార్త… ఇప్పుడు నథింగ్..
రేప్ అంటే అప్పట్లో క్రైమ్, ఇప్పుడు జస్ట్ ఓ వార్త..
సినిమాల్లో మనిషిని తెగ నరకడం అప్పట్లో వాయిలెన్స్.. ఇప్పుడు అదే ట్రెండ్..
వాయిలెన్స్ ను ఇష్టపడని వాడికి సినిమా చూడడం రాదు.. అదే నరుకుడు నిజ జీవితంలో జరిగితే, ప్లేట్ చేంజ్…

Ads

మాటల్లో బూతులు జారడం అప్పట్లో క్రింజ్… ఇప్పుడు అదే ట్రెండ్..
చెడు పదాలు లేని డైలాగ్ లేవడం లేదు…
బూతులు లేని హాస్యం పేలడం లేదు ..

సరే…
నాని… నేచురల్ స్టార్.. సహజసిద్ధమైన నక్షత్రం..
సినిమా బాగుండొచ్చు .. సినిమా కంటెంట్ అసలు ఇప్పటికీ కనీ వినీ ఎరుగని రీతిలోనూ ఉండొచ్చు… కానీ..
ఎప్పుడూ లేని విధంగా బూతు మీద ఆధారపడడం దేనికి..

ఏ ఆధారమూ లేని వాడు బూతుని ఆశ్రయిస్తున్నాడు.. అలా అయినా నాలుగు కాసులు రాలతాయని…
కానీ, యాక్టింగ్ నే నమ్ముకొని, నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నానికేం అయింది..? ఎందుకు బూతుని నమ్ముకోవలసి వచ్చింది..?

Psychology behind these acts: జనాలని ట్రిగ్గర్ చేయడం…
Shocking experience – by triggering emotions..
షాకింగ్ experience ఇవ్వడం వల్ల జనాలు దాని గురించే మాట్లాడతారు..

తిడుతూనో పొగుడుతోనో దాని మీదనే పడతారు.. నేను ఈ రివ్యూ రాయడమూ అందులో భాగమే..
ప్రజెంట్ మార్కెట్ రూల్ : ప్రతీ విషయంలోనూ అంతకంతకూ దిగజారాలి .. ఎంత జారితే అంత మార్కెట్… నేను సింపుల్ గా ఉంటాను అంటే మార్కెట్ నన్ను పట్టించుకోదు..
RGV లాంటి వాళ్ళు చేసేది అదే… జనాలని ట్రిగ్గర్ చేయడం…

సినిమా వాళ్ళకి బాగా తెలుసు. ఏ సీన్ ఎక్కడ ఎలా లేస్తుందో, దేనికి విజిల్స్ పడతాయో. ఏ సీన్ – ఏ డైలాగ్ పడితే ఓ జెండర్ నుండి అరుపులు వస్తాయో , మరో జెండర్ uncomfort గా ఫీల్ అవుతుందో..
అదే మెజారిటీని satisfy చేసే ఫార్ములా.
“ఇదొక లంజా కొడుకు కథ” అనగానే థియేటర్లు అరుపులతో తగలబడిపోతాయి…
Exactly this is what they want…!!

పట్టరాని కోపంలోనో… అతి చనువుతోనో వాడే పదజాలం అది..
దాన్ని నార్మలైజ్ చేయడమే ఇప్పుడు జరిగేది.
సరే .. మరి ఈ పదాలు ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ లేవా అంటే… ఉన్నాయి, ఇంతకు మించి ఉన్నాయి..
కానీ.. సినిమాలో అంతర్భాగంగా ఉన్నాయి..

రంగస్థలం సినిమాలో ఇదే పదం వాడబడింది. కానీ అక్కడ ఈ పదానికి విజిల్స్ పడవు. జస్ట్ ఆ సీన్ కి విలన్ మీద మనకే కోపం తన్నుకొస్తుంది . ఆ పదం అక్కడ ఆనుతుంది. మన నోటి నుండీ అదే పదం వస్తుంది… అది ఆ సీన్ ను జస్టిఫై చేస్తుంది. అది ఒక సినిమా చేయాల్సిన పని.
మీర్జాపూర్ సిరీస్ లో వాడేది అదే భాష.. కానీ, దాని మూడ్ అండ్ వేవ్లెంత్ వేరు..

ప్రచారం కోసం ఓ బూతు పదాన్ని వాడడం సినిమా సెన్స్ అనిపించుకోదు. సినిమాని అమితంగా ఇష్టపడేవాళ్ళకి ఇది నచ్చదు కూడా.
Raw and rustic పేరుతో గుంపులో గోవిందం లాగా పైపైన బాగుంది బాగుంది అని పొగుడుతారు ,అది వేరే విషయం.
ఇంకో ముచ్చట…

ఇక్కడ లంజా కొడుకు అనే పదానికి ఫిమేల్ వాయిస్-ఓవర్ ఇచ్చారు… ఎందుకు?
కాంట్రవర్సీ అవకూడదు అని.
అదే మేల్ వాయిస్ అయ్యుంటే సినిమా వేరేలా ఉండేది..
ఆ లం -జ ఎవరు, దాని కొడుకు ఎవడు అని..!!
ఇదీ సైకాలజీ..
జనాలని ఎర్రిపప్పలని చేసే సైకాలజీ..

చివరగా ఒక మాట..
సినిమా ఇలా ఉండాలి , ఎండ్ ఇలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు.
సినిమా కంటెంట్ అయినా, అందులోని పాటలయినా insta reels బేస్డ్ గానే తయారవుతున్నాయి. క్యాచీ వర్డ్స్… Triggering emotions and lust… అంతే..!!

సినిమాలో అంతర్భాగమైన రే- ప్ సీన్స్ ని సెపరేట్ గా insta reels లో పెట్టేసి సొంగ కార్చేవాళ్ళు మన మధ్యే ఉన్నారు..
మాటల లోతుల్లోకి పోతే అర్థాలు వేరుగా ఉంటాయి.. దాని పర్యవసానమే చేతలు..
అందుకే బూతు అనేది పర్సనల్…
అతి కోపం… అతి చనువు…

రెండు సందర్భాల్లో మాత్రమే Raw అనబడు పచ్చి బూతులకి అర్థం పర్థం ఉంటుంది తప్ప.. వాటిని జనరలైజ్ చేసేస్తే కాదు..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోరడి చేత బూతులు పలికించారు…
రేప్పొద్దున చిన్న చిన్న పిల్లలు లంజ కొడక అనే పదానికి అర్థం అడిగితే పేరెంట్స్ ఏమని సమాధానం చెబుతారు.. లంజ అంటే ఎవరు..

నాని లంజా కొడుకు లాగా ఎందుకు దిగజారాల్సి వచ్చింది… జారాడు ఒకే.. సినిమా కాబట్టి , తాను ఎప్పుడూ డిఫరెంట్ కేరక్టర్ చూజ్ చేసుకుంటాడు కాబట్టి వదిలేద్దాం.. మరి దాన్నే ప్రచారం చేయాల్సిన ఖర్మ ఏం పట్టింది..? దీనికి కూడా జస్టిఫికేషన్ ఉంటుందా..!? నెవర్..
This is not justified for you Mr. Natural Star.

Educational and informational వీడియోలు రీచ్ ఉండడం లేదని బూతు మీదకి దిగిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు…
కుంభమేళాలో మహిళల స్నానాల వీడియోలు అమ్ముకున్న వాళ్లూ ఉన్నారు..
ఎక్కడైనా రే- ప్ జరిగితే ఆ బాధితురాలి అందచందాల గురించి డిస్కషన్ పెట్టే వాళ్ళూ ఉన్నారు, తాము అందులో భాగం కానందుకు బాధపడే వాళ్ళూ ఉన్నారు…

ఇండియాస్ గాట్ లేటెంట్ అంటూ తల్లిదండ్రుల శారీరక కలయిక ఇష్యూను సపోర్ట్ చేసిన వాళ్ళూ ఉన్నారు..
వాటి ముందు ఇదెంత అనే సందేహం, ఇది జస్ట్ ఒక సినిమా అని , దాన్ని అలానే చూడాలనే హితబోధ చేసేవాళ్ళు ఉన్నారు…
కానీ… ఇక్కడ సమస్య బూతు పదం కాదు.. దాన్ని నార్మలైజ్ చేసేయడం… దాన్నే ఓ ట్రెండ్ లాగా ఫీల్ అవడం..
సరే మరి ఇది ఇక్కడితో ఆగుతుందా… నెవెర్… ఇంకో దర్శకుడు, ఇంకో హీరో.. మరో పచ్చి బూతు…?
నీ అవ్వ…. … ఎవడ్రా మనల్ని ఆపేది బాంచేత్…!!



Anchoori Venkat Reddy…… ఇంతదానికి పారడైజ్ అని పేరెందుకు, బాంచోద్ లంజాకొడుకు అని సినిమా పేరు పెట్టుకుంటే సరిపోయేది కదా. డబ్బు కోసం గడ్డి తినే జన్మలు….



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions