Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హన్మంతన్నా… అంతా నిమ్మళమేనా… మంచి గుర్తింపు ఇచ్చిండు సీఎం…

May 1, 2026 by M S R

.

Mohammed Rafee …. ఓపికగా… భరోసాగా… సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో బిసి అగ్ర నాయకుడు వి. హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ సలహాదారులు పదవి లభించింది! సీనియర్ నేతగా అయన ఓపికకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉండి నేనున్నా అంటూ ఇచ్చిన భరోసాకు నజరానా అని చెప్పుకోవచ్చు!

వి. హనుమంతరావు ఆషామాషి నేత కాదు. ఎన్టీఆర్ హయాంలోనే పిసిసి నేతగా కాంగ్రెస్ ప్రచార రధంపై పోటా పోటీగా ప్రచారం నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించిన మాస్ నాయకుడు! ఆయన మాట తీరు ప్రేమతో నిండి ఉంటుంది! విలక్షణంగా ఉంటుంది! ముఖ్యంగా పేదల పక్షపాతి!

Ads

ఎవరు వెళ్లినా “ఏందిరా భయ్” అంటూ ఆప్యాయంగా పిలవడం, సంబంధిత అధికారులకు ఫోన్ కలిపి విషయం చెప్పి సమస్య పరిష్కారం చూపించడం ఆయన స్టయిల్! ఆయనతో కాకుంటే “ఇది నాతో కాదురా భయ్” అని ఖుల్లం ఖుల్లా గా చెప్పేస్తారు!

హనుమంతరావుకు రాష్ట్ర మంత్రిగా సేవలు అందించాలనే కోరిక! కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు ఆయన డామినేషన్ తట్టుకోలేక ఎంపిగా పంపించే వారు! ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీలను నేరుగా కలిసేంత చనువు ఉందని, సీనియర్ నేతగా ఆయన్ని పార్టీలో గౌరవిస్తారని ఆయనే స్వయంగా చెప్పి సంతోషం వ్యక్తం చేశారు ఒకసారి!

ఆయన అల్ప సంతోషి! పెద్ద పెద్ద పదవులు ఆశించింది లేదు! అవి వెతుక్కుంటూ వచ్చాయని చెప్పారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండటం, వార్తల్లో ఉండటం ఆయనకు ఇష్టం!

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సెబ్బాష్ రెడ్డీ, నీ వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చాం అని మొదట గొంతు విప్పి అభినందించిన తొలి అగ్ర నేత కూడా హనుమంతరావు అనే చెప్పాలి! మొన్న గాక నిన్న వచ్చిన చాలా మంది సీనియర్లు మొఖాలు మాడ్చుకున్నా హనుమంతరావు మాత్రం ఎప్పటికప్పుడు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి సమర్థించుకుంటూ వచ్చారు!

రేవంత్ రెడ్డి సైతం ఎంతో గౌరవిస్తూ హనుమంతరావుకు గుండెలాంటి బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్ది ఏకంగా హనుమంతరావు పేరు పెట్టి కృతజ్ఞత సమర్పించుకున్నారు. అధిష్టానం కూడా హనుమంతరావును బాగా చూసుకోండి అని చెప్పడంతో ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ తో ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. హనుమంతరావు రేవంత్ రెడ్డికి కొండంత భరోసా! ఆయన మాట గొప్ప అండ అంతే! – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హన్మంతన్నా… అంతా నిమ్మళమేనా… మంచి గుర్తింపు ఇచ్చిండు సీఎం…
  • ఒకరు ఐపీఎస్… మరొకరు ఐఐటీ… కొత్త డీజీపీ కుటుంబ నేపథ్యం…
  • హహహ…! బిడ్డింటికి దారేది..? స్పూఫ్… నవ్వు ఆపుకుంటున్నవ్ కదరా..!!
  • గెలిచిన గుజరాత్ పైకి ఎక్కలేదు… ఓడిన బెంగుళూరు దిగిపోలేదు…
  • హిమాలయాల నిశ్శబ్దంలో ఓ అద్భుతం… అలీనా వెట్రోవా ‘పునర్జన్మ’ కథ…!
  • కోర్టు వర్చువల్ విచారణ సందర్భంగా అశ్లీల వీడియోల ప్రదర్శన
  • టీఆర్ఎస్… పార్టీ పేరు, అనుమతి… బభ్రాజమానం- భజగోవిందం…
  • చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
  • ‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?
  • TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions