Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డబుల్ ఎలిమినేషన్..! టేస్టీ తేజకు తప్పదు… తోడుగా పృ‌థ్వి కూడా..!?

November 30, 2024 by M S R

.

టేస్టీ తేజ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు… ఇదీ ఓ ముందస్తు వార్త,..

పర్లేదు, హోప్‌లెస్… ఇప్పటికే లేటయింది… ఒకటే ఇరిటేషన్… తనకే కాదు, తనను చూసేవాళ్లకు కూడా… అసలు ఎందుకు తీసుకొచ్చారో ఆ షో క్రియేటివ్ టీమ్‌కే తెలియాలి…

Ads

తను ఏదీ సరిగ్గా ఆడలేడు… స్థూలకాయం సహకరించదు… రోహిణి కూడా అంతే, కానీ ఆమె ఫైట్ చేయగలదు… ఎంటర్‌టెయిన్ చేయగలదు… మంచి టైమింగ్… తేస్టీ తేజ మెంటాలిటీ కూడా షోకు సూట్ కాదు…

నిన్న ప్రేరణతో గొడవ, గౌతమ్‌తో గొడవ… అసలే గౌతమ్ మెంటల్ కేసు… తను కూడా టేస్టీ తేజను ఏదో ఓదార్చబోయి, తేజ రఫ్‌గా ఏదేదో పిచ్చిగా మాట్లాడటంతో ఛిఛీ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు… దటీజ్ తేజ…

సో, ఈ ఎలిమినేషన్ లేటయినా సరే, సరైన నిర్ణయమే… ఫినాలేకు టికెట్ పొందిన అవినాష్ ఎలాగూ గ్రేట్ ఎస్కేప్… లేకపోతే ఈసారి బయటికి తరిమేయడం జరిగేదేమో…

సరే, శనివారమే, అంటే ఈరోజే టేస్టీ తేజకు నిష్క్రమణ… అంటే సండే మరో ఎలిమినేషనా..? అవును, డబుల్ ఎలిమినేషన్ అట… తప్పదు… 9 మందిలో డబుల్ ఎలిమినేషన్స్ రెండుసార్లు జరిగితే లాస్ట్ వీక్‌కు ఐదుగురు మిగులుతారు…

మరి రేపు..? వోటింగులో మరీ తక్కువ స్థానాల్లో ఉన్న పృథ్వి లేదా విష్ణుప్రియ… మేం జంట కాదు, జస్ట్ ఫ్రెండ్స్‌మి ఎట్టకేలకు తమ డొల్ల ప్రేమ నిజరూపాన్ని ప్రకటించారు కదా నిన్న శ్రీముఖి ఎదుట… ఇంకెందుకు ఆలస్యం..? ఎవరో ఒకరు ఔట్ తప్పదు…

మెంటల్ పృథ్వితో పోలిస్తే నత్తి బ్రెయిన్ విష్ణు కాస్త నయం… పైగా నాగార్జునకు ఇష్ట కంటెండర్… పృథ్వి లేకపోతే మామూలు మనిషి అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి… పృథ్వికి మెయిన్ గేటు చూపే అవకాశాలే ఎక్కువ… ఏమో, చెప్పలేం… అసలే బిగ్‌బాస్… ఏదైనా చేయగలడు…

ఇద్దరు వెళ్లిపోతే మిగతా ఏడుగురూ బలమైన కంటెండర్లే… నబీల్ రీసెంట్ డేస్‌లో చెడగొట్టుకున్నాడు కానీ… తను టాప్ ఫైవ్‌కు అర్హుడు నిజానికి… ప్రేరణ, నిఖిల్ సరేసరి… గౌతమ్‌కు వోటర్ల మద్దతు ఉంది… అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్టు… రోహిణికీ మద్దతు దొరుకుతోంది…  వచ్చేవారం ఆట కాస్త ఆసక్తికరం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions