Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంతుడు ఒక యోగీ కాగలడా..? షాబాద్ కిల్లర్‌కు బతికే అర్హత ఉందా?

July 13, 2026 by M S R

.

ఒకాయన తన అభిప్రాయం చెప్పాడు మార్నింగ్ వాక్ సమయంలో… ‘‘తన భాష విషయంలో రేవంత్ చాలా బదనాం అయ్యాడు… లా అండ్ ఆర్డర్ మీద, పర్టిక్యులర్‌గా పోక్సో కేసుల నిందితులపై నిఘా మీద… మరీ ప్రత్యేకించి షాబాద్ కిల్లర్ రాజ్‌కుమార్ ఇష్యూలో..!

బండి భగీరథ్ విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారం రేవంత్ రెడ్డికి ఎంతోకొంత మైనస్… ఇప్పుడు ఈ షాబాద్ కిల్లర్ కేసు మరికొంత మైనస్… యూపీలో ఇలాంటిది జరిగి ఉంటే, అంటే బయటికి రాగానే ఆరుగురిని కసకసా చంపేసిన నిందితుడు మరుసటిరోజు పక్కగా ఎన్‌కౌంటర్ అయ్యేవాడు… ఇక్కడ బుల్‌డోజర్ కాదు, ఓ చీడ పురుగును ఏరిపారేయడం…

Ads

యోగీ లీగల్ ప్రొసీజర్ తొక్కాతోలూ ఆలోచించడు, ఇలాంటి నేరగాళ్లు ఎన్నేళ్లు జైళ్లలో ఉంచినా సంస్కరించబడరు… మన న్యాయవ్యవస్థ గురించి తనకు తెలుసు… నొటోరియస్ జాతివ్యతిరేకుల్ని, ఉగ్రవాదుల్ని కూడా ఏళ్ల తరబడీ జనం సొమ్ముతో మేపే వ్యవస్థ మనది… ప్రధాన దోషి న్యాయ వ్యవస్థే… రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియవని కాదు, కానీ సాహసించలేకపోతున్నాడు… అదీ ప్రధాన లోపం…’’

…. దీంతో నేను మొత్తం ఏకీభవిస్తున్నానని కాదు… కానీ ఇదే రాజ్‌కుమార్ దగ్గర పోలీసులు భారీగా అవినీతికి పాల్పడ్డారని వస్తున్న వార్తలు మొత్తం ప్రభుత్వం మీద నెగెటివ్‌గా మారాయి… ప్రత్యేకించి డీజీపీ ఆనంద్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ ఇది…

పోలీసుల అదుపులో ఉన్నాడని వార్తలు, విచారిస్తున్నాడని వార్తలు… కానీ భిన్నంగా ప్రత్యేక టీమ్‌కు ఏదో లీడ్ దొరికింది, అక్కడికి వెళ్తోందని లీకులు… ఇవేవీ పనిచేయవు… తెలంగాణ సమాజంలో సదరు నేరగాడిపై (నిందితుడు కాదు, నేరగాడే) తీవ్ర ఆగ్రహంతో ఉంది…

ఇలాంటి కేసుల్లో నో బుల్లెట్, శాంతి మంత్రాలు పనిచేయవు… కానీ ఎటొచ్చీ అసలు ప్రశ్న… రేవంత్ రెడ్డికి జనం మూడ్‌ను బట్టి వ్యవహరించే సాహసం ఉందా..? ఒక షాబాద్ కిల్లర్‌కు ఇంకా బతికి ఉండే అర్హత ఉందా..?! తనే లా అండ్ ఆర్డర్ బాస్… నిర్ణయం తీసుకోవాల్సిందీ తనే..!! ఆల్రెడీ రాజకీయ రాబందులు ఈ కేసుపై ఎగురుతూ క్షుద్రలాభాన్వేషణలో పడ్డాయి కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు ! ఈ సుందరి ఏమన్నదో తెలుసా ?
  • ఏయ్, తప్పు..! సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయకూడదు !!
  • నిజమే అనసూయా… అసలే సోషల్ మీడియాలో బికినీల కాలమిది !!
  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions