Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీచింగ్ వృత్తి కాదు… విలువల జాతి నిర్మాణం… ఈ చిన్న కథ విన్నారా..?!

June 27, 2025 by M S R

ఎండ… చెమట… ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి… అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు… పలకరించాడు… వంగి, కాళ్లు మొక్కాడు… మాస్టారూ, బాగున్నారా..?

‘సర్, నన్ను గుర్తుపట్టలేదా..?‘

‘ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడం లేదు… గుర్తుపట్టలేకపోతున్నాను’

Ads

‘సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్‌ను…’

‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తు రావడంలేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..? అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?’

‘నేను టీచర్‌ను అయ్యాను మాస్టారూ…’

‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’

‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి తెలుసా..?’

‘అదేంటి..? అదెలా..?’

‘బహుశా మీకు గుర్తుండదు ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి…’

——

teacher

‘‘ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు… దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది… ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను… కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది… లబోదిబో ఏడ్చాడు… టీచర్‌కు కంప్లయింట్ చేశాడు… అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే…

ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు… నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది… అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా…

అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..? కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్‌గా నిలబెట్టారు… ప్రతి ఒక్కరి జేబూ చెక్ చేస్తానన్నారు… కాకపోతే అందరినీ కళ్లుమూసుకోవాలని చెప్పారు… జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు…

తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు… నాకు అర్థం కాలేదు…

వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక…

ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా ఇజ్జత్ మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది… ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో… అలా నన్ను రక్షించారు మీరు…

నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్… కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా… నా అంతట నేనే మారిపోయేలా చేశారు… ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్…’’

.

.

.

.

అప్పుడు ఆ టీచర్ సావధానంగా చెప్పాడు ఇలా… ‘‘ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను… నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నా ప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు… అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం…. నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను…’’ (మంచి ఉపాధ్యాయులందరికీ అంకితం…)

.

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!
  • నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!
  • చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!
  • హరీష్ భయ్… నో గురుదక్షిణ, నో నిర్లక్ష్యం – ఇది సిన్సియర్ ఎఫర్ట్ !!
  • మిస్టర్ క్లీన్ ! మీడియాకన్నా చరిత్ర బాగా అర్థం చేసుకుంది !!
  • “రూమ్ నం. 39… మూడేళ్లుగా ఎవరికీ అర్థం కాని రహస్యం!”
  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions