Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో లేడీ కంటెస్టెంట్ ఔట్… దిక్కుమాలిన బిగ్‌బాస్ షోలో మగాధిపత్యం…

October 7, 2023 by M S R

నిజంగానే బిగ్‌బాస్ క్రియేటివ్ టీం బుర్రలకు ఏదో తెలియని చైనా వైరస్ పట్టుకున్నట్టుంది… ఎలాగూ ఉల్టాపుల్టా అని పేరు పెట్టుకున్నాం కదా, సో, అడ్డదిడ్డంగా వ్యవహరించకపోతే ఇక ఆ పేరుకు అర్థమేమిటి అనే భావనలో ఉన్నట్టున్నారు… లేకపోతే ఏమిటి..? ఇప్పటికే నలుగురు లేడీ కంటెస్టెంట్లను హౌజు బయటికి తరిమేశారు కదా… ఇప్పుడు తాజాగా శుభశ్రీని కూడా తరిమేశారు…

అసలు హౌజులోకి వచ్చిందే 14 మంది… ఏడుగురు మగ, ఏడుగురు ఆడ… అందరూ సమానంగా ఆడాలి, మగాళ్లకు దీటుగా ఆడాళ్లు కూడా… తగ్గడానికి వీల్లేదు అని నీతులు చెబుతాడు బిగ్‌బాస్.,. కానీ వరుసగా ఐదుగురు ఆడవాళ్లను బయటికి పంపించేసి, ఆడ మగ బ్యాలెన్స్‌ను ఘోరంగా దెబ్బతీశాడు… ఇక ఆటలో మజా ఏముంది..? థ్రిల్ ఏముంది..? పోనీ, సర్‌ప్రయిజ్ ఎంట్రీలో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్నాయనుకుంటే అవీ లేకుండా పోయాయి..? ఐదు వారాలు గడిచినా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది ఈ షో పట్ల పాపులారిటీ… రేటింగ్స్ సంగతి తరువాత చెబుతాను…

షకీలా, రతిక రోజ్, దామిని, కిరణ్ రాథోడ్ ఇప్పటివరకు వెళ్లిపోగా… తాజాగా శుభశ్రీని కూడా పంపించేశారట… ఫాఫం శుభశ్రీ… నిజంగానే ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహాలు లేవు, చూపించలేదు ఆమె… జనమే పెద్దగా వోటింగులో స్పందించలేదు… ఆమెను పంపించేయక తప్పనట్టుంది… కానీ బిగ్‌బాస్‌లో కొనసాగించడానికి, పంపించేయడానికి కేవలం జనం వోట్లే ప్రామాణికం కాదు… ఆ షో టీం ఏదనుకుంటే అది… శివాజీ, అమర్‌దీప్, యావర్‌లతో పోలిస్తే శుభశ్రీ సేమ్… కానీ ఆ మగాళ్లకు నాగార్జున, బిగ్‌బాస్ టీం సపోర్ట్… శుభశ్రీ అందులో వెనకబడిపోయి, హౌజు నుంచి బయటికి వెళ్లిపోయింది…

Ads

శుభశ్రీ

సాధారణంగా మన ఇండస్ట్రీలో (టీవీ, సినిమా) ఒడిశా వాసులు తక్కువ… శుభశ్రీ నటి, మోడల్, లాయర్, డాన్సర్, యాంకర్, ప్లేయర్… అన్నీ… కానీ బిగ్‌బాస్ షోలో పెద్దగా ఇంప్రెసివ్ అనిపించలేదు… సరే, ఇక బిగ్‌బాస్ రేటింగ్స్ విషయానికి వద్దాం… గత సీజన్‌లాగే ఇదీ ఫ్లాప్… అంకెలు కావాలా..?

24 సెప్టెంబరు, ఆదివారం షోకు కేవలం 5.38 (హైదరాబాద్ బార్క్), 23 సెప్టెంబరు, శనివారం షోకు ఇంకా తక్కువగా 4.32 మాత్రమే… వీక్ డేస్‌లో ఈ షోను దేకేవాడే లేడు… సోమవారం 3.67, మంగళవారం 3.32, గురువారం 3.29, బుధవారం 3.17, శుక్రవారం 3.06 రేటింగ్స్… ఈ మాత్రం రేటింగ్స్‌కు అంత ఖర్చా..? వేస్ట్… ఈ ఖర్చుతో బ్రహ్మముడి వంటి టాప్ రేటింగ్ సీరియల్స్ పది తీయవచ్చు… ఇలాంటి దిక్కుమాలిన షోలకు డబ్బు దండుగ… అవునూ, ప్రస్తుతం హౌజులో మిగిలిన ఆడలేడీస్ ఎవరో తెలుసా..? ప్రియాంక, శోభాశెట్టి… కాకపోతే వీరిద్దరినీ అంత తేలికగా బయటికి పంపించలేరు… మిగతా మగ పురుష్‌కన్నా వీళ్లు గట్టి పిండాలు… ఆటలో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions