.
బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ విముక్తి పోరాట నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి (52) ఎంత ఆధునిక వైద్యం అందినా చివరకు ఆ ప్రాణం దక్కలేదు… అర్ధరాత్రి దాటాక (12.50) ఆయన కన్నుమూసినట్టు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి… ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేట ప్రాంతంలో తను పార్టీకి కీలకనేత… పార్టీ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ తనపై సదభిప్రాయం ఉంది… తనను కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి లోటుగానే భావించాలి…
మొదటి నుంచీ కేసీయార్ స్ట్రాంగ్ ఫాలోయర్, ఆ కుటుంబానికి కూడా సన్నిహితుడు… ప్రజల మనిషి… నిన్న రాత్రి హరీష్ రావు చెప్పిన మాటలు వింటుంటే పెద్ది పరిస్థితి విషమంగా ఉండి, కోలుకునే అవకాశం లేనట్టుగానే వినిపించాయి…
Ads
‘‘పెద్దిని బతికించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అమెరికాకు కూడా రిపోర్ట్స్ పంపించాం. లండన్‌లోని టాప్ హాస్పిటల్స్, హైదరాబాద్‌లోని టాప్ డాక్టర్స్‌తో మాట్లాడాం. ప్రస్తుతం బీపీ మెయింటెన్ అవుతోంది. అస్వస్థతకు గురైన రోజు 30 – 40 నిమిషాలు హార్ట్ ఆగిపోయింది.
దీంతో మెదడుకు ఆక్సిజన్, రక్త ప్రసరణ నిలిచిపోయింది… జనరల్‌గా 5 నిమిషాలు బ్రెయిన్‌కు ఇవి అందకపోతే బ్రెయిన్ డెడ్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మెదడుకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేసి అమెరికా, లండన్ పంపించాం. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్మెంట్ జరిగుతోంది.
ఆయనకు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదు. లంగ్స్‌కు సంబంధించిన సమస్య. గత 20 రోజుల నుంచి హిమోగ్లోబిన్‌కు సంబంధించిన ట్యాబ్లెట్ వాడలేదు. దీంతో హిమోగ్లోబిన్ పర్సంటేజీ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్‌కు పోయే వాల్వులో బ్లాక్ ఏర్పడింది. లంగ్స్ పనితీరు దెబ్బతింది. దాని ఎఫెక్ట్ గుండెపై పడింది. ఇది హార్ట్ ఎటాక్ కాదు.. ఊపిరితిత్తుల సమస్య.
ఐనా మానవ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతోంది. హైదరాబాద్, బాంబే, అమెరికా, లండన్ డాక్టర్లతో మట్లాడి ఏం చేయాలో అది చేస్తున్నాం. కేసీఆర్ కూడా ప్రతి రోజూ డాక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నాడు. మేమంతా ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు డాక్టర్లు ఏం చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రయత్నం కొనసాగుతోంది…’’
సో, రెగ్యులర్‌గా వేసుకునే ఓ టాబ్లెట్ కొన్నిరోజులుగా వేసుకోకపోవడం వికటించింది… ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్నాయో, ఇక కోలుకునే అవకాశం లేకుండా పోయింది… గుండె ఆగిపోయాక హన్మకొండ రోహిణి హాస్పిటల్‌లో డాక్టర్ మమత 9 సార్లు సీపీఆర్ చేసి, గుండె లయ మళ్లీ స్టార్టయ్యేలా చేయగలిగింది… కానీ అప్పటికే మెదడుకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది… ఇక అక్కడి హాస్పిటల్ వల్ల కాలేదు…
తక్షణం సికింద్రాబాద్ యశోదకు తరలించారు… ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా సత్వర తరలింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయించాడు… కేసీయార్ స్వయంగా హాస్పిటల్ వెళ్లి, వైద్యులకు మొక్కి, పెద్దిని కాపాడండి అని విజ్ఞప్తి చేశాడు… ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది… పెద్దికి సద్గతి ప్రాప్తిరస్తు…
https://www.facebook.com/reel/3235846693273637
Share this Article