ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… […]
ఏ ఆంధ్రుల మీద ద్వేషపు సెగల్ని రాజేశామో… వాళ్లనే ఉద్దరిద్దాం రండి అర్జెంటుగా…
రోజురోజుకూ కేసీయార్ వ్యవహారశైలి, ఆలోచనలు అన్నీ దారితప్పుతున్నయ్… తెలంగాణ స్పూర్తిని దాటేసి, పక్కదోవలు పడుతున్నయ్… తెలంగాణ ప్రేమికులకు చిరాకు తెప్పిస్తున్నయ్… విశాఖ ఉక్కు ప్లాంటుపై కేసీయార్ తాజా ఆలోచనల బాట కూడా అదే… నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలా… విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం సంకల్పించిన విషయం తెలుసు కదా… ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలిచింది… అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఆసక్తిని అధికారికంగా సబ్మిట్ చేయడం… తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనాలని ఆలోచిస్తోంది అనేది […]
కేసీయార్ దగ్గర అంత భారీ ధనం ఉందా..? రాజదీప్ వ్యాఖ్యలతో ప్రబలే ప్రచారమేంటి..?
ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… మోడీ వర్సెస్ ఆల్ అనే […]


