Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!

October 31, 2026 by M S R

.

టిల్లూ స్క్వేర్ అనే సినిమాలో కావచ్చు, ఓ డైలాగ్… గిట్ల తయారయ్యారేందిర మీరంతా..? ఇదే కాదు, తరచూ టీవీ ప్రోగ్రాముల్లో, సోషల్ మీడియా రీల్స్‌లో వినిపించే మరో డైలాగ్… రేయ్, ఎవుర్రా మీరంతా..? ఈ రెండూ గుర్తొచ్చాయి మొన్నటి ఆదర్శకుటుంబం సినిమా ఈవెంటులో…

అదేనండీ, ది గ్రేట్ ప్రపంచ ప్రఖ్యాత మల్లారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణంలో ఓ ఈవెంటు చేశారుగా… విద్యాలయాలు చివరకు సినిమా ఫంక్షన్ల వేదికలయ్యాయి కదా… అక్కడ ఆ విద్యాలయాలన్నీ మేనేజ్ చేసే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అత్యంత దయార్ద్ర ఔదార్య హృదయంతో విద్యార్థులకు ఓరోజు హాలీడే ప్రకటించింది…

Ads

పాపం, ఆ ఫంక్షన్‌ను వేల విద్యార్థులు కష్టపడి విజయవంతం చేసినందుకు కాదు, ఆదర్శకుటుంబం సినిమా చూసేందుకట… హాలీడేలు, సిలబసులు, మార్కులు, పరీక్షలు అన్నీ వాళ్లిష్టమే కదా… అంతేకాదు, చివరకు బతుకమ్మ ఉత్సవాల పేరిట దాండియాలు, గార్భాలు ఆడించిన మహత్తర తెలంగాణ సంస్కృ‌తికి ఆమె పరిరక్షకురాలు కదా… ఏక్‌దోతీన్ చార్పాంచ్ అనబడే ఓ పాత సినిమా భక్తిగీతాన్ని వినిపిస్తూ, ఆ తాదాత్మ్యతలో ఆనందనృత్యం కూడా చేసింది… (బీజేపీలో చేర్చుకుంటారట పాపం)…

ramajogaiah

ఆ సరస్వతీ నిలయాలు అలా వినోద వేదికలయ్యాయి కదా… సరస్వతీపుత్ర అని పేరుకు ముందు మరో ప్రిఫిక్స్ తగిలించుకున్న రామజోగయ్య శాస్త్రి మరో టైపు… సినిమా సెలబ్రిటీలందరూ ఏదో నోటికొచ్చింది కూసేసి పాపులర్ అయిపోతున్నారు కదా, ప్రచారంలోకి వచ్చేస్తున్నారు కదా, నేనూ సినిమా వాడినే కదా, నేనేం తక్కువ; నేనెందుకు వెనుకబడాలి అనుకున్నాడేమో పాపం (శమించుగాక)…

తనూ ఓ మాట అనేశాడు… ఆదర్శ కుటుంబం థియేటర్ల వద్ద తొక్కిసలాటలు జరగాలట… ఏ తలకుమాసిన నిర్మాతో, దిక్కుమాలిన నటీనటులో, నెత్తిమాసిన దర్శకుడో అర్ధపాండిత్యంతో ఈ మాటలు అన్నారంటే సర్లే, వాళ్లకు తెలిసిన తెలుగు, తెలివి అదేలే అనుకోవచ్చు… కానీ ఒక సాహితీవేత్త (??) నోటి నుంచి తొక్కిసలాటలు జరగాలనే కోరిక వ్యక్తం కావడం ఏమిటి..? (సినిమా పాటల రచయితలను సాహితీవేత్తలు అంటావాా, ఆ పదం పరువు తీస్తావా అని తిట్టేయకండి ప్లీజ్, త్రివిక్రమ్‌ను గురూజీ అన్నట్టుగానే ఇదీనూ)…

అల్లు అర్జునుడి నిర్వాకంతో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట విషాదం గుర్తురాలేదా మహాశయా..? ఎందుకు జరగాలి ఈ తొక్కిసలాటలు..? ఎవరిని ఉద్దరించడం కోసం..? ప్చ్, అందుకే ఆ రెండు డైలాగులు అర్జెంటుగా గుర్తొచ్చాయి… ‘గిట్ల తయారయ్యారేందిర మీరంతా’… ‘రేయ్, ఎవుర్రా మీరంతా’…!!

https://www.instagram.com/reels/DfB3bq-l0ie/

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!
  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్
  • ఎఐ కొలువుల్నే కాదు, ప్రాణాలనూ తీయగలదు… బహుపరాక్…
  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…
  • … చివరకు ఓటీటీలోనూ ఫాస్ట్‌ఫార్వర్డ్ చేస్తూ సైతం చూడలేకపోతి…
  • మియాపూర్ కేసు ! కేసీయార్ పట్టించుకోలేదు- రేవంత్ చేసి చూపించాడు !!
  • ‘అన్యమతస్తులు ఎంతటివారైనా సరే… ధ్వజస్థంభం దాటడానికి లేదు…’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions