వివిధ పార్టీల నుంచి కేసీయార్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసే క్రమంలో… ఎవరినిపడితే వారిని, చివరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారిని కూడా తీసేసుకుంటున్న క్రమంలో… ఒకే మాటతో తనను సమర్థించుకునేవాడు… రాజకీయ శక్తుల పునరేకీకరణ… ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విధేయతలు, నైతికతలూ మన్నూమశానం జాన్తా నై… ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోవడమే… అఫ్‌కోర్స్, దేశమంతా అలాగే ఉంది… పైగా కొత్తదేమీ కాదు, ఆయారాం, గయారాం, ఇండియన్ పాలిటిక్సులో పెద్ద విశేషం కూడా ఏమీ కాదు… […]
ఎంపీ ఎన్నికల దిశలో… ఏ పార్టీ పొజిషన్ ఏంటి తెలంగాణలో..?
John Kora…. తీగల, పట్నం ఫ్యామిలీలు కరెక్ట్‌గా పని చేస్తే చేవెళ్లలో ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువ. కానీ సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఖమ్మంపై పెద్దగా చర్చ అవసరం లేదు. రేణుకను ఎట్లాగో తప్పించారు. తుమ్మల కూడా కొడుకు యుగంధర్‌ను పోటీ నుంచి దూరం పెట్టాడు. సోనియా వచ్చే అవకాశాలు ఎలాగూ లేవు, ఆ చర్చే క్లోజ్. ఆమె రాజ్యసభకు వెళ్లిపోయింది. భట్టి, పొంగులేటి […]
ఘనత వహించిన సోకాల్డ్ ఉన్నతాధికారులంతా సేఫ్ అయిపోతున్నారు..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది… అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… […]
బాబుపై సుప్రీం తీర్పు ప్రభావం కేసీయార్‌పై ఎంత..? తమిళిసై ఇంపార్టెన్స్ పెరిగిందా..?
చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సందిగ్ధత ఇంకా కొనసాగనుంది… చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాల్ని వెలువరించి, తదుపరి కార్యాచరణను చీఫ్ జస్టిస్‌కు నివేదించింది… సో, త్రిసభ్య ధర్మాసనమో, సీజే నేతృత్వంలోని మరింత విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాలి… నిజానికి ఈ ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు గవర్నర్ ముందస్తు అనుమతి దగ్గర డిఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప 17 ఏ సెక్షన్ వర్తింపు […]
అటు జగన్, ఇటు కేసీయార్… ఆ ఇద్దరితో సంబంధాల్లో రేవంత్ ‘పరిణతి’…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉంది… ఇద్దరూ చంద్రబాబు అభిమానులు కావడం వల్ల కావచ్చు, ఇద్దరికీ శృతి కలవడం వల్ల కావచ్చు, రేవంత్‌కు తన మీడియాలో బాగా ప్రయారిటీ లభించింది… ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు రేవంత్‌ను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ సీఎం అయ్యాక నెల రోజుల తరువాత మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశాడు… ఇతర మీడియా ఇంటర్వ్యూయర్లకు రాధాకృష్ణకు పోలికే లేదు… చాలా అంశాల్ని తెలివిగా, చొరవగా చెప్పిస్తాడు… అలా రేవంత్ […]
కేసీయార్ సైలెంట్ నిష్క్రమణ దేనికి సంకేతం… ఇక కేటీయారే అన్నీ…!!
మూడు వార్తలు… 1) హుందాగా వైదొలగిన కేసీయార్, ట్రెండ్ తెలియగానే రాజీనామా, సామాన్య పౌరుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఫామ్ హౌజ్‌కు ప్రయాణం, గన్‌మెన్ కూడా లేకుండానే ఒంటరిగా బయటకు… అని నమస్తే తెలంగాణలో ఓ వార్త… 2) కేసీయార్ సభకు వస్తారా..? సభలో రేవంత్ రెడ్డి మొహం చూస్తారా..? గెలిచిన స్థానానికీ రాజీనామా చేస్తారేమో..? అసలు రాజకీయాల్నే వదిలేస్తారేమో..? అని ఓ డిజిటల్ పత్రిక (దిశ కావచ్చు) లో ఓ వార్త… 3) కేటీయార్ పార్టీ ముఖ్యులతో […]
ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…
వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా… సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి […]
తొలి వోటు… యువతలో భలే సెంటిమెంట్… అదే ఊళ్లకు రప్పించింది…
ఎగ్జిట్ పోల్స్, అంచనాలు, జోస్యాలు, బెట్టింగులు గట్రా కాసేపు వదిలేస్తే… అరయగ కర్ణుడీల్గె ఆరువురి చేతన్ అనే విశ్లేషణలు 3 తేదీన చెప్పుకుందాం… కానీ ఒకసారి తొలి వోటు గురించి చెప్పుకోవాలి… యువత దీనికి ఎంత ప్రాధాన్యమిచ్చారంటే… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… రేవంతరెడ్డి, కేసీయార్, బీజేపీ వెంకటరమణారెడ్డి బలంగా పోటీపడిన కామారెడ్డి స్థానంలో ఆమెకు వోటు ఉంది… పేరు గజ్జె శ్రీలేఖ… ఆమె బెంగుళూరులో శ్యాంసంగ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… తొలి వోటు తప్పకుండా వేయాలని ఆమె […]
పవన్ కల్యాణ్ బరిలో ఉన్నట్టా..? లేనట్టా..? ఏదీ… ఎక్కడా కనిపించడేం..?!
ఈరోజు తీసేస్తే… పోలింగ్ ముందు రోజు తీసేస్తే… ఇక మిగిలింది మహా అంటే 12 రోజులు… చాలా తక్కువ సమయమే ఉంది… ఏ బరిలో ఎవరు పోటీదారులో ఖరారై పోయింది… సో, ప్రచారానికి ఇదే కీలకదశ… పోలింగ్‌కు ముందు 2, 3 రోజులు ‘పోల్ మేనేజ్‌మెంట్’ అనబడే ప్రలోభపర్వం ఉంటుంది… అంటే పదిరోజులు లెక్కపెట్టుకోవాలి… ఎస్, ప్రచారంలో బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది… పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగులే కాదు, సోషల్ మీడియాలో ప్రకటనలు, చివరకు మెట్రో స్టేషన్లలో, […]
వేర్వేరు పంథాలు… గెలుపు లక్ష్యాలు కాదు, ఇంకెవరినో ఓడించే శుష్కసిద్ధాంతాలు…
మిత్రులు చెబుతున్నట్టు… గెలవడం కోసం గాకుండా… ఇంకెవరినో ఓడించడానికి మాత్రమే బరిలో ఉంటాయి లెఫ్ట్ పార్టీలు… అదేమంటే ఎత్తుగడలు, వ్యూహాలు అని బోలెడు పడికట్టు పదాలు చెబుతారు ఆ నాయకులు… కలిసి పోరాడటం, సొంతంగా ఎదగడం ఏనాడో మరిచిపోయి… నానాటికీ బలహీనపడుతున్నా పంథాలు మారవు… ఆ నాయకులు మారరు… కొత్తతరం రాదు, కొత్త నాయకత్వాన్ని రానివ్వరు… ముసలి నాయకుల చేతుల్లో ఆ పార్టీలు మూలుగుతున్నాయి… ఒకప్పుడు ప్రభ వెలిగిన లెఫ్ట్ పార్టీల ఇప్పటి పరిస్థితి ఏమిటి..? ఆ […]
ఎవరు ఎవరికి దోస్త్..? జనం కళ్లకు భలే గంతలు కడుతున్నారు అందరూ..!!
రాష్ట్రవ్యాప్తంగా ఒక భావన ప్రబలిపోయింది… బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహితులు అని..! జనం దాన్నే విశ్వసిస్తున్నారు… బండి సంజయ్ మార్పు దగ్గర నుంచి కవిత సేఫ్ వరకు… రకరకాల అంశాల్ని క్రోడీకరించుకుంటున్నారు… దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియడం లేదు బీజేపీకి… బీఆర్ఎస్‌కు కూడా… బీజేపీ-బీఆర్ఎస్ సేమ్ అనే ప్రచారం స్ట్రెయిట్‌గా కాంగ్రెస్ జోష్ పెరగడానికి కొంత కారణమవుతోంది… మరేం చేయుట..? దాన్ని ఎలాగోలా బ్రేక్ చేయాలి..? అలాగని అబ్బే, బీఆర్ఎస్‌తో మాకేమీ దోస్తానా లేదు, మీ […]
లెఫ్ట్ దీనావస్థ… రైట్ తన్నులాట… బరిలో కొట్లాడేది మళ్లీ కాంగ్రెసే…
బీజేపీ కంప్లీట్ రైట్ దారి… సీపీఎం, సీపీఐ కంప్లీట్ లెఫ్ట్ దారి… తెలంగాణలో ఈ రెండు పక్షాలూ గందరగోళంలో పడిపోతూ కొట్టుకుంటున్నాయి… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే సీటు గెలుచుకుని దారుణంగా భంగపడిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్నాక కాస్త తెరిపిన పడింది… తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలనూ గెలుచుకుంది… ఆ ఊపులో ఏకంగా తెలంగాణలో తామే అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కనడం మొదలుపెట్టారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా… ఒకే ఒక్క రాజాసింగ్… […]
ఫాఫం కేసీయార్… ఒంటరి పయనంలో లెఫ్ట్ సహబాటసారి… ఒకరు తెలంగాణ ద్రోహి…
ఎక్కడో చదివినట్టు గుర్తు… షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనమట… డీకే శివకుమార్ మధ్యవర్తి అట… వావ్… అన్నను జైలులో వేసిన కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలకు గమ్యమా..? డబుల్ వావ్… ఆ కాంగ్రెస్‌లో చేరి ఇక తను కలలుగన్న రాజన్న రాజ్యం స్థాపిస్తుందా..? పొంగులేటి, రేవంత్, జూపల్లి, భట్టి, పొన్నాల, రాజనర్సింహ, జగ్గారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి… అడుగుకో సీఎం కేండిడేట్… వీళ్లందరి నడుమ షర్మిలకు సీఎం పోస్టు ఎవరివ్వాలి మరి..? సీఎం పోస్టు లేక రాజన్న […]
టెన్త్ పరీక్షలు అంటేనే ఓ ప్రహసనం… టెన్త్ పేపర్ లీక్- ఓ పరిశీలన…
Shankar Rao Shenkesi……….. టెన్త్ హిందీ పేపర్ లీకు… ఒక పరిశీలన… – టెన్త్ పరీక్షలు అంటేనే ఒక ప్రహసనం. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ రొటీన్ ‘కార్యక్రమం’. టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తే మన రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం 50 కూడా మించదు. కానీ ప్రతీ ఏటా సగటున 85 శాతంపైనే ఉత్తీర్ణత ఉంటుంది. – టెన్త్ పరీక్షల్లో చిట్టీలు చూసి రాయడం అనేది ఒకప్పటి తంతు. ఇప్పుడంతా మారిపోయింది. 100 మార్కుల […]
‘‘బాబుకు తెలంగాణలో పనేమిటా..!? అసలు కేసీయార్‌కు ఆంధ్రాలో ఏం పని..?’’
ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు… నిజంగా గట్టి ప్రశ్నే… టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా… ‘‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..?’’ ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…! గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా… ఆంధ్రా […]
జోష్ లేదు… టీఆర్ఎస్ ప్రధాన కేడర్‌లో ఎందుకో అనూహ్యంగా స్తబ్దత…
తాడో పేడో… బీజేపీ అంతగా కాన్సంట్రేట్ చేస్తోంది తెలంగాణ మీద… కేసీయార్ మీద… ఇంకా చేయబోతోంది… తప్పనిసరై కేసీయార్ కూడా బలంగా ప్రతిఘటిస్తున్నాడు… అయితే తనదైన శైలిలో, ముందస్తు దాడి వ్యూహంతో…! మొన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు పథకాలు, ఆ వీడియోల విడుదల అందులో భాగమే… కాకపోతే స్కెచ్ ఎక్కడో తన తాజా అదృష్టంలాగే గాడితప్పి తుస్సుమంది… వీసమెత్తు ఇంపాక్ట్ లేదు… పైగా చివరకు హైకోర్టుకు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది… బీజేపీని బజారుకు లాగి, ఇరుకునపెట్టడానికి ఇంకేదో ఆలోచిస్తూనే […]
కేసీయార్ ఎంత గోకినా, రక్కినా… కేంద్ర హోంకు ఉలుకూపలుకూ లేదేం..?!
కేసీయార్ ఇంత చెలరేగిపోతున్నాడు, బట్టలిప్పుతున్నడు, బట్టకాల్చి మీదేస్తున్నడు, బజారుకు గుంజుతున్నడు… ఐనా ఢిల్లీ బీజేపీ నుంచి రియాక్షన్ లేదు, భయపడుతున్నరా..? ఇందిరమ్మే ఉండి ఉంటే, రెండు నిమిషాల్లో ఖతం చేసేది సర్కారును…… అని చెప్పుకుంటూ పోతున్నాడు ఓ మిత్రుడు… సరే, మనం ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు గానీ… బీజేపీ నిజంగా గవర్నర్లను ముందుపెట్టి, దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వాల మీదకు పోతోందా..? రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాల్ని కుట్రలు పన్ని కూల్చేస్తోందా..? అంత సీన్ లేదు… అదొక […]
పక్కా స్క్రిప్టే…! చివరలో ఎవరిదో డబుల్ గేమ్…! మొత్తం ప్లాన్ ఉల్టాపల్టా…?
సోషల్ మీడియాలోని ఇరువర్గాల బురదను… మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చిపడిన వార్తల వరదను… ఎంత పరిశీలించినా అర్థం కాని ప్రశ్నలు కొన్ని అలాగే ఉండిపోయాయి… వాటికి జవాబులు తెలిస్తే తప్ప అసలు ఈ స్కామ్ ఏమిటో, స్కీమ్ ఏమిటో అంతుపట్టదు… 1) జస్ట్, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..? అబద్ధం… 2) ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ ఫాయిదా ఏమైనా ఉంటుందా..? ఏమీలేదు… 3) మరి బీజేపీ ఆ నలుగుర్ని కొనేయడానికి అంత […]
అసలు ఇజ్జత్ పోయింది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే కదా…!!
జెర బైఠీయే… అని పదే పదే బీహార్ సీఎం నితిశ్‌ను తెలంగాణ సీఎం కేసీయార్ చేయి పట్టుకుని కూర్చోబెట్టడం… అరె, వాళ్ల ట్రాప్‌లో పడకయ్యా స్వామీ, ఇప్పటికే బోలెడు టైం తీసుకున్నాం, పద, లే, పోదాం అని నితిశ్ పదే పదే వారించడం… నిన్నంతా నవ్వు పుట్టించింది… దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసేసి, ఏదో విమర్శకు ప్రయత్నించింది గానీ అది పెద్దగా పేలలేదు… నిజానికి అందులో కేసీయార్‌ను రెండు భిన్నరకాల్లో చూడొచ్చు… 1) జర్నలిస్టులను వెక్కిరిస్తూ, […]
హయ్యారే… ఏం సేయుట..? సభ రద్దు చేయుటయా..? వేచి ఉండుటయా..?
కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్‌ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్‌గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు… కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… […]