.
Priyadarshini Krishna …. How to k&i@l₹l a movie….
ఎస్ …..మీరు చదివిన టైటిల్ కరేక్టే ….
ఒక సినిమాని ప్రేక్షకులు చం&పా@రు అంటే అది రోటీన్
ఒక సినిమాని రివ్యూ రైటర్స్ చం&పా@రు అంటే అది కూడా రోటీన్
ఒక సినిమాని దర్శకుడు చం&పా@డు అంటే అది కూడా కొంతలో కొంత రోటీన్
కానీ …. రొటీన్ కానిది, రొటీన్ కి భిన్నమైనది ఏంటంటే … ఒక సినిమాని స్వయంగా ప్రొడ్యూసర్లే చం&పా@రు అంటే అది రోటీన్ ఎలా అవుతుంది … కాదు కదా …
అదే సెన్సేషన్ !!!
ఇంత ఏం సినిమా అంటారా….
94 పడిలో తన నలభై ఏళ్ల నిరీక్షణ, ఎంతో శ్రమ ధారపోసిన దిగ్దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు తీసిన లేటెస్ట్ సినిమా ‘సింగ్‌గీతం’ అనే సినిమా గురించి…
అలా ఎలా చం&పా@రు
తమ డబ్బులనే నిర్మాతలు అలా పాడుచేసుకుంటారా అని అడిగితే , ఏమో మరి కొందరు అలా ఉంటారేమో…..!
Ads
దర్శకుడు తనకొచ్చిన ఐడియాని రచయితతో పంచుకుని ఆలోచనకి ఒక రూపం ఇచ్చి కథని తయారు చేస్తాడు… తర్వాత నిర్మాతని పట్టుకుని అతడు కథని ok చేసాక దానికి సరిపడే నటీనటులను, ఇతర నిపుణులను ఎంపిక చేసుకుంటారు…
ఇది జరిగే విధానం, పద్ధతి…
కథ వినగానే ఆ కథకి ఏమేమి సరంజామా కావాలో నిర్మాత మెదడులో మెరుస్తుంది …
దర్శకుడిని on board తీసుకున్నాక మిగతా వారిని కూడా బుక్ చేసుకుంటారు నిర్మాతలు…
దర్శకుడు సూచించిన నటీనటులను తీసుకోడం కద్దు, ఒకవేళ ఆ నటుల డేట్స్ అందుబాటులో లేకుంటే వారికోసం ఆగటమో లేదా వేరొకరితో ముందుకు పోవడమో జరుగుతుంది
సింగీతం గారి ఫిల్మాలజీ ఒకసారి చూడండి …
అమెరికా అమ్మాయి – వాణి గణపతి, రంగనాథ్
పంతులమ్మ- లక్ష్మి, దీప, శరత్ బాబు
సొమ్మొకడిది- సోకొకడిది – కమల్ , జయసుధ
అమావాస్య చంద్రుడు – కమల్, మాధవి
జేగంటలు – రాంజీ, అరుణ
మయూరి – సుధా, సుధాకర్
పుష్పక విమానం – కమల్, అమల
ఆదిత్య 369- బాలకృష్ణ, మోహిని
బృందావనం – రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ…
గమనించారుకదా సింగీతం గారి తొలినాళ్ళలోని సినిమాల కాస్టింగ్…
అన్నీ చక్కని జంటలే …
అన్ని సూపర్‌హిట్ సినిమాల్లో మొదటినుండి ఆయన తనకు నచ్చిన నటీనటులతో పనిచేసారు. అందరూ అందమైన, పేరున్న, నటన వచ్చిన డైరెక్టర్ అడిగే 100% ఇచ్చినవారే….
ఇది దర్శకుని గొప్పతనం ఒకపక్క, ఆయన అడిగిన నటులను సమకూర్చిన నిర్మాతల సహృదయం.
ఈ ‘సింగ్‌గీతం’ సినిమాలో నటులు ఎవరికి తెలుసు …?!
తెలియని ముఖాలతో సినిమా తియ్యడం నేరం కాదు, కొత్త వారికి అవకాశం ఇవ్వకుంటే నటులు ఎలా పుడతారు…?!
కానీ, ఇక్కడ దొరికిన వారు substandard పీసులు… ఈ వయస్సులో వారితో తనకు నచ్చేంత వరకు ఔటపుట్ ఎలా రాబట్టగలరు …?!
ఇది మొదటి ఫెయిల్యూర్ …
కథ మొత్తం తిరిగేది జరిగేది మ్యూజిక్ మీద… 90% మ్యూజిక్ పైన ఆధారపడిన ఈ సబ్జెక్ట్ కి మన దేవిశ్రీప్రసాద్ ఏమాత్రం న్యాయం చెయ్యలేదు… ఏదో తూతూ మంత్రంగా కానిచ్చేశాడు … ఇతనికంటే మనం రోజు చూసే అడ్వర్టైజ్మెంట్స్ లో వినపడే జింగిల్స్ ఎక్కువ ఆకట్టుకున్నాయి, గుర్తుండి పోయాయి….
మాటలే పాటలుగా సాగే ఈ సినిమాకి సంగీతమే టైటిల్ అయివున్న ఈ సినిమాకి అదే పెద్ద మైనస్ అయింది.
ఏయే మాటని ఎంతెంత లెవెల్స్ లో మ్యూజిక్ ని అద్దాలి అనే కనీసం ఆలోచించకుండా ప్రేక్షకుల చెవుల్లోంచి రక్తాలు కారించాడు . సినిమా అయిపోయాక బయటకు వస్తే ఒక్కపాట కూడా గుర్తుండదు, కానీ సినిమా పడకముందు వేసిన అడ్వర్టైజ్మెంట్ లోని మ్యూజిక్ మాత్రం మనకు గుర్తువుంటుంది…. అట్లుంటది డీఎస్పీ తోని….
ఇది రెండో ఫెయిల్యూర్ …
కథ ప్రకారం, అదొక బంగారు గనీ అక్కడ జరిగే నడిచే కథ.. అక్కడి కార్మికులు, అక్కడి ఊరి ప్రజలు పడుతున్న కష్టాల చుట్టూ అల్లిన కథ….
కానీ మనకు ఒక ఎడారి, దానిలో ఒక చిన్న గుహ, ఒక పదిమంది కార్మికులు, ఒక 20 మంది ఊరిజనాలు…
ఇది మనకు తెరమీద కనపడే విషయం. కథలో ఏమో భారీగా బంగారుగని, ఒక వూరు అని వుంటే మన ఊహ ఎలా వుంటుంది … KGF లో లాగా కాకపోయినా, కనీసం దానిలో సగమైనా మనం అనగా ప్రేక్షకులు ఊహించుకుంటారు కదా .. కానీ అక్కడ అదేం వుండదు …!
బంగారు గని ఓనర్ కూడా మిడిల్ క్లాస్ మనుషుల్లాగe వుంటారు , అదేంటో మరి అంత భావదారిద్ర్యం … కాదు కాదు , బడ్జెట్ కన్స్ట్రైన్స్…!
ఇది మూడో ఫెయిల్యూర్ …
కథలో ఒక జానపద కథ ఇమిడి వుంటుంది….
జానపద బ్రహ్మ తర్వాత అంతటి నైపుణ్యం చూపించి జనాలను నలభై ఏళ్లగా మెప్పించి తనకంటూ సినిమా చరిత్ర లో ఒక పేజీని ఇప్పటికే ఖరారు చేసుకున్న సింగీతం గారికే జానపద కథ తీసేందుకు చేతులు కట్టేశారు… నాసిరకం సెట్టింగులు, నాసిరకం CG work, నాసిరకం visual effects… వెరసి కన్నులకు భారం కలిగించే సీన్లు తెరపై కదిలిపోయుంటాయి, దానికి తోడుగా నాసిరం నటన, నాసిరకం మీజిక్కు … స్వారీ … Music … ఎప్పడు ముగుస్తుందా అని మనం ఎదురుచూస్తాం కానీ, ఇంకాస్త వుంటే ఎంత బాగుణ్ణు అని ఏకోశానా అనిపించదు…
భైరవద్వీపంలో లాగా కాస్త బడ్జెట్ ఇచ్చి, మంచి సెట్స్ వేసి, మంచి VFX టీమ్ ని ఇచ్చివుంటే సింగీతం గారు ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లేవారు …
ఇది మూడో ఫెయిల్యూర్ …
ఇక, ఇల్లు అలకగానే సరిపోదు- సినిమా తియ్యగానే సరిపోదు, పబ్లిసిటీ చేసి రిలీజ్ కూడా చెయ్యాలి.
జనాలకు ఇలాంటి ఒక సినిమా వుంది అని తెలియాలి, అందుబాటులోని హాళ్లలో ఆట పడాలి, థియేటర్ లో పోస్టర్లు, స్టాండీలు వుండాలి … ఈ సినిమాకి అవేం లేవు, తూతూ మంత్రంగా ప్రిరీలీస్ ఈవెంట్స్ చేసారు.. అందులో కూడా ప్రొడ్యూసర్ల సోత్కర్షనే, తమకి సింగీతం గారి మీద ఎంత శ్రద్ధాభక్తులో, 40 ఏళ్ళగా నలిగిన కథని మేమెంత గొప్ప హృదయంతో నిర్మిస్తున్నామో అంటూ గొప్పలే …!
ఇది చిట్టచివరి ఫెయిల్యూర్ …
కొత్త దర్శకునిలాగే పాపం ఆయన కూడా సినిమా ఎలాగోలా తెరకి ఎక్కితే చాలు అని కాంప్రమైజ్ అయిపోయిన సంగతి మనకు తెరపైన అడుగడుగుకి కనపడుతుంది…. పైగా సెట్స్ మీదకు రాకుండా, ఓ మెరిక అసిస్టెంట్‌తో నడిపించేశారు.
ఇస్తినమ్మ వాయనం అన్నట్లు, మేక తోక బెత్తేడు అన్న చందంగా సినిమా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు …
దీనినే సినిమాని చం&పే@య#డం అంటారు …
operation success
patient d€i$e$d అన్న చందంగా అన్నమాట …!!
ఇప్పటికే చాలామంది ఈ సినిమాని చూసి మెచ్చుకుంటూ రివ్యూలు రాశారు … మేధావివర్గం, ఒక సామాజికవర్గం కూడా ఆకాశానికి ఎత్తేసారు… ఇది చూడకుంటే జన్మ వృధా అన్నారు …
ఒక సినిమా మీద నెగటివ్ గా రాసి దానిని కిందకు లాగడం నా ఉద్దేశం కాదు…
ఇప్పటికే చాలా మంది చూసేశారు కాబట్టిని , మరి ఇది kings new clothes ‘రాజుగారి దేవతా వస్త్రాల’ కథలోలాగా జనాలు మొయ్యడమేలనో …
హాహహా
హాహహా
హాహా
Share this Article