Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!

May 9, 2026 by M S R

.

సువేందు అధికారి… అందరూ అనుకున్న పేరే… మమత బెనర్జీని దింపి, ఆమె ప్లేసులో ప్రతిష్టించడానికి సువేందుకు మించిన పేరు లేదు… సరైన నిర్ణయమే… అయితే రెండు విషయాల్లో ఓసారి తన గురించి చెప్పుకోవాలి… స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ బెంగాల్ ‘భద్రలోక్’ వర్గంలోనే పాలించబడుతోంది… ఇప్పుడు నాన్-భద్రలోక్ కేటగిరీలోకి వచ్చినా సరే… అదే భూస్వామ్య, వ్యవసాయాధారిత, ప్రభావశీల సామాజికవర్గంలో చేతుల్లోకే వెళ్లిపోతోంది…

సరే, ముందుగా మరో విషయం చెప్పుకుందాం… అస్సాంలో ముఖ్యమంత్రి ఎవరు..? హిమంత విశ్వ శర్మ… శర్మ… తను బీజేపీ కాదు మొదట్లో, సంఘ్‌తో సంబంధం లేదు… ‘కోర్ సంఘ్’ నుంచి ఎమర్జయిన వాళ్లకే అవకాశాలు అనే పాత ఛాందస ధోరణి నుంచి బీజేపీ బయటపడ్డాక తొలి ముఖ్యమంత్రి తను… అఫ్‌కోర్స్, హార్డ్‌కోర్ట్ సంఘ్ భావజాలాన్ని మించిన కట్టర్ హిందుత్వవాది అయ్యాడు… తన కెరీర్ మొదట్లో కాంగ్రెస్…

Ads

సేమ్… సువేందు అధికారి కూడా కాంగ్రెస్ నుంచే తన కెరీర్ స్టార్ట్ చేశాడు… తండ్రి శిశిర్ అధికారి అప్పట్లో కాంగ్రెస్ కేంద్ర మంత్రి…  తరువాత టీఎంసీ నిర్మాతల్లో ఒకరు.., పక్కా పొలిటికల్ ఫ్యామిలీ… మమత బెనర్జీ… కాదు, కాదు, అభిషేక్ బెనర్జీతో బెడిసికొట్టాక బీజేపీలో చేరాడు, బీజేపీ కూడా ఎంకరేజ్ చేసింది… తను ఏకంగా నందిగ్రామ్‌లో, ఈ ఎన్నికల్లో మమతనే ఓడించాడు… ఆ క్యాంపు నుంచి వచ్చినవాడు కదా, ఆ బలహీనతలు మొత్తం తెలుసు తనకు…

ఇప్పుడు తనే బెంగాలీ బీజేపీ ఫేస్… తన కుటుంబం మొత్తం బీజేపీయే ఇప్పుడు… సోదరుడు సౌమేందు అధికారి బీజేపీ ఎంపీ, మరో సోదరుడు దివ్యేందు అధికారి ఎంపీ, ఎమ్మెల్యే ఒక టరమ్… మమత క్రియేట్ చేసిన అరాచకం నుంచి ఒక యోగీ, ఒక హిమంత స్థాయిలో బెంగాల్‌ను ఎలా బయటపడేస్తాడో చూడాలిక…

సరే, ఇక్కడ మరో అంశం… ఇది కులసమీకరణం… బెంగాల్ ఈరోజుకూ బ్రాహ్మణ, భద్రలోక్, అగ్రవర్ణ గుప్పిట్లో నుంచి బయటికి రాలేకపోతోంది… పేరుకు ఆ సమాజం ప్రొగ్రెసివ్… భద్రలోక్ అంటే బ్రాహ్మణ, కాయస్థ, బైద్య… ఈ ప్రభావవంత కులాలు… ఎక్కువ కాలం పాలించిన సీఎంలు ఇలా…

జ్యోతిబసు (లెఫ్ట్), బిదాన్ చంద్రరాయ్ (కాంగ్రెస్), మమతా బెనర్జీ (టీఎంసీ), బుద్ధదేవ్ భట్టాచార్య (లెఫ్ట్), సిద్ధార్థ శంకర్ రే (కాంగ్రెస్), ప్రఫుల్ల చంద్రసేన్ (కాంగ్రెస్), అజోయ్ ముఖర్జీ, ప్రఫుల్ల చంద్ర ఘోష్,… వీరిలో ఒక్క ప్రఫుల్ల చంద్రసేన్ మాత్రమే నాన్ భద్రలోక్… తను మహిష్య కులం… అది ఎన్‌లైటెన్ కమ్యూనిటీయే…

ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… సువేందు అధికారి కూడా ఈ మహిష్య కులమే… (కొందరు బ్రాహ్మణ అంటారు)… అంటే, 1947 నుంచి బెంగాల్ పాలన భద్రలోక్ కులాలు, మహిష్య కులానికి సంబంధించిన వారే పాలించారు… మళ్లీ అదే మహిష్య కులానికి పాలనపగ్గాలు… ఈ సువేందు అధికారి కూడా గతంలో శారదా స్కామ్, నారద స్టింగ్ ఆపరేషన్లలో ఆరోపణలకు గురైనా… బీజేపీలో చేరాక పవిత్రుడైపోయాడు సహజంగానే..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!
  • తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…
  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…
  • ఆనందప్రకాష్… ఓ రాక్షసుడితో 19 ఏళ్ల అలుపెరుగని పోరాటం…
  • ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?
  • ‘‘తమిళ గవర్నర్ తప్పు లేదు… స్పష్టత కోరడం న్యాయసమ్మతమే’’
  • సీఎం సాబ్, నీ కడుపు సల్లంగుండ..! మెచ్చుకునే నిర్ణయం చెప్పావు..!!
  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions