.
వాళ్ల వ్యక్తిగత జీవితాలు వాళ్ల సొంతం… ఆ జీవితాల్లోకి తొంగిచూడటం తప్పు అంటుంటారు కొందరు నీతిపెద్దలు… కానీ ఒక కేసు అయినప్పుడు, సెలబ్రిటీల జీవితాలు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ల వ్యక్తిగత జీవితాలూ వార్తాంశాలే అవుతాయి… కావాలి… అవుతున్నాయి కూడా…
ఉదాహరణకు సింగర్ కల్పన… ఆమె బతుకంతా గతంలో విషాదం… పోరాటం, సాధన, ఆత్మవిశ్వాసం, గానప్రతిభ ఎట్సెట్రా… ఆమె అంటే సంగీత ప్రియులకు మంచి అభిమానం… నిజంగా అద్బుత గాయని ఆమె… కానీ కొందరు సెలబ్రిటీలకు ఒకటి బాగా పనిచేస్తే మరొకటి పనిచేయదు…
Ads
చాలా వేదికల మీద ఈమధ్య పిచ్చికూతలు చూస్తున్నాం కదా… ఈమెకు కూడా బుర్ర పనిచేయడం లేనట్టుంది… లేదా అనుభవిస్తున్న మానసిక ఒత్తిడితో తన బుర్ర మీద తనకే అదుపు తప్పిపోతున్నట్టుంది… ఎస్, ఆమె బతుకులో స్టిల్ మానసిక వేదన ఉంది, ఒత్తిడి ఉంది, నిజమే… కానీ…?
‘‘అబ్బే, ఆత్మహత్యాయత్నం కాదు, నిద్ర పట్టడం లేదు, 8 ట్యాబ్లెట్లు వేసుకున్నాను, పనిచేయలేదు, మరో పది వేసుకున్నాను, తరువాత ఏమైందో నాకు తెలియదు’’ అని చెప్పిందట పోలీసులతో… ఎవడైనా నమ్ముతాడా..? అవేమైనా పప్పులా పాప్ కార్న్ గింజలా..?
బిడ్డ, మొగుడు, ఆమె అందరూ ఓవర్ డోస్ కథలే చెప్పేసరికి… పోనీలే అనుకుని పోలీసులు కూడా ఆమె చెప్పింది రాసుకుని ఇకపో అనేసి ఉంటారు..! కేసు గాకుండా ఉండటానికి అలా చెప్పిందేమో… (ఆత్మహత్యాయత్నం కూడా నేరమే)… కానీ జస్ట్, ప్రమాదవశాత్తు ఓవర్ డోస్ అట అది… నిన్నటిదాకా ఆమె బాధల పట్ల సానుభూతి చూపినవాళ్లు కూడా ఇప్పుడీ స్టేట్‌మెంట్ చూసి జాలిగా నవ్వుకుంటున్నారు…
ఆమె గతంలోనూ ఓసారి ఆత్మహత్య (చాన్నాళ్ల క్రితం) ప్రయత్నం చేసినట్టు ఎక్కడో చదివిన గుర్తు… ఏదో ఒకటి అనేయడం కాదు, కాస్త ఆచితూచి మాట్లాడాలి సెలబ్రిటీలు… జనంలోకి ఎలా వెళ్తున్నదనేదీ ముఖ్యమే… ఈమెకు ఆ సోయి లేదు…
బిడ్డను చెన్నైలో ఎవరో దగ్గరి బంధువుల ఇంట్లో ఉంచితే అక్కడ లైంగిక వేధింపులు… కేసు… కల్పన డిస్టర్బయింది… మళ్లీ ఇప్పుడూ ఆ బిడ్డ గురించే సమస్య అట… కల్పన నిజాంపేటలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో అయిదేళ్లుగా ఉంటోంది…
పైకి చెబుతున్నది మాత్రం…, తను బిడ్డను ఇకపై హైదరాబాదులో చదువుకోవాలని కల్పన అడిగిందట, కానీ ఆ పిల్ల ఒప్పుకోలేదట… ఎర్నాకులం వదిలేసి రాను అంటోందట… ఇదీ గొడవ అట… కానీ ఉంటే చెన్నైలో, లేకపోతే హైదరాబాదులో… మరి మధ్యలో ఈ ఎర్నాకులం ఏమిటి…? ఏదో బయటికి చెప్పడానికి ఇష్టపడని ఇష్యూ ఉంది, అదే పెద్దదైంది…
కోపంతో మెగుడు చెన్నై వెళ్లిపోయాడు… ఈమె నిద్రమాత్రలు మింగింది… సరే, ఇంకా బదనాం గాకుండా ఉండటానికి, జనంలో పలుచన గాకుండా ఉండటానికి ఏవో సాకులు, కారణాలు చెప్పాలనుకుంటే కాస్త జనం నమ్మే సాకు ఏదో చెబితే అయిపోయేది… మరీ ప్రమాదవశాత్తూ 18 ట్యాబ్లెట్ల కథ చెబితే ఎలా..? అతకలేదు… సమాజం నమ్మలేదు… నమ్మేలా ఉందా మరి..! నవ్వేలా ఉంది గానీ..!!
Share this Article