Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోయి లేని సాయిపల్లవి… స్వయంకృతం, అతి తెలివి… ఎందుకంటే..?

April 29, 2026 by M S R

.

నటి సాయిపల్లవి అద్భుతమైన నటి కావచ్చుగాక… కానీ కామన్ సెన్స్ విషయంలో ఓ మెంటల్ కేసు… ఈ మాట అనడానికి పెద్ద జంకు అవసరం లేదు, బోలెడు ఉదాహరణలున్నాయి… నిజానికి మనకు పరాయి భాష పూర్తిగా తెలియనప్పుడు… మాట్లాడుతుంటే వేర్వేరు అర్థాలు స్పురిస్తున్నప్పుడు… అదీ మీడియా మీట్లలో, బహిరంగ వేదికల మీద… అవాయిడ్ చేసి, తనకు తెలిసిన భాషనో, లేక ఇంగ్లిషులో ఆశ్రయించడం బెటర్, పర్టిక్యులర్‌గా సినిమా సెలబ్రిటీలు పాటించాల్సిన సూత్రం ఇది… భవిష్యత్తు ఇబ్బందులు రాకుండా… (Presence of Mind)….

సరే, విషయం చెబుతాను… ఇటీవలే జరిగిన ఏక్ దిన్ అనే తన బాలీవుడ్ డెబ్యూ సినిమా ఈవెంటులో సాయిపల్లవి హిందీలో ధారాళంగా మాట్లాడలేకపోవడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ కంటెంట్ కోసం వాడుకుంటున్నారు… అమీర్ ఖాన్ నిర్మాతగా తీసిన మూవీలో, అమీర్ ఖాన్ కొడుకు కథానాయకుడిగా నటించిన ఈ మూవీలో… ఈ మాత్రం భాష నేర్చుకోలేదా అంటూ తన మీద కామెంట్స్ చేస్తున్నారు… హిందీ నెటిజనం…

Ads

ముంబైలో నిర్వహించిన ‘ఏక్ దిన్ కీ మెహఫిల్’ అనే మ్యూజికల్ ఫెస్ట్‌ ఇది… ఈ కార్యక్రమంలో అతిథులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడే క్రమంలో సాయి పల్లవి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించింది… వచ్చీరాని హిందీలో మాట్లాడిన ఆమె వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, ఉత్తరాది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు… ఇలా అయితే నాలుగు వేల కోట్లతో తీసిన రామాయణలో సీతగా ఎలా మేనేజ్ చేస్తారనే ప్రశ్నలు సంధిస్తున్నారు… నిజం చెప్పాలంటే సాయిపల్లవి స్వయంకృతం…

సాయిపల్లవి

ముందుగా ఒక వాదన చూద్దాం… ‘‘సౌత్ నుంచి బోలెడు మంది తారలు బాలీవుడ్‌కు వెళ్లారు… హేమమాలిని, రేఖల దగ్గర నుంచి మొదలుపెట్టి… శ్రీదేవి, జయప్రదల నుంచి ప్రస్తుతం రష్మిక దాకా బాలీవుడ్ తెరను ఏలుతున్నారు… భాషదేముంది..? నటన ముఖ్యం… అంతేకాదు, హిందీ నుంచి వచ్చి తెలుగు తెరపై వెలిగి, ఒక్క తెలుగు ముక్క మాట్లాడలేని వాళ్ల మాటేమిటి..? అంతెందుకు, బాలీవుడ్ స్టార్లలో ఎందరికి సరైన హిందీ తెలుసు..?’’

ఎస్, భాషకూ, నటనకూ లింక్ లేదు అంటారు చాలామంది… కానీ సరికాదు… ఒకవేళ సొంత డబ్బింగ్ చెప్పుకునే పక్షంలో..!! భాషకూ, నటనకూ లింక్ ఉంటుంది… సింక్ ఉండాలి, కుదరాలి, అప్పుడే పాత్ర పండుతుంది… అందుకే కదా సాయిపల్లవి ఏ భాషలో నటించినా తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది..? సో, భాష ప్రధానమే…

saipallavi

ఏక్ దిన్ విషయానికి వద్దాం… అమీర్ ఖాన్ కొడుకు, బోలెడంత నెగెటివిటీ ఉంది తన మీద… ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందో సాయిపల్లవికే తెలియాలి… బహుశా బాలీవుడ్ ఎంట్రీ అనగానే టెంప్ట్ అయి ఉంటుంది… కానీ కొన్ని నిజాలు చెప్పుకుందాం…

– ఆమె గతంలో ఓ మీడియా మీట్‌లో మలయాళం భాష ఫ్లూయెన్సీ మీద క్వశ్చన్ వస్తే నేను మలయాళీ కాదు, తమిళ్ అని చెప్పుకుంది… అదీ వివాదమైంది… పేరుకు ఆమెది తమిళనాడులోని ప్రాంతమే అయినా… లిపి లేని గిరిజన బాడగ భాష మాతృభాష అయినా… ఆమె ఫస్ట్ మూవీ మలయాళమే… తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనేది ఆమె పట్టుదల… తద్వారా ఎమోషన్స్ సరిగ్గా రక్తికడతాయని ఆమె భావన, తప్పులేదు…

సాయిపల్లవి

కానీ డబ్బింగ్ సమయంలో… ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు… సరిచేయొచ్చు… కానీ మీడియా ఎదుట, వేదికల మీద కుదరదు… పైగా సౌత్ స్టార్స్ అంటేనే విపరీతంగా విషం చిమ్మే బాలీవుడ్ మీడియా ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంది… ఈ సోయి, తెలివిడి సాయిపల్లవికి లేదు… 4 వేల కోట్ల రామాయణ మూవీలో ఆమెను సీత పాత్రకు ఎంపిక చేయడం మీద బాలీవుడ్ మీడియా ఉడికిపోతోంది… అలాంటప్పుడు  వచ్చీరాని హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించి అభాసుపాలైంది… ‘ఇదుగో ఈమె సీత పాత్ర చేస్తుందట’ అనే ట్రోలింగు… నిజానికి సీత పాత్రకూ ఈమె భాషకూ లింక్ లేదు…

గుర్తుందా..? ఆమెకు తెలుగు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు, అదే చెబితే అంగీకరించదు… ఏదో మీడియా మీట్‌లో ఆమె మాటలు ఇలాగే గందరగోళంగా, ఏమీ అర్థం గాకుండా ఉండటంతో… ఆమె గోహంతకులకు మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా బయటికి ఫోకస్ అయిపోయి, కేసులు కూడా నమోదయ్యాయి… ఐనా సోయి రాలేదు ఆమెకు… ఏదో సమర్థించుకోవడానికి విఫలప్రయత్నం చేసింది… సరే, హైదరాబాద్ పోలీసులు ఇలాంటి కేసులు పెద్దగా పట్టించుకోరు, ఆమెకు నటుడు రానా మద్దతు ఉండటంతో ఆ కేసు సద్దుమణిగింది…

నిజం చెప్పాలంటే… ఆమెకు మలయాళం, తెలుగు, హిందీ మాట్లాడటం ఈరోజుకూ రాదు… (తెలుగు టీవీ సీరియళ్లలో నటించే కన్నడ తారల భాష చూడండి ఓసారి… తెలుగువాళ్లకన్నా బాగా మాట్లాడతారు…) ఇలాంటప్పుడు… మరీ బోయపాటిలాగా ‘హమ్ నే బోల్ దియా’ బాపతు భాష దేనికి..? నవ్వులపాలు కావడం దేనికి..?!

https://www.facebook.com/share/r/1BmAADX9xb/?mibextid=wwXIfr

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions