కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు… కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… […]
ఇల్లలకగానే పండుగ కాదు… బీజేపీ బలం పెరిగింది నిజమే… కానీ…?
నిజానికి పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు…. తెలంగాణ ప్రజల మూడ్ మీద ఆరా మస్తాన్రావు సర్వే నివేదిక వివరాలు చదువుతుంటే అది వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు కూడా అనిపించలేదు… అంకెల సంగతి తరువాత, ప్రజల మూడ్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు తెలుసు… తెలుసు కాబట్టే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.., కాంగ్రెస్ను ఒక్క మాటా అనకుండా, ప్రజల వర్తమాన సమస్యల గురించి పట్టకుండా మోడీని కేసీయార్ రెండున్నర గంటలపాటు వాషింగ్ పౌడర్ నిర్మా సర్ఫ్తో కడిగినప్పుడే […]