Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!

August 16, 2026 by M S R

.

నో డౌట్… సినిమా అనేది పెద్ద దందా… అదేమీ సమాజాన్ని ఉద్దరించదు, చైతన్యపరచదు… పైగా మనుషుల్ని రకరకాల ప్రలోభాల వైపు, బలహీనతల వైపు, వ్యసనాల వైపు, అవలక్షణాల వైపు నెట్టేస్తుంది… ప్రత్యేకించి యువతను…

సినిమా ప్రపంచంలో ఎవడికీ సమాజం పట్ల బాధ్యత ఉండదు, సమాజం మనకు ఇంత ఇచ్చింది కదా, మనమూ కొంత ఇద్దాం అనే సోయి కూడా ఉండదు… సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్… వీళ్లకు ఏం తక్కువ చేసింది సమాజం… అంతులేని సంపదను ఇచ్చింది కదా…

Ads

ప్రతిగా వాళ్లు చేస్తున్నదేమిటి..? రెండు ఉదాహరణలు… 1) హుషార్ పిట్టలు 2) పళ్ల బురుసు… దిల్ రాజు సపోర్ట్ చేసిన బలగం సూపర్ హిట్ అయ్యిందంటే అందులో కుటుంబ బంధాలు, ఎమోషన్స్ ఉన్నాయి, కాబట్టి సమాజానికి కనెక్టయింది… మేమూ ఓ తెలంగాణ సినిమాను సపోర్ట్ చేస్తాం అనుకుని పైన రెండు సినిమాలకు ఆ రెండు కంపెనీలు సపోర్ట్ చేశాయి…

రెండూ సరైన టేస్ట్ కావు, ఆ ఎంపికల్లోనే తేడా ఉంది… ముందుగా హుషార్ పిట్టలు సినిమా… దీన్ని దగ్గుబాటి సురేష్ (సురేష్ ప్రొడక్షన్స్), సునీల్ నారంగ్ (ఆసియాన్ ఎగ్జిబిటర్స్) కలిసి ప్రజెంట్ చేశారు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్‌ను శాసించే నలుగురిలో వీళ్లిద్దరు… స్టూడియోలు, హీరోలు, మస్తు సాధన సంపత్తి, ఆస్తులు… ఏం తక్కువుంది..?

టీన్స్‌లో ఉన్న ఓ పిల్ల, ఓ పిల్లాడి లవ్వు, రొమాన్స్‌ను వెగటు, రోత డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేశారు… జబర్దస్త్ అనే రోత షోకు ఇది మరో రేంజ్… అంతా బోల్డ్… సినిమాల్లో అశ్లీల సీన్స్ ఉండవు, కానీ అంతకుమించిన ఫీల్ కలిగించేలా ఉంటాయి సీన్స్, డైలాగ్స్… ఓచోట హీరోయిన్ పాత్ర కండోమ్స్, వయాగ్రాను స్వయంగా హీరోకి ఇచ్చి.. ఇంకా కోరికలు పెరగాలని చెప్పే సన్నివేశాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి..?

ఈ సినిమా సమర్పణకు ముందు ఆ రెండు పెద్ద కంపెనీల పెద్ద తలలు కనీసం దీన్ని చూశాయా..? మైనర్ బాలికతో శృంగారం చేస్తే ఫోక్సో యాక్ట్ తప్పదని ఆ తరహా సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ డిస్క్లైమర్ వేశారు తప్ప వాటిని చూపించకూడదనే ఇంగిత జ్ఞానం మాత్రం లేకపోయింది… చెబుతూ పోతే ఈ సినిమా మీద పోస్ట్ మార్టం అంతా ఇలాగే ఉంటుంది… బోల్డ్ కంటెంటుకు తగినట్టే లిరిక్స్… ఖర్మ…

ఇక అన్నపూర్ణ స్టూడియోస్… జీటీవీలో మంత్రాలు, మాయలు, తంత్రాల త్రినయని వంటి సీరియల్ సమర్పించినప్పుడే ఇది ఎప్పుడో దారితప్పిందని తెలుసు… దాని చరిత్ర ఏమిటి..? చివరకు నాగార్జున ఎక్కడికి దిగజార్చాడు..? పళ్లు బురుసు అని ఓ సినిమా సమర్పించారు తాజాగా…

నిజానికి చిన్న సినిమాలకు ఇలాంటి పెద్ద కంపెనీలు సపోర్టుగా నిలబడాలి, అభిలషణీయం, కానీ ఎలాంటి  చిన్న సినిమాలు..? వాటి నాణ్యత ఏమిటి..? అది చూసుకోవద్దా..? పళ్ల బురుసు (టూత్ బ్రష్) అనేది సీరియస్ సబ్జెక్టే… తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను చెప్పే కథ… కానీ మరీ నాసిరకం ప్రజెంటేషన్…

ఆయన పేరేమిటో గుర్తులేదు, ఓ ముసలాయన ఎన్టీయార్ వచ్చాకే తెలంగాణ ఉద్దరించబడింది అన్నట్టుగా ఏదో వీడియోలో ఏవేవో చెప్పిన సోది మాటలపై బోలెడు రీల్స్ కనిపించాయి… (సుధాకర్ రెడ్డి?)… సినిమాలో ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేడు… చివరకు మురళీధర్ కూడా సో సో, ఈ సినిమాలో… పాపం, ఏమైంది..?

చివరగా… తెలంగాణ సినిమాలన్నీ బలగం కాలేవు… కనీసం తెలంగాణ కథ ఇజ్జత్ తీయకండి, పెద్ద కంపెనీలు తమ స్వార్థం కోసం మీకు సపోర్ట్ చేస్తాయి తప్ప ప్రేమతో కాదు… బయట భాషల్లో మస్తు ప్రయోగాలు, నాణ్యమైన కథలు, కథనాలపై చాలామంది వర్క్ చేస్తున్నారు… తెలంగాణ కాన్వాస్ అంటే, ఉరికేంత మైదానం… అది సోయిలో ఉంటే చాలు..!!

ఓ తెలంగాణతనం ఉన్న దర్శక మిత్రుడు అడిగాడు వీటిని కాస్త ఎంకరేజ్ చేయమని, నాలుగు మంచి మాటలు రాయమని..! మిత్రమా, ఏమాత్రం మనసొప్పలేదు, సారీ..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions