. కేసీయార్ జల్ జంగ్ అంటున్నాడు కదా… ఊరూరా డప్పు కొట్టి ఉద్యమిస్తాం అంటున్నది సుదీర్ఘమైన తన ప్రెస్‌మీట్‌లో ప్రధానంగా నీళ్ల గురించే కదా… తోలు తీస్తానంటున్నాడు కదా పవన్ కల్యాణ్ భాషలో… గుడ్, తెలంగాణ పార్టీగా, ప్రతిపక్షంగా చేయాల్సిందే కానీ తను జవాబులు చెప్పాల్సిన చాలా ప్రశ్నల్ని వదిలేశాడు… అవి తన వైపల్యాలు కాబట్టి… వాటివల్లే తెలంగాణకు నీళ్ల ద్రోహం ఉమ్మడి పాలనలోకన్నా ఎక్కువ జరిగింది కాబట్టి… మళ్లీ జల్ జంగ్ అంటే… తెలంగాణ సెంటిమెంట్ […]
BRS to TRS…? పార్టీ పేరులో తెలంగాణ ఆత్మకు పునఃప్రతిష్ట..?!
. నిన్న మొత్తం మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ… కేసీయార్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ అని మార్చబోతున్నాడా..? తనంతటతనే ‘జాతీయ ఆశలతో’ చంపేసుకున్న తెలంగాణ ఆత్మను పార్టీ పేరులో పునఃప్రతిష్టించనున్నాడా..? నిన్న పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతూ… ‘‘టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ’’ అని ప్రస్తావించాడు… ఉద్దేశపూర్వకంగానే పార్టీ శ్రేణులకు ఓ హింట్ ఇచ్చాడా..? https://www.facebook.com/reel/1110655644336491 సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ ఏమంటాడంటే..? Trs .. not brs .. is […]
రేవంత్ రెడ్డి బాణాలు గట్టిగానే తగిలాయి… కారులో ముసలం మొదలైంది…
. రేవంత్ రెడ్డి విసిరిన బాణాలు కేసీయార్ క్యాంపుకి బలంగా తగిలాయి… కలకలం మొదలైంది… కలవరమూ మొదలైంది… వివరంగా చెప్పుకుందాం… ‘‘కేటీయార్ వర్కింగ్ ప్రసిడెంటుగా ఫెయిల్యూర్… అసెంబ్లీ ఎన్నికలు ఫెయిల్, ఎంపీ ఎన్నికలు ఫెయిల్, ఉపఎన్నికలు ఫెయిల్, పంచాయతీ ఎన్నికలు ఫెయిల్… మరోవైపు హరీష్ రావు ఇక పార్టీని కేటీయార్ చేతుల్లో నుంచి లాక్కోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాడు… కేసీయార్ రాజకీయంగా రిటైరయినట్టేనని చివరకు గజ్వెల్ ప్రజలు కూడా తీర్మానించుకుని కాంగ్రెస్ వైపు మళ్లారు…’’ ఇదే కదా […]
రేవంత్ ఆరోపణకు నో కౌంటర్..! ఎన్డీయేలోకి బీఆర్ఎస్..? సంకేతాలన్నీఅవే..!!
. ‘బీజేపీ, బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కు… కలిసి పోటీచేసినా 33 శాతమే వాళ్ల గెలుపు… ఇక భవిష్యత్తులో అవి కలిసి పోటీచేయటానికి ఇది పునాది… ఇదే సంకేతం’ అని రేవంత్ రెడ్డి ఆరోపణ… ఇప్పటిదాకా వేచి చూస్తే… బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్యుల నుంచి అసలు కౌంటర్ లేదు, ఖండన లేదు… మౌనం అంగీకారమేనా..? నో, మేం ఎవరితోనూ కలవం అని బీజేపీ అనడం లేదు, బీఆర్ఎస్ అనడం లేదు… రేవంత్ విమర్శ కరెక్టేనంటారా..? పొద్దున్నే […]
కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
. తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేటీయార్ విమర్శలు మరీ దారితప్పిపోతున్నాయి… తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మీద ఏదో ఒకటి విమర్శించాలనే ధోరణిలో పడి… ప్రతి అంశాన్నీ వివాదం చేయటానికి, సీఎంను తిట్టిపోయడానికి ప్రయత్నిస్తూ… అడుసులో కాలేస్తున్నాడు..! పర్‌ఫెక్ట్ ఉదాహరణ… యూరియా యాప్… తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది…? రైతులు యూరియా కోసం ఎండలో, చలిలో, వానలో క్యూలలో నిలబడే అవసరం లేకుండా… ఒక సౌకర్యం కోసం, ఒక సౌలభ్యం కోసం ఓ యాప్ తీసుకొస్తోంది… […]
సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా, బలంగా ఉండాలి… కానీ ప్రతిపక్షం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలాగా ఉండకూడదు… దీన్ని పదే కేటీయార్, హరీష్ రావు నిరూపిస్తున్నారు… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, వీళ్ల కువిమర్శలు ఎలా కౌంటర్ ప్రొడక్ట్ అవుతున్నాయో కూడా సమజవుతున్నట్టు లేదు పాపం… ఆ ఇద్దరి గురించే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… అధినేత కేసీయార్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి… అనారోగ్యమో, వైరాగ్యమో తెలియదు… ఆ ఫామ్ హౌజులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి…! కేటీయార్ ఏమంటున్నాడు..? ‘‘సర్పంచి ఎన్నికల్లో […]
అది గులాబీ క్యాంపు… ‘పంచాయతీ స్కోర్ బోర్డు’ కూడా మార్చేయగలదు…
. కేటీయార్‌లో ఇక మార్పు రాదు… అచ్చం కేసీయార్‌లాగే ప్రజాతీర్పును గౌరవించాలని, శిరసావహించాలని ఏమాత్రం అనుకోడు… పంచాయతీ సర్పంచుల తొలి విడత ఎన్నికల ఫలితాలకు కూడా వక్రబాష్యాలు, తప్పుడు లెక్కలు, అబద్దాలతో స్పందించాడు నిన్న… తన స్పందనలోని ముఖ్యాంశాలు ఓసారి చూద్దాం… ‘‘అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నో దౌర్జన్యాలు చేసింది… హత్యారాజకీయాలకు పాల్పడింది… సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం […]
కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్…! ఏం జరుగుతోంది..?!
. ఫార్ములా వన్ కేసులో కేటీయార్ సహా నిందితులందరి ప్రాసిక్యూషన్‌కు, తదుపరి చర్యలకు గవర్నర్ అనుమతించాడు… జుబ్లీ హిల్స్ ఎన్నికలో రేవంత్ రెడ్డి గెలుపు కూడా దీని వెనుక తరచి చూస్తే ఓ ప్రధాన కారణం… అందుకే ఇన్నాళ్లూ (10 వారాలపాటు) గవర్నర్ దగ్గర ఆగిన ఫైల్ హఠాత్తుగా క్లియరైంది… జుబ్లీ హిల్స్ ఎన్నికకూ దీనికీ లింకె ఏమిటీ అంటారా..? కాస్త వివరాల్లోకి వెళ్దాం… ఏసీబీ కేసు దర్యాప్తు చేసినా, పలుసార్లు కేటీయార్, అరవింద్ కుమార్ వంటి […]
ఒక చంద్రసేనుడు… కొడుకు రామసేనుడు… అల్లుడు హరిసేనుడు…
. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్-2 అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంలో చెప్పిన “బావా- బావమరిది” కథ… లీగల్ ఇష్యూస్ రాకుండా, కొన్ని హింట్లతో… అసలు వ్యక్తులు ఎవరో తెలిసేలా జర్నలిస్టులు కొన్ని కథనాలు రాస్తుంటారు కదా… అలా చెప్పాడు… ఎవరి గురించి..? కేసీయార్, హరీష్ రావు, కేటీయార్ గురించి… మీరు ఏం అర్థం చేసుకుంటారో… దేనికి వర్తింపజేసుకుంటారో మీ ఇష్టం… రేవంత్ చెప్పిన కథ ఇదీ… సారాంశం…. ఇది పూర్తి ఎఐ సహకారం… […]
వై ఓన్లీ హిమాంశు…? వై నాట్ ఆదిత్య…? కాచుకో కేటీయార్… నెక్స్ట్ తరమూ రెడీ…
. కేటీయార్… కవితక్క తగ్గేదేలా… నువ్వేనా కేసీయార్ వారసుడివి..? ఏం మగ వారసత్వమేనా..? ఆడ వారసత్వం పనికి రాదా ఈ దేశంలో..? ఠాట్, వీల్లేదు… మహిళల రిజర్వేషన్ల గురించి కొట్లాడిన కవితక్క అస్సలు ఊరుకోదు… రాజకీయ వారసత్వంలో కూడా మహిళలకూ సమాన హక్కులు ఇవ్వాల్సిందే… నో, ఇవ్వకూడదు, అంటే మీ బీఆర్ఎస్ రాజ్యాంగం మార్చుకొండి… ప్రజలకు చెప్పండి, మాది మగవారస పార్టీ మాత్రమే అని… హమ్మా… ‘‘చూస్తుండు, ఈ తరమే కాదు, భవిష్యత్తు తరానికీ నీకు పోటీ […]
కాళేశ్వరం అక్రమాలపై హరీష్‌రావు తెలివిగా కేసీయార్‌ను ఫిక్స్ చేశాడా..?
. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తను సేఫ్‌గా ఉంటూ, రేప్పొద్దున ఏదైనా ఎదురుతిరిగితే స్వయంగా కేసీయారే ఫిక్సయ్యేలా హరీష్‌రావు కుట్ర చేశాడా..? చివరకు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కూడా కేసీయారే అడ్డంగా బుక్కయ్యేలా, తను సేఫ్‌గా ఉండేలా స్టేట్‌మెంట్లు ఇచ్చాడా..? నిన్న కవిత ప్రెస్‌మీట్‌లో మీడియా ఏవేవో వివరాల్ని కవర్ చేసింది గానీ… ఆమె వెల్లడించిన విషయాల్లో ఈ పాయింట్లకే వార్తా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపిస్తోంది… కొద్దిరోజులుగా ఆమె హరీష్‌రావు, సంతోష్‌రావు ఎలా తన తండ్రి, […]
అసలు ఆలూ లేదు, చూలూ లేదు… తుమ్మిడిహెట్టిపై పొలిటికల్ బురద రెడీ…
. అదుగో ఆ చెరువులో కొమ్ములు కనిపిస్తున్నాయా..? అవి మాంచి కోడె కొమ్ములు… దిట్టంగా ఉంటుంది అది… లక్ష రూపాయలు ధర… కొమ్ములు చూస్తే అంచనా వేయలేవా కోడె దారుఢ్యాన్ని….. ఈ బేరాల్లాగే ఉంది హరీష్ రావు ట్వీట్… కాకపోతే రివర్స్ యవ్వారం… అధికారంలో ఉన్నవాడి మీద ఏదో ఒకటి గాలి నుంచి బురద క్రియేట్ చేసి చల్లేయడం… కడుక్కునే పని కాంగ్రెస్ తీట… అచ్చం అలాగే ఉంటున్నయ్ కేటీయార్, హరీష్ ట్వీట్లు, విమర్శలు, ఆరోపణలు… ప్రాణహిత- […]
కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
. స్వరాష్ట్ర సాధన తరువాత కేసీయార్ సాగించిన పదేళ్ల అరాచక, అక్రమ, అవినీతి, అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనలో ఇది మరో వికృతకోణం… ఈమాట హార్ష్‌గా అనిపించినా సరే… వరుసగా బట్టబయలవుతున్న విషఅధ్యాయాల్లో మరొకటి చెప్పుకోవాలి… వెయిట్, వివరంగానే చెప్పుకుందాం… ముందుగా ఈ ఫోటో చూడండి… 90 రోజుల్లో 84 మందిని దొరకబుచ్చుకుంది ఏసీబీ… సరే, టిప్ ఆఫ్ ఐస్ బర్గ్… ఐనా సరే, పదేళ్ల తరువాత కాస్త దూకుడు కనిపిస్తోంది… సీన్ కట్ చేయండి ఇక… కేసీయార్ […]
ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
. నాయకుడికి క్రెడిబులిటీ ముఖ్యం… తన మాటలకు విలువ ఉండాలి… రాజకీయ విమర్శ అయినా సరే జనంలో ఆలోచనను రేకెత్తించాలి… బట్, ముఖ్యమంత్రి కావాలనుకునే కేటీయార్‌కు అదేమీ పట్టినట్టు లేదు… ఇది సోషల్ మీడియా యుగం… రకరకాల అబద్ధాలు, అతిశయోక్తులు సమాజంలో ప్రవహిస్తూ ఉంటాయి… కానీ వాటిని మెయింటెయిన్ చేసినా సరే, నాయకుడు అలా మాట్లాడకూడదు… జనం నవ్వుకుంటారనే ఇంగితాన్ని ప్రదర్శించాలి… ఫాఫం కేటీయార్… తను బాగానే సబ్జెక్టు అర్థం చేసుకోగలడు, ఆశువుగా మాట్లాడగలడు… కానీ తన టీమ్ […]
దేవనపల్లి కవిత..! గులాబీ యాదవ శిబిరంలో అసలైన ముసలం..!
. కవిత ఆ గులాబీ యాదవ శిబిరంలో ఓ ముసలం… ముసలం ఎటు దారితీస్తుంది… జనానికి తెలుసు… ఇక లోతు చర్చ లేదు… కవిత గొప్ప నాయకురాలు కాకపోవచ్చు… ఎస్, మరి కేటీయార్..? సేమ్ సేమ్ కదా.,.! సినిమా వారసుల్లాగా వీళ్లూ తెలంగాణ ఉద్యమతెర మీదకు వచ్చారు… అయ్య పోరాడుతున్నాడు… ఇదొక మైనింగు… ఛలో అని వాళ్లూ ఓ చెయ్యేశారు… ఎస్, ఆమే చెబుతున్నట్టు కవిత పెళ్లినాటికి కేసీయార్ కటకట… సిద్దిపేట ముఖ్యులకు అందరికీ తెలుసు… మరి […]
కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?
. చిన్న వార్తలాగా కనిపించింది… కానీ పెద్ద వార్తే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ ఆరోగ్యం బాగాలేదు… సరే, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అది కాదు విషయం… నిజానికి తన ఫామ్ హౌజులోనే చిన్న చిన్న సమస్యలను డయాగ్నయిజ్ చేసి, అవసరమైతే యశోద డాక్టర్లు అప్పటికప్పుడు అటెండ్ అవుతారు… కానీ ఈమధ్య హైదరాబాదులో ఇన్‌పేషెంటుగా చేరాడు… తరువాత మళ్లీ అస్వస్థత… ఇప్పుడు మళ్లీ అస్వస్థత… ఏమైంది..? అసలు కేసీయార్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? […]
కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
. కేటీయార్‌కు ఏమైంది..? బీఆర్ఎస్ కేడర్‌లోనూ ఓ అయోమయం… ప్రత్యేకించి ఉపరాష్ట్రపతి పోటీకి సంబంధించి నిన్న తను చేసిన వ్యాఖ్యలు ఒకవైపు నవ్వు పుట్టించడమే కాదు, పార్టీ తీసుకుంటున్న పొలిటికల్ లైన్ మీద కేడర్‌లోనే బోలెడు సందేహాలను కలిగిస్తున్నాయి… 2 లక్షల టన్నుల యూరియా ఎవరి ఇస్తే వాళ్లకు మద్దతు అట… కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే, అన్నదాత అవసరాలకు తగినంత యూరియా సప్లయ్స్ దాని బాధ్యత… కాంగ్రెస్ గానీ, ఇండియా కూటమి గానీ వెంటనే ఓ […]
బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
. తెలంగాణ ఉద్యమ సాధన దిశలో సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏ వేషాలు వేసినా సరే… కేసీయార్ ఏ ఒక్క క్షణమూ అదుపు తప్పలేదు, ఉద్యమాన్ని అదుపు తప్పనివ్వలేదు… ఒక్క ఆంధ్రుడి మీద గానీ, వ్యాపార సంస్థల మీద గానీ, మీడియా ఆఫీసులపై గానీ ఒక్క రాయీ పడలేదు… వాళ్లే భయంతో ఇళ్లకు, ఆఫీసులకు పెద్ద పెద్ద నెట్లు పెట్టించుకున్నారు రాళ్ల దెబ్బల్ని కాచుకోవడానికి… ఒక్క ఉద్యమకారుడూ ఒక్క రాయీ విసరలేదు… అది […]
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!
. ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే… హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ […]
వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!
. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]



















